మత్తయి 2:1-12.
1. తూర్పు జ్ఞానులను నక్షత్రము నడిపించెను. వారు పర్ష్యా దేశమునుండి పాలస్తీనా దేశమునకు వచ్చిరి. వారినడక బేత్లెహేము వరకు వెళ్ళలేదు. యెరూషలేములో రాజుగారిని కలిసికొనినయెడల పుట్టిన శిశువును గురించి బాగుగా తెలియునని రాజుగారి దివాణమునకు వెళ్ళిరి. వారు జ్ఞానులెగాని, యెరూషలేమునకు వచ్చుసరికి వారిజ్ఞానమంతా ఖర్చయిపోయెను. నక్షత్రము నడిపించుచుండగా హేరోదు దగ్గరకు ఎందుకు వెళ్ళవలెను?
2. వారు రాజుగారి దివాణమునుండి బైటికి వచ్చువరకు నక్షత్రము కనిపెట్టుకొని యున్నది. వారు రాజుగారి దగ్గరకు వెళ్ళుట అజ్ఞానము. వారి అజ్ఞానము వారికి తెలియలేదు. వారు దివాణములోనికి వెళ్ళినందున నక్షత్రము (వారి మనస్సులోనుండి) తప్పుకొన్నదిగదా. మనగతి కూడా అంతే. మనము దైవనడుపుదల ప్రకారము వెళ్ళిన చేరవలసినచోటు చేరుకొందుము గాని మన స్వంతజ్ఞాము కలిసిన శత్రువులయొద్దకే చేరుదము జాగ్రత్త?
3. నక్షత్రము గొప్పదా? తూర్పు జ్ఞానులు గొప్పవారా? జ్ఞానము గొప్పదేగాని, నక్షత్రమే ఇంక గొప్పదని తెలియుచున్నది. నక్షత్రము వారిని తప్పుదారిలో నడిపించలేదు. గాని వారి జ్ఞానమే వారిని తప్పుదారిలో నడిపించినది. ప్రభువు నడుపుదల ఇస్తున్నారు. మనము గ్రహింపలేక పోవుచున్నాము.
4. జ్ఞానులు తప్పు దిద్దుకొనలేదు. రాజు ఎరుగననెను. గనుక దివాణము బయటికి వచ్చినరు. వారి స్వంత తప్పు దిద్దుకొనలేదుదిద్దుకొనలేదు. చాలా విచారాము వారు దివాణములోనుండి బైటకు రాగానే నక్షత్రము కనిపించెను.
5. వారి దేశములో నక్షత్రము చూచి సంతోషించిరి. కాని రాజుగారి దివాణములో నుండి వచ్చిన నక్షత్రమును చూచి “అత్యానందభరితులైరి”. (మత్తయి2:10,11) అలాగే ప్రభువు సంగతి మనము మొదట విన్న్ సంతోషపడుదుము. ఆయన మనలను దిద్దినపుడు అత్యానందపడుదుము.
6. మన మిషనులో ఒకరికి అత్యానందము అని పేరు పెట్టినారు. ఆయన బ్రతికి ఉన్నంత కాలము ఎన్ని కష్టములున్నను అత్యానందముగానే ఉన్నాడు. మనమును ప్రభువులో ఉన్నంత కాలము అత్యానందముగా నుందుము.
7. వారి మొదటి సంతోషము కంటె రెండవ సంతోషమే గొప్పది. నక్షత్రము అచ్చటనే ఆగి ఉండెను. అలాగే ప్రభువు మనలను నడిపించి నడిపించి మనము పొరబాటులో పడగానే ఆగి, మరల మనము సరియగు వరకు కనిపెట్టుచుండును. కాబట్టి నక్షత్రము వంటి నడిపింపు ప్రభువు మనకు ఈ కాలములో ఇచ్చుచున్నాడు. మహాజ్ఞానులే తప్పిపోయిరి గనుక ఇది గుర్తించవలసిన సంగతే.
8. వారు ప్రభువును దర్శించిరి. ఈ కాలములో ప్రభువు కొందరికి దర్శనమిచ్చుచున్నారు. కొందరు ప్రార్దించుచున్నను కనబడుటలేదు. జ్ఞానులవలె తప్పు దిద్దుకొనిన యెడల ప్రభువు దర్శనము దొరుకును.
9. భక్తులు అనుకొనుచున్నారు (అయ్యగారు చిన్నతనములోనే విన్నారు) మొదటి రాకడలో కనిపించిన ఆ నక్షత్రము, రెండవరాకడలో తప్పక కనిపించును. మొదటి రాకడ నక్షత్రము జ్ఞానులకే కనిపించెను. రెండవ రాకడ నక్షత్రము అనేకులకు కనిపించును. జ్ఞానులకు కూడ కనిపించును.
10. క్రొత్త నక్షత్రము కథ:-దేవుడు జ్ఞానులతో మీరు వచ్చిన దారిని వెళ్ళక పెడదారిని వెళ్ళండి అని చెప్పెను. పెడదారిని వెళ్ళండి అని చెప్పిన దేవుని వాక్కే ఆ క్రొత్త నక్షత్రము. కీర్తన 119:105లో నీ వాక్యము నా త్రోవకు వెలుగై యున్నది. వారు శిశువు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆకాశ నక్షత్రము నడిపించెను. తిరిగి ఇంటికి పోవునపుడు వాక్య నక్షత్రము నడిపించెను. ఈ వాక్య నక్షత్రము మనము అనుదినము చదివిన, జ్ఞానులను ఆ నక్షత్రము నడిపించినట్లు మనలను ఈ వాక్యమను నక్షత్రము నిత్యమూ నడిపించును. 1) ఆకాశ నక్షత్రము, 2) వాక్కు నక్షత్రము, 3)మనకు ఇవ్వబడిన లిఖిత నక్షత్రము.
11. ప్రష్యా దేశములో ఒక పండితుని మనసులో దేవుడు పుట్టించగా వ్రాసినది ఒక పవిత్రమైన కుమారుడు జన్మించును. ఆ వార్త వినగానే మీకున్న శ్రేష్టవస్తువులు బహుమానముగా తీసుకొని వెళ్ళండి అని చెప్పెను. అప్పటివారు కనిపెట్టి చనిపోయిరి. తర్వాత వారికి దేవుడు నక్షత్రము ద్వారా తెలియపర్చెను. కనిపెట్టు వారికే ప్రభువు ఏదైన చూపించును.
12. క్రీస్తు ప్రభువు అనే నక్షత్రమును మనము చూచుచున్నాము గనుకను దైవ వాక్యమనే నక్షత్రమువల్ల నడిపింపబడుచున్నాము గనుకను కొంతకాలమునకు మనము నక్షత్రములవలె అగుదుము అని దానియేలు 12:3లో ఉన్నది. అనేకులను నీతి తట్టు త్రిప్పువారు నక్షత్రములవలె ప్రకాశింతురు. వాక్య ప్రకారము నడిపింపబడవలెను. ఆ వాక్యము ఇతరులకు బోధింపవలెను.
13. రాజమండ్రిలో ఒక మిషనెరీగారి భార్య చనిపోయినది. బరంపురంలోని సన్నిధి కూటస్థులకు ఒక దర్శనము వచ్చినది భూమిమీద నుండి ఆ దినము ఒక నక్షత్రము పరలోకమునకు వెళ్ళెను. మనము కూడ బోధించిన యెడల ఆ మిషనెరీ భార్య వెళ్ళినట్లు నక్షత్రమువలె వెళ్ళుదుము.
నక్షత్రమువలె ప్రకాశించు ధన్యత మీకు కలుగును గాక!