క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. క్రిస్మసు పండుగ...
  5. జగదైకరక్షకుని జనోత్సవము

జగదైకరక్షకుని జనోత్సవము

“ఇదచ్చయుష్మ ధర్ఠం తదభిజ్ఞానం దన్యంశయానో సాదర్వెస్టితః

శిశుర్గనాదన్యాంశయానో యుష్మాభిరాసాదయిష్యత ఇతి”

లూకా2:12 – “ఏలయనగా మనకు శిశువుపుట్టెను మనకు కుమారుడు.అనుగ్రహింపబడెను. ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగుతండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును” (యెషయా 9:6)”

మా చదువరు లందరకు క్రిష్ట్మసు పండుగ దీవెనలు కలుగు గాక. ఆ దీవెనలు పండుగగా శబ్దించునుగాక. ఈ పండుగ జీవనాభివృద్ధికి సాధనమగును గాక.

ప్రియులారా! మీరే మతస్థులైనను క్రిష్ట్మసు చరిత్ర మీకు వినోదముగా నుండునుగాక. పైన వ్రాసిన బైబిలు వచనములో గల విషయములు వినండి. దేవుడగు యేసుక్రీస్తు ప్రభువు లోకరక్షణార్ధమై నిష్కళంక కన్యక గర్భమున శరీరధారిగా జన్మించిన చరిత్రకు అనుగుణ్యమైన కొన్ని అంశములు ఈ వచనములో కనబడుచున్నవి. అవి ఏవనగా

1) క్రీస్తు ప్రభువు మనకొరకు పుట్టిన “శిశువైయున్నాడు”- 1) శిశువును చూచి సమీపించుటకు భయపడువారు గలరా! క్రీస్తు ఒకప్పుడు శిశువైనాడు గనుక ఆయనను స్మరించుటకు నమ్ముటకు దర్శించుటకు ఎవరును భయపడరాదు. సందేహింపరాదు. ఆయన అందరికిని చనువైనవాడు 2) శిశువును చూచి ముచ్చటపడనివారు గలరా? అట్లే క్రీస్తు యొక్క శిశుత్వము, యవ్వనము, స్వీయ సమర్పణము తెలిసినవారు ముచ్చటపడరా? దీవెన: క్రీస్తు ప్రభువుతో సమీప పరిచయముగల దీవెన మీకు కలుగునుగాక.

2) “మనకు కుమారుడు అనుగ్రహింపబడెను”.- ఆయన శిశువైనందువలన మనుష్య కుమారుడు అను బిరుదు కలదు. (లూకా 18:8). ఆయన శిశువు కాకముందు దేవుడు గనుక దేవుని కుమారుడు అను బిరుదుకూడ కలదు. (మార్కు15:39). ఆయన మనుష్య కుమారుడును, దేవుని కుమారుడును అను వ్రాతకలిపి చదవండి, అప్పుడు కుమారుడు అను ఏకపదము తేలును. అయ్యా! ఆయనను ఎవరనుకొన్నారు? దొరకొడుకు సుమండీ అని ఒకబాటసారి ఒకరితో అన్నాడు. దాని భావమేమి? ఆయనకూడ దొరయే అని భావము. అట్లే ఈయన దేవుని కుమారుడు అని అన్నప్పుడు ఆయన దేవుడే అని గ్రహింపవలెను.

3) “ఆయన భుజము మీద రాజ్యభారముండును”:- ఆ శిశువు రాజైయున్నాడు. గనుక ఆయనకు ఒక రాజ్యము కలదు. ఆ రాజ్యములో ఇష్టమున్న వారందరు చేరవచ్చును. ఆయన రాజ్యము భూమిమీదనే ఉండును. ఆయన శిశువుగా జన్మించుట భూమిమీదనే గదా! ఆయన దేవలోకము నుండి వచ్చినవాడు గనుక ఆయన రాజ్యము మోక్షలోకమందును ఉండును. అందుచేతనే అది సర్వకాలమందు ఉండును. ఆ రాజు సమాధానకర్తయగు అధిపతియై యుండును. గనుక ఆయన రాజ్యవాస్తవ్వులు మనశాంతి గలవారైయుందురు. ఆయన రాజ్యము సర్వకాలముండును గనుక ఆ రాజ్యవాసులు సర్వకాలము సుఖముగా జీవింతురు. ఆయన రాజ్యములో న్యాయమును, నీతియు కనబడును. అన్యాయమునకు గాని, అపవిత్రతకుగాని సందులేదు. ఆయన దావీదు వంశములో జన్మించెను. గనుక దావీదను పేరు ఉదహరింపబడెను. యెషయా 9:7 మనకాలములో ఆయన రాజ్యము ప్రకటించబడుచున్నది. దీవెన: ఆ రాజ్యమును, ఆ రాజును నీ హృదయములో నుండునుగాక.

