క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. ఈష్టరు పండుగ...
  5. పునరుత్ధాన కాంతి

పునరుత్ధాన కాంతి

  1. విరోధులు ఆయనను శ్రమలు పెట్టగా, ఆయన వారిని శ్రమలు పెట్టనిచ్చెను ఎందుచేత? సహించుట వలన జయించుటకే.
  2. చంపనిచ్చెను, ఎందుచేత? బ్రతికి బయటికి వచ్చి అందరికి కనబడుటకే.
  3. సమాధి చేయనిచ్చెను, ఎందుచేత? సమాధిలో ఉండిపోయి మన్ను కాకుండుటకే.
  4. ఆయన సమాధిలో నుండి బయటికి రాకుండుటకై సమాధి ద్వారము వద్ద పెద్దరాయి వేయబడెను. ఆయన వేయనిచ్చెను, ఎందుచేత? మనుష్యుల సహాయము లేకుండ ఆ రాతిని దొర్లించుటకే.
  5. సమాధిలోనున్న ఆయన శవమును, శిష్యులు ఎత్తికొని పోకుండునట్లు అధికార సంబంధమైన ముద్ర సమాధి మీద వేయబడెను. ఆయన వేయనిచ్చెను. ఎందుచేత? అధికారుల సెలవు లేకుండనే తన అధికారముతో దానిని తీసివేయుటకే.
  6. శిష్యులు సమాధి యొద్దకు రాకుండునట్లు రాణువవారు కావలి యుండిరి. ఆయన అట్లు ఉండనిచ్చెను. ఎందుచేత? పరలోక కాంతి చూచి వారు చచ్చినవారివలె పడిపోవుటకే. ఆయన మూడవ దినమున సమాధిలో నుండి వెలుపలకు వచ్చివేసెను. ఎవరు ఆటంక పరచిరి? ఎవరి మట్టుకు వారు ఒత్తిగిలిపోయిరి. సాతాను దయ్యములు, మరణము, అపహాసకులు, కావలివారు ఏమైపోయిరో! సమాధి, రాయి, ముద్ర ఏమైనవో!!!
  7. గెత్సెమనే తోటలో ప్రభువు ఒక మాట పలికెను. ఆ మాట ఏమనగా ఇది “మీ ఘడియయు, అంధకార సంబంధమైన అధికారము”, అయితే పునరుత్థాన దినము క్రీస్తుకాలము, విజయ దినము,ప్రకాశమానమైన దినము, నీతిసూర్యోదయ దినము, క్రీస్తు పునరుత్థానము విశ్వాస జనసంఘము యొక్క పునరుత్థానమును సూచించు దినమైయున్నది.
  8. ఆయన శ్రమలను ధ్యానించి, పునరుత్థాన బలము పొందెదము గాక! క్రీస్తు ప్రభుని పునరుత్థానము మనకు ఏమి జ్ఞాపకము చేయును? (1) ఆయన యందు విశ్వాసముంచి మృతులైన వారందరు మరల బ్రతికి వచ్చెదరు అనియు, (2) ప్రభువు ఎట్లు జయము పొందెనో అట్లే ప్రతి విశ్వాసి జయము పొంద వచ్చుననియు, (3) ఒక్క ఈస్టరునాడు మాత్రమే కాక ప్రతి దినమున పునరుత్థాన బలము కొరకు ప్రార్ధింపవలెననియు, (4) మనము ఆయన వారము గనుక ఆయన సంపాధించిన జయము అంతా మనదే అనియు, (5) ఆయన జయశీలుడై వచ్చుటకు గల ఆటంకములన్నియు తొలగిపోవునట్లు, మనము జయశీలులమై ఉండుటకు గల ఆటంకములు కూడ తొలగిపోవుననియు, (6) అనుదినము పాపాకర్షణ కలదు గనుక పునరుత్థాన బలము వలన పాపమువైపు ఆకర్షింపబడకుండవలెననియు జ్ఞాపకము తెచ్చుచున్నది.

ప్రభువు పునరుత్థానమైన నిమిషమును ఎవరును ఎరుగరు గాని, రెండవ రాకడనాడు సంఘమంతటికిని త్వరలోనే కలుగనైయున్న పునరుత్థానమును రాకడనాడు సంఘమంతటికిని త్వరలోనే కలుగనైయున్న పునరుత్థానమును విశ్వాసులంతా ఎరుగుదురు. అట్టి మహాధన్యత కొరకు సిద్ధపడండి.

సిలువ మోయుట మన నిమిత్తమైనట్లు అందరిమీద అన్నిటిమీద జయము పొందిన క్రీస్తు యొక్క జయము మన నిమిత్తమైన జయమే. క్రీస్తునకు జై! క్రీస్తునకు జై! క్రీస్తునకు జై! ఆయనను నమ్మిన సంఘమునకు జై! ఆయనను నమ్మిన సంఘమునకు జై! ఆయన సంఘమునకు జై!

Please follow and like us:

How can we help?

Leave a Reply