క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. క్రిస్మసు పండుగ...
  5. క్రిష్ట్మసు కథలు

క్రిష్ట్మసు కథలు

  1. క్రీస్తు రాజైయున్నాడని పాత నిబంధన భక్తులు ఆనందించిరి. భూలోక భక్తులను ప్రాణముతోనే తీసికొని వెళ్ళుటకై క్రీస్తు రెండవసారి మేఘాసీనుడై రానైయున్నాడని మనము ఆనందింపకూడదా? ఆనందించినపుడు పండుగ చేసికొనకూడదా? పండుగ చేసికొనకూడదని తోచిన యెడల ఆనందించుట మానివేయవలెనుగదా? ప్రకటించుట మానివేయవలెను గదా? క్రిష్ట్మసు ఆనందము రాకడ ఆనందము మీకు కలుగును గాక!
  2. సర్వలోక రక్షకుడైన క్రీస్తు జన్మకాలమందు సర్వలోక జనసంఖ్య వ్రాయబడుటకు రోమా చక్రవర్తి ఆజ్ఞ బయలు వెడలెను. అప్పుడు దేవుని ప్రజలైన పన్నెండు గోత్రముల యూదులు అనగా ఇశ్రాయేలీయులు తమ పూర్వీకుల స్థలములకు వెళ్ళిరి. అప్పుడు దేవుని ప్రజల సంఖ్య వ్రాయబడినట్లు ఇప్పుడు క్రీస్తు ప్రజల సంఖ్య వ్రాయబడుచున్నది. చదువరులారా! లోక రక్షకునికి రక్షితుల సంఖ్యలో మీ పేరులు ఉన్నవా?
  3. క్రీస్తు దేవుడైనను, నిరాకారదేవుడైనను అందరికి కనబడగల శరీరధారియాయెను. రెండవ రాకడలో ఆయన మహిమశరీరముతో కనబడెను చూచుటకును పైకివెళ్ళుటకును మరల ప్రయత్నించుచున్నారా?
  4. ‘క్రీస్తు జన్మించెను ‘ అనువార్త దేవదూత వినిపించెను. అది కాపరులు విన్నారు. రెండవ రాకడ మిగుల త్వరలో సంభవించునని దేవదూతకాదు దేవవాక్య గ్రంధమగు బైబిలు చెప్పుచున్నది. నీ శరీర చెవులకు మాత్రమే కాక నీ లోపలి చెవులకు కూడ వినబడుచున్నదా?
  5. క్రీస్తు జన్మదినము దేవదూతల సైన్యము దేవుని స్తుతించిరి. మీరు ఇప్పుడు దేవుని స్తుతింపగలరా? మరియు బహుశీఘ్రముగా రానైయున్న రెండవరాకడను తలంచుకొని సంతోషముతో దేవుని స్తుతింపగలరా?
  6. కాపరులు వెళ్ళిరి తొట్టిలోనున్న బాలుని చూచిరి. ఆయనకు నమస్కరించిరి. రెండవ రాకడకు మేఘములోనున్న క్రీస్తు నొద్దకు గొల్లలవలె వెళ్ళుటకు సిద్ధపడుచున్నారా?
  7. కాపరులు బాలుని చూచి ప్రకటించిరి. రెండవరాకడ్దను గురించి మీరు ప్రకటించుచున్నారా?
  8. క్రీస్తు బాలుడు యెరూషలేము దేవాలయములో ఉన్నప్పుడు సుమెయోను దైవాత్మ ప్రేరేపణవలన లోపలికివచ్చినట్లే అన్నా అను భక్తురాలుకూడ లోపలికి వచ్చెను. బేత్లెహేములో కాపరులు బాలుని చూచినట్లు దేవాలయములో వారిద్దరు చూడగల ధన్యులైరి. చదువరులారా! మీరు క్రీస్తును దైవాత్మ ప్రేరణవలన చూచుచున్నారా! రెండవరాకడలో మీరాయనను బాహాటముగా చూచెదరు.
  9. క్రీస్తు ప్రభుని దేవుని జనము కాని వారికి వెలుగైయున్నాడు. దేవుని ప్రజలగు ఇశ్రాయేలీయులకు మహిమయైయున్నాడు. వెలుగు వలన ఎదుటి వస్తువు కనబడును.ఆలాగే ఇతరులకు క్రీస్తు కనబడినట్లు వారికి దేఉడు వెలుగు అనుగ్రహించును. యూదులలో ఆయన జన్మించునందువలన వారికి మహిమ అనగా కీర్తి. చదువరులార! దేవుడు మీలో పెట్టియున్న జ్ఞానకాంతికి క్రీస్తు బయలుపడినాడా? మీరు క్రీస్తును అంగీకరించుట వలన మీకు కీర్తి ఇది ఇప్పుడు మీ మూలముగా జరుగుచున్నది.
  10. తూర్పుజ్ఞానులు దైవనక్షత్ర కాంతివలన ప్రేరేపణ గలిగినవారై బేత్లెహేము వెళ్ళి క్రీస్తుబాలుని చూచి ఆరాధించిరి. కాపరులు దగ్గరనుండి క్రీస్తుబాలుని చూచిరి. సుమెయోను అన్నా కొంచెము దూరస్థలమున చూచిరి. తూర్పుజ్ఞానులు బహుదూరము వెళ్ళి చూచిరి. చదువరులారా! మీరు మీ ఇండ్లలో, దేవాలయములో క్రీస్తుబాలుని చూచుచున్నారా? క్రిష్ట్మసు ధన్యత మీకు కలుగునుగాక!
  11. బాలుడగు క్రీస్తును మనస్సునందు తలంచుకొని క్రిష్ట్మసు పండుగ ఆచరించుటకు త్వరపడుచున్న మీరు యౌవనుడగు క్రీస్తును మనస్సునందు తలంచుకొని మేఘములో ప్రవేశించుటకు త్వరపడుచున్నారా?
  12. క్రీస్తు జన్మదినము నూతన యుగాది: క్రీస్తు రెండవ రాకడ దినము మరియొక యుగాది. త్వరగావచ్చుచున్న జనవరి మొదటి దినము సంవత్సరాది. ఆ రెండు యుగముల సంతోషము మీకు కలుగు రీతిగానే ఈ నూతన సంవత్సరాది సంతోషము, దీవెన కలుగును గాక!
Please follow and like us:

How can we help?

Leave a Reply