మార్కు 16:1-8.
ప్రభువుయొక్క జీవిత కాలములో జరిగిన ప్రతి అంశముపై పండుగ చేయవలసినదే మనకు కలిగిన ఉపకారములలో ప్రతి దానికి పండుగ చేయవలసిన మనకు కలిగిన ఉపకారములలో ప్రతి దానికి పండుగ చేయవలసినదే. రూపమునకు పండుగ చేయకపోతే కృతజ్ఞతా స్తుతులద్వారా పండుగ చేయవలసినదే.
3 కాలములు:
1. మనము పుట్టినది మొదలు మరణము వరకు ఉండేకాలము. 2. చనిపోయిన తరువాత సమాధిలో ఉండేకాలము. 3. చనిపోయిన తరువాత సమాధిలోనుండి మనలను లేపేకాలము. బైబిలులో కాలములకు దినములని పేరు కూడా ఉన్నది. గనుక దినమనగా కాలము అను భావము ఇచ్చట చెప్పబడుచున్నది. మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము అనునవి మూడు కాలములు మానవుడు ఈ భూమిపై పుట్టింది మొదలు చనిపోయేవరకు అన్నీ శ్రమలే, ఈ కాలమంతటిని ఒక దినం అందురు. ఈ మధ్యలోనివి ఎన్ని సంవత్సరలు? 6,10,50, 100 వరకు అనగా ఇలా 6-100 వరకు గల ఈ సంఖ్యలలో ఏదైనా కావచ్చు ఈ కాలమంతా శ్రమలే. మనుష్యులు ఈ భూమిపై ఎంతకాలము జీవిస్తారో దానిపేరు మంచి శుక్ర వారము, 2వ కాలము: నిద్ర సమాధిలో ఉండే ఈ కాలము కూడా కొన్ని సంవత్సరములుండును. దీని పేరే శని వారము. 3వ కాలము నిండ లేవడము. పునరుత్థానమయ్యే ఈ మూడవ కాలము ఆది వారము. ప్రభువు చనిపోయిన మొదటి దినము శుక్ర వారము సమాధిలోనున్న రెండవ దినము శనివారము. పునరుత్థానము అయిన 3 వదినము ఆది వారము ఇవి ప్రభునియొక్క మూడు దినములు.
నేను ఇవి కాదు చెప్పుట మనము బ్రతుకు దినములన్ని మనకు శుక్ర వారమని, శని వారము మనం సమాధిలో ఉండే కాలము, ఆది వారము మన ప్రభువు వస్తే మనలో సిద్ధపడేవారు రాకడలో వెళ్ళుదురు. ఇది ఆది వారము. ఆది వారమైతే ప్రభువుయొక్క పునరుత్థానము లోకమంతటికి ఈస్టరు కాలం.
- ప్రభువు ఏ ప్రకారం శ్రమలుపడి చనిపోయెనో భక్తుడు అలాగే చనిపోవును.
- ప్రభువు ఏ ప్రకారం సమాధిలో ఉండెనో భక్తుడును ఆ ప్రకారమే ఉండును.
- ప్రభువు ఏ ప్రకారం లేచెనో భక్తుడు ఆ ప్రకారమే లేచును. పూర్వము నుండి చనిపోయిన భక్తులకు శుక్ర వారము అయిపోయినది. శని వారము జరుగుచున్నది. ప్రభువు రాకడలో వస్తే వారు మూడవ దినము అయిన ఆది వారము లేస్తారు. పరిశుద్ధుడైన ఆగస్టీన్ ప్రభువు ఏ ప్రకారము 3వ దినము లేచెనో ఆ ప్రకారమే భక్తుడు లేచునని వ్రాసెను. ప్రతి సంవత్సరము మార్కు 16లో కథ వింటున్నారు, గాని సంగతులువేరుగా ఉండును.
- ప్రభుని శుక్ర వారం, శని వారం, ఆది వారం.
- మన శుక్ర వారం, శని వారం, ఆది వారములు జ్ఞాపకముంచుకొనండి.
ప్రభువు సిలువమీద నున్నప్పుడు ఆక్షేపించిరి. లేక (కోరిక) ఇతరులను రక్షించుచున్నావు, గాని నిన్ను నీవు రక్షించుకొనలేవా అనిరి. గాని ప్రభువు శుక్ర వారం సిలువమీద నుండి దిగి వస్తే అది అద్భుతమేగాని అయితే ప్రభువు ఆ విధముగా దిగి రాలేదు. ప్రభువు చనిపోయి సమాధిలో పెట్టబడి, మరణమును జయించి లేచి, శిష్యులకు కనబడెను. యిది గొప్ప మహాద్భుతము. మనుష్యులు చిన్న అద్భుతము కోరిరి. శుక్ర వారం నాడు సిలువపై నుండి దిగి రమ్మనే చిన్న అద్భుతము కోరితే ఆయన ఆది వారమున లేచి గొప్ప అద్భుతము చేసెను.
కొందరికి ఇది గొప్ప అద్భుతముగా కనబడకపోయినను మర్మముగా ఉన్నది. లోకోపకార అద్భుతం. మనము నిజంగా పాపాలు వదలి మారుమనస్సు పొంది పరలోకమునకు వెళ్ళితే మనము అనుకొన్న అద్భుతముకంటే గొప్ప అద్భుతము కనబడును.
- యేసు ఏ ప్రకారము లేచెనో ఆ ప్రకభక్తులు లేస్తారు.
- శుక్ర వారము
- శుక్ర వారమ్నాడు ఎన్ని శ్రమలున్నను, శుక్ర వారం నకు పూర్వము 33 1|2 సంవత్సరములలో ఆయన మనస్సులో ఒక తీర్మానమున్నది. నాకెన్ని శ్రమలుంటేనేమి, ఎన్ని మేకులు కొడితేనేమి, ఎంత సమాధి ఉంటేనేమి, నేను మూడవ దినమున లేవకుండ ఉందునా? (సైతాను: దయ్యాలు, పాపాలు, జబ్బులు, పగవారు, మేకులు, పోట్లు సమాధి అన్నీ ఉన్నా నాకు లెక్కలేదు. కారణము నేను మూడవ దినమున లేస్తాను) ఉదా: సంసోనుకు త్రాళ్ళతో (మగ్గపు త్రాళ్ళతో) కట్టిన కట్లనిన లెక్కలేదు. ఎందువలన అనగా అవన్నీ అతడు త్రెంపివేయగలడు గనుక లెక్కలేదు.
అలాగే క్రైస్తవ భక్తులకును శ్రమలనిన లెక్కలేదు. ఈ విషయమును గూర్చి పౌలు ఈ రీతిగావ్రాసినాడు “రాబోవు మహిమ యెదుట ఇప్పటికాలపు శ్రమలు ఎన్నతగినవి కావు.” రోమా 8:18. అలాగే ప్రభువును రాయి, ముద్ర, సమాధి, రాణువ వారు ఏమియు చేయలేకపోయిరి. అలాగే భక్తులు వీటన్నిటిని యేసుప్రభువు వలే జయించి లేస్తారు. యేమన్నా లెక్కలేదు. యేమున్నా లెక్క లేదు. శ్రమల యందు లెక్కలేని తనము.
‘పచ్చిమ్రానుకే ఈలాగుచేస్తే ఎండిన మ్రానుకు ఏలాగు చేయుదురు?” అని శిష్యులను ఎండిన మ్రానుతో పోల్చినారు.
యేసుక్రీస్తు ప్రభువు మూడవ దినమందు లేచిన తరువాత (యేసుప్రభువు పుట్టింది మొదలు సమాధి వరకు) ప్రభువు శరీరము ఉన్నంతవరకు ఎంతో బాధించిరి గాని లేచిన తరువాత ఆయనయొద్దకు ఆ జాబితా వారందరు రాలేదు. కారణము: లేచిన తరువాత మహిమ శరీరము వచ్చినది కావున 33 1|2 సంవత్సరములు మన శరీరమువలె నున్నది గాని ఆ జాబితా వారందరు స్థూల శరీరము దగ్గరకు చేరి ఆధపెట్టిరి. ఈ శరీరమును ఆ జాబితా జయించెను గనుక ఈ మహిమ శరీరము వచ్చెను. ప్రభువు సమాధిలోనుండి వచ్చినప్పుడు ఆ జాబితా అంతే ఉన్నది గాని యేమియు చేయలేకపోయెను. 1. మన శరీరమును బాధించగలవు గాని 2. మహిమ శరీరమును చేరలేవు. అలాగే మనకును ఈ శరీరమున్నంతవరకు బాధించగలవు గాని మనకు మహిమ శరీరము వచ్చిన తరువాత మనలను శోధించుటకు సందేలేదు.
