క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. త్రిత్వ ఆదివారము...
  5. త్రిత్వ ఆదివారము

త్రిత్వ ఆదివారము

మత్తయి 28:19; 1యోహాను 5:7.

త్రిత్వాదివారము కూడ ఒక పండుగ దినమే. క్రిస్మసు, సిలువ, ఈస్టరు, ఆరోహణము, పెంతెకొస్తు, త్రిత్వము ఈ ఆరును మన జ్ఞానమునకు పూర్తిగా అర్ధము కావు. అయినను విశ్వాసము ద్వారా గ్రహింపగలము. అగ్నిజ్వాల అనునది ఒక వస్తువు. వేడిమి, వెలుగు జ్వాలతో కలసి గలవు. ఈ అగ్ని జ్వాలలోని వెలుగును తీసివేసిన తక్కిన రెండునూ ఆరిపోవును. వేడిని తీసివేసిన మిగతా రెండును ఆరిపోవును. జ్వాలను ఆర్పివేసిన ఆ మిగతా రెండును ఆరిపోవును. వేరుగా మాట్లాడగలము, వివరించుకొనగలము) గాని ఈ మూడింటిని విడదీయలేము. దేవుడు మనకు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను గ్రంధములో బయలుపడినాడు. ఈ ముగ్గురూ ఒక్కరే, ఒక్కరుగా నున్న ముగ్గురు, ఇది మర్మము. అయినను గ్రంధములో ఉన్నది గనుక బోధించుచున్నాము. కుమారునిగా ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తును మనము ప్రభువు అనుచున్నాము.

దేవుడు కుమారుని దానముగా ఇచ్చినందున, క్రిష్ట్మస్ నాడు ఆయనను స్తుతింతుము. కుమారుడు తన ప్రాణమును దానముగా ఇచ్చినందున, మంచి శుక్రవారమునాడు ఆయనను స్తుతింతుము. పరిశుద్ధాత్మ సంఘము మీద కుమ్మరింపుగా ప్రవేశించిన దానమైనందున, పెంతెకొస్తునాడు ఆయనను స్తుతింతుము. త్రిత్వాదివారమునాడు తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను స్తుతింతుము. ఆ మూడు స్తుతులలో ఈ నాల్గవ స్తుతి కూడ ఇమిడి యున్నది.

ప్రియులారా! సృష్టియందు గల అనేక సంగతులు మనకు అర్ధమగుటలేదు. అట్లే క్రిష్ట్మస్, మంచి శుక్రవారము, ఈస్టరు, ఆరోహణము, పెంతెకొస్తు, త్రిత్వము ఈ ఆరును మన జ్ఞానమునకు పూర్తిగా అర్ధము కావు, అయినను విశ్వాసము ద్వారా అర్ధము చేసికొని ఆనందించుచుండుము, కాబట్టి అర్ధము కానంత మాత్రమున అధైర్యపడక నిత్యము ప్రార్ధనయందు నిలకడగా ఉండుడి. అప్పుడు మీకు మహోపకారము కలుగును. పండుగ దినములలో మాత్రమేగాక, అనుదినము ఈ ఆరు విషయములు ధ్యానింపవచ్చును. జ్ఞానము గ్రహింపలేని సంగతులను, విశ్వాసము గ్రహించును. దేవుడు మీకు అట్టి గ్రహింపుశక్తి అనుగ్రహించును గాక! ఆమెన్.

Please follow and like us:

How can we help?

Leave a Reply