క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. ఈష్టరు పండుగ...
  5. పునరుత్ధాన జీవము

పునరుత్ధాన జీవము

వాక్యములు:

తండ్రి: కీర్తనలు 118:14-24.

కుమార: మత్తయి 28:1-10.

పరిశుద్ధాత్మ: 1కొరింథి,15:12-19.

ప్రియులారా! ఈ పండుగ మీ అందరికీ, ప్రపంచమంతటా ఈస్టరు పండుగే. సంఘములో పాస్టరు ప్రసంగము, సండే స్కూలులో మాస్టరు పాఠము. ఈవేళ లోకమందంతటా ఈస్టరు, పాస్టరు, మాస్టరు, ఈ మూడు ముఖ్యములు. ఈస్టరు అనగా పండుగ. పాస్టరు అనగా బోధించుట. మాస్టరు అనగా చెప్పుట. ఈ మూడునూ లోకమంతటా ఈ దినమున జరుగుచున్నవి. రోజు రెండే కానీ ఈ వేళ మూడు.

ఈ వేళ రెండే రెండు వర్తమానములు.

1. బహు విచారము

2. బహు సంతోషము.

గత సంవత్సరములో నేను ఈస్టరు విచారమును గూర్చి చెప్పితిని. అదేమనగా యేసుప్రభువు సమాధిలోనుండి లేచినపుడు ఎవరూ చూడకపోవుట విచారము. ఆయనకు మరణము, సమాధి రాయి, ముద్ర, కావలివారు ఇవన్నీ ఆయినను చుట్టిముట్టినపుడు ఆయన ముద్రను గెలిచి లేచి రావడము మనకు, సంఘానికి గొప్ప సంతోషము. 11 మంది శిష్యులు ప్రభువు చేసిన అనేక అద్భుతములు చూచిరి. గాని సమాధిలోనుండి లేచుట చూడలేక పోయిరి. శుక్రవారమున ప్రభువు సిలువపై నున్నప్పుడు యోహాను తల్లి, ఇతర స్త్రీలు అయనను చూచిరి గాని వీరు కూడా పునరుత్థానమును చూడలేక పోయిరి. అద్భుతాలు, శ్రమలు, సిలువ, సమాధి చూచినను పునరుత్థానము చూడలేకపోతే లాభమేమి?

ప్రభువు పై విషయాలలో సంపూర్ణ జయము పొందలేదు గాని పునరుత్థానములో సంపూర్ణ జయమును పొందిరి. ప్రభువు శక్తి ఆయన చేసిన అద్భుతాలలోను, ఆయన చూపిన ప్రవర్తనలోను కనబడుచున్నదా? లేదా? అట్లు ఆయన చేసిన పనులలో గొప్పతనమున్నదా? లేదా? ఆయన సిలువ మరణములో, సహనములో, క్షమాపణలో గొప్పతనము, మహిమ, శక్తి ఉన్నదా? లేదా? ఆయన చనిపోయి సమాధిలో పండుకొనుటలో గొప్పతనమున్నదా? లేదా? వీటన్నింటికంటే ఈస్టరు రోజు అన్నింటిని మించిన గొప్పతనమున్నది. 33 1|2 సంవత్సరములలో ఆయన పొందిన శ్రమలు మరలా ఎన్నటికి పొందడు. ఈ పునరుత్థాన పండుగ వచ్చినది గనుక ఆయన మహిమ పొందవలసినదే గాని శ్రమపొందవలసిన భాగము లేదు. ఆయన మరియొక పర్యాయము సిలువపై మరణము పొంది సమాధిలోకి వెళ్ళడు. నెరవేర్చవలసిన నిర్గమము పూర్తియై చీకటి గతించెను. అరుణోదయము కల్గెను. ఇకమీదట శాశ్వతము ఆయనకు మహిమే. గనుక బోధకునికి సంఘములోని భక్తులను బట్టి విచారముండవచ్చును గాని, సొంత విచారములు ఉండరాదు. ప్రభువునకు ఇదివరకు శ్రమ. సిలువ, బల్లెము, మేకులున్నవి గాని ఇప్పుడేవియు ఉండవు. గనుక ఆయన శరీర రక్తములందుకొను భక్తులకు, సంఘానికి కూడా సిలువ, బల్లెము, మేకులు మహిమ శరీరమును దాల్చకముందు ఉండును. ఆయనకు పునరుత్థానమైనది గాన ఇప్పుడేవియు ఉండవు. సైతానుకు పనేముండదు. సంఘాన్ని బాధించి, నిందించే పనిమాత్రముండును గాని ప్రభువు విషయములో పనే లేదు. ఆయన విషయములో శోధించుచుండు పనులన్నియు ముగింపైనవి. సూది బెజ్జమంత కూడ ప్రభువు మీద ఏమియును జరిగించలేదు.

ప్రభువు ఆరోహణమగుచు పునరుత్థాన బలము సంఘము మీద పెట్టి వెళ్ళిరి. సంఘము అందుకొనలేక పోవుచున్నది. ఇదివరకు పునరుత్థాన బలమును గూర్చి బోధించితిని. దినదినము ఆ బలము మనకవసరము. పాపము మనలో ప్రవేశించి అనారోగ్యము కలిగి శ్రమలు, నానావిధ నిందలు, అవస్థలు వస్తున్నవి. అప్పుడే మనకు పునరుత్థాన బలమవసరము, ఈ బలము వల్ల ఎన్ని శ్రమలు వచ్చినా జయించగలము. చనిపోయిన ప్రభువు ఈ పునరుత్థాన శక్తితోనే పరిశుద్ధజీవితాన్నిబట్టి బ్రతికివచ్చిరి. ఈయన లేవగానే చుట్టూ ఉన్నవారూ మరణించిన వారివలే పడిపోయిరి. ఇట్టి వ్యతిరేక పనులు లోకములో యున్నవి. ప్రభువు చనిపోయననే బిరుదు కాదు. లేచెననే బిరుదు ఆయనకు అవసరము. ఆయన మరణము, సమాధి ఈ మాటవల్ల అంతరించిపోయినది.

బైబిలులో పాత నిబంధన, క్రొత్త నిబంధన ముంగుర్తు అనగా పాత నిబంధనలో ఏమి చెప్పబడెనో అది క్రొత్త నిబంధనలో నెరవేరినది. ఈ క్రొత్త నిబంధనలో ఏమి చెప్పబడెనో అది క్రొత్త నిబంధనలో నెరవేరినది. ఈ క్రొత్త నిబంధనలో యేసుప్రభువు సమాధిలోనుండి లేచి, భూమి మీదకు వచ్చి భూమిని విడచి పరలోకానికి ఆరోహణము కావడము అనేది సంఘము ఆరోహణము కావడానికి ముంగుర్తు. ఈస్టరు రోజు సమాధిలో నుండి లేవడము ముందుగా జరిగినది తరువాత పరలోకానికి వెళ్ళుట జరిగెను. ప్రభువు రేపో మాపో రాగానే అనగా రెండవ రాకడలో సంఘమంత ఆరోహణమగును. ఈస్టరు రోజున, ఆరోహణము రోజున ఒక్కరే లేచిరిగాని రెండవ రాకడ రోజు అందరూ లేస్తారు. ప్రభువు దేహమును సమాధిలో పెడితే అంతకు ముందున్న మృతులైన పరిశుద్ధులు మృతులు లేచిరి. ప్రభువు మరణము ద్వారా లేపబడెను. పునరుత్థానానికి ఉన్న శక్తి మరణానికి ఉన్నందున లేచిరి. సామెత: ఏనుగు బ్రతికిన చనిపోయిన వెయ్యిరూపాయిలే. రాకడలో పరిశుద్ధులు లేస్తారు గాని ప్రభువు దేహమును సమాధిలో పెట్టినపుడు మరణములోనున్న పరిశుద్ధులు లేచిరి. ఆరోహణమునకు, సమాధిలోనుండి లేవడమునకు ముంగుర్తు పరిశుద్ధులు లేచుట.

1. పరిశుద్ధులు లేచిరి. (ఆనాటి వరకున్నవారు)

2. ప్రభువు లేచిరి.

3. ప్రభువు సమాధినుండి, భూమిమీద నుండి లేచిరి.

4. 1థెస్స 4:13-16 ముందు మృతులు లేస్తారు. (వీరు పరిశుద్ధులే) రాకడప్పుడు సజీవులైన పరిశుద్ధులు లేస్తారు.

5. ప్రభువుకు, పరిశుద్ధులకు శరీర మరణమున్నది.

6. అద్భుతములు వలన లేచిన వారికి రెండవసారి మరణమున్నది.

7. ఆనాటి వరకున్న భక్తులందరికి మరణమున్నది. పునరుత్థానమున్నది.

8. బ్రతికియుండి ఆరోహణమయ్యే వారికి శరీర మరణము లేదు.

9. పరమ భక్తులకు మరణమున్నది కాని రాకడ భక్తులకు మరణములేదు. ఏది గొప్పది? సమాధిలోనుండి లేవడము గొప్పదా? మరణము లేకుండా లేచి వెళ్ళుట గొప్పదా? మీకు ఏది ఇష్టమో దానికి సిద్ధపడండి.

10. రాకడకు సిద్ధపడువారెవరనగా దినదినము పునరుత్థాన బలము కలిగియున్నవారే.