హిందువులు మానవుని శరీరమును స్థూలదేహమని, మహిమ శరీరమును సూక్ష్మదేహమని అందురు. మహిమ శరీరమును మరియమ్మ ముట్టుకొనలేకపోయెను. ఆమె భక్తురాలే. భక్తులైనను శోధన గలవారే గనుక మహిమ శరీరమును ముట్టుకోలేదు. మహిమ శరీరము దగ్గరకు మానవ శరీరం వెళ్ళలేదు కాబట్టి మనకును మహిమ శరీరము వచ్చినప్పుడు మనమును ముట్టుకోగలము “సందేలేదు, సందే లేదు.” మహిమ శరీరము వచ్చినప్పుడు మనలో పాపమునకు సందే లేదు.
యిప్పుడు మనలను సైతాను శోధించగలడు.
పడవేయగలడు, కొందరిని పడవేయలేడు. పూర్వం పిశాచి మనలను శోధించగలడా? శోధించగలడు గాని మనము సందు ఇవ్వకపోతే పడవేయలేడు. సందు ఇస్తే (1). శోధిస్తాడు (2). పడవేస్తాడు, భక్తుడు సందు యిస్తాడా? యివ్వడు, మీరు సందివ్వకపోయిన శోధిస్తాడు గాన సందు ఇవ్వకండి.
ప్రశ్న :- మనలను సైతాను శోధించే సందు ఇస్తామా? ఇవ్వగలమా?
జవాబు:- ప్రభువు బ్రతికియున్నంతకాలము సందు ఇవ్వలేదుగాన మనమును ఇవ్వరాదు. ప్రభువు 33 1|2 సంవత్సరములు శోధనలకు సందిచ్చినాడు గాని పడలేదు. పునరుత్థానములో ఒక బలమున్నది. పై జాబితాలో చేరనివ్వక పడగొట్టే బలము పునరుత్థానములో ఉన్నది గాన మనమును ఆ బలమును బట్టి, జయించవలెను. పడకూడదు ఎందుకంటే వాటికి సందివ్వలేదు. పునరుత్థాన బలం, జయం ఎలాటివనగా సైతానుకు సందివ్వక దానిని పడగొట్టే శక్తి ఉన్నది.మనకునూ ఆ బలమువల్ల క్రీస్తుయొక్క పునరుత్థానమునూ, క్రీస్తునూ, బలమును, జయమును మనము నమ్ముటవల్ల పాపానికి సందు ఉండదు. పడగొట్టే బలము వల్ల జయించగలము. ప్రభువు లేచి మట్టిని దులిపినట్లు దులిపివేసెను. (అంతకుముందు వాటన్నిటిని వెంటాడనిచ్చెను. తిరిగి లేచినపుడు మూడవనాడు దులిపివేసెను. ఈస్టరువల్ల లోపల సంతోషము బైటకు నవ్వువచ్చింది. రేపు మనకునూ ఆ జాబితా అంతా దండెత్తి వచ్చినపుడు మనమును దులిపివేయవలెను.)
- రొట్టెల బోధప్పుడు దులిపివేసెను.
- శ్రమ, మరణము లప్పుడు దులిపివేసెను.
- పునరుత్థానమందు సమాధిని దులిపివేసెను.
- నా ఈస్టరుబట్టి మీకు ఈస్టరు నా పునరుత్థానమునుబట్టి మీకు పునరుత్థానము నా దులపడమును బట్టి మీరు దులపడం.
ప్రార్ధన:- ఓ ప్రభువా! ఈవేళకూడ నీ పునరుత్థాన బలము, దయచేయుము. (ఉదయమున మెళుకువవచ్చి మంచముమీద కాలు క్రిందకు పెట్టక పూర్వమే రోజూ ఈ చిన్ని ప్రార్ధన చేయండి) ఆమెన్.