- ప్రభువు జన్మదినమున పరలోక సైన్యము చేసినస్తుతి ఇప్పుడు జ్ఞాపకము చేయుచున్నాను.(లూకా 2:14). సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక.
- మొట్టమొదట అది వ్రాయబడిన గ్రీకు భాషలో ఇట్లున్నది డొక్సెన్ ఉపిస్టాయిస్ తియో, కైఎఫిగేయిస్ ఎరెనె ఎన్ ఆంత్ర బోయస్ హ్యు డొకయస్.
- పురాతన భాషయైన లాటిన్ భాషలో ఇది వినిపించుచున్నాను. గ్లోరియ ఇన్సోయిలిస్ ఆల్ టిమిస్సిస్ డియో ఏట్ ఇన్ టెర్రా పాక్యిస్ హూమైన్సు బెనవ లేన్ షియ.
- అచ్చు పుట్టిన కాలములో మొట్టమొదట లూథర్ ప్రయత్నము వలన అచ్చుపడిన జర్మన్ బైబిలులో ఇది ఎట్లు ధ్వనించుచున్నదో వినండి. ఎహ్ రేసెగాట్ ఇండేర్ హూయెహె అండ్ ఫెడి ఆఫ్ ఎర్ డెన్ అండ్ దెన్ మెన్ స్పెస్ హూల్ గేపాలెన్!
- అనేకమందికి తెలిసిన ఇంగ్లీషులో ఈ స్తుతి ఏ రీతిగా నున్నదో ఆలకించండి. గ్లోరిటు గాడ్ ఇన్ ది హైఎస్టు అండ్ ఆన్ ఎర్త్ పీస్ గుడ్విల్ టు వర్తమెన్
- మనదేశ మాతృ భాషయైన సంస్కృతములో ఈ స్తోత్రము ఏ విధముగ నున్నదో చెప్పుచున్నాను. ఈశ్వరాయోద్ధకేషు భూయాన్మ హాత్మ్య కీర్తనంశాంతిర్భూయతి పృధివ్యాశ్చ ప్రోతిపాత్రాణి మానవా||
- బెంగాల్ బైబిలులో పరలోక సైన్యస్తుతి ఏ విధముగా నున్నదో తెలిసికొనండి. ఉర్దొ ఔకేఇక్సోరేర్ మెహిమ ప్రీతిబితే ప్రితిపాత్రో మొనుక్సొదేర్ మొద్దేశాంతి
- గోదావరి పుష్కరకాలములో తరచుగా వినబడు ఓడ్ర భాషలో ఈ ప్రశస్తమైన స్తుతి ఎట్లు శబ్దించుచున్నదో విందాము. సబో పరిస్థ, పరమేశ్వరంకొ ప్రతిమహిమ, వృధిబీరెసంతి, ఓ మనుష్య మనొంకొఠరె, మంగొళోహెఉ||
- ఇప్పుడు దేశమంతట వ్యాపించుచున్న హిందీభాషలో ఇది ఈ ప్రకారముగా ఉన్నది. ఆకాస్ మె పరమేశ్వర్ కి మహిమ ఔర్ పృధ్విపర్ మనుష్యోం మెజిన్ సెనహ్ ప్రసన్నహై శాంతిహూ!
- మరాఠి క్రైస్తవులు ఇది ఎట్లు తర్జుమా చేసికొన్నారో చూడండి. ఉర్ధ్వలో కోం దేవాల గౌరప్, అఠిపృధ్వీవర్ మనుష్యాంత్ శాంతి త్యాంజవర్ త్యాచా ప్రసాద్ జాజా ఆహి.
- అరవ భాషలో ఈ వాక్యము ఎంత మృధువుగ నడుచుచున్నదో కనిపెట్టండి. ఉనందత్తి తిరుక్కిర దేవనుక్కు మగిమైయం భూమియిదే సమాదానముం. మనుషర్ మేల్ పిరియముం, ఉండావదాగ ఎన్ రుచొల్లి దేవనై తుదిత్తార్ గళ్.
- అరమువలె వినబడు మళయాళములో ఈ వచనము అప్పగించుచున్నాను. అత్యున్నాతంగిళిల్ దైవతిన్ను మహత్తుం, భూమి ఇల్ దైవ ప్రసాదముళ్ళ మనుష్యుర్కుసమాధానం ఎన్ను పరం జ్ఞు.
- ఉరుదు భాషలో ఇది ఎంత జాంఘారముగ వినబడుచున్నదో వినండి. ఆలిం బాలపర్ ఖూదాకి తమీజ్ ద్ హో ఔర్ జమీన్ పర్ ఉన్ ఆద్మీయూం మె జిన్సె ఒ రాజిహైసులా.
షరా:- ఇవి పదముగ్గురు విధ్యార్ధులకిచ్చి కంఠత చేయించి సభలో చెప్పించవచ్చును.
షరా:- ప్రభువుయొక్క అవతార ప్రవచనముల నెరవేర్పు మత్తయి, మార్కు, లుకా, యోహాను అను పుస్తకములలో కనబడుచున్నది. ఇది మొదటి రాకడ; రెండవ రాకడను గురించి ముఖ్యముగా 1థెస్సలోనికై పత్రికలోను, ప్రకటన పుస్తకములోను తేటగా తెలియుచున్నది. గురుతులను బట్టి చూడగా రాకడ త్వరగా వచ్చునని అర్ధమగుచున్నది.
గనుక ఏ మాత్రమును ఆలస్యము చేయక త్వరపడి త్వరగా రెప్పపాటు కాలమునకు సిద్ధపడుట అవసరమైయున్నది
Please follow and like us: