- క్రీ.శ. 30వ సంవత్సరము; ఏప్రిల్, మే నెలలు; నలుబది దినములు. భూకంపము, రాయి దొర్లింపబడుట, కావలివారు భయపడుట, ఆదివారము సూర్యోదయమునకు పూర్వమే పునరుత్థానము జరుగుట, మత్తయి 28:2-4
- ఆదివారము వేకువ జామున స్త్రీలు సమాధి కడకు వచ్చి, అది ఖాళీగానుండుట కనుగొనుట, మగ్ధలేనే మరియ పరుగెత్తి సమాధి దోపుడు జరిగెనని పేతురు, యోహానులతో చెప్పుట. మత్తయి 28:1;మార్కు 16:2-5; లూకా 24:1-3; యోహాను 20:1.2.
- మిగిలిన స్త్రీలు సమాధి యొద్దనే నిలిచి, దూతలద్వారా పునరుత్థాన వార్తను తెలిసికొని తిరిగివెళ్ళుట, మత్తయి 28:5-8; మార్కు 16:5-8; లూకా 24:4-9.
- పేతురు, యోహానులు సమాధి కడకు పరుగెత్తుట. లూకా 24:12;యోహాను 20:3-10.
- సమాధియొద్ద యేసు మగ్ధలేనే మరియకు దర్శన మొసగుట. మార్కు 16:9; యోహాను 29:11-17.
- యేసు తక్కిన స్త్రీలకు కూడ మార్గమున దర్శన మొసగుట. మత్తయి 28:9,10.
- యేసు తమకు దర్శనమిచ్చెనని స్త్రీలు శిష్యులకు చెప్పుట. వారి అపనమ్మకము. మార్కు 16:10,11; లూకా 24:9-11; యోహాను 20:18.
- కావలివారీ వార్తను సనెడ్రిన్ వారికి తెలుపగా, అబద్ద వార్తను చాటుటకై వారు కావలి వారికి లంచమిచ్చుట. మత్తయి 28:11-15.
- యేసు క్లెయొపకును, అతని చెలికానికిని ఎమ్మాయుకు వెళ్ళు మార్గమున దర్శనమొసగుట. మార్కు 16:12; లూకా 24:13-32.
- క్లెయొపకును, అతని చెలికాడును ఈ వార్తను శిష్యులకు తెలుపుటకు తిరిగి యెరూషలేమునకు వచ్చి, యేసు పేతురునకు దర్శన మొసగెననువార్త వినుట. మార్కు 10:13; లూకా 24:33-35; యోహాను 20:19.
- తోమా లేని సమయమున యేసు తన శిష్యులకగుపడి వారికాజ్ఞాపించుట. తోమా అపనమ్మకముతో యెరూషలేము ఆదివారము సాయంకాలము మార్కు 16:14;లూకా 24:36-43; యోహాను 20:19-25.
- ఒక వారమునకు పిమ్మట యేసు తన శిష్యుల కగపడుట, తోమా నమ్ముట; యెరూషలేము. యోహాను 20:26-29.
- గలిలయ సముద్రతీరమున యేసు తన శిష్యులలో ఏడుగురికి కనిపించుట, విస్తారమైన చేపల రాసిపడుట, యేసు పేతురును పరీక్షించుట. యోహాను 20:1-23.
- గలిలయలో యేసు నియమించిన కొండపై పదకొండు మంది శిష్యులకగపడుట, ఆయన యొసగిన గొప్ప ఆజ్ఞ. మత్తయి 28:16-20; మార్కు 16:19-20; లూకా 24:44-49.
- యేసు ఆరోహణము, ఒలీవల కొండ, మార్కు 16: 19,20; లూకా 24:50-53.
ముగింపు: యోహాను సువార్త యొక్క ఉద్దేశము – గ్రంధకర్త యొక్క స్వీయ సాక్ష్యము. యోహాను 20:30,31.
సంఘారోహణము, ప్రకటన 4వ అధ్యాయము.
Please follow and like us: