“నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించియున్నావు.” దా.కీర్తనలు 56:12
ఈ నూతన సంవత్సరములో మనము
- జీవపు వెలుగు
- దేవుని సన్నిధి సంచారము
- కాలుజారకుండా తప్పించుట
జీవపు వెలుగులో ఉండవలెను.
దేవుని సన్నిధిని సంచరించవలెను.
పాదము జారిపడకుండా తప్పించుకొందుము
- జీవపు వెలుగు
వెలుగునకు జీవమున్నది. వెలుగు అనగా ఏమిటో తెలియును. మన నివాసములో వెలుగుండవలెను. మంచి పనులు అనే వెలుగుండవలెను. చీకటి సంబంధికులు దుష్కార్యములు చేయుదురు. వెలుగు సంబంధికులు మంచిపనులు చేయుదురు. వెలుగులో ఉండుట వేరు మరియు వారి కార్యములు వేరుగా ఉండును. మంచివారై యుండువారు మంచి కార్యములు చేయుదురు. వెలుగులో ఉండుట అనగా ప్రవర్తన మంచిదై ఉండవలెను. యేసుప్రభువు నికోదేముతో చెప్పినది (యోహాను 3:20) దుష్కార్యము చేయువాని క్రియలు చెడ్డవి గనుక అతడు వెలుగు దగ్గరకు రాడు. మన జీవితము పవిత్రముగా ఉండవలెను. కళంకము లేకుండా ఉండవలెను. క్రైస్తవులమైన మనము మొదట పరిశుద్ధముగా యుండవలెను. వెలుగులో ఉండవలెను, వెలుగు పిల్లలమై యుండవలెను. జీవపు పిల్లలమై యుండవలెను. జీవముగలవారు ఊరకుండరు. మనము స్వభావ సిద్ధముగా మంచి వారమై యుండవలెను. మనము నైజము చొప్పున మంచి వారమై యుండవలెను. అట్టివారు ఏ చిన్న మాట చెప్పిన విందురు. (||కొరింథి 13:7). మంచి నైజము లేనివారి గతిఏమి? వారు యేసు ప్రభువును బట్టి మంచి నైజము తెచ్చుకొనవలెను. అంధకారములో నున్నవారు మాటుమణుగుదురు, నాశనమై పోవుదురు. వెలుగులో ఉండువారు జీవములోనే ఉండిపోవుదురు. వెలుగు ఏ ప్రకారము దానంతట అదే కాంతి కలిగియుండునో నేను నా నైజ ప్రకారము పరిశుద్ధుడై యుందును. ఇది క్రొత్త సంవత్సర వర్తమానము.
దీవెన: జీవపు వెలుగులో ఉండే దీవెన మీకు కలుగునుగాక!
2. దేవుని సన్నిధిలో సంచరించుట:-
తల్లి తన బిడ్డలను, తన దృష్టిలోనే ఆడుకొనవలెను అని కోరుకొనును. దూరముగా వెళ్ళిన యెడల వారికి ఆపద కలుగునని భయపడును, ఆలాగే మనలను దేవుని సరిహద్దులలో నుంచుట ఆయనకిష్టము. లోకపు సరిహద్దులలో తిరుగువారికి శ్రమ. దేవుని బిడ్డలు అరణ్యములో ఉన్నా దేవుని సన్నిధిలో ఉన్నట్టే గాని వారు పాపము చేస్తే సాతాను సన్నిధిలో ఉన్నట్టే. ఎక్కడ దేవుని సన్నిధి లేదో అక్కడ పాపము ఉన్నట్టే. హానోకు దేవునితో నడచెను. ఆయనతో కొనిపోబడెను.
దీవెన:- మీరు ఈ నూతన సంవత్సరములో దేవుని సన్నిధిని సంచరించుదురుగాక!
సజీవుల వెలుగు: ప్రభువు రెండవ సారి వచ్చినపుడు ఎత్తబడువారికి సజీవపు వెలుగున్నట్లు, విశ్వాసులకు ఈ వెలుగు యేసుప్రభువును బట్టి వచ్చును. (యూదా పత్రికలో 24 వ వచనము)
3. జారకుండ తప్పించుట:-
ఈ 365 రోజులు మీ కాలు జారకుండా జాగ్రత్తగా నడువవలెను. పరలోకములో మనకు ఏమి సిద్ధమైయున్నదో దానిని భూలోకములోనుండి చూచుకొనవలెను. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునెయున్నది. దీపమును బట్టి కొంత దూరము నడిచి వెళ్ళగలమని మనకు తెలియును. కొందరు దైవభక్తులు శత్రువులకు జడిసి ఒక పర్వతము మీద దాగుకొన్నప్పుడు అచ్చట దేవుడు వారికి ప్రత్యక్షమై వెలుగు కలిగించెను.
విశ్వాసమనునది ఒక దుర్భిణి. విశ్వాసము వాక్యమును బట్టి కలుగును. సన్నిధిలో సంచరించుట ద్వారా ప్రత్యక్ష్త అనేక రీతులుగా బైలుపడును. మరణమునుండి నీవు నన్ను తప్పించి నప్పుడు, నా కాలు జారకుండా నీవు నన్ను తప్పించుదువు. దీవెన: మీ కాలు జారకుండా దేవుడు తప్పించును గాక! ఇదే దీవెన. ఇదే ప్రవచనము.
3 నీతి పాఠములు: 1. వెలుగులో ఉండుట. 2. సన్నిధిలో సంచరించుట. కాలుజారకుండ తప్పించుట.
3 దుర్భిణీలు: 1. వి శ్వాసము 2 దర్శనము 3 వాగ్ధానము.
ఈ నూతన స్థితులన్నీ ఈ నూతన సంవత్సరములో మీకు అందును గాక. ఆమెన్.