క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. పెంతెకొస్తు పండుగ...
  5. పెంతెకొస్తు పండుగ

పెంతెకొస్తు పండుగ

ఈ వేళ పరిశుద్ధాత్మ కుమ్మరింపు పండుగ. క్రొత్త వారు ఆత్మ బాప్తిస్మము పొందుటకు, ఇది వరకు ఆత్మ బాప్తిస్మము పొందినవారు ఆత్మ ప్రోత్సాహము పొందుట కొరకు ఇది ఒక ప్రత్యేక పండుగ. ఈ రెండు కలిస్తేనే పెంతెకొస్తు పండుగ.

1. క్రిస్ట్మస్ రోజున తన కుమారునిచ్చినందుకు తండ్రికి స్తుతి, 2. మంచి శుక్రవారమున ఆయన తన ప్రాణమిచ్చినందుకు కుమారునికి స్తుతి, 3. పెం, తెకొస్తు రోజున ఆయనే తన్నుతాను మనకిచ్చి వేసికొన్నందుకు పరిశుద్ధాత్మకు స్తుతి చెల్లించెదరు. ఇచ్చట తండ్రి దానకర్తయై తన కుమారుని, తన ఆత్మను ఇచ్చెను. తండ్రి, బైబిలును ఇచ్చుట ద్వారా కుమారుని యొక్కయు, ఆత్మయొక్కయు చరిత్రలు మనకు తెలియుచున్నవి. మూడు దానములు, తండ్రి మనకు అనుగ్రహించెను. అవి:- 1. కుమారుని దానము. 2. ఆత్మ దానము. 3. గ్రంధ దానము. ఈ మూడింటిలో గొప్పది గ్రంధము. ఎందుకంటే (1) తండ్రిని గూర్చి 92) కుమారుని గూర్చి (3) ఆత్మను గూర్చి (4) గ్రంధమును గూర్చి ఈ బైబిలు వల్లనే మనము తెలిసికొనగలము.

పరిశుద్ధాత్మ బాప్తిస్మ కథ:- పాదిరిగారు నీళ్ళ బాప్తిస్మమిచ్చును. క్రీస్తు పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చును. ఈ రెంటిలో ఏది గొప్పది? ప్రభువు యొర్ధాను నదిలో నీళ్ళ బాప్తిస్మము పొంది, బైటికి రాగానే ఆత్మ బాప్తిస్మము పొందెను. యేసు ప్రభువు రెండునూ ఒక్కసారె పొందెను.బాప్తిస్మమొక్కటే, రెండు కలిసే ఉన్నవి. విడదీయుటకు వీలు లేదు. నీళ్ళ బాప్తిస్మము మనిషి ఇవ్వాలి, ఆత్మ బాప్తిస్మము తండ్రి యిచ్చును. నీళ్ళ బాప్తిస్మము కొంచెము ఎడముగా పొందుచున్నాము. నమ్మి బాప్తిస్మము పొందవలెననగా: స్నానము పొందిన తరువాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని సంఘముతోను, భూలోక సంఘముతోను, విశ్వాసుల సంఘముతోను, రక్షణ పొందినవాడు బంధుత్వము కలిగి వారిలో ఒకనిగా చేర్చబడుచున్నాడు.

పెంతెకొస్తు రోజున 16 దేశముల వారు వచ్చిరి. 120 మంది పరిశుద్ధాత్మను పొంది సంపూర్ణ సువార్తను ప్రకటించిరి. ఇవి మూడు గొప్ప దివ్య చరిత్రలు:- 1. పునరుత్థాన చరిత్ర. 2. ఆరోహణ చరిత్ర. 3. పెంతెకొస్తు చరిత్ర.

పెంతెకొస్తు దినమున 120 మంది చేసిన సువార్త ప్రకటన సంపూర్ణ సువార్త ప్రకటన. అంతా చెప్పి పరిశుద్ధాత్మ చరిత్ర చెప్పకపోతే అసంపూర్ణ చరిత్రయగును. 1. సిలువ చరిత్ర, 2. పునరుత్థాన చరిత్ర, 3. ఆరోహణ చరిత్ర ఎంత ముఖ్యమో, పరిశుద్ధాత్మ బాప్తిస్మము చరిత్రయు అంతే ముఖ్యము. త్రియేక దేవుని పనులలో ఇది ఒక ముఖ్యమైన పని. ప్రభువు రెండవసారి వస్తున్నారనేది జరుగనైయున్నది. పెంతెకొస్తు చరిత్ర జరిగిపోయిన చరిత్ర.

పెంతెకొస్తు దినమునకు పూర్వము జరిగిన కథ:- యోవేలు పరిశుద్ధాత్మ బాప్తిస్మమివ్వబడునని ప్రవచించెను. ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్త, స్నానికుడైన యోహాను – నేను నీళ్ళతోను; ప్రభువు తన ఆత్మతోను మరియు అగ్నితోను బాప్తిస్మమిచ్చును అని చెప్పెను. ప్రభువు కొద్ది దినములలో, మీరు పరిశుద్ధాత్మను పొందుదురు’ అనెను.

ప్రవక్తలు ముగ్గురు:- 1. యోవేలు 2. స్నానికుడైన యోహాను, 3. యేసు ప్రభువు. యోవేలు మొదలు యోహాను వరకు ఎవరైన బాప్తిస్మము పొందినారా? యోహాను మొదలు యేసుప్రభువు వరకు ఎవరైనా బాప్తిస్మము పొందినారా? లేదు. ఆ మూడు వాగ్ధాన ప్రవచనములు: ప్రభువు చెప్పినట్లు చేసి, ప్రార్ధించి, కనిపెట్టిన ఆ 120 మంది విషయములో నెరవేరెను. గనుక మీరును ఆ రీతిగా సిద్ధపడిన, అట్టి కృప మీకందరకు కలుగును గాక!

Please follow and like us:

How can we help?

Leave a Reply