క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. ఆరోహణ పండుగ...
  5. ప్రత్యక్షత

ప్రత్యక్షత

(అ.కార్యములు 1:9)

(ఆసౌయో యీశు ర్యుష్మత్బమీపాత్ స్వర్గం నీతః సయాదృశేన గమ సేన స్వర్గం గచ్చన్ యుష్మాభిః సందృష్టస్తోదృశేన ప్రత్యాగ మిష్యతి కార్య. 1:11.)

యేసుప్రభువు సమాధిలోనుండి వెలుపలకు వచ్చిన దినము మొదలుకొని ఆరోహణమైన దినము వరకు మొత్తం నలుబది దినములు.

  1. ఆయన లేవగానే ఏమి జరిగెను?

జవాబు: సమాధికి దాపిన (అడ్డుపెట్టిన) పెద్దరాతిని దొర్లించివేసి, దేవదూత దానిమీద కూర్చుండగా భూకంపము కలిగెను. కావలివారు ఆయన కాంతికి భయపడి చచ్చిన వారివలె పడిపోయిరి. మేము నిద్రపోవుచుండగ శిష్యులు, క్రీస్తు శవమును ఎత్తికొనిపోయిరి అని వారు అధికారులతో చెప్పిరి. ఈ మాట పాట్టణవాసులు నమ్మలేదు. వారు నిద్రించుచుండగా శిష్యులను ఎట్లు చూడగలిగిరి? మొట్టమొదట స్త్రీలు , సమాధియొద్దకు వెళ్ళి ఆయన లేచిన విషయమును శిష్యులకు తెలిపిరి. ఆయన స్త్రీలకు దారిలో కనబడెను. లూకా, క్లెయొపా అను ఇద్దరు పునరుత్థాన విషయము మాటలాడుకొనుచు ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచుండగా , ప్రభువు వారి సంభాషణలో కలిసి వారి గృహములోనికి వెళ్ళి, భోజన సమయమందు వారికి బయలుపడెను. లూకా 24వ అధ్యాయములో శిష్యులు ఒక గది యందుండగా తలుపులు వేసినను ప్రభువు లోపలికి వెళ్ళి, వారికి సమాధాన వచనము వినిపించెను. ఆయన లేచెనని మొట్టమొదట ఎవరును నమ్మలేకపోయిరి గాని తరువాత నమ్మగలిగిరి. తోమా అను పేరు గల ఒక శిష్యుడు బొత్తిగా నమ్మలేదు గాని రెండవమారు శిష్యుల సమాజములో నుండగా ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు నమ్మెను. యోహాను 20వ అధ్యాయము.

2. ఇంకను ఆయన ఎవరికి కనబడెను?

జవాబు: గలిలయలో ఏడుగురికి ఆయన కనబడెను. యోహాను 20వ అ. తరువాత ఆయన ఐదు వందల మందికంటె ఎక్కువ మందికి ఒక్కసారే కనబడెను. అటుతరువాత ఆయన యాకోబునకు కనబడెను. 1కొరింథి 15:7. పిమ్మట ఆయన అపొస్తలుల కందరికి కనబడెను. కార్యములు 1వ అధ్యాములో ఆయన వారిని దీవించుచు పరలోకమునకు వెళ్ళిపోయెను.

ఈ నలుబది దినములలో ఆయన చేసిన పనులు రెండు. మొదటిది విశ్వాసులందరికి ప్రత్యక్షమగుట. రెండవది దేవుని రాజ్య విషయములు బోధించుట.

(1) తరచుగా కనబడని యెడల ఆయన లేచిన సంగతి విశ్వాసులకు వదంతిగా వినబడునే గాని నిశ్చయముగా తెలియదు.

(2) ఆయన అకస్మాత్తుగా కనబడి అకస్మాత్తుగా వెళ్ళిపోయిన యెడల శిష్యులకు మిగుల బాధగా, దిగులుగా నుండును. ఇప్పుడట్లుండదు. “వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి, యెడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి” లూకా 24:52,53. ఎందుకనగా తమ గురువు సమాధిలో లేడనియు, ఆయన సజీవుడుగా పరలోకములో నున్నాడనియు, త్వరగా వచ్చుననియు తెలిసికొని, దగ్గరలేనందున దుఃఖింపక ఆనందించిరి. వారి సంతోషమునకు మేరలేదు.

(3) వారి సంతోషమునకు మరియొక కారణమేదనగా – బోధపని వారి చేతులకు అప్పగించుటయే.

(4) మరియొకటి వారిని దీవించుటయే.

Please follow and like us:

How can we help?

Leave a Reply