క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. కానుకల పండుగ...
  5. కానుకల పండుగ – 3

కానుకల పండుగ – 3

(వాక్యభాగములు: మలాకీ 3:7-12; మత్తయి 5:20; లూకా 21:1-4; || కొరింథి 8:1-4; 9:1-11). 

          కానుకల పండుగ దేవుడు ఏర్పాటు చేసెను. సంఘము పండుగ యొక్క తేదీ ఏర్పాటు చేసికొనెను. క్రిస్మస్, ఈష్టరు, పెంతెకొస్తు- ఈ మూడును సంఘము ఏర్పర్చెను గాని చేయవలెనని ఆజ్ఞలేదు. సంఘము తన సంతోషము చొప్పున ఏర్పరచుకొనెను. దేవుడు అంగీకరించి, ఆమోధించి సంఘముతో ఏకీభవించెను. ఎన్ని పండుగలు సంఘము ఏర్పర్చుకొన్నను అవి వాక్యమునకు విరుద్ధముగా లేని యెడల ప్రభువు సంతోషించును. పండుగలు వాక్యమునకు విరుద్ధముగా ఉండకూడదు.

      కానుకల పండుగ దేవుడు ఏర్పర్చెను. మీ సంపాదనలో పదియదవ భాగము నా సన్నిధికి తీసికొని రండి అని చెప్పెను. కానుకల పండుగను గూర్చి మూడు ముఖ్యమైన భాగములు ఉన్నవి. (1). తండ్రి తన కుమారునిచ్చెను. (2). కుమారుడు తన శరీర ప్రాణ రక్తములను మనకు ఇచ్చెను. (3). పరిశుద్ధాత్మ తన్ను తాను మనకొరకై అర్పణ చేసికొని తన వరములను కూడ మనకు ఇచ్చెను. ఈ మూడు సంగతులు తండ్రి నామమున, కుమారుని నామమున, పరిశుద్ధాత్మ నామమున మనకు దొరికినవి. దైవ వాక్యములోని మొదటిభాగము పాతనిబంధన గ్రంధము. అందు మాట్లాడిన వాడు తండ్రియైన దేవుడు తర్వాత రెండవ భాగమైన క్రొత్త నిబంధనలో మొదటనున్న సువార్తలలో, కుమారుడైన తండ్రి అనగా యేసుప్రభువు మాట్లాడెను. తర్వాతనున్న పత్రికలో పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడెను. ఈ పండుగను గూర్చి పాతనిబంధనలో తండ్రి ఒక మాట చెప్పెను. సువార్తలలో ప్రభువు ఒక మాట చెప్పెను. పత్రికలలో పరిశుద్ధాత్మ ఒక మాట చెప్పెను. మనము ఇచ్చుటను గురించి ముగ్గురు మూడు విధములుగా చెప్పిరి. ఈ ముగ్గురి మాటలలో ఒకరి మాటకు ఇంకొకరి మాటకు తేడా ఉన్నది. ఒకరి మాట కన్నా రెండవ వారి మాటలో ఎక్కువ అర్ధము. మూడవవారి మాటలో ఇంకా ఎక్కువ అర్ధము గలదు. ఉదా:- సూర్యుని కాంతి ఉదయమున కొంచెముగా నుండును. పది గంటలకు కాంతి ఎక్కువగును. పన్నెండు గంటలకు ఇంకా కాంతి హెచ్చగును. అలాగే ముగ్గురి మాటలలోని అర్ధము క్రమముగా హెచ్చయినది. (1). పాతనిబంధనలో తండ్రి, ఇచ్చుటను గురించి చాల చెప్పెను గాని ఈ సందర్భములో (మీ పదియవ భాగమును తీసికొని రండి) అని మలాకీ గ్రంధములో చెప్పెను. మీ రాబడిలో పదియవ భాగము తీసికొని నా సన్నిధికి రావలెనని చెప్పెను. (2). కుమారుడైన యేసుప్రభువు మత్తయి 5:20లో “శాస్త్రుల నీతికంటెను, పరిసయ్యులూ నీతికంటెను, మీ నీతి అధికము కానియెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.” శాస్త్రులు, పరిసయ్యులు, వీరు యూదులు. వారి నీతి, రాబడిలో దశమ భాగము అనగా 10వ వంతు ఇచ్చుట. వారు బైబిలు నెరవేర్చుటలో ప్రసిద్ధులు. భక్తి లేకపోయినను, ఆచారము తప్పక చేయుదురు. పాత నిబంధన ప్రజలు ప్రభువును చూడ లేదు. క్రొత్త నిబంధనవారు ప్రభువును చూచిరి. పాత నిబంధనవారికి ఈ భాగ్యము లేదు గనుక క్రొత్త నిబంధన వారు ఎక్కువ ఈయవలెనని ప్రభువు చెప్పెను. పాత నిబంధనవారు ఇచ్చినదాని కంటెను, వారు చేసిన దాని కంటెను, క్రొత్త నిబంధన వారు ఎక్కువ ఈయవలెను. ఎక్కువ చేయవలెను. వారు ప్రభువు కొరకు కనిపెట్టిరి. అయితే క్రొత్త నిబంధన వారికి ప్రభువు కనబడు చుండెను. గనుక ఎక్కువ చేయవలెను. గనుకనే ప్రభువు ఎక్కువ ఇచ్చిన (అనగా తన జీవనమంతయు ఇచ్చిన) బీద విధవ రాలిని  మెచ్చుకొనెను. (3). పరిశుద్ధాత్మ తండ్రి పత్రికలలో మాసిదోనియవారు (|| కొరింథి 8:1-4) తమ శక్తీ కొలదికాక, శక్తికి మించి చందా వేసిరి అని వ్రాయించిరి. వారి కానుక కలిమి కొలది కాదు గాని లేమికొలది ఇచ్చిరి. వారికి శ్రమలు ఉన్నవి గనుక సంతోషము లేదు. శ్రమలున్నను, ఇచ్చుటలో సంతోషముతో ఇచ్చిరి. ముగ్గురూ (త్రిత్వము) చెప్పినవాటిలో ఏది చేయవలెను? సంఘమునకు స్వాతంత్ర్యము గలదు. గనుక మన ఇష్టప్రకారము చేయవచ్చును. ఈ ప్రత్యేక విభజన వాక్యములో నున్నది గాని మనకు తెలియదు. యూదులు చిన్న పిల్లల వంటివారు అనగా మనకున్న సంపూర్ణ వాక్యము వారికి లేదు. వారికి లెక్కలు అవసరము గనుక 10వ వంతు భాగము ఇవ్వండి అని చెప్పెను. అయితే ప్రభువు వచ్చిన తర్వాత మీరు దశమ భాగము మాత్రము కాదు, ఎక్కువ పొందియున్నారు గనుక మీరే ఎక్కువ ఇయ్యవలెనని చెప్పిరి. ప్రభువు వచ్చుట ఎక్కువ, ప్రభువును చూచుట మరి ఎక్కువ. గనుక మీ నీతి అధికముగా నుండవలెనని ప్రభువు చెప్పిరి. మరియు బాప్తిస్మము, ఆత్మ కుమ్మరింపు పొందినవారు ఇంకా ఎక్కువ ఇయ్యవలెను. పాత నిబంధనలో అంత్య దినములలో ఆత్మ కుమ్మరింపబడునను ప్రవచనము వారికి (యూదులకు) గలదు. మనకు ఆ ప్రవచనము యొక్క నెరవేర్పు గలదు. గనుక వారికన్న ఎక్కువే. శక్తికిమించి ఎవరు ఇవ్వగలరు? పెట్టెలో రూ. 5లు మాత్రము ఉన్నవి. రూ. 4లు ఇచ్చుట శక్తికి సరిపోవును. అయితే అయిదు రూపాయిలను ఇచ్చివేసిన యెడల శక్తికి మించి ఇచ్చినట్లగును.

