క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. క్రిస్మసు పండుగ...
  5. క్రిష్ట్మసు కారణము

క్రిష్ట్మసు కారణము

ఆది 33:9,11 ఏశావు – సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది. నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను. యాకోబు – నాకు అంతయు గలదని చెప్పెను. తెలుగు బైబిలులో ఈ మాట లేదుగాని, ఇంగ్లీషు బైబిలు ప్రక్కలో ‘all things’ అనగా ‘అంతయు ‘ అని ఉన్నది.

ఈ వాక్యములో ఏశావు నాకు కావలసినంత ఉన్నది. అనగా ఎంతకావలెనో అంతే ఉన్నది. గాని, ఎక్కువ లేదు. అయితే యాకోబు నాకు అంతయు గలదు అన్నాడు. అనగా కావలసినదే కాకుండ అంతయు గలదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది (కీర్తన 23:5 అని అర్ధము. అనగా ఎక్కువ ఉన్నది గనుక దిగజారును అనగా సరిపోగా ఇంకా ఎక్కువగును. ప్రభువు యొక్క చరిత్రలో వేల మందికి సరిపోగా మిగిలిపోయినవి. అనగా భూలోకములో మనకు కావలసినంత ఉన్నది. పరలోకములో కావలసినంత అందరికి లేదు. అనంతమువరకు అంతయు గలదు. ప్రభువు యొక్క అవతారము రెండు లోకములకు సరిపోవును. అనగా ఈ లోకములో మనిషికి మనిషి పరలోకమునకు దేవుడు. క్రిష్ట్మసు దినమున అంతయు గలదు. ఎందుకనగా ఆయనవల్ల “సమస్తము కలిగెను” ఆయనే మన దగ్గరకు వచ్చిన సమస్తము కలుగదా? సమస్తము మనదికాదా?

భూలోకములో మనకు కావలసినంత మాత్రమే కాదు. మిగిలిపోవునంత గలదు. అనగా గిన్నెనిండి పొర్లునంత గలదు. విశ్వాసమును బట్టి అంతటికి వారసులముగాని -అనుభవింపలేక పోవుచున్నాము. లోకములో పండ్లు మిగిలిపోవుచున్నవి. అడవులలో పండ్లు పాడైపోవుచున్నవి. ఆలాగే లోహములు కూడ మిగిలిపోవుచున్నవి. ఆఫ్రికాలో కొన్ని అరణ్యములలో వజ్రములు దీపాలవలె వెలుగుచున్నవి. మనిషి వాటిని తెచ్చుకొనుటకు వెళ్ళలేక పోవుచున్నాడు. అవన్ని మనకొరకే, ఇప్పుడు వెళ్ళకపోయిన తర్వాత వారైన వెళ్ళుదురు. లేకపోయిన వెయ్యేండ్ల వరకు అలాగే ఉండును. మనిషి ఖర్చుచేసిన దేవుడు ఇంకా ఎక్కువ ఇచ్చును.

ప్రభువు చెప్పిన ఉపమానములో రాజు విందుచేసినాడు ఇంకా చోటు ఉంది అన్నాడు . విందు ఉన్నది మనుష్యులు రాలేదు. మనుష్యులు ఎక్కువ ఉన్న 12 గంపలు ఖర్చయిపోవును. ఇప్పుడు మాత్రము వస్తున్నారా? పేదరికము ఎందుకు వచ్చినది, ఉన్నది గనుక వచ్చెను. అనగా పాపము ఉన్నది గనుక వచ్చెను. తినవద్దన్న పండు తినెను. గనుక ఇప్పుడు తినడానికి లోటువచ్చెను. భాగ్యవంతులకు తినడానికి ఉన్నదిగాని, వారికి అజీర్తి, పాపముయొక్క దుష్టశక్తి, అందరిని చుట్టుకొనెను. ఉదా:- చీకటిలో నడుచునప్పుడు తెలియక పాము దగ్గరకు వెళ్ళిన కట్లపాము కాలునకు చుట్టుకొనినట్లు – ఆది సర్పము పోసిన విషము ఆదాము, హవ్వలయొక్క బిడ్డలందరికి పాకెను. అయితే స్త్రీ సంతానములో నుండి ప్రభువు రావలెను. అదే ప్రభువు యొక్క జనాంగము. వారినికూడ పాపము చుట్టుకొనెను. ఆ విషపు పండు అంటుకున్న స్త్రీకిని, తన సంతానమంతటికిని క్రీస్తు జనాంగమునకు, విశ్వాసులకు, భక్తులకు కూడ అంటుకొనెను. ఆమె తర్వాత అందుకున్న ఆదామునకు, వాని జనాంగమునకు కూడ చుట్టుకొనెను. మనిషికి అందుకొను గుణమున్నది. గనుక ముందు హవ్వ అందుకొనెను. తర్వాత ఆదాము అందుకొనెను. హవ్వ చెట్టుమీద పండు అందుకొనెను. ఆదాము హవ్వ చేతిలోని పండు అందుకొనెను. అది ఇప్పుడును గలదు. ఒక మనిషిలో తప్పున్న దానిని అందుకొనుటకు ఇంకొకరు సిద్ధముగా నుందురు. ఉదా: మామిడిచెట్టు ఒకడు ఎక్కి కోయుచుండెను. క్రిందనున్నవాడు వాటిని అందుకొనుచుండెను. తోటమాలివచ్చి, ఇద్దరిని కొట్టెను. మనిషిని పాపము చుట్టుకొన్నందున దేవుడు మనిషి అయ్యెను. న్యాయముగా దేవుడు మనిషి కాకూడదు. ఎందుకనగా మనిషి దేవునిని విడిచెను. మనిషి విడిచిపెట్టినవి. (1)తినవద్దని దేవుడు చెప్పిన మాట విడిచెను. 2) తినండి అని చెప్పినమాట విడిచిపెట్టెను. (3) ఆ రెండునూ చెప్పిన దేవునినే విడచెను గనుక దేవుడే వచ్చెను. అది మొదటి రాకడ. స్నేహితులు కలిసికొన్నప్పుడు ఏలాగున్నావు? అని అడుగుదురుగదా! అలాగే దేవుడు వచ్చి, ఆదామా! ఎలాగున్నావు? ఎక్కడున్నావు? అని పలుకరించెను. గనుక అది మొదటి రాకడ.

బేత్లెహేములో శిశువై రక్షించడానికి పుట్టెను. అదికూడ మొదటి రాకడ. (1) తోటలోనిది మొదటి రాకడ (2) తొట్టిలోనిది మొదటి రాకడ, మేఘములోనిది మొదటి రాకడ, భక్తులు మేఘముమీద వచ్చు రాకడను రెండవ రాకడ అన్నారు. అదికూడ రైటే, తప్పుకాదు, బేత్లెహేములో పుట్టుట మొదటి రాకడ అన్నారు. అది నిజమే. అయితే తొలిసారిగా పాపములో పడిన తర్వాత వచ్చి, పలుకరించుట మొదటి రాకడ కాదా? పాప చరిత్ర జరిగిన విషయములో మొదటి రాకడ జరిగెను.

తోటలో జరిగిన పాపములు:- (1) మంచి పండు వైపు హవ్వ చూచుచు, వెనుకకు తిరిగి ఆకర్షణ అయ్యి ఇంకొక పండువైపు చూచుట ఒక పాపము (2) సర్పము మాట్లాడినది వినుట రెండవ పాపము (3) సర్పముయొక్క వాక్కును, ఓడగొట్టు వాదము ఆమె చేయలేదు. అనగా ‘లా’ చట్టము చెప్పలేదు. మా తండ్రి తినవద్దాన్నాడు అను తండ్రి మాట, అదే ‘లా’ ఆమె వాడలేదు. మూడవ పాపము, (4) పండ్లుచూచి ఆహారమునకు రుచిగాను, రమ్య ముగా నున్నవని తెలిసికొనెను. ఆమె తెలివివల్ల ఏమి లాభము, తండ్రి మాట త్రోసివేయుట తప్ప మరేమియు లాభములేదు.- మరొక పాపము. (5) యేసుప్రభువు రక్షకుడని ఇతరులకు నచ్చనప్పుడు మనము నచ్చచెప్పక పోవడము. అది ఒక పాడు తెలివి అది తోటలోని పాపమునుబట్టి వచ్చినదే. ఎదురాడువారు అనేక వాదములు చెప్పగా జవాబు చెప్పకలేకపోవుట పాపము. (6) దేవునిమాట నమ్మక, త్రోసివేసి సర్పము మాట నమ్మెను. ఇదొక పాపము. (7) దేవుని యెడల అపనమ్మిక కలిగించెను. ఆయనవలె అవుదురని సర్పము చెప్పినమాటను బట్టి దేవుని మాట అపార్ధ అపార్ధము చేసికొని, తప్పుగా భావించెను. ఇదొక గొప్ప పాపము. ఉదా: పిల్లలు ఆడుకొనునప్పుడు పడిపోయిన చేతికి గత్తర అవును. పిల్లలు ఆ గత్తర అంటుకొనిన వానిని రానివ్వరు. వారు అతనిని ముట్టుకొనరు గాని, ఈ పెంకి కుర్రవాడు వారికి కూడ అంటించును. అలాగే వారిద్దరు అందరకు అంటించిరి. ** ఇదంతయు రద్దుచేయుటకు ఆయనే నరుడై వచ్చెను. అదే క్రిష్ట్మసు.

తోటలోనికి మొదట దేవుడు వచ్చి ఆదాముతో ఎక్కడున్నావు, నేనెక్కడ పెట్టినాను, నీవెక్కడ ఉన్నావు? అని అడిగెను. మనము కూడ దేవుడు మనలను మంచిస్థితిలో ఉంచిన, అక్కడ ఉండక మన ఇష్టము వచ్చినచోటికి పోవుచున్నాము. దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి నేను చెట్టు ఎదుట నిన్ను పెట్టినాను. నీవు చెట్టు చాటునకు ఎందుకు వెళ్ళినావని అడిగెను. ఇది ఒక సొడ్డు(Dose). పాప చరిత్రయొక్క ప్రారంభమందు దేవుడు వచ్చుట అది మొదటి రాకడ. హవ్వ చరిత్ర త్రవ్వగా ఇంకా అనేక క్రొత్త సంగతులు ఉండును.

యాకోబు నాకంతయు ఉందని చెప్పెను. సమస్తము ఉన్నది అనెను. హవ్వ సర్పముతో అదే చెప్పెను. చెట్లపండ్లన్ని నిరభ్యంతరముగా తినవచ్చునని చెప్పెను. ఈ వేళ నాలుగు పండ్లు తిని, రేపు రెండు తిన్న ఎందుకు తక్కువ తిన్నావు? అని దేవుడు అడుగడు. మరుసటి రోజు ఏడు పండ్లుతిన్న, ఎందుకు తిన్నావని అడుగడు. దేవుడు వారికి హక్కు, స్వతంత్రత రెండునూ ఇచ్చెను. దేవుడు తాను కలుగజేసినంత ఇచ్చెను. వెలుగు, వాన, గాలి, భూమి, ఆకాశము పండ్లు అంతా ఇచ్చెను. అంతకు సరిపడినంత స్వతంత్రత ఇచ్చెను. రెండు సమస్తములు ఇచ్చెను. అనగా సమస్తసృష్టి సమస్త స్వతంత్రత. ఈ సామంతులు ఇవి రెండు పోగొట్టుకొనిరి. తోటలోని అయ్య, అమ్మలు పోగొట్టుకొనిరి. ఆ పోగొట్టుకొన్నవి ( హక్కు, స్వతంత్రత ) రెండు ఇచ్చుటకే శిశువుగా బేత్లెహేము వచ్చెను. ఇప్పుడు కూడ దేవుడు ఇచ్చుటకు శక్తి గలవాడు. మనిషికూడ పోగొట్టుకొను శక్తిగలవాడు. అయితే మనిషికి ఎన్ని మార్లు అడిగిన ఇవ్వలేదు అని మూలుగుకొనే శక్తి మాత్రము గలదు. ఇవన్నీ ఇచ్చుటకే శిశువుగా వచ్చెనుగాని సాగలేదు.

ప్రభువు భూమి మీదనున్న 33 1|2 సం|| సాగలేదు. (1) తోటలో దేవుని పని నెరవేరలేదు. (2) తరువాత నాలుగు వేల సం||లు అనగా పాత నిబంధన కాలములో నెరవేరలేదు. (3) తరువాత క్రీస్తు ప్రభువు వచ్చిన 33 1|2 సం||లు అంతగా నెరవేరలేదు. (4) ప్రభువు వెళ్ళిన తరువాత ఈ రెండు వేల సంవత్సరములలో కూడ సాగలేదు. గనుక దేవుడు ఓపికపట్టి, మేఘమువరకు కనిపెట్టి చనిపోయిన విశ్వాసులను, బ్రతికిన వారిని చావులేకుండ మొదటి రెప్పపాటులో, రెండవ రెప్పవేయకముందు తీసికొనిపోవును. తోటలో చెట్టుచాటున దాగొన్నప్పుడు రెప్పపాటులో ‘రయ్యి ‘ మని వచ్చెను. రేపు రెప్పపాటులో వచ్చును. ఎందుకనగా రెండవ రెప్పపాటులో వచ్చిన మృతులైన విశ్వాసులు, సజీవులైన రాకడ విశ్వాసులు, రెండు గుంపులవారు ఎగిరిపోవుదురు. ఒక్కరు సాతానుకు దొరకరు.

ఇప్పుడు రాకడ విశ్వాసులు, కోట్లు ఉన్నారు. చనిపోయిన విశ్వాసులు ఇంకా ఎక్కువ ఉన్నారు. రెండవ రెప్పపాటులో వచ్చినవారు, వీరుకూడ చస్తారు. ఆదాము, హవ్వలు ఆత్మీయ రీతిగా మృతులగుదురు. వీరు కూడ ఆత్మీయ రీతిగా మృతులగుదురు. ఒకరు ప్రభువుతో తన కుమారుడు చావకముందే రమ్మని చెప్పెను, దానికి ప్రభువు మీ అబ్బాయి బ్రతికినాడని రెప్పపాటులో జవాబిచ్చెను. తండ్రి చెప్పిన గంట ఉండి జవాబు ఇయ్యలేదు, రెప్పపాటులో చెప్పెను. గనుక అబ్బాయి బ్రతికెను__మనిషి పాపము ఆరంభించినపుడు నాశనము ఆరంభము. ఇంకా పాపము సాగించుచున్నాడు. నాశనముకూడ చివరి వరకు వచ్చుచున్నది. నాశనము కూడ “కుంచము నిండు” సరికి ప్రభువు రెప్పపాటులో రానియెడల సంఘముకూడ నశించును. సంఘమునకు పాపములేదు. పాప పరిహారముగలదు. అయినను (doubt) సందేహము, విసుగు ఉన్నది. “త్వరగా’ అనగా ఆలస్యమెందుకు, ఇంకా ఎందుకు రాలేదు అని అడుగుచున్నారు. ఆలాగు అడుగుట, తప్పు. అనుకొనుట, అడుగుట విసుగు పోవలెను. అప్పుడు ప్రభువు వచ్చును.

హవ్వ పడినప్పుడు దేవుడు చూస్తున్నాడుగదా? ఎందుకు ఊరుకొనెను? హవ్వ పండు కోసినప్పుడు, ఆదామున కిచ్చినప్పుడు దేవుని వాక్యము ఆమెతో నుండెను. గనుక దేవుడు అడ్డగించలేదు.

బేత్లెహేము శిశువును తలంచి, మొదటి రాకడ ఆచరించు మనము మేఘాసీనుడై వచ్చు ఆ రెండవ రాకడకును ఆయత్తపడుదుము గాక!

Please follow and like us:

How can we help?

Leave a Reply