బైబిలు పాఠము: మార్కు 16:1-18.
ప్రార్ధన: ప్రభువా! నీ సిలువ, శ్రమ, సమాధి తట్టుచూచినట్లు, ఈ దినము మేము పునరుత్థానముతట్టు చూచేటట్లు మా హృదయములను త్రిప్పుము. నీ పునరుత్థాన బలమును గుర్తించగల నీ వర్తమానము అందించుము. ఆమెన్. మరనాత.
ప్రియులారా! సహవిశ్వాసులారా! క్రిష్ట్మసు అని చెప్పుకున్న పండుగయు, మంచి శుక్రవార పండుగయు గతించినవి. ఈ వేళ సూర్యోదయమునకు ముందే, ఈస్టరు సూర్యోదయము ఉదయించెను. త్రిత్వానికి మంగళ స్తోత్రములు కలుగును గాక.
ఈవేళ చాల విచారకరమైన పండుగ. ఆలాగుననే ఈ దినమందుకూడ విచారకరమైన పండుగ. మరియు క్రిష్ట్మసు పండుగ ఏలాగు సంతోషకరమైన పండుగైయున్నదో, అలాగుననే ఈ దినముకూదా సంతోషకరమైన పండుగైయున్నది. ఇది ఈస్టరు పండుగ. ఈ వేళ క్రీస్తు ప్రభువుయొక్క పునరుత్థాన దినోత్సవము గనుక ఇది గొప్ప పండుగ. అయినప్పటికిని నేను విచారకరమైన పండుగ అని చెప్పుచున్నాను. ఆశ్చర్యపడవద్దు. మిశ్రమ ఆనంద దినోత్సవము అని ఈ దినమునకు పేరు. రెండునూ అనగా విచారము, సంతోషము, కల్సియున్న దినము గనుక ఇది మిశ్రమ ఆనంద పండుగ దినము. విచారకరమైన, సంతోషకరమైన విశ్వాసులకు ఇది పండుగే. ఈ దినము యెరూషలేములో జరిగిన పనినిగూర్చి వివరించెదను. యేసుప్రభువు సమాధిలో నుండి లేచినందున సైతానును కాళ్ళ క్రింద త్రొక్కి గెలిచెను. సాతాను ఓడిపోయెను. గనుక సాతాను వాని అనుచరులు, పాపము, పాపఫలితము, మరణము, సమాధి మొదలగు వాటిని అన్నింటినీ గెల్చి, ప్రభువు పునరుత్థానుడై సమాధిలోనుండి వెలుపలకి వచ్చెను. ఇవన్నీ మన కొరకే గాన మహాసంతోషకరమైన పండుగ. భూమి మీద అనగా సర్వ ప్రపంచ మందు ఈ పండుగ మహా ఘనముగా చేస్తారు. విచారకరమైన పండుగ అని ఎందుకు అంటున్నానో వినండి. నేను ఇప్పుడు మనుష్యులను కొందరిని కొన్ని గుంపులుగా ఏర్పరచి చెప్పుతాను.
- మొదటి గుంపు: 11 మంది శిష్యుల గుంపు.
- వ గుంపు: ఆయన సిలువ మ్రాను మీద శ్రమ పడుచుండగ రొమ్ముకొట్టుకొనుచు ఏడ్చిన గుంపు.
- వ గుంపు: యోహాను, ప్రభువు తల్లి, మరియమ్మ వీరు సిలువకు దగ్గరగానున్న గుంపు.
- వ గుంపు: మిలటరీ ఆఫీసర్సు (ఆ మిలటరీ ఆఫీసరు ప్రభువు సిలువను, ఆయన సహింపును చూచి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పిన గుంపు,
- వ గుంపు: పిలాతు ఆయన భార్య కలిసి ఉన్న గుంపు.
- వ గుంపు: అరిమతయి యోసేపు, నికోదేము ఉన్న గుంపు.
మనము ఈ గుంపులను చూస్తున్నాము. యేసుప్రభువు సమాధిలో నుండి లేచుటను ఈ ఆరు గుంపుల వారు చూడలేదు. ఈ ఆరు గుంపులవారు ప్రభువుయొక్క అభిమానులే గాని సమాధిలో నుండి లేవడము వీరు చూడలేదు గనుక దీనిని విచారకరమైన పండుగ అన్నాను. వీరు విరోధులు కారు, అభిమానులే, వీరే చూడలేకపోతే ఇంకెవ్వరు చూస్తారు.
ప్రభువు శిష్యులు సర్కీటులో ఉన్నప్పుడు నేను మూడవ దినమున లేస్తానని చెప్పిన మాట అందరికి తెలిసిపోయినది. అందరు విన్నారు గాని అదెలాగో తెలియకనే ఒక మైకములా జరిగిపోయినది. మూడవ దినమున లేస్తానని చెప్పిన మాట, విన్నవారు నమ్మినట్లయితే కనిపెట్టుకొని యుండి చూచేవారే, అది జరుగలేదు. గనుకనే విచారకరమైన పండుగ అన్నాము. ప్రభువు ఈ మాటలు కొన్ని వందల యేండ్ల క్రిందట చెప్పిరి. ఇవి బైబిలులో లేవు గాని అందరికి తెలుసు. అదేమనగా నేను సమాధిలోనుండి లేచునప్పుడు ఆ గడియలోని మహిమ మహా గొప్పది అన్నారు. మరనాత.