పైనచెప్పినట్లు ఇచ్చిన వరికి దీవెన గలదు, పాత నిబంధనలోని యూదులకు, ప్రభువు కాలములోని వారికి, సంఘమునకు దీవెనలు గలవు.”ఆకాశపు కిటికీలి విప్పి పట్టజాలనంత” ఇచ్చెదనని చెప్పెను. ఈ మూడు జ్స్నాంగముల వారికి ఇదే అధారము. మాసిదోనియవారు ఇది నమ్మి ఇచ్చిరి. పాత నిబంధన వారిది గొప్ప విశ్వాసము, సువార్తలలోని వారిది ఇంకా గొప్ప విశ్వాసము. సంఘ కాలములోని వారిది అన్నటి కన్న మహా గొప్ప విశ్వాసము. మీరు శక్తికి మించి ఇవ్వండి. మీకు ఇంకా ఎక్కువ ఇచ్చెదనని దేవుడు చెప్పెను. దేవునికిచ్చినవారు గొప్ప  ధనికులగుదురు. 

      కోల్గేట్ ఎక్కువ ధనికుడాయెను. ప్రభువునకు రెండు పదులిచ్చి ఇంకను ఎక్కువ అభివృద్ధి పొందెను. తరువాత మూడు పదులు, నాలుగు పదులు, ఐదు పదులు ఇచ్చెను. ప్రభువు సేవకై లక్షల కొలది డాలర్లనిచ్చి శాశ్వతమైన పేరు గాంచిన విలియం కోల్గేటు ఈయనే. 

       నీతి:- ప్రభువునకు మరింత ఇచ్చిన వారు వర్ధిల్లుదురేగాని క్షీణింపరు.

1. కానుక పెట్టె

      1. వేదవాక్యము:- ‘ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవన మంతయు వేసెను.’ (లూకా21:1-4).

      2. కథ:- యెరూషలేము దేవాలయమునందు స్త్రీలయావరణములో గొఱ్ఱెపొట్టేలు కొమ్ము రూపమున చేయబడిన 13 కానుక పెట్టెలు గలవు. అవి స్త్రీల యావరణమునుండి పురుషుల ఆవరణములలోనికి వెళ్ళు పెద్ద ద్వారముయొక్క రెండు ప్రక్కలను అమర్చబడియుండెను. వీటిలోనే క్రీస్తుప్రభువు కాలమునందు ఒక పేద విధవరాలు తనకు కలిగిన రెండు కానుకలను వేసెను. (కాసు అనగా దమ్మిడీ లేక అర్ధణా కాసు వంటిది) ఆమె కనుక వేయుచున్న సమయమున క్రీస్తు చూచి ‘వారందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవన మంతయు వేసెను ‘ అని చెప్పెను.

      3. నీతి:- చందానీయకుండా వెళ్ళుచున్నావా? అన్నట్లున్నది గుడిలో ఉన్న కానుకల పెట్టె.

     2. అప్పులు తీరి ఆస్తి వచ్చుట 

      1. వేదవాక్యము:- వారు వట్టిచేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించిన దీవెన చొప్పున, ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. (ద్వితీయో 16:17). 

      2.కథ:- ఒక ఉద్యోగి దశమభాగమును గూర్చి బోధ విని, తీర్మానించుకొన్న ప్రకారము యిచ్చుటకు మొదలు పెట్టి, ఇంత ఎక్కువ ఇస్తే ఎట్లు అని మానుకొనెను. అందువలననే అప్పులు పాలైనట్లు, జబ్బులు వచ్చినట్లు, అదివరకున్న దీవెన పోయినట్లుగాను, అనుభవము వలన గ్రహించి, మరల దశమభాగమియ్య మొదలు పెట్టెను. కొంత కాలములోనే అప్పులు తీర్చుకొని ఆస్తిపరుడు నైతినని తానే సాక్ష్య్య గలవాడాయెను.

     3. నీతి:- అప్పులు గలవారు మొదట దేవునికి వారు బాకీ వున్నదంతయు తీర్చుట మంచిది. అప్పుడు దేవుడే వారి బాకీ తీర్చును. 

2. ఏడు వాక్యములు 

     1. యూదులు తమ ధనధాన్యాదులనుండియు, కూరలు మొదలగు వాటన్నిటిలో నుండియు పదియవ వంతులనర్పించునట్లు (నెహె. 10:37) లో కలదు. ‘మా పిండిలో ప్రధమఫలము, ప్రతిష్టార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చునట్లుగా, ప్రతి పట్టణములో నున్న మా పంట్లలో పైయవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.’