ఇష్టమున్నను కొందరు సిద్ధపడలేరు. కారణము సమాధుల దొడ్లను, సమాధులమీద వ్రాతను మరియ చూచినట్లు సమాధిలోనికి తిరిగి చూడ వద్దని యున్నది. మగ్ధలేనే మరియ ఆదివారమున వేకువనే ప్రభువు సమాధిలో ఉన్నారని తొంగి చూస్తే లేరు. ఉన్నారని అనుకొని అక్కడవరకు వెళ్ళిన సమాధి లోకంలోని చెడ్డ విషయాలలో ఒకటి. ఆలాగే పాపమున్ను: ఈ పాపమే లేకపోతే సిలువ మరణము సమాధి ఉండదు. ఇది పాపము వల్ల వచ్చినది. ప్రభువు సమాధిని మరియమ్మ తొంగి చూడగా ప్రభువులేడు. అలాగే మనముకూడా మన పాపముల వైపు మరియమ్మ తొంగి చూడగా ప్రభువులేడు. ఆలాగే మనముకూడా మన పాపముల వైపు మరియమ్మ వలే చూడకూడదు. మనము మరణము వంక చూడకూడదు. చాలామంది భక్తుల ప్రార్ధనలో ‘ప్రభువా! నాకు రక్షణ గల మరణము దయచేయుము ‘ అని ప్రార్ధింతురు. మరణము వైపు చూస్తే దానివల్ల వచ్చే శిక్ష, పాపము వైపు చూచుట, పాపము వైపు చూస్తే పాపము చేయించిన సాతాను తట్టు చూడాలి. సమాధి, మరణము, శిక్ష, పాపము, సైతాను ఈ ఐదింటి వైపు చూడాలి. ఒకరిని ఎన్ని చెప్పినా నాకు మరణము తప్పదని అనుకొనేవారు ప్రభువు తట్టు చూస్తే ప్రభువు పునరుత్థానము దొరుకును. ప్రభువు చెప్పినా ఇవన్నియు మరచిపోయినప్పుడు మనము శ్రమలలో పడి పునరుత్థానము మరచిపోతాము.

మరణము జ్ఞాపకమునకు వస్తే ఓ మరణమా! నీ ముల్లెక్కడా? ఓ మరణమా! నీ విజయమెక్కడా? ఇవన్ని మా ప్రభువు జయించి పెట్టినాడు. సాతానా నీకు అపజయమేనని ఎదిరించాలి. మరణము రాగానే ఈ వాక్యధ్యానము తలంపులోనికి తెచ్చికొనియుండుము. మరణము ఏలాగో ఒకలాగు సందు చేసికొని రాగానే మరణము వచ్చింది గాని మరణముయొక్క ముల్లు నాకు రాలేదు. ఉదా: తేలు కాలుపై ప్రాకింది గాని దానికొండి నాకు తగలలేదు అనాలి. మరణము వచ్చిందిగాని మరణపు ముల్లు నాకు రాలేదు. ప్రభువు పునరుత్థాన బలము వలన నాకు జీవమిచ్చెను. మరణపు ముల్లు నాకు వస్తే ఏదేనులోనికి పోవాలి. మరణము వస్తే ఈ భక్తుని నేను చంపడానికి వచ్చినను మరణ ద్వారము నుండి ప్రభువు దగ్గరకు జీవములోనికి పోవును, మరణపు ముల్లు గుచ్చుకొంటే, ఏదేనులోకి వెళ్ళుదుము. ప్రభువు మరణములోనుండి, సమాధిలో నుండి ఆరోహణమైనట్లుగా మనకు మరణము వస్తే మరణములోనుండి, సమాధిలోనుండి జీవములోనికి వెళ్తాము. మొదట పిశాచికి లోబడినాము కదా! తలంపులో లోబడితే ఏమాయెను? ఇప్పుడు నీవి ఏమైనావు అని పిశాచి అంటే భక్తుడు లేడు. ఒక నిమిషము ఆలాగు జోగినాను గాని నా ప్రభువు పునరుత్థాన బలమువల్ల త్రొక్కివేసినాను అని అంటాడు. ఉదా: కండువ మీద బురదపడితే కడిగి వేసిన తరువాత ఇంకొకరు వచ్చి మీ కండువా మీద బురదపడెనట ఏది? అని అడుగగా లేదు, కడిగినాము గాన పడనట్టే అని పునరుత్థాన తలంపు తెచ్చుకోవలెను. సాతాను ఒకరి దగ్గరకు వచ్చి ఓ ఆసామి రాకడ రాకడ, అన్నావు చనిపోయినావేమి? అనగా ఈ భక్తుడు లేదు. చనిఓయిన ప్రభువు రాగానే సజీవుల కంటే ముందుగా ప్రభువును చేరుటకు సమాధిలోకి, మరణములోకి వెళ్ళాము అని చెప్పాలి.

సాతాను అంటుంది పడ్డావులేయని, భక్తుడు నేను పడలేదులే అని అనాలి. నాకు ఆపదలేదని క్రీస్తునందందు నిశ్చయముగా చెప్పాలి. కాబట్టి ఈస్టరు పండుగ భాగ్యము, కాంతి, జీవము, జయము మీకందరకును సంఘమంతటికిని కలుగును గాక!

పాట::పిశాచి కడిమి పడగొట్టెను….

Please follow and like us:

How can we help?

Leave a Reply