రెండు విషయములు ఈ దినమందు మీ నేత్రములు ఎదుట పెట్టుచున్నాను. క్రిష్టాఫర్ అనే స్వరము ఎక్కడ వ్రాయబడియున్నది? క్రైస్ట్ అనగా క్రీస్తు. ఫర్ అనగా మోయుట కొరకు ఉన్నవాడు. గనుక క్రిష్టాఫర్ అనగా క్రీస్తును మోయువాడు. అది ఒక విషయము. రెండవది క్రీస్తు మనలను మోయువాడు. ఇద్దరూ మోయు వారే. క్రీస్తు మనలను మోస్తే, మనము క్రీస్తును మోయవలెను. అనగా ఇద్దరూ మోయువారే. క్రిష్టాఫర్ కథలో ప్రభువును అతడే ముందు మోసినాడు. క్రీస్తుప్రభువు తనను మోసినాడనే విషయము తెలిసిన తర్వాత ప్రభువును తాను మోసిన తర్వాత క్రీస్తుప్రభువు అతనిని మోసినాడు. అయితే దేవుడు అనగా త్రియేకదేవుడు, మన విషయమై ఇదివరకే కొన్ని పనులు చేసి పెట్టినాడు. ఇప్పుడు కూడా మనకొరకు పనులు చేస్తూనే ఉన్నాడు. గనుక మనము కూడ ఆయన విషయమై కొన్ని పనులు చేయవలెను. ఆయన మనకు సహాయం చేసినాడు గనుక మనము ఆయనకు సహాయము చేయవలెను అని ఈ వేళ పాఠము బోధించుచున్నది. సీమోను సిలువను మోసినాడు గాని, క్రిష్టాఫర్ వలె క్రీస్తును మోయలేదు. అయితే సీమోను ప్రభువు మోసిన సిలువను మోసెను. గనుక దాని అర్ధమేమిటంటే ప్రభువునకు సహాయము చేసెను. సీమోను క్రీస్తుయొక్క సిలువను మోసినాడు సీమోను కురేనీయుల దేశస్థుడు. ఈ కురేనీయుల దేశము ఐగుప్తులో ఉన్నది. అచ్చట నుండి యెరూషలేము ఎందుకు వచ్చెనో తెలియదు. అచ్చట గోల జరుగుచున్నది. ఆ గోలను చూచుటకు పోతే ప్రభువు సిలువను మోయు ధన్యత వచ్చినది.
బైబిలులో నలుగురు సీమోనులు ఉన్నారు. వారికి 4 పనులున్నవి. మొదటి సీమోనుకు క్రైస్తవ సంఘ స్థాపన ధన్యత దొరికినది. రెండవ సీమోనుకు సీమోనుకు యేసుప్రభువునకు విందు చేయు ధన్యత వచ్చెను. మూడవ సీమోనుకు యేసుప్రభువు సిలువను మోయు ధన్యత వచ్చెను. నాల్గవ సీమోనుకు, మొదటి సీమోనుకు వలె పరిచర్య చేసే ధన్యత వచ్చెను. దేవుడు సృష్టించేకర్త. అందువలన మనము కూడా సృష్టించే వారమై యుండవలెను. సూర్యుని, ఆకాశమును, భూమిని దేవుడు సృష్టించెను. రైళ్ళను, స్టీమర్లను, విమానములను సృష్టించలేదు. ఇవన్నీ మనిషి సృష్టించెను. గనుక దేవుని ఏర్పాటు ప్రకారముగా మానవుడు కూడ సృష్టికర్తయైయున్నాడు. గనుక దేవుని ఏర్పాటు ప్రకారముగా మానవుడు కూడ సృష్టికర్తయైనాడు. గనుక ఈ మనిషి దేవునికి సహాయకారియైనాడు. గనుక మనము దేవునికి ఏ విషయములలో సహాయకారులుగా ఉన్నామో, ఆ విషయములలో ఆయన మన పోషకుడైయున్నాడు. దేవుడు మనలను పోషిస్తున్నప్పుడు మనము పేదలను, పక్షులను, పశువులను పోషించాలి. దేవుడు మనకిచ్చిన బిడ్డలను పోషించుచున్నాడు. గనుక ఈ విషయములో మనము బాధ్యులమై యుండిన యెడల, వారి పోషణ విషయములో దేవునికి సహాయకులమై యుండగలము. సృష్టిలో కూడా మనము పోషకులమై యున్నాము. దేవుడు పోషణకర్త మాత్రమే కాకుండా దానకర్తయై యున్నాడు. ఆరోగ్యము, జ్ఞానము మొదలగు వరములిస్తున్నాడు. ఇచ్చుట దేవునిలో యున్నది గన్ మనము ఆయనకు తోడుగా ఉండవలెను. భూదిగంతముల వరకు సాక్షులై యుండండి అన్నారు. గనుక మనము కూడా ఆయనకు ఇవ్వవలెను. ఆదివారము దేవాలయములో కానుక ఇవ్వవలెను. దశమ భాగము కూడ ఇవ్వవలెను. దేవుడు మనకు ఇచ్చుచున్నాడు గనుక మనము కూడా ఆయనకు సహాయకారులమై యుండవలెను. మనము కష్టస్థితులలో నున్నప్పుడు దేవుడు మనలను ఆదరించువాడై యున్నాడు గనుక మనము కష్టస్థితులలో ఉన్నవారిని ఆదరించిన యెడల దేవునిని ఆదరించినట్టే. ఉదా: ఈ చిన్నవారిలో ఒకరికిస్తే, నాకిచ్చినట్లే అని ప్రభువు చెప్పినాడు. దేవుడు ఆయనకున్నవన్నీ మనకు ఇచ్చేవాడు గనుక ఆ ఇచ్చే విషయంలో మనము ఆయనకు తోడుగా ఉండవలెను. భూదిగంతముల వరకు సాక్షులై యుండండి అన్నారు. మనము మంచిపని చేస్తే దేవుని ఎదుట, దేవదూతల ఎదుట ఆయన సాక్ష్యము చెపుతాడు. ప్రభువు అక్కడ సాక్ష్యమిచ్చును గనుక మనలను గూర్చి ఆయన చెప్పినపుడు ఆయనను గూర్చి మనము చెప్పవలెను. సీమోను ప్రభువునకు ఉపకారముగా సహాయము చేసెను. ప్రభువు మోసిన సిలువను మోసినాడు. ప్రభువు మనలను గూర్చి శ్రమపడునపుడు మమ్మును గూర్చి ఎందుకయ్యా! నీకింత ప్రేమ అని చెప్పు భక్తులున్నారు. వారిలో మొదటివారు హతసాక్షులు. గనుక ఈ హతసాక్షులు ప్రభువు కొరకు ప్రాణత్యాగము చేశారు. మేము ఆయన కొరకే అంతమయ్యెదమని వారు శ్రమలకు ఎదురెక్కివెళ్ళారు. ఆలాగు అంతమయిన వారికి పరలోకంలో గొప్ప కిరీటములున్నవి.
లోకములో మనము పుట్టింది మొదలు ఈ నిమిషము వరకు ఎన్ని కష్టాలొచ్చినా అవన్నీ ఒక గుంపుగా చేర్చండి. మనకు పేదరికము, ఇబ్బంది, జబ్బులు రాలేదా? క్రీస్తు నామధారులైనందుకు అవమానములు రాలేదా? అలాగే క్రీస్తుప్రభువునకు 30 సంవత్సరములలోనే శ్రమలు ఎన్ని వచ్చినా ఆయన భరించలేదా? ఆయన మన కొరకు భరించినాడు. గనుక మనమును ఆయన శ్రమలు భరించువారమై యుండవలెను. స్నేహితులవల్ల, శత్రువుల వలన, అధికారుల వలన, కుటుంబములో ఉన్నవారివలన వివిధ రకముల శ్రమలు రానివ్వండి. ఏవైనా శ్రమలే. 10 రకాల శ్రమలు ఉన్నవనుకొనండి. ఈ 10 రకాల శ్రమలను గురించి ఎన్నిసార్లు సహించినామో, లేక ఎన్నిసార్లు విసుగుకొన్నామో మీరే లెక్క పెట్టండి. విసుగుకొన్న సంఖ్యయే ఎక్కువగును. అలాగైతే ప్రభువు మనకు సహాయకారియైయుండరు. ఆయన దేవుడుగానే వచ్చి సహించలేదు. మనిషిగా వచ్చి సహించెను. ఎప్పుడైతే శ్రమలు సహిస్తామో అప్పుడు దేవునికి సంతోషము. చిరునవ్వు ఆదరణ, ఇది కుటుంబీకులకు చాలా బాగా అనుభవము. అనేక దృష్టాంతములున్నవి. చిన్నపిల్లలు చెట్టుక్రింద ఆటలాడుటకు వెళ్ళి, చిన్న పుల్లలలు తెచ్చి కట్టలు కట్టి తల్లికే తెచ్చి ఇచ్చును. అప్పుడు తల్లికి సంతోషము. మన సిలువ వేరు. ప్రభువు సిలువ వేరు. మన సిలువంటే అజాగ్రత్తగా పనిచేసి పది దెబ్బలు తెచ్చుకొనుట. ఇవన్ని మన సిలువలు. ఒకానొకప్పుడు మనమీద ఆయన తన సిలువ నెత్తును. ఆ సిలువను ఏ రీతిగా ఎత్తునో మనకు తెలియదు. బాధపడేటప్పుడు సిలువ నెత్తును. ఆ సిలువను ఏ రీతిగా ఎత్తునో మనకు తెలియదు. బాధ పడేటప్పుడు సహించేటప్పుడు అది ఏ సిలువ అయినది మనకు తెలియదు. ఒకానొకప్పుడు బేధము వచ్చును. ఒకానొకప్పుడు ప్రభువే వచ్చును. ఏదో ఒక శ్రమ వచ్చినా మనము సహించుకొంటే ఆ సిలువను మనము మోసినట్ట్లే. సన్నిధిలో సీమోనును పిలచి ఆయన కథను అడగండి. సువార్తికుని, నన్ను పిలవండి మేముకూడ చెప్తాము. గనుక మన సిలువలు మోయుటలో గొప్పలేదు గాని ప్రభువు సిలువను మోయుటలో గొప్పయున్నది. మహిమే యున్నది. ఆ మహిమను గురించి సంతోషముతో చెప్పవచ్చును. గాని శ్రమలను గూర్చి చెప్పుట కష్టము. ఒకానొక భక్తుని మాట. ప్రభువా! ఇన్ని శ్రమలైతే మేమెట్లు సహింతుము. సిలువను మోయలేము. తీసివేయమంటారు. దేవుడు ప్రతివారికి సిలువ ఇస్తాడు. ఆ సిలువను ప్రతి వారూ మోయవలెను. అయ్యగారి సిలువ మరెవరికైనా ఉందా? అని చూస్తున్నారు. ఎవ్వరికి ఉన్నట్లు కనబడుటలేదు. ఇవ్వవలెనని ఆయన కోరుచున్నారు. సిలువకు తగిన మహిమ కావలెను. కొందరు సిలువక్కర్లేదంటారు. ప్రభువు మోయమంటారు. ప్రభువు ఇలా అంటారు. “నీవు సహించ గలిగిన దానికన్నా ఎక్కువ నేను పెట్టలేదు.” మేము సహించలేమంటారు కొందరు. అప్పుడు ప్రభువు నీవు మోస్తావని చెప్తారు. ఈ పాయింటు, సీమోను మీద శత్రువులు బలవంతముగానే పెట్టివేసినారు. ఆలాగుననే మనకు బలవంతముగా సిