(వాక్యములు: ఆది 18:27; యోబు30:19; 42:6, ఆది 3:19; యోనా 3:5-10)
” ధూళియు, బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించు చున్నాను.” అని అబ్రాహాము దేవునితో అనెను. ధూళి కాళ్ళ క్రిందది, బూడిద పొయ్యి లోనిది, కాల్చివేయబడినది. విశ్వాసి ఆలాగు అనకూడదు గాని అబ్రహాము ‘నా మారుమనస్సు ఎంత! నేనెంత!’ అని తగ్గించుకొన్నాడు. ధూళియు, బూడిదయు, రెండూ భస్మమే. అందుకనే భస్మ బుధవారమను పేరు కలిగినది. అబ్రహాము ఏ రీతిగా తగ్గించుకొన్నాడో ఆలాగు మనమును తగ్గించుకొని ఉపవాసముండి, మన పాపముల నిమిత్తము పశ్చాతాపపడి ప్రార్ధించుట మంచిది. పాపపరిహారము సిలువమీదనే కలిగినది. దీనికి మొదటి మొదటిరోజు భస్మబుధవారము, చివరిరోజు మంచి శుక్రవారము మధ్య రోజులు ధ్యానదినములు. మంచిశుక్రవారమను పేరు ఎందుకు వచ్చినది అనగా ఉపకారము జరిగినది గనుక మంచి శుక్రవారము.
- పాపములున్నవారు పాపములు ఒప్పుకొనవలెను.
- పాపములేనివారు – 2. నీరసస్థితి, 3. మందస్థితి. 4. వెనుకాడేస్థితి మొదలగునవి ఒప్పుకొనవలెను ఇదికూడ లేనివారు – 5.నేను ఎందుకూ పనికిరాను, 6. నీవు సిలువమీద చేసిన పనికి నేను పాత్రుడనుకాను, 7. అయోగ్యుడను అని ఒప్పుకొనవలెను. మన పాపములు, అయోగ్యతలు, నీరస గుణములు ఒప్పుకొన్నందున మోక్షమునకు వారసులము అని అనకూడదు. ఆయన సిలువమ్రాను మీద చేసిన దానిని బట్టియే నాకు మోక్షమని అనవలెను.
స్తుతివరుసలు
- యేసు తండ్రీ! నీకే – స్తుతులు = అన్నిటిలో నీవే – స్తుతి పాత్రుడవు||
- సిలువ మరణము – రానై యుండగ = ప్రార్ధన చేయుటకై – వెళ్ళినావు||
- శ్రమకు ముందు – ప్రార్ధింపవలెను=అను నీ మాదిరి-మా నిమిత్తమే||
- కాబట్టి నీకు – స్తోత్రంలు=మాకు నీ మాదిరి – నేర్పింతువు||
- దుఃఖించుటకు-మొదలు పెట్టితివి=లోక దుస్థితి-జ్ఞప్తికి తెచ్చుకొంటివి||
- చింతాక్రాంతుడవగుటకు ఆ-రంభించితివి=మమ్మును గురించియే-నీకు చింత||
- అందుచేత-నీకే స్తుతులు=నీ కెప్పుడును – మా తలవిబ్రంపె||
- సిలువ బాధ – నీకు ముందె = తెలియుట వల్ల – మనస్సున వేదన|| (ఎంతయో!)
- నర స్వభావముతో – అట్టి వేదన = ఎంతో స -హించుకొంటివి||
- విభ్రాంతి – నొందినావు=నీ ప్రయాసమునకు – నేనే కారణము||
- నీ ఓర్పు – ఎంతో గొప్పది = నీకు నా వం – దనము||
- నిన్ను దుఃఖ – పెట్టి యుంటిమి = నన్ను సంతోష – పెట్టు చున్నావు||
- నా జీవిత – కాలమంతయు = నీకు నా కృత – జ్ఞతలు||
- నీ ప్రాణము – మరణమగునంతగా = దుఃఖముపొం -ది యున్నది||
- నీ దుఃఖము – ప్రేమేంతో = మేము గ్ర -హింపలేము||
- గ్రహింపగలిగిన – పక్షమందు = సహింపలేక న -శించిపోదుము||
- మేము పొంద – వలసిన = వేదన నీవే – పొందితివి||
- స్తోత్రార్పణలు – స్తోత్రార్పణలు = నీకే చెల్లు – చున్నవి. ఆమెన్||
Please follow and like us: