ప్రభువు జన్మమునకు పూర్వము దేవుడు ఎన్నో వాగ్ధానములనిచ్చెను. ఒక వాగ్ధానమిచ్చెను. కొన్నాళ్ళయిన తరువాత ప్రజలకు ఏదో ఒక కష్టము రాగానే ఒక వాగ్ధానమిచ్చుచుండెను. ఏడ్చుచున్న ఆదాము, హవ్వలు వాగ్ధానమును పొందగానే మిక్కిలి సంతోషించిరి. అట్లే మరియమ్మ వరకు వాగ్ధానములిచ్చుచుండెను. మనకాలములో కూడ ఇట్లే జరుగుచున్నది.
నోవాహు దగ్గర ఒక కష్ట కాలము రాగానే ఒక వాగ్ధానమిచ్చెను. ఇకనెన్నటికిని అట్టి నాశనమును భూమి మీదికి పంపననే వాగ్ధానము.
షేము కాలములో ఒక వాగ్ధానమిచ్చెను. పిల్లలు మంచివారు కారు. ప్రతి కుటుంబములోను ఇట్టి చిక్కు కనబడుచున్నది. తల్లితండ్రులు మంచివారు కావచ్చును కాని పిల్లలు దుర్మార్గులగుదురు. ప్రతి కుటుంబములోనూ, కన్నీటిధార కనబడుచున్నది. నోవాహు ముగ్గురి కుమారులలో ఒకడు మంచివాడుకాడు, గాని ఒక గొప్ప వాగ్ధానము వారి కుటుంబమునందే చేయబడెను. షేము దేవుడైన యెహోవా స్తుతినొందుగాక! ఒక కష్టకాలమును రానిస్తాడు. తరువాత ఒక సంతోషకరమైన సంగతికూడ జరుగనిస్తాడు. విచారకరమైన సంగతి తర్వాత మిక్కిలి సంతోషకరమైన సంగతి, తరువాత అబ్రహాము వచ్చెను. ఈయన సంగతి ఏమనగా ముండ్లతుప్పల మధ్యను ఒక పండుపడితే తీయుట ఎంతో, అంతకష్టము. ఎక్కడ కష్టమున్నదో అక్కడే క్రిష్ట్మస్. ఆదామునకు ఇచ్చిన వాగ్ధానము కంటే అబ్రాహామునకిచ్చిన వాగ్ధానము గొప్పది. భూమినంతటిని కప్పివేయుచున్నది. కష్టము వచ్చిన తరువాత ఆయన చేసేపని ఆయన చేయును. శోధనలు, కష్టములు ఆయన రానిస్తాడు. అవన్ని వచ్చిన తరువాత అవన్నియు అంతరించిపోవునట్లు ఆయన చేస్తాడు. సూర్యుడు రాగానే తేళ్ళు, పాములు, నక్కలు, తోడేళ్ళు మొదలగునవన్నీ వాటంతట అవే సర్దుకొనును. అట్లె దేవుని సహాయం వచ్చేముందు అవన్నీ ఒకటి తరువా ఒకటి పారిపోవును. క్రిష్ట్మసు వాగ్ధాన ప్రవచనము, కీడు వచ్చినది. దాని చాటున మేలు ఉన్నది. మేలు రానైయున్నది. ఎప్పుడు మనకు కష్టము వస్తున్నదో అప్పుడు ఒక మేలుకూడ రానైయున్నదని తెలుసుకొనవలెను. ఒక వాగ్ధానము రాఐయున్నదనుకొనవలెను. అబ్రాహాము, ఇస్సాకు కాలములో కరువు వచ్చినది. అప్పుడు వారు అచ్చటనే ఉండవలసినది గాని, వాగ్ధాన దేశము దాటి అన్యదేశము వెళ్ళవలసి వచ్చినది. అన్యరాజు దగ్గరుండవలసి వచ్చినదని చాల విచారించెను. అబ్రామునకు వినిపించిన వాగ్ధానమే ఇస్సాకునకు కూడ వినిపించెను.
- కొందరికి కష్టకాలము వెళ్ళిపోయిన తరువాత వాగ్ధానము వినిపించును,
- కొందరికి కష్టకాలములోనే వాగ్ధానము వినిపించును.
ఇస్సాకు = నవ్వు. ఇస్సాకు తన పేరునకు తగినట్టుగానే సంతోషము ననుభవించెను.
యాకోబు: తాతగారి ఆశీర్వాదము ఈయనకు కూడ వచ్చెను. విచారములో సంతోషము కుటుంబములో గందరగోళము జరిగినప్పుడు దేవుడు దిగి, ఇస్సాకు ద్వారా యాకోబును ఆశీర్వదించెను.
యూదా: తాతగారి, తండ్రిగారి వాగ్ధానము, ఈ అబ్బాయిలో నెరవేరెను. యేసు వారి జన్మ వాగ్ధానము యూదాలో కలదు. కొదమసిం హము యోసేపునకు ఇట్టి వాగ్ధానములేదు.
యాకోబు గోషెను దేశములో 17 సంవత్సరములుండెను. పరదేశము ఇచ్చినారు. ముసలివాడైన తండ్రి చనిపోవుచున్నాడు. బిడ్డలకు విచారము ఉంటున్నదా? యూదా ఆశీర్వాదమును తక్కిన కుమారులందరు విన్నారు. బిలాము ఇశ్రాయేలీయులను కొండెక్కి దీవించెను. ప్రకటనలో యేసుప్రభువునకు వచ్చిన పేరు వేకువచుక్క ఇశ్రాయేలీయులకు అరణ్యములో వనవాసమైన తరువాత ఏమికష్టము వచ్చినది? బాలాకు ఇశ్రాయేలీయులను శపించుమనెను, గానీ బిలాము దీవించెను. కష్టకాలమున దేవుడు తన బిడ్డలను భయపడకుడి అని ఆదరించును. మరియొక ప్రక్కన దీవించును.