క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. పెంతెకొస్తు పండుగ...
  5. పెంతెకొస్తు పండుగ

పెంతెకొస్తు పండుగ

యోవేలు: 2:28-32; యోహాను. 14:16-24; అపో.కార్య. 2వ అధ్యా.

ఇది పరిశుధాత్మ పండుగ. తండ్రి పరిశుద్ధాత్ముడే, కుమారుడు పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడే. త్రియేక దేవుడు పరిశుద్ధాత్ముడే. క్రిస్ట్మస్ రోజున పరిశుద్ధాత్ముడైన కుమారుని పండుగను, ఈ వేళ పరిశుద్ధాత్ముడైన పరిశుద్ధాత్మ పండుగను జరుపుకొందురు. దీని తర్వాత వచ్చే ఆదివారము త్రిత్వపండుగ. అనగా పరిశుద్ధాత్ముడైన తండ్రి యొక్కయు, పరిశుద్ధాత్ముడైన కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముడైన పరిశుద్ధాత్మ యొక్కయు పండుగను జరుపుకొను దినమైయున్నది. అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయములో ఈ పండుగ యొక్క కథ వివరముగాను, స్పష్టముగాను ఉన్నది.

కార్య 2:2లో “ఇల్లంతయు నిండెను” అని ఉన్నది. ఆయన మనుష్యులలో నిండుట వేరు, ఇల్లంతయు నిండుట వేరు. ఇల్లంతయు నిండినట్లయిన , మనుష్యులలో మాత్రము నిండదా! కొందరు ఆత్మను పొందుటకు చాలా ప్రయాసపడుదురు. గుడిలో చేరి ఓ పరిశుద్ధాత్మా! దీగిరా, నా హృదయములో ప్రవేశించు! నన్ను నీ వశము చేసికో! అని కేకలు వేయుదురు. కాని, అపో.కార్య 2వ అధ్యాయములో వారు అల్లరి చేయలేదు. నిశబ్ధముగా ప్రార్ధనలో ఉండగా ఆత్మ వారిలో ప్రవేశించెను. కేకలు వేయలేదు, క్రిందబడి దొర్లలేదు, ఓ పరిశుద్ధాత్మా! రమ్ము! అని బలవంతముగా పిలువ లేదు. ఆ పద్ధతి అజ్ఞానము. అయినను దేవుడు కొందరి అజ్ఞానమును కనికరించి వారి పట్టుదలను ఆసక్తిని, ఆశను మెచ్చుకొని; పద్దతి బాగా లేకపోయినను ఆత్మను ఇచ్చుచునేయున్నారు.

పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకు బాగుగా తెలియవలెను. ఒకరికి తనలో ఆత్మ ఉన్న సంగతి బాగుగా తెలియును. కొందరిలో ఉన్ననూ ఉన్నట్లు తెలియదు. గనుక మీకు తెలిసేటట్లు ఉండే ఆత్మ కావలెనా? కనబడకుండ నుండే ఆత్మ కావలెనా? అట్టి వారిలో కొందరు, ఆత్మ ఉన్నదని విశ్వాసమును బట్టి నమ్ముచున్నారు. అయితే ఇద్దరును ధన్యులే. ఒకరిలో ప్రాణము ఉన్నట్టు టక్కుటక్కుమని తట్టుచున్నది. అన్నము తిన్న తర్వాత అది మనలో ఉన్నట్టు తెలియుచున్నది. అదే మనలను తట్టును గనుక తెలియును. అలాగే కొందరికి అన్నము కడుపులో ఉండి ఏలాగు తట్టునో అలాగే ఆత్మకూడా తట్టును, అది ఉన్న యెడల ఆ వ్యక్తికి ఉన్నట్లుగా తెలియును మనలో నున్న అన్నము తట్టినట్లు, ప్రాణము మనలను తట్టదు గాని ప్రాణము మనలో ఉంది అని తెలియును. అన్నము తట్టినంత స్పష్టముగా తెలియదు, గాని ప్రాణమున్నట్టు చెప్పగలము. అలాగే పరిశుద్ధాత్మ మనలోనున్నట్లు చెప్పగలమా? చెప్పగలిగితే మహాధన్యులము. మన శరీరములో ఎముకలు ఉన్నవని పట్టుకుంటే తెలియును. ఎముకలు ఉన్నట్టు తెలియును గాని అవి తట్టవు. పట్టుకొన్న తెలియును. ఎముకలు ఉన్నట్టు తెలియును గాని అవి తట్టవు. పట్టుకొన్న యెడల తెలియును గాని అన్నము తట్టినట్టు తట్టదు. శిరస్సు మొదలు అరికాలు వరకు రక్తము ప్రవహించుచున్నదని మనకు తెలియును. గాని అన్నము తట్టినట్లు రక్తము తట్టదు. ప్రాణము, ఎముకలు, కండరములు,రక్తము ఉన్నవి గాని అన్నము తట్టినట్లు అవి తట్టవు. అలాగే పరిశుద్ధాత్మ వారిలో ఉన్నాడు అని ఎవరు నమ్ముదురో వారిలో నున్నాడు. ఈ విషయము వారి విశ్వాసమునకు తెలియును. గాని జ్ఞానమునకు తెలియదు. జ్ఞానమునకు తెలియకపోయినా ఫరవాలేదు. కారణం జ్ఞానముకంటే విశ్వాసము గొప్పది.

ఆత్మ శక్తి లోకమంతటను గలదు. చెట్టులో జీవమున్నది. ఆ జీవము పరిశుద్ధాత్మ దగ్గర నుండి వచ్చిన ఒక శక్తి. జంతువులు, పురుగులు, పక్షులు మొదలగు వాటికి జీవమున్నది. అది కూడ ఆత్మ దగ్గరనుండి వచ్చిన శక్తి సూర్య, చంద్ర, నక్షత్రములకు జీవమున్నదా? ‘లేదు ‘ అని పిల్లలు అనవచ్చును. వాటికి జీవము లేకపోతే గాలిలో క్రిందపడకుండ ఏలాగున్నవి. మనమున్న భూమి కూడ గాలిలోనే ఉన్నది. భూమి గుండ్రముగా నున్నది. దానికి అన్ని ప్రక్కల, అడుగున కోటాను కోట్ల మైళ్ళు గాలి వ్యాపించి ఉన్నది. ఆకాశములో సూర్య, చంద్ర, నక్షత్రములు వ్రేఅలాడుచున్నవి. అవి క్రిందపడుట లేదు. తిరుగుచునే ఉన్నవి. ఆ తిరిగే జీవము వాటికెక్కడిది? అది పరిశుద్ధాత్మ శక్తియే. మన వాక్యములో, పరిశుద్ధాత్మ ఇల్లంతయు వ్యాపించి యున్నదని కలదు. దేవుని యొక్క ఆత్మ శక్తి-లోకమంతా, సూర్య, చంద్రాదుల దగ్గర కూడ వ్యాపించి యున్నది. పరిశుద్ధులు, దూతలు దేవలోకములో నున్నారు. వారక్కడ ఆడుకొనుచున్నారు. వారు పడటము లేదు. వారిని ఎవరు పట్టుకొన్నారు? అదియును ఆత్మశక్తియే. అపోస్తలుల కార్యములలో ఇల్లంతయు నిండిన ఆత్మ. అన్ని లోకములలో వ్యాపించి యున్నాడు. అట్లు వ్యాపించి యుండని యెడల లోకములు ఎప్పుడో నశించియుండును. గనుక ‘ఆత్మలేదు ‘ అని ఎవ్వరు అనవద్దు. ఆయన ఉన్నాడు గాని ఉద్రేకము లేకపోవచ్చును. ఒక మనిషిలో ప్రాణము ఉండును గాని ఉసూరుమంటు, ముడుచుకొని ఉండును. అతనిలో ప్రాణము గలదు గాని చురుకుదనము లేదు.

ఇంకొకరిలో ప్రాణము ఉండును గాని ఉద్రేకము లేక ఉండును. కొందరిలో ఆత్మ ఉండి, ఉద్రేకముగా పనిచేయును.

జరిగిన కథ – సాధు సుందర సింగ్ క్రీస్తు మత విరోధి. ఆయన – ఆకాశమును, భూమిని ఎవరు చేసిరో, ఆయనే నాకు కనబడిన ఉందును. లేకపోయిన రైలు క్రింద పడి చనిపోయి నేనే ఆయనను చూస్తానని అనుకొనెను. తర్వాత కొంచెము సేపటికి గది అంతయు గజ గజ వణికినది. యేసుప్రభువు ప్రత్యక్షము కాగా నేను నిన్ను పిలువలేదని సాధు సుందర్ సింగ్ చెప్పెను. సృష్టికర్తను నేనే. నీవు నన్ను పిలిచినావని ప్రభువు చెప్పగా సుందర్ సింగ్ వెంటనే నమస్కరించెను. వెంటనే అతనిలో ప్రభువు ప్రవేశించెను. మనము మంచి నీరు త్రాగినప్పుడు లోపలికి వెళ్ళుట ఏలాగు తెలియునో, అలాగే ప్రభువు ఆయనలో ప్రవేశించుట సుందర్ సింగ్ నకు బాగుగా తెలిసినది. నీరు ఏలాగున కడుపులో నున్నదో, అలాగే ప్రభువు ఆయనలో నుండుట సుందర్ సింగునకు తెలిసినది. ఆయన జీవిత కాలమంతయు ప్రభువు ఆయనలోనుండి బయటకు పోలేదు. సుందర్ సింగ్ ప్రతి స్థలములోను ఈ అనుభవము చెప్పినాడు. ఇట్టి గొప్ప అనుభవము ఎక్కడను లేదు. ప్రభువు మీలోనున్నట్టు, తెలియకపోయినను ఉన్నట్టు నమ్మండి. సుందర్ సింగ్ నకు కలిగిన అట్టి అనుభవము లేక అట్టి విశ్వాసము చదువు వారెల్లరికి కలుగును గాక. ఆమెన్.

Please follow and like us:

How can we help?

Leave a Reply