క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. త్రిత్వ ఆదివారము...
  5. పరిశుద్ధ త్రిత్వ పండుగ

పరిశుద్ధ త్రిత్వ పండుగ

త్రియేక దేవుని తలంచుకొని పండుగకు వచ్చిన ప్రియులారా! త్రిగుణాశీర్వాదము మీకు కలుగును గాక!

క్రిస్ట్మస్ దినమున, కుమారునిచ్చిన తండ్రి పండుగ, మంచి శుక్రవారమున తండ్రి తన దానముగా నిచ్చిన కుమారుని పండుగ. పోయిన ఆదివారమున పరిశుద్ధాత్మ కుమ్మరింపుపైన పెంతెకొస్తు పండుగ. ఈ దినము ఈ ముగ్గురిని తలంచుకొని ఆరాధించే త్రిత్వ పండుగ. ఇది బైబిలోనున్న సంగతే. బైబిలులో నున్నది ఆచరించిన అది వాక్యానుసారము. బైబిలులోనున్న సంగతులనుబట్టి క్రమము ఏర్పాటు చేసిన అది సంఘకార్యక్రమము. వాక్యమును, సంఘమును వేరుచేయకూడదు. వాక్యము సంఘము కొరకే వచ్చినది. దేవుడు వాక్యమునకు సంఘమును, సంఘమునకు వాక్యమును జతపర్చియున్నాడు. దేవుడు జతపరచిన దానిని మనుష్యులు వేరుచేయకూడదు. ఆదికాండము 1వ అధ్యాయములో త్రిత్వమున్నది. ముగ్గురు వేరుగానున్నట్లుగా కాక కలిసి ఉన్నట్లు గలదు. ఆదికాండము మొదలు మలాకి వరకు తండ్రియైన దేవుని పని కనబడుచున్నది. సువార్తలలో కుమారుడైన దేవుని పని కనబడుచున్నది. తర్వాత అపోస్తలుల కార్యములు, పత్రికలలో పరిశుద్ధాత్మ పని కనబడుచున్నది. నేటివరకు పరిశుద్ధాత్మ పని కనబడుచున్నది. తాటి పండు ఒకటిగా కనిపించును గాని విప్పినప్పుడు మూడు గింజలు ఉండును. ఆలాగే ఆదికాండములో ముగ్గురు కలసి ఉన్నారు. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. కుమారుడు మనిషి కాలేదు గనుక ఆత్మగానే ఉండెను. ముగ్గురు ఆత్మగానే ఉన్నారు. ముగ్గురు ఒక్కరుగానే యున్నారు. గాని తాటి పండు విత్తనాలు వేరైనట్లు ఎక్కడో ఒకచోట వేరగుదురు. మనిషిని రక్షించు పనిమీద వారు పనిని, పంచుకొని వేరుగా కనిపించిరి. తాటిపండు అని అందుము గాని మూడు గింజలను బట్టి మూడు కాయలని అనము గదా, అపోస్తలుల తర్వాత ‘అథనాసియ ‘ అను భక్తునికి దేవుడు త్రిత్వమును గూర్చిన మర్మము బయలుపర్చెను. ముగ్గురు దేవుళ్ళుకారు, ఒక్కడే దేవుడు. ముగ్గురు ప్రభువులు. కారు ఒక్కరే ప్రభువు. ముగ్గురు రక్షకులు లేరు, ఒక్కడే రక్షకుడు.

ఆది. కా. 3వ అధ్యాయములో పాప ప్రవేశమును గూర్చి ఉన్నది. దేవుడు ఏదేను తోటలో కోర్టు పెట్టెను. ప్రధమ కోర్టు ఆయన పెట్టినదే. ఈ కోర్టులన్ని దానిలోనుండి వచ్చినవే. ఆ కోర్టులోని నేరస్తులు: ఆదాము, అవ్వ, సర్పము __ ఆదాము దగ్గర తండ్రియైన దేవుడు ఉన్నాడు, అవ్వ దగ్గర కుమారుడైన దేవుడు ఉన్నాడు. సర్పము దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దీనికి కొంతకాలము ముందే ప్రభువు అయ్యగార్కి ఒక సంగతి బయలు పరచినారు. ఆది. కా. 1వ అధ్యాయములో ఒకటిగానున్న మేము 3వ అధ్యాయములో పాప ప్రవేశకాలమున వేరైనామని చెప్పిరి. గనుక ముగ్గురు నేరస్థుల దగ్గర త్రిత్వములోని ముగ్గురు నిలువబడిరి. (ఇప్పటికే అబద్ధ ప్రవక్తలని మమ్మునంటున్నారు. ప్రభువు బైలుపరచిన ఈ సంగతి చెప్పిన ఇంకా అందురు. అయినను ప్రభువు బైలుపరచినది ఏలాగు చెప్పకమాని వేయవలెను? అని అయ్యగారు చెప్పినారు). ముగ్గురు నేరస్థుల దగ్గర త్రిత్వములోని ముగ్గురు నిలువబడి యుండుట ఏలాగు ప్రభువా? అని అడుగగా దాని వివరము ఇలాగున చెప్పిరి. (1) ఆదాముతో ‘భూమి, నీ నిమిత్తము శపింపబడి యున్నది ‘ అని గలదు కదా! భూమిని తండ్రి కలుగజేసిరి. గనుక ఈ మాట అనుటకు తండ్రికి తప్ప మరెవరికి హక్కులేదు. గనుక తండ్రి ఆదాము దగ్గర నిలువబడి చెప్పెను. (2) అవ్వతో ‘నీ ప్రసవ వేదనలో చాలా బాధపడుదువు ‘ అనెను. ఈ గీత అవ్వ దగ్గర నుండి శారా వరకు, అక్కడనుండి రిబ్కాకు, ఆమె నుండి యాకోబు యొక్క ఏర్పాటు భార్యయైన లేయా దగ్గరకు, ఆమెనుండి ప్రభువు తల్లియైన మరియ వరకు వచ్చెను. ఆమె గ గర్భములో ప్రభువు పుట్టెను. అవ్వ దగ్గర భూలోకములో పుట్టబోవు కుమారులందరికి జ్యేష్ట కుమారుడైన ప్రభువు నిలువబడెను. (3) సాతాను ఆత్మ రూపిగా నున్నాడు. పరిశుద్ధాత్మ కూడా ఆత్మయే గనుక సాతాను దగ్గర పరిశుద్ధాత్మ నిలువబడియున్నాడు. సర్పవేషముతో సాతాను అవ్వకు తెలియకుండ ఉన్నాడు. సర్ప వేషముతోనున్న ఆ దుష్టాత్మ సంగతి పరిశుద్ధాత్మకు బాగా తెలియును. గనుక ఆత్మ సైతాను దగ్గర నిలువబడెను. ఇక్కడ సైతానుదే నేరము. అది సర్పముయొక్క నేరము కాదని చెప్పుటకు ఆత్మ తండ్రి నిలువబడెను. ఈ దురాత్మ మనసులోని గుట్టు, మాయ బయట పెట్టుటకు ఆత్ముండెను. ఆదామునకు శాపమున్నను, పంటదీవెన ఉన్నది.

అమాయకుడు-పిశాచివలన పాపములో పడినాడు. తరచుగా అయ్యగారు సాతానును ఇదే తిట్టు తిడతారు. మనిషిని నీవే పాపములో పడవేస్తున్నావు, అతడు తిరిగి లేచి దీవెన కూడ కలదు. అది ‘పంట దీవెన ‘. స్త్రీకి కూడ వేదన ఉన్నను, ‘కుమారుడు పుట్టుట ‘ అను దీవెన కలదు. శ్రమ వచ్చినా, దాని వెంటనే దీవెన కలదు. ఆదాము, అవ్వలకు శాపములున్నను దాని వెంటనే దీవెన కలదు. సాతానుకు అది లేదు. ఆలాగే మనకు నింద, అవమానము, శ్రమ ఉన్నను దాని ప్రక్కనే దీవెన ఉన్నది. శ్రమలలో మీరు ఒడిలిపోకుండ త్రిత్వ దేవుని దీవెన తలంచి, సంతోషింతురు గాక! ఆమేన్.

Please follow and like us:

How can we help?

Leave a Reply