4) “ఆయన ఆశ్చర్య కరుడు”- ఆయన దేవుడును, నరుడునై యున్నందున ఆశ్చర్యకరుడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధ విని ప్రజలు ఆశ్చర్యపడిరి. 9మత్తయి 7:28). లోకములో గొప్ప గొప్ప బోధకులు గలరు. వారి బోధలు విని అనేకులు ఆశ్చర్యపడుచున్నారు. రూపాంతర మొందుచున్నారు. ఈ బోధకులు భూమిమీదికి వచ్చుటకు సాధనమైన యేసుక్రీస్తు ప్రభువు వారందరికంటె గొప్ప బోధకుడుగదా! గనుక ఆయన బోధకు వారు ఆశ్చర్యపడిరి. మన బోధకులు నేర్చుకొన్న బోధకులు. ఆయన ఒకరివలన నేర్చుకొనక తనలోనే బోధనాశక్తిగల బోధకుడు. అందుచేతనే ఆశ్చర్యకరుడు. దీవెన: ఆయన బోధ బైబిలులో చదివి ఆశ్చర్యపడునట్లు మీ మనోనేత్రములకు తేజస్సు కలుగును గాక. ఆ బోధయొక్క వివరము విని ఆశ్చర్యపడునట్లు మీ శ్రవణ ద్వారము తీసియుండును గాక.

5) ఆయన “ఆలోచనకర్తయై యున్నాడు”- పాపబంధకములలో నున్నవారికి విమోచన మార్గమెట్లో తెలియనప్పుడు ఆయన ఆలోచనకు తోచినట్లు చేయును. పావన మార్గమున నడచుట తెలియనప్పుడు ఆయన ఆలోచనను అందించును. పరీక్షించి చూడుడి. దీవెన: ఆయన ఆలోచనకర్తయై యున్నంత మాత్రమున ఆయన ఆలోచన గైకొనని వారికి ఏమి ప్రయోజనము? గనుక మీకు ఆయన ఆలోచనను గైకొనగల దీవెన కలుగును గాక.

6) “బలవంతుడైన దేవుడు”- అనగా బలశాలియైన దేవుడు మనము చేయలేని పనులు ఆయన చేసిపెట్టగల బలశాలి. దీవెన: సైతానును, పాపములను, పాప ఫలితములను మీరు జయింపగల శక్తి ఈ బలశాలివలననే స్వీకరింతురుగాక. ఎఫెసీ 5:10.

7) “నిత్యుడగు తండ్రి”- ఆయన అన్ని కాలములలొ అందరియొద్ద ఉండగలడు. పై వచనములలో దేవుడు అని గ్రాహ్యమైన ఆయన ఈ వచనములో తండ్రియని గ్రాహ్యమగుచున్నాడు. ఒక శిశువును తండ్రి యనుట ఎంత విచిత్రమైన సంగతి!!! దీని భావము ఎంతవరకు వెళ్ళునో, లోకములను కలుగజేసిన వ్యక్తిని తండ్రి అనవచ్చును. అట్లయిన ఈయన లోక నిర్మాణమునకు కారకుడు. (యోహాను 1:3) దేవుడైన తండ్రి భూమ్యాకాశములను కలుగజేయుటలో గొప్పవాడు. మరియు మీలో నూతనమైన సృస్ష్టి కలుగజేయును. గనుక ఇంకను గొప్పవాడు. దీవెన: దేవుడును, తండ్రియును అయియున్న శిశువే మీ క్రిష్ట్మసు శిశువై యుండునుగాక.

8) “సమాధానకర్తయగు అధిపతియని అతనికి పేరుపెట్టబడును”-“భూమి మీద సమాధానము కలుగునుగాక” అని దేవదూతలు ఆయన జన్మకాలమున పలికిరి. అదివరకే భూమి విడిచిపెట్టి మోక్షలోకమునకు వెళ్ళినవారు అనేకులు గలరు. వారికి సమాధానము కలదు. అది ఈయనవలనే కలుగును. నేటివరకును కలుగుచున్నది. సమాధానము లేని భూమిమీద సమాధానము అనగా శాంతి కలుగవలెనని దేవదూతలు కోరిరి. అది ఈయన వలననే కలుగును. నేటివరకును కలుగుచున్నది. ఇది నిత్యము నిలుచును దీవెన: ఈయన సమాధానమును కలిగించు అధిపతి గనుక మీకు సమాధానము అనుగ్రహించు గాక.

1) శిశువును చూచి సమీపించుటకు భయపడువారు గలరా! క్రీస్తు ఒకప్పుడు శిశువైనాడు గనుక ఆయనను స్మరించుటకు నమ్ముటకు దర్శించుటకు ఎవరును భయపడరాదు. సందేహింపరాదు. ఆయన అందరికిని చనువైనవాడు 2) శిశువును చూచి ముచ్చటపడనివారు గలరా? అట్లే క్రీస్తు యొక్క శిశుత్వము, యవ్వనము, స్వీయ సమర్పణము తెలిసినవారు ముచ్చటపడరా? దీవెన: క్రీస్తు ప్రభువుతో సమీప పరిచయముగల దీవెన మీకు కలుగునుగాక.

2) “మనకు కుమారుడు అనుగ్రహింపబడెను”.- ఆయన శిశువైనందువలన మనుష్య కుమారుడు అను బిరుదు కలదు. (లూకా 18:8). ఆయన శిశువు కాకముందు దేవుడు గనుక దేవుని కుమారుడు అను బిరుదుకూడ కలదు. (మార్కు15:39). ఆయన మనుష్య కుమారుడును, దేవుని కుమారుడును అను వ్రాతకలిపి చదవండి, అప్పుడు కుమారుడు అను ఏకపదము తేలును. అయ్యా! ఆయనను ఎవరనుకొన్నారు? దొరకొడుకు సుమండీ అని ఒకబాటసారి ఒకరితో అన్నాడు. దాని భావమేమి? ఆయనకూడ దొరయే అని భావము. అట్లే ఈయన దేవుని కుమారుడు అని అన్నప్పుడు ఆయన దేవుడే అని గ్రహింపవలెను.

3) “ఆయన భుజము మీద రాజ్యభారముండును”:- ఆ శిశువు రాజైయున్నాడు. గనుక ఆయనకు ఒక రాజ్యము కలదు. ఆ రాజ్యములో ఇష్టమున్న వారందరు చేరవచ్చును. ఆయన రాజ్యము భూమిమీదనే ఉండును. ఆయన శిశువుగా జన్మించుట భూమిమీదనే గదా! ఆయన దేవలోకము నుండి వచ్చినవాడు గనుక ఆయన రాజ్యము మోక్షలోకమందును ఉండును. అందుచేతనే అది సర్వకాలమందు ఉండును. ఆ రాజు సమాధానకర్తయగు అధిపతియై యుండును. గనుక ఆయన రాజ్యవాస్తవ్వులు మనశాంతి గలవారైయుందురు. ఆయన రాజ్యము సర్వకాలముండును గనుక ఆ రాజ్యవాసులు సర్వకాలము సుఖముగా జీవింతురు. ఆయన రాజ్యములో న్యాయమును, నీతియు కనబడును. అన్యాయమునకు గాని, అపవిత్రతకుగాని సందులేదు. ఆయన దావీదు వంశములో జన్మించెను. గనుక దావీదను పేరు ఉదహరింపబడెను. యెషయా 9:7 మనకాలములో ఆయన రాజ్యము ప్రకటించబడుచున్నది. దీవెన: ఆ రాజ్యమును, ఆ రాజును నీ హృదయములో నుండునుగాక.

4) “ఆయన ఆశ్చర్య కరుడు”- ఆయన దేవుడును, నరుడునై యున్నందున ఆశ్చర్యకరుడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధ విని ప్రజలు ఆశ్చర్యపడిరి. 9మత్తయి 7:28). లోకములో గొప్ప గొప్ప బోధకులు గలరు. వారి బోధలు విని అనేకులు ఆశ్చర్యపడుచున్నారు. రూపాంతర మొందుచున్నారు. ఈ బోధకులు భూమిమీదికి వచ్చుటకు సాధనమైన యేసుక్రీస్తు ప్రభువు వారందరికంటె గొప్ప బోధకుడుగదా! గనుక ఆయన బోధకు వారు ఆశ్చర్యపడిరి. మన బోధకులు నేర్చుకొన్న బోధకులు. ఆయన ఒకరివలన నేర్చుకొనక తనలోనే బోధనాశక్తిగల బోధకుడు. అందుచేతనే ఆశ్చర్యకరుడు. దీవెన: ఆయన బోధ బైబిలులో చదివి ఆశ్చర్యపడునట్లు మీ మనోనేత్రములకు తేజస్సు కలుగును గాక. ఆ బోధయొక్క వివరము విని ఆశ్చర్యపడునట్లు మీ శ్రవణ ద్వారము తీసియుండును గాక.

5) ఆయన “ఆలోచనకర్తయై యున్నాడు”- పాపబంధకములలో నున్నవారికి విమోచన మార్గమెట్లో తెలియనప్పుడు ఆయన ఆలోచనకు తోచినట్లు చేయును. పావన మార్గమున నడచుట తెలియనప్పుడు ఆయన ఆలోచనను అందించును. పరీక్షించి చూడుడి. దీవెన: ఆయన ఆలోచనకర్తయై యున్నంత మాత్రమున ఆయన ఆలోచన గైకొనని వారికి ఏమి ప్రయోజనము? గనుక మీకు ఆయన ఆలోచనను గైకొనగల దీవెన కలుగును గాక.

6) “బలవంతుడైన దేవుడు”- అనగా బలశాలియైన దేవుడు మనము చేయలేని పనులు ఆయన చేసిపెట్టగల బలశాలి. దీవెన: సైతానును, పాపములను, పాప ఫలితములను మీరు జయింపగల శక్తి ఈ బలశాలివలననే స్వీకరింతురుగాక. ఎఫెసీ 5:10.

7) “నిత్యుడగు తండ్రి”- ఆయన అన్ని కాలములలొ అందరియొద్ద ఉండగలడు. పై వచనములలో దేవుడు అని గ్రాహ్యమైన ఆయన ఈ వచనములో తండ్రియని గ్రాహ్యమగుచున్నాడు. ఒక శిశువును తండ్రి యనుట ఎంత విచిత్రమైన సంగతి!!! దీని భావము ఎంతవరకు వెళ్ళునో, లోకములను కలుగజేసిన వ్యక్తిని తండ్రి అనవచ్చును. అట్లయిన ఈయన లోక నిర్మాణమునకు కారకుడు. (యోహాను 1:3) దేవుడైన తండ్రి భూమ్యాకాశములను కలుగజేయుటలో గొప్పవాడు. మరియు మీలో నూతనమైన సృష్టి కలుగజేయును. గనుక ఇంకను గొప్పవాడు. దీవెన: దేవుడును, తండ్రియును అయియున్న శిశువే మీ క్రిష్ట్మసు శిశువై యుండునుగాక.

8) “సమాధానకర్తయగు అధిపతియని అతనికి పేరుపెట్టబడును”-“భూమి మీద సమాధానము కలుగునుగాక” అని దేవదూతలు ఆయన జన్మకాలమున పలికిరి. అదివరకే భూమి విడిచిపెట్టి మోక్షలోకమునకు వెళ్ళినవారు అనేకులు గలరు. వారికి సమాధానము కలదు. అది ఈయనవలనే కలుగును. నేటివరకును కలుగుచున్నది. సమాధానము లేని భూమిమీద సమాధానము అనగా శాంతి కలుగవలెనని దేవదూతలు కోరిరి. అది ఈయన వలననే కలుగును. నేటివరకును కలుగుచున్నది. ఇది నిత్యము నిలుచును దీవెన: ఈయన సమాధానమును కలిగించు అధిపతి గనుక మీకు సమాధానము అనుగ్రహించు గాక.

Please follow and like us:

How can we help?

Leave a Reply