     2. తమ మందలలోనుండి, వస్తువులలోనుండి పదియవ వంతును ఇచ్చిరి. “ఎద్దులలోను, గొఱ్ఱెలలోను పదియవవంతును, దేవుడైన యెహోవాకు ప్రతిష్టితములైన వస్తువులలో పదియవ వంతును తీసుఒనివచ్చి కుప్పలుగా కూర్చిరి ” (||దిన 31:6). 

       3. క్రైస్తవులైనవారు దశమ భాగము ఇవ్వవలెనని (మత్తయి 23:23)లో ‘వాటిని మానక ‘ అను మాటవలన కనబడుచున్నది. యూదులు యెహోవాను మాత్రమే కలిగియుండి దశమభాగములిచ్చిరి. క్రైస్తవులమైన మనము త్రియేక దేవునిని కలిగియున్నాము. మరియు సంపూర్ణ రక్షణను కలిగియున్నాము. గనుక వారి కంటే ఇంకా యెక్కువ చెల్లించుటకు బద్దులమై యున్నాము. 

4.”ఆ యాజ్ఞ వెల్లడియగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రధమ ఫలములైన ధాన్య, ద్రాక్షరసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండియు పదియవ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి.” (||దిన.31:5).

      5.”యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటినుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్పరాశి మిగిలినది” (||దిన.31:10). 

       6. “మానవుడు దేవునియొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును, ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరును నా యొద్ద దొంగిలించుచునే యున్నారు. మీరు శాపగ్రస్తులై యున్నారు. నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొని రండి. దీనిచేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను” (మలాకి, 3:8-10).

7.” ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా, గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచరగాడిదల మీదను, ఒంటెలమీదను ఎక్కించి, సర్వజనులలో నుండి నాకు ప్రతిష్టిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు,” (యెషయా, 66:20). 

రెండు బలహీనతలు

     1. చెల్లని కానుకలిచ్చుట:- పడమటి దేశపు క్రైస్తవులు దేవుని కిచ్చునపుడు తమ భోజనములోనుండి శ్రేష్టమైన వాటినిత్తురు. మన దేశీయులు చెల్లని కాసులు, పడని రూపాయల నిత్తురు. మనుష్యులకు పనికిరానివి దేవునికెట్లు పనికివచ్చును? 

     2. సణుగుకొనుచు ఇచ్చుట:- ‘సణుగుకొనకను బలవంతముగా కాకను ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉ త్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును ‘ (||కొరింథి. 9:7).

3. ఏడు విధముల చందా 

        1. ఆదివారపు చందా:- “నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ, ప్రతి ఆదివారమున, మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది, తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.” (|కొరింథి. 16:2).

       2. పరిశుద్ధుల కొరకైన చందా:- “పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి”. (|కొరింథి.16:1). 

       3. బీదల చందా:- “మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని”. (గలతీ. 2:10) గొప్ప కరువు రాబోవుచున్నదని ఆత్మచేత ప్రవచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. ‘అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయముగా పంపుటకు నిశ్చయించుకొనెను” (కార్య. 11:29). 

       5. ఆలయపు చందా:- “మీరు వారి యొద్ద తీసికొనవలసిన అర్పణలు ఏవనగా బంగారు, వెండి, ఇత్తడి” (నిర్గమ. 25:3).

       6. దశమభాగముల చందా:- భూధాన్యములలోనేమి, వృక్షఫలములోనేమి, భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్టితమగును”(లేవి.27:30). 

7. పండుగ చందా:- “నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను.” (నిర్గమ.23:16). 

                                                                            స్వేచ్చార్పణ 

     స్వేచ్చార్పణ అనగా నీవు మనసులో ఎంత ఇవ్వవలెనని అనుకొనుచున్నావో అంత ఇవ్వవచ్చును. మరియు నీవు ఆశీర్వదింపబడిన కొలది ఇవ్వవలెను. 

         స్వేచ్చార్పణ అనగా నీవు మనసులో ఎంత ఇవ్వవలెనని అనుకొనుచున్నావో అంత ఇవ్వవచ్చును. మరియు నీవు ఆశీర్వదింపబడిన కొలది ఇవ్వవలెను. 

     1. ఇతరుల ప్రేరేపణనుబట్టి తెచ్చుటకాదు. 

     2. ఇబ్బందిపడి తీసుకొని రావద్దు.

     3. ఒకవేళ ఇవ్వకపోతే దేవుని దీవెన రాదేమో! కానుకలు తెచ్చిన వారికి దీవెన వచ్చును గనుక నేను కూడ కానుక తీసికొని వెళ్ళిన, నాకు కూడ దీవెన వచ్చును. అని దీవెనను మనస్సులో దృష్టించుకొని తీసుకొని రావద్దు.     

4. కళంకమైనవి తీసుకొని రావద్దు. అనగా పడని డబ్బులు, పుచ్చిపోయిన కూరగాయలు, పనికిరానివి తీసికొని రావద్దు. వాటిని ప్రభువు అంగీకరింపడు. 

       5. అభిప్రాయ భేధమున్నప్పుడు తీసికొని రావద్దు. సంఘము మేలు నిమిత్తము, (బోధకుని ఉపయోగార్ధము). దేవుని మహిమార్ధము ఈ కానుక వాడరేమో అని అభిప్రాయభేదము కలిగినప్పుడు తేవద్దు. అది ప్రభువు అంగీకరింపడు. బోధకుని పోషణ కొరకు సంఘము కానుక లివ్వవలెనని లేవికాండములో ఉన్నది కదా!   

6. ‘నేను ఇంత కానుక యిచ్చియున్నాను ‘ అని మానవులకు తెలియవలెననెడి ఉద్దేశముతో తేవద్దు. మానవులు తెలిసికొంటే తప్పులేదు గాని అది మన కోరికయై యుండరాదు. నేను ఎక్కువ ఇచ్చియున్నట్లు అందరికిని ప్రకటన కావలెనను ఉద్దేశముతో కానుక ఇవ్వవద్దు. 

        7. కానుకలో కళంకము లేదు గాని మీ హృదయములో అవిశ్వాసమో, అధైర్యమో, భీతియో యున్నది. అట్టి సమయమున కానుక తెచ్చిన ప్రయోజనమేమి? మొదట మీ హృదయమును శుద్ధి చేసికొని రావచ్చును. ఏ కారణములేకుండ, ఇష్టపూర్వకముగా తెచ్చినదే స్వేచ్చార్పణ. 

            (ద్వితి. 16:10; ఫిలిప్పీ. 1:12-22; యోహా. 1:29). 

4. కృతజ్ఞత కానుక 

     దేవుడు నా పాపములను క్షమించినాడనే సంతోషముతోను, పాపమును జయించేశక్తిని దయచేయునను విశ్వాసముతోను; శ్రమలు, శోధనలు రానివ్వడము నా మేలుకోసమే అను నిరీక్షణతోను కానుకలర్పించిన యెడల అదే కృతజ్ఞత కానుక.

     2. ఒక బీద క్రైస్తవురాలు వారిదగ్గర వీరిదగ్గర సహాయము పొందుచున్నది. ఆమె ఏమి చందా వేయగలదని కొందరడుగ వచ్చును. దీనికి జవాబేమిటంటే ఆమె పొందే సహాయంతో ఆమె తన శక్తి కొలది వేయును. కానుక వేయవలెనని చెప్పించుకోవడము నిజ విశ్వాసుల లక్షణము కాదు. స్వాభావికముగా దేవుని ఉపకారములను తలంచుకొని కృతజ్ఞత కానుక లిచ్చుటయే కృతజ్ఞత.

     3.’అందరు చంద వేస్తూ యున్నారు. నేను వేయకపోతే ఏమైనా అనుకుంటారేమో’ అని ఎవరైనా అనుకొని వేస్తే అది కానుక కాదు. కృతజ్ఞత కానుక అసలేకాదు.

     4. తల్లిదండ్రులు పిల్లలకు అనేకమైన మంచి వాడుకలు నేర్పిస్తారు. చందావేసే వాడుక, కానుకలిచ్చే వాడుక, బీదలకు భిక్షమేసే వాడుక మొదలగునవి నేర్పిస్తే, ఆ వాడుకలే వారి స్వాభావికమైన వాడుకగా మారిపోవును. చివరకు కృతజ్ఞత గలవారై కానుకలర్పించ గలరు.   

   5. నాకు తలనొప్పిగా యున్నది. గుడి నాకిష్టముండదు. ఏలాగు మరీ! అనుకుంటారేమో? దానికి జవాబు ఏమంటే పర్వాలేదు. పంపించ వచ్చును. కృతజ్ఞత ఉన్న వారు ఇయ్యకుండ ఉండలేరు.

       6. “అయ్యో! ఇవ్వవలసిన చందాలు ఇయ్యకలేకపోవుచున్నాను” అని నొచ్చుకునే వారు కృతజ్ఞత గలవారు.  

       7. అడిగినా అడుగకపోయినా, ఉన్నా, లేకపోయినా సదా కానుకలిచ్చుటే కృతజ్ఞత యొక్క గుర్తు.

      బాగా పండే పొలాలవలన, బాగా కాసే వృక్ష ఫలాలవలన, పచ్చగావుండే గడ్డివలన, బాగా కాసే ఎండవలన, చల్లగా వీచే గాలివలన, మతాబీవలె వెల్గే వెన్నెల వలన, కురిసే వానవలన, నిల్వగాయుండే లోహములవలన దేవునికి స్తుతి గలుగుచున్నది. ఈ స్తుతే సృష్టి దేవునికర్పించే కానుక. 

      దేవదూతలు, పరలోక వాస్తవ్వ్యులు సదా దేవునికి స్తొత్రములు చెల్లించుచున్నారు. అనగా తమ స్తుతినే కానుకగా చెల్లించుచున్నారు. మానవులమైన మనమును స్తుతి కానుక చెల్లింప బద్దులమై యున్నాము.  

5. పరలోకమునుండి వచ్చిన తంతివార్త 

        1. బైబిలు వాక్యము:- భూమిమీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ‘ (మత్తయి 6:19). 

        2. కథ:- డాక్టరు జె. హెల్ విన్ గారు 1910సం||ము చికాగో నేషనల్ లేమేన్సు కాంగ్రెసులో పరలోక తంతివార్త ఒక కలకత్తా వర్తకునికి వచ్చినట్లు తెలిపిరి. 

       బ్రిటిష్ మిషనెరీ సొసైటీయొక్క సెక్రటరీ, తమ మిషను పనికి ధనసహాయము చేయుమని ఒక వర్తకుని అడిగెను. వెంటనే ఆ వర్తకుడు చెప్పెను. సెక్రటరీగారు ఆ పరిస్థితులను బాగుగా గ్రహించి 750 రూ. కిచ్చిన చెక్కును తిరిగి ఇచ్చివేసిరి. చెక్కు పుస్తకము యింకా తెరువబడియే యుండెను. వర్తకుడు ఇంకొక చెక్కును వ్రాసి యిచ్చెను. సెక్రటరీ ఆశ్చర్యముతో దానిని చదివెను. ఆ చెక్కు రూ. 3000లకు వ్రాయబడెను. “మీరు పొరపాటు వ్రాయలేదా?” అని వర్తకుని అడిగెను. “లేదు, నేను పొరబాటు పడలేదు” అని సెక్రటరీతో ఆ వర్తకుడు కన్నీళ్ళతో చెప్పినదేమనగా, “అప్పుడే నా పరలోక తండ్రి యొద్ద నుండి కూడా నాకు ఒక తంతివార్త వచ్చెను. అందు “మీకొరకు భూమి మీద ధనమును కూర్చుకొనకుడి” అని వ్రాయబడి యున్నదనెను.

        3. నీతి:- నష్టపడిన కాలమదే దైవసేవకై అధికముగా నిచ్చుట-ఇది ఒక గొప్ప మాదిరి. మనమిట్లు చేయగలమా? 

6. యాభైయేడు పెన్నీల పంట 

       1. బైబిలు వాక్యము:- “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును”. (లూకా.6:38)

       2. హటీ మేవియట్ అను బాలిక ఒక ఆదివారపుబడికి వెళ్ళి తన్ను చేర్చుకొమ్మని అడిగెను. ఆమె కూర్చుండుటకై స్థలము చాలదని ఆమెకు చెప్పబడెను. రెండు సంవత్సరములలోనే ఆ పిల్ల జబ్బుపడి చనిపోయెను. ఎవరును ఆమె యొక్క వింతైన రహస్యమును గ్రహింపలేకపోయిరి. నలిగిపోయిన నోటు పుస్తకము ఆమె తలగడ క్రింద వుండెను. దానిలో 57పెన్నీలు అనగా రూ.1-84పైసలు ఉండెను. ఆ బిడ్డ తాను మిగుల పేదదగుటచేత కష్టపడి పనిచేసి వానిని దాచియుంచెను. అవి ఒక కాగితములో చుట్టబడి యుండెను. అందుపై ఆ పిల్ల ఇట్లు వ్రాసెను. “చిన్న గుడిని పెద్దదిగా కట్టుటకును, అనేకమంది చిన్నబిడ్డలు సండేస్కూలుకు పోవీలుండుటకును”, అందరి హృదయములలో నాటునట్లు పాదిరిగారు ఈ విషయము గుడిలో చెప్పిరి. వెంటనే సంఘస్తులు చందాలిచ్చుటకు మొదలు బెట్టిరి.  దూరస్థలములకు ఈ వార్త పత్రికల ద్వారా తెలుపబడెను. అయిదు సంవత్సరములలో ఆ యాభైయెడు పెన్నీలు 7,50,000 లాయెను. ఈ రోజున ఫిలడెల్ఫియాలో “బాప్టిష్టు టెంపుల్” అను పేరున పెద్ద దేవాలయము గలదు. అందులో 3,300 మంది కూర్చుండుటకు వీలున్న స్థలమున్నది. ఒక దైవ మందిరపు కాలేజీ కలదు. అందులో 1400 మంది విధ్యార్ధులకు సరిపోయిన స్థలము గలదు. ఒక టెంపుల్ సండెస్కూలును గలవు. అవి చాల విశాలమైనవి. ఆమె లేత హృదయము గలదైనను ఆమె దాతృత్వము విశాలమైనది.

       నీతి:- ప్రార్ధనశాలలు కట్టుటకు తోడ్పడుటకు మనకిట్టి శ్రద్ధ గలదా! ఆ బాలిక. వెళ్ళిపొమ్మన్నందుకు కోపింపక సహాయపడెను. ఇట్టి హృదయమే మనకవసరము.   

7. ఇనుప సిలువ యొక్క క్రమము 

       1. బైబిలు వాక్యము:- “ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువ నెత్తికొని నన్ను వెంబడించ్పవలెను. (మత్తయి, 16:24).

       2. కథ:- సుమారు నూరు సంవత్సరముల క్రిందట ప్రెడ్రిక్కు మూడవ విలియం అను ప్రష్యా (ప్రస్తుత జర్మనీ) డేశపు రాజు చాల మోపైన యుద్ధము చేయుచుండెను. ఎంతో ద్రవ్యము వ్యయమయ్యెను. తన రాజ్యమును బలపర్చవలెననియు, తన ప్రజలను గొప్ప జనముగా చేయవలెననియు, ప్రయత్నించు చుండెను గాని తన ఉద్ధేశము నెరవేర్చుటకు తగిన ధనము అతనియొద్ద లేకుండెను. ఆయనేమి చేయవలెను? ఆయన ఉన్నచోటనే యుండిన యెడల రాజ్యమును శత్రువులు ఆక్రమించుకొందురు. ప్రతివారికి అది భయంకరమైన ఆందోళన. అందు చేత తన రాజ్యములో ‘రాజుకు సహాయముచేయదలచిన ప్రతి స్త్రీ తన యొక్క వెండి బంగారు ఆభరణములను రాజుకు తెచ్చి యిచ్చిన యెడల వాటిని సొమ్ము క్రింద కరగించి, వారి దేశము కొరకు వ్యయపరచబడునని ‘ ప్రతిగా రాజుగారు కృతజ్ఞత తెలుపుటకై, వారి ఆభరణముల వంటి ఇనుప ఆభరణములు వారికిచ్చెను. వానిపైన “నేను ఇనుమునకు బదులు బంగారమునిచ్చితిని: 1813” అని వ్రాయబడియుండెను. స్త్రీలు రాజు కొరకు ఏమి అర్పించిరోఋజువుపరచునట్టి, ఆ ఆభరణములెంతో వెలగలవిగా చూపబడెను. ఎటువంటి నగలు ధరించుకొన్నను నాగరికతకాదని స్త్రీలు తమ ఆభరణములు విసర్జించిరి. 

అందుచేత ఇనుము విలువ క్రమముగ వృద్ధిపొందెను. ఆ దేశ్సవాసులు తమ ఛాతి మీద చిన్న ఇనుప సిలువను తగిలించుకొని, ఆభరణముల క్రింద అగు సొమ్మంతయు, వారి తోటివారి సేవకొరకు ఇచ్చిరి.” 

     3. నీతి:- మనము కూడ ఇనుప సిలువ నొకటి ఉంచు కొందుము గాక! ఆమెన్.   

8. మూడు రకముల దాన కర్తలు 

   1. బైబిలు వాక్యము:- “దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” ||కొరింథి. 9:7).     

   2. కథ:- ఒక హాస్య ప్రియుడు ఒకసారి ఈ క్రింది విధముగా చెప్పెను. “మూడురకముల దానకర్తలు గలరు.

   1. చెకుమికిరాయి 2. స్పాంజి 3. తేనేపట్టు.

    చెకుమికిరాతితో నుండి ఏమైనను తీయవలెననిన, దానిని సుత్తితో కొట్టవలెను. అప్పుడు చిన్న ముక్కలు, పిండివంటి ధూళి వచ్చును. స్పాంజిలో నుండి నీరు తీయవలెననినా, దానిని పిండవలెను. ఎంత ఎక్కువగ పిండితే అంత ఎక్కువ నీరు వచ్చును. గాని తేనెపట్టు దానంతట అదే దాని స్వంత మా మాధుర్యముతో పొంగిపొర్లును”.

    1. కొందరు లోభులు, కఠినిలు, సహాయము చేయగలిగి కూడా సహాయము చేయరు.

    2. మంచివారు కొందరు, ప్రేరేపణకు లొంగుదురు. వారినెంత ఎక్కువగా ప్రేరేపించిన అంత ఎక్కువగా కానుకలిత్తురు.

    3. మరికొందరు అడుగకుండానే ఇచ్చుటకు ఆనందపడుదురు.

    4. నీతి:- మనము ఏ వరుసలో నున్నామో పరీక్షించుకొనుట మంచిది. 

9. నిజమైన పశ్చాతాపము యొక్క గుర్తు 

     1. బైబిలు వాక్యము:- “ఆ యౌవనుడు మిగుల ఆస్తి గలవాడు” (మత్తయి 19:22).

     2. కథ:- వెస్లీకాలములో ఒక మెథడిస్టు పనివాడుండెను. ఆయన పేరు కెప్టెన్ వెబ్. ఎవరైన ఒక ఆస్తిపరుడు మారుమనస్సునొంది, క్రైస్తవుడైనట్టు ఆయన వినిన యెడల వెంటనే ఆయన “అతని ధనము కూడ మతము పుచ్చుకొనినదా?” అని అడుగువాడు. ఒక మనుష్యునిలో ఏమియు మార్పు లేనప్పుడు ఆమతము నందు అతనికి నమ్మకము లేనట్లే అని డాక్టరు క్లార్కుగారు చెప్పిరి. 

    3. నీతి:- మనము నిజమైన మార్పు పొందితిమా? లేనియెడల పొందుట మంచిది. కృపాతరుణము దాటకముందే. 

10. దాతృత్వము మాటలలోనే 

 1. బైబిలు వాక్యము:- “ఇచ్చుట ధన్యత” (కార్య. 20:35).

2.  కథ:- పశ్చిమ దేశస్థులైన తెల్లవారిలో ఇద్దరికి జరిగిన సంభాషణ;

    (తి=తియోఫిల, క్రి=క్రిష్టోబెల్.) 

    తి : క్రిష్టోబెల్ నీకు నూరు గొర్రెలున్న యెడల వాటిలో యాభై గొర్రెలు ప్రభువు సేవ కిచ్చెదవా? 

    క్రి : ఔను, ఇచ్చెదను.

    తి : నీకు నూరు ఆవులు ఉన్నయెడల ఇచ్చెదవా? 

    క్రి : అవును తియోఫిలా! నే నిచ్చెదను. 

    తి : నీకు నూరు గుర్రములున్న యెడల తప్పకుండా ఇచ్చెదవా? 

    క్రి : అవును, నిశ్చయముగా నిచ్చెదను.

    తి : నీకు రెండు వందలున్న యెడల వాటిలో ఒకటిచ్చెదవా? 

    క్రి : ఇవ్వను, నన్నడుగుటకు నికేమియు అధికారము లేదు. ఎందుకనిన నా వద్ద రెండు వందలే ఉన్నవని నీకు తెలియును.  

11. వితంతువు వేసిన చందా 

1. బైబిలు వాక్యము:- “వారందరికంటే ఈ బీద విధవరాలు వారందరికంటే ఎక్కువ వెసెను.” (మార్కు 12:43) 

2. కథ:- ఒక ధర్మకార్యార్ధమై ఒక ధనికుడు తన స్నేహితులలో ఒకనిని దర్శంచెను. వారిద్దరికిని సంభాషణ జరిగెను.

   ధనికుడు   : మీ కానుక ఇచ్చెదరా? 

   స్నేహితుడు : ఔను, నా కానుక నేను నీకియ్యవలెను.

   ధనికుడు   : విధవరాలి కాసా? (కాసు అనగా బంగారపు కాసు కాదు.

              మనము దమ్మిడికాసు, అర్ధణా కాసు అని వాడుకొను కాసు వంటిది.)

   స్నేహితుడు : అవును, నిశ్చయముగా అదే.

   ధనికుడు   : విధవరాలి కాసులో సగము ఇచ్చినను నేను తృప్తి పొందెదను, నీ ఆస్తి ఎంత? 

   స్నేహితుడు : డెబ్భైయైదువేల డాలర్లు (రూ. 3,75,000).

   ధనికుడు   :  ముప్పదియైదువేల డాలర్లకు చెక్కియ్యండి. విధవరాలి కాసులో సగమగును. మనకు తెలిపినట్లుగా ఆమె తన జీవితమంతయును ఇచ్చెను గదా! 

   షరా:- అప్పుడు అది విని ఆ ధనికుని స్నేహితుడు సిగ్గుపడెను. 

3. నీతి:-  ఇట్లే కొందరు ఏ కొంచెమో ఇచ్చి, మా నా పదియవ వంతు చెల్లించాము అని అనుకొనుచున్నారు. పదియవ వంతు అనగా అంతటిలో పదియవ భాగమే! ఆ ధనికుని స్నేహితుని వలె మనము అట్లు మోసపోకుందుము గాక!    

12. ఇచ్చుటకై సమర్పించుకొనుట

     1. బైబిలు వాక్యము:- “శక్తికొలది ఇయ్యవలెను” (ద్వితియో. 16:17)

     2. కథ:- ఒక ఆదివారము ఉదయమున ఒక చిన్న పట్టణములో ఒక బోధకుడు హోం మిషనుల నిమిత్తమై చేసిన మనవిని గూర్చిన జాలి కథను, ఎస్.డి. గార్డనుగారు ‘క్వయిట్ టాక్ ఆన్ సర్వీసు ‘ అను పుస్తకములో వ్రాసిరి.

      ఆ బోధకుడు ప్రసంగము ముగించిన వెంటనే, తాను చేసిన ప్రయత్నము కొంచెమేననియు దాని ఫలితమును కొంచెమేననియు తలంచెను. ప్రసంగమైన తరువాత చందా పట్టిన ఆయన, మాగీ అను ఒక కుంటిపిల్ల దగ్గరకు వెళ్ళినప్పుడు తన రెండు చంక కర్రలను పళ్ళెములో వేసెను. అవి ఆమె బ్రతుకుదెరువై యుండెను. పళ్ళెము గురువు నొద్దకు వెళ్ళినప్పుడు ఒక ఆస్థిపరుడు వేసిన చీటి అందులో ఉండెను. ఆ చీటిలో “నేను ఆ కర్రలకు 150 రూపాయలు ఇచ్చుచున్నాను. ఆ కర్రలు ఆ బాలికకు తిరిగి ఇచ్చివేయ వలెను” అని వ్రాయబడెను. అప్పుడు పాదిరిగారు నిజముగా ఆ బాలిక మనకొక మంచి మాదిరి చూపినది అని పలికెను. ఆమెను బట్టి ఆ దినము పోగుపడిన చంద కొన్ని వేల రూపాయలు అయ్యెను. 

      3. నీతి:- మనమిట్టి సమర్పణ చేయగలమా? 

13. ఇచ్చుటవలన క్రీస్తుయొద్దకు నడిపింపబడుట  

    1. బైబిలు వాక్యము:- “నీవు నా కిచ్చు యావత్తులో పదియవ వంతు నిశ్చయముగ నీకు చెల్లించెదను” (ఆది. 28:22).

    2. కథ:- ప్రతి డాలరులో నుండి పదియవ వంతు ప్రభువు పనికొరకు తీసియుంచుమని ఒక విధవరాలు తన కుమారునికి నేర్పెను. ఆమె కుమారుడైన ఛార్లీకి ఆందోళనము కలిగెను. అతడు దూరముగా పడమటి దిక్కునకు వెళ్ళి, త్రాగుడుకు అలవాటుపడెను గాని అతనికి దశమభాగమిచ్చు అలవాటు పోలేదు. ఒక రోజున 10 సెంట్ల నాణెము తన యెదుట మెరయుచుండెను. “పదియవ వంతు యిచ్చుట బుద్ధిహీనత, దీనితో ఒకసారి త్రాగివేసి ఈ బుద్ధిహీనతను తుద ముట్టించెదనని” అతడు అనుకొనెను. ఆ నాణెమును తీసుకొని అతడు సారా దుకాణమునకు పరుగెత్తెను. దానిని డబ్బులుంచు స్థలములో పడవేసి సారా తెమ్మనెను. వానియొద్దకు అది తేబడక ముందు ఆ నాణెము, నిందారోపణ నాణెము క్రింద మారి, “నీ శరీరాత్మలను పాడుచేయునట్టి మద్యము నిమిత్తమై  దేవుని డబ్బు యెందుకు పాడుచేయుచున్నావు” అని పలికెను. వెంటనే అతడు ఆ నాణెమును తీసికొని ఇంటికి వెళ్ళి మోకరించి, క్షమాపణ కొరకు దేవుని వేడుకొనెను.

     3. నీతి:- దశమభాగమిచ్చు అభ్యాసమతనికి మార్పు కలిగించెను.ఆ విధవరాలి వెలె మనమును చేయుచు, మన బిడ్డలకు అట్టి అలవాటును అభ్యసింపచేయుదుము గాక!   

14. ఇచ్చుటవలన ఆదరణ 

      1.వేద వాక్యము:- “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యత”. (కార్య20:35) 

      2. కథ:- ఒక మెథడిస్టు పాదిరిగారు ఒక మంచి కథ చెప్పిరి. సంఘపోషణార్ధమై ఒక సజ్జనుడు ప్రతి ఆదివారము 15 రూపాయలు ఇచ్చుచుండెను. ఒక పేద విధవరాలు కూడ ఆ సంఘములో నుండెను. ఆమె చాకలి పని చేసి తన ఆరుగురు బిడ్డలను పోషించుకొనుచుండెను. తాను మిగుల్చుకొన్న 5 అణాలు, ఆ సజ్జనుని వలె ప్రతి ఆదివారము, ఆ వితంతువు ఆలయమునకు ఇచ్చుచుండెను. ఒకరోజున ఆ సజ్జనుడు పాదిరిగారి దగ్గరకు వచ్చి, “ఆ పేదరాలు చందా ఇవ్వనవసరము లేదు. ఆమెకు బదులుగా నేనే ఇచ్చెదను” అని చెప్పెను. పాష్టరుగారు ఈ సంగతి విధవరాలినితో చెప్పిరి. ఆమె కన్నీరు గార్చుచు ఇట్లు అనెను. “నేను ప్రభువునకు ఇచ్చుటలో నాకు కలిగిన నెమ్మదిని వారు నాయొద్ద నుండి తీసివేయ జూచుచున్నారా? నేనాయనకు ఎంతో బాకీ ఉన్నాను. దేవునికి ఇచ్చుటవలన నాకు ఎంతో ఆరోగ్యముగా నున్నది. నా బిడ్డలు క్షేమముగా నున్నారు. నేనెన్నో దీవెనలు పొందితిని. క్రీస్తుప్రభువునకు ప్రతివారము నా చిన్న కానుకను అర్పింపక పోయిన యెడల నేను బ్రతకలేను.”

     3. నీతి:- దశమభాగము లిచ్చినందున నాకు గడువదు అని కొందరు దశమభాగము ఇయ్యనియెడల వారికి ‘గడువదు ‘ అని ఈ కథ వలన తెలియుచున్నది. గనుక దశమ భాగము ఇచ్చిన వారికే శాంతి.

15. ఇండియా దేశస్తునికి అది అంత ఎక్కువ కాదు 

     1. వేదవాక్యము:- “బీదవాడు తక్కువ ఇవ్వరాదు.” ( నిర్గమ 30:15)

     2. కథ:- ఒక ఇండియా దేశస్తుడు రెండు డాలర్ల నోటు తీసికొని ఒక డాలరు గల నోట్లు రెండింటిని ఇమ్మని బిషప్ నిపిల్ గారిని అడిగెను. ‘ఎందుకు ‘ అని బిషప్ గారు ప్రశ్నించిరి. ప్రభువునకు ఒక డాలరు, నా భార్యకు మరొక డాలరు అని ఆ ఇండియన్ బదులు చెప్పెను. నీ దగ్గరున్న డబ్బంతయు ఇంతేనా అని బిషప్ గారు అడిగిరి. అతడు అవుననెను. “నీవిచ్చిన ఒక డాలరు చాలా ఎక్కువేనని” బిషప్ గారు అనబోవుచుండగా, దగ్గర నిలిచియున్న ఒక ఇండియన్ పాదిరిగారు ఇట్లనిరి. “తెల్లవానికి అది చాలా ఎక్కువగా నుండ వచ్చును గాని ఈ సంవత్సరము యేసుయొక్క ప్రేమను గూర్చి విన్న ఇండియా దేశస్తునికి అది అంత ఎక్కువ కాదు” అనెను. 

     3. నీతి:- చందా వేసిన తరువాత చాలా వేసితినని చింతించరాదు. దేవుడు నీకిచ్చిన దానిలో అదెంత?

16. ఆయన ఎందుకు అంత ఇచ్చెను 

     1. వేదవాక్యము:- “చీకటిలో కూర్చుండియున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి.” (మత్తయి4:16).

      2. కథ:- ఒక హిందూదేశ నాయకుడు, హిందూ మతమును విడచి, క్రైస్తవ మతమును స్వీకరించి, ప్రార్ధనలయందు పట్టుదల కలిగియుండి, ప్రార్ధనలో స్తులు చెల్లించుచు, మిషనరీల యెడలను, ఆయన పనియెడలను గొప్ప అభిమానము గలవాడై ధారాళముగా కానుకలిచ్చుచుండెను. 

     ఒకనాడు ఒక మిషనరీ అతనిని ఇట్లడిగెను. “ప్రార్ధనలయందును, చందాలు ధారాళముగా ఇచ్చుటయందును నీ కెందుకింత పట్టుదల?” అందుకాయన “అయ్యా! మీరెన్నడును చీకటిలో ఉండలేదు” అని జవాబిచ్చెను.

      షరా:- సువార్త విననివారు చీకటిలో నున్నట్లే గదా! వారిని వెలుగులోనికి తీసికొని వచ్చు బోధకుల నిమిత్తమై ఈ చందా అవసరము అని దాని అర్ధము.

     3. నీతి:- వెలుగులోనికి వచ్చినవారు, చీకటిలో నున్నవారిని గురించి చింతింపదగును.   

17. విలియం కోల్గేట్ దేవుని కెట్లు ఇచ్చెను?

      1. వేద వాక్యము:- “అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ యిచ్చునప్పుడు ధనవంతుడు ….తక్కువ ఇవ్వరాదు.” (నిర్గమ 30:15).

      2. కథ:- చాలా సంవత్సరముల క్రిందట పదునారేండ్ల పిల్లవాడు ఇల్లు విడచి ఉద్యోగము నిమిత్తము స్థలాంతరము వెళ్ళెను. దారిలో అతనికి పడవ నాయకుడు ఎదురుపడెను. వారికి ఈ దిగువ సంభాషణ జరిగెను. 

       నాయకుడు : విల్లీ! నీవెక్కడకి వెళ్ళుచున్నావు?

       పిల్లవాడు  : నాకు తెలియదు. నేను ఏదో ఒక వృత్తి చేయవలెనని వెళ్ళుచున్నాను.

       నాయకుడు : దాని విషయమై ఏమీ భయములేదు. నీవు త్వరగా బయలుదేరుము. అప్పుడు నీవు చివరకు బాగుపడెదవు

       పిల్లవాడు  : సబ్బులు చేయుటయు, క్రొవ్వొత్తులు చేయుటయు మాత్రమే నాకు తెలుసును.

       నాయకుడు :  సరే, నీతో కలసి ప్రార్దన చేసి, నీకొక చిన్న సలహా ఇచ్చెదను. అప్పుడు నిన్ను వెళ్ళనిచ్చెదను. ఇద్దరు కలిసి మోకరించి ప్రార్ధించిరి. ఆ తరువాత 

       నాయకుడు : ‘ఎవరో ఒకరు న్యూయార్కు నగరములో సబ్బులు చేయుటలో ప్రసిద్ధికెక్కిరి. అక్కడివారిలో నీ వొకడవై యుందువేమో! మంచివాడవు కమ్ము నీవు సంపాదించిన ప్రతి డాలరులో నుండి దేవునికి చెందిన పదియవ వంతు చెల్లింపుము. నీ హృదయమును క్రీస్తునకు ఇమ్ము, నమ్మకముగ సబ్బులను చేయుము. నీవు తప్పక వర్ధిల్లి ధనవంతుడవవుదువని నా నమ్మిక.

       పిల్లవాడు : ‘సరే, మీరు చెప్పినట్లే చేసెదను ‘ అని చెప్పి ఆ పిల్లవాడు న్యూయార్కు పట్టణము చేరెను.

      అక్కడ అతడు ఒంటరిగాడైయుండెను. తన తల్లి చెప్పిన మాటలను, నావికుడు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొనెను. “దేవుని నీతిని, ఆయన రాజ్యమును మొదట వెదకుడి” అను మాటచొప్పున నడచుచుండెను. దేవాలయముతో సంబంధము కలిగియుండెను. అతడు సంపాదించిన మొదటి డాలరు దేవునికిచ్చెను. అతడు బైబిలు చదువరియాయెను. అతను సంపాదించిన ప్రతి దానిలో నుండి ప్రభువునకు పదియవ వంతు చెల్లించెను. తాననుకొనిన దానికంటే ఎక్కువ ధనికుడాయెను. ప్రభువునకు రెండు పదులిచ్చి ఇంకను ఎక్కువగ అభివృద్ధిపొందెను. తరువాత మూడుపదులు, నాలుగుపదులు, ఐదుపదులు ఇచ్చెను. ప్రభువు సేవకై లక్షల కొలది డాలర్లనిచ్చి శాశ్వతమైన పేరుగాంచిన విలియం కోల్గేటు ఈయనే.

      3. నీతి:- ప్రభువునకు ఇచ్చినవారు వర్ధిల్లుదురే గాని క్షీణింపరు.  

Please follow and like us:

How can we help?

Leave a Reply