క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. శ్రమకాల ధ్యానములు...
  5. ప్రయాసపడినది కృపయే

ప్రయాసపడినది కృపయే

శ్రమకాల ధ్యానము:- “ప్రయాసపడునది నేనుకాను, నాకు తోడైయున్న దేవుని కృపయే” 1కొరింథి 15:10. యేసుప్రభువా! నీలోనున్న ఒకగొప్ప లక్షణము. నీ’ కృప ‘ అది లోకమునకు బయలుపడిన నీ గొప్ప లక్షణము అని తలంచుకొనుచున్నాము. ఆ గొప్ప లక్షణము మా జీవాంత పర్యంతము జ్ఞాపకముండునట్లు సహాయపడుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ దినము జ్ఞాపకము చేయుచున్న సంగతి, ఈ దినమే కాదు జీవాంత పర్యంతము మీ హృదయములో ముద్రించు కొనవలసినది. అనేకులకు ఈ దినము కృప ‘ అను రెండు అక్షరముల మాట చేయుపని కన్నులకు కనబడలేదు. కనబడినను, కనబడింది అని అనుకొనలేరు. అది వివరించుటకు నేను చాల దూరము వెళ్ళవలెను.

పర మండలములో దేవుడు ఉన్నాడు. ఆయన లక్షణములు ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, సర్వవ్యాపకత్వము, నిరాకారము, అనాది, అనంతము మొదలగునవి. ఈ గుణములలోనే రెండు గలవు. అవి ప్రేమ మరియు కృప, ప్రేమ అన్న కృప అన్న ఒక్కటే, అయితే వీటి వివరములో చాలా తేడా ఉన్నది. వేదాంతములో గొప్ప అంశములై యున్నవి. ఇవి ఈ ప్రేమను ఆశ్రయించిన వారెవరనగా లోకములో దేవుడు కలుగజేసిన విశ్వాసులు, అవిశ్వాసులు, లోకములోనున్న అందరు. వారికి తెలిసిన తెలియక పోయిన ప్రేమ దగ్గర ఉంటారు. యోహాను 3:16లో “దేవుడు లోకమును ప్రేమించెను” అని గలదు. దాని అర్ధము తెలిసిన, తెలియక పోయిన ఒక్కటే. శిశువు పుట్టినప్పుడు తల్లి ముద్దుపెట్టుకొనును. ఆ ముద్దు శిశువునకు తెలియదు. తర్వాత తర్వాత తెలుస్తుంది. బిడ్డకుతెలిసినా తెలియక పోయినా, తల్లి ముద్దులిచ్చుట మానదు. ఆలాగే దేవుడు విశ్వాసులైనా, అవిశ్వాసులైనా అందరిని ప్రేమించుచున్నాడు. దాని పేరు సార్వత్రిక ప్రేమ, అందరిని సమానముగా చూచే ప్రేమ. మనుష్యులను మాత్రమేకాదు, వారికి సంబంధించినచెట్లు, జీవరాసులు, సృష్టి అన్నిటిని ప్రేమించుచున్నాడు. గనుకనే “దేవుడు లోకమును ప్రేమించెను”. అని గలదు.

రెండవ ప్రక్క కృప అని గలదు. కృపను ఆశ్రయించువారు విశ్వాసులు మాత్రమే. ప్రేమ దగ్గరనున్న వారు కృప సంగతి ఎరుగరు గాని ప్రేమను ఎరుగుదురు. వారికి కృప తెలియదు. తెలిసినను నమ్మరు. నమ్మిన అవలంభింపరు. కృప దగ్గర ఉండువారు ప్రత్యేకులు. అయితే కృప అనగా ఏమిటి? దేవుడే తన ప్రేమ చొప్పున భూలోకమునకు మానవ, రూపములో వచ్చి మానవులతో కలసి మెలసి యుండుటయే కృప. ఈ కార్యమునకు కృప అని పేరు. ఈ కృపను ప్రేమ దగ్గర నున్న సజ్జనులు నమ్మరు. దేవుడు నన్నునూ, ఈ సర్వలోకమును కలుగజేసినాడు. చివరకు నన్ను మోక్షమునకు తీసికొని వెళ్ళునని నమ్ముదురు గాని దేవుని అవతారమును నమ్మరు. అందరికీ ఈ విషయము బయలు పడదు. ఎవరికి బయలుపడునో, ఎవరు నమ్ముదురో వారికే ఆ కృప. ఇతరులు కృపలో లేనేలేరు. ఎందుకనగా దేవునిని గూర్చి నమ్మి, క్రీస్తును నమ్మక పోతే కృపను ఎట్లు పొందగలరు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే, అని యేసుప్రభువు చెప్పెను. పౌలు తన వ్రాతలలో ప్రేమను గూర్చియు, మరియు కృపను గూర్చి కూడ వ్రాసెను. కృప వలన రక్షింపబడినామని వ్రాసెను. అనగా విశ్వాసులగుదురు అని అర్ధము. అనగా క్రీస్తునందు విశ్వాసులకే ఆయన ప్రేమ గలదు. కృప కూడ గలిగి యుండుట ఇంకొక మెట్టు ఎక్కువ. వీరు కృప వలన రక్షింపబడిన వాలాగైతే కృప అనేది ప్రత్యేకమైన వరము. ఇది ప్రత్యేకమైన జనము కొరకే ఉన్నది; అది ప్రత్యేకమైన స్థితి, వారు ప్రత్యేకమైన జనము. ప్రత్యేకమైన వారు కలిగినవారు గనుక వీరికెక్కువ ప్రత్యక్షతలు గలవు. అపోస్తలుడైన పౌలు సువార్త చెప్పుటకు ప్రయాస పడెను. చాల కష్టములు సేవయందు అనుభవించె ను. దెబ్బలు, అన్నము లేకపోవుట, సముద్రములో ప్రాణాపాయములు మొదలగు చాలా శ్రమలు అనుభవించెను. ||కొరింథి 11: 23-33. “అపోస్తలులందరి కంటే ఎక్కువ శ్రమ పడితినని” చెప్పి ఒకమాట అన్నాడు. నేను ప్రయాసపడిన మాట నిజమే కాని అసలు నిజము అది కాదు. “ప్రయాసపడినది కృపయే” అని చెప్పెను. 1కొరింథి 15:10, ఇది చెప్పిన అందరు నవ్వుదురు. కృప అనునది దేవుని లక్షణము, అది ఏలాగు బాధపడెను. పౌలు ప్రయాసపడిన మాటే నిజము అందురు. కానీ పౌలు కృప ప్రయాసపడెనని చెప్పుచున్నాడు. యేసుప్రభువు ప్రయాసపడెను అంటే తెలియును. దేవుడు ప్రయాసపడెను అంటే తెలియును. నేను ప్రయాసపడి తిని అంటే అందరకు తెలియును. కృప ప్రయాసపడెను అంటే ఏలాగు ప్రయాసపడెను? మనమైతే సువార్త విషయములో కష్టాలు. ఇవి అవి పౌలువలె అనుభవించితిమని చెప్పి ఆగిపోతాము. అయితే పౌలు “కృప ప్రయాసపడినది” అని చెప్పెను. ఇది జ్ఞాపకముంచుకొనుట కష్టము. దేవుని లక్షణములలో ఒక లక్షణము కృప. పౌలు అనుభవించినది కృపయే గనుక అ కృపయే ప్రయాసపడినది. ఆ ప్రయాసపడుట శ్రమ కాలములో గలదు. యేసుప్రభువు పన్నెండు మంది శిష్యులను ఏర్పర్చుకొని, అందులో ముగ్గురిని ప్రతేకముగ కొన్ని ముఖ్య స్థలములకు తీసుకొని వెళ్ళెను. రూపాంతర సమయమందు ఆ ముగ్గురినే కొండ పైకి తీసుకొనివెళ్ళి, మిగతా వారిని క్రింద నుంచెను. ఎంత ప్రత్యేకింపబడిన వారైనను గెత్సెమనెలో ప్రార్ధించుమని ప్రభువు చెప్పినప్పుడు వారు నిద్రపోయిరి. వారు కూడ మోకరించి ప్రార్ధించిన యెడల ప్రభువునకు ఎంత సంతోషము! పన్నెండుగురు శిష్యులు కృపను బట్టియే పిలువబడిరి. గాని ముగ్గురికి ఎక్కువ కృప చూపబడలేదా? గనుక వీరు ఎక్కువైన కృపను పొందిరి. గనుక ప్రభువునకు ఎక్కువగా సహాయపడవలెను గానీ ఇప్పుడు వారు తోటలో నిద్రపోవుచున్నారు. గనుక బాధ ఎవరికి? కృపకే. ఎంతో కృప చూపించి ఈ ముగ్గురిని పైకి తీసికొనివస్తే, ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తే వారు నిద్రించిరి. అదే కృప యొక్క ప్రయాసము. తొమ్మిది మంది శిష్యులలో నుండి వారిని వేరు చేయుటలో ముగ్గురిగా ఏర్పాటు చేయుటలో, చేయుటరుచేయుటలో, ప్రార్ధన యందు ఉండుటలో, ఇదంతయు కృప పడిన ప్రయాసము. ఇంతగా ప్రయాసపడిన కృప వారితో ఉన్నప్పుడు స్తోత్రము అనక నిద్రపోవుచుండిరి. ఆయన లక్షణము కృప ప్రయాసపడెను. ప్రభువు జాలితో ప్రశ్నవేసెను. ఒక్క గడియయైన మేల్కొని యుండలేరా? ఎనిమిది మంది గేటు దగ్గర, ఒకరు ప్రభువును అప్పగించుటకు తిరుగుచున్నారు. ముగ్గురు మాత్రము దగ్గర ప్రత్యేకముగా ఉన్నారు. కృపకు ఎంత ప్రయాస! ఎంత శ్రమ! అయితే పోకిరి గుంపు క్రీస్తుప్రభువు దగ్గరకు రాగానే ఈ ముగ్గురు ఆ ఎనిమిది మంది పారిపోయిరి. మూడు ఏండ్లు బోధ వినుట పారిపోవుటకేనా? ఈలాగున కృప ప్రయాసపడినది అందుకే విచారము. పన్నెండు మది శిష్యులలో తలపతి పేతురు, చివరి స్థితి యూదా, మొదటి వాని మొదలు చివరి వాని వరకు అందరూ తప్పిపోయారు. ప్రత్యేక కృప పేతురు పొందలేదా? తల్లి ఏవిధముగా రొట్టె కుమారుని నోటికందించిచునో అట్లే చివరగా ప్రభువు మిక్కిలి ప్రేమతో రొట్టె అందించి కృపను చూపిన యూదా పోయెను. కృపకు వేదన కాదా? ఊరిలో ప్రధాన యాజకులు, పూజారులు వారి చేతిలో మోషే ధర్మ శాస్త్రము, ప్రవక్తల గ్రంధములు గలవు. అందు ఏది తప్పో, ఏది నిజమో వ్రాయబడియున్నది. ప్రవక్తల గ్రంధాలలో యేసుప్రభువు గురించి, ఆయన చేసే పనిని గురించి వ్రాయబడెను. ఈ రెండు శాస్త్రములుగల ధన్యత గలిగిన మత గురువులు, ప్రభువునకు కోర్టులో అన్యాయపు తీర్పుతీర్చి శిక్షవిధించుట ధర్మమా? అన్యులకు ధర్మశాస్త్రము దేవుడివ్వలేదు. అన్యులకన్న వీరికి ఎక్కువ కృప చూపబడినది కాదా? ప్రత్యేక కృప కాదా? యేసును చూచి ఆనందిచవలసినది గానీ మరణ శిక్ష విధించిరి. కృప ఎంత ప్రయాసపడినది! ముందు ధర్మశాస్త్రము, తరువాత ప్రవక్తల శాస్త్రము ఇవ్వడమనే కృప. ఇప్పుడు కృపా శాస్త్రము అందించుటనే కృప. గనుక కృపకు ఇప్పుడు ఎక్కువ ప్రయాసము. రోమా గవర్నమెంటువారు ప్రభువునకు మరణశిక్ష ఖాయము చేసిరి. ఆ ప్రభుత్వమువారు ఎవరు? దేవుని ప్రేమ దగ్గర ఉన్నవారే. ఈ మత గురువులు దేవుని కృప దగ్గర ఉన్నవారే. వారు, వీరు కూడ క్రీస్తును తృణీకరించినారు. అందువలన కృప ఎంతగా ప్రయాసపడినది! శిష్యులను సంపాదించుటకు, వారికి బోధించుటకు కృప ఎంత ప్రయాసపడినది! మతగురువులకు శాస్త్రములు ఇచ్చుటకు కృపయే ప్రయాసపడినది. ప్రభుత్వము వారికి ఇప్పుడు ఒక మంచి సమయము దొరికినది. ‘ఆ శాంతి పరుని జోలికి పోవద్ద్ ‘ అని ఒక ఆమె చెప్పినది. ఈయన యందు ఏ దోషము కనబడలేదు అని జడ్జిగారు జ్ఞానము చొప్పున గ్రహించిరి. గాని అట్లు చేయక దేవుడిచ్చిన కృపను ప్రేమను వారు తృణీకరించిరి. తుదకు సిలువ మీదనున్న దొంగ కూడ దూషించెను. అతడెప్పుడు దేవుని కృపను చూడలేదు. మరియొక దొంగ కూడ కృప నెరుగడు గాని ప్రభువును మెచ్చుకొన్నాడు గనుక కృప దొరికినది. రెండవ వాని విషయములో కృప యొక్క ప్రయాసము వ్యర్ధమాయెను. దూరమునున్న వారు ‘ఇతరులను రక్షించెను. తన్ను రక్షించుకొనలేడా’? అని దూషించిరి. ఇతరులను రక్షించెనని సంతోషపడ వలసినది గాని దూషించిరి. అప్పుడు కృప ప్రయాసపడెను. నికోదేము ప్రభువు దగ్గరకు వచ్చినాడు. అరిమతయి యోసేపు నీతిమంతుడు, సజ్జనుడని గలదు. యేసుప్రభువు శరీరమును దించి మిగతా కార్యములు వారు చేసిరి. వారంతకుముందు దేవుని కృపను గ్రహించలేదు. ఇప్పుడు వారిద్దరు వచ్చెను. ఆరంభములోనే వచ్చిన కృపకెంత సంతోషము! దేవుడు మనకు ప్రత్యేక కృప చూపించు చున్నాడు. గనుక మనము తప్పిపోతే ఎవరు ప్రయాసపడతారు? కృపయే బాధపడును. మన విషయములో కూడ కృపయే ప్రయాసపడును. ఇంకను కృపను ప్రయాసపడకుండ చేతుము గాక! కృప మీ అందరికి కలిగియున్నది. దానిని క ష్టపెట్టకుందుము గాక! కృప మీకు కలిగియుండునుగాక! మీరు కృపను కలిగి యుందురు. గాక! ప్రభువు మనుష్యులకు కృపనిచ్చారు. ఆ కృపను అంగీకరించిన వారు ప్రభువునకు దొరుకుతారు. అదే కృపకు దొరుకుట. కృప మనిషికి దొరికినట్లు, మనిషి కృపకు దొరుకును గాక! మనమును కృపకు దొరుకుదుము గాక! ఆమెన్.

Please follow and like us:

How can we help?

Leave a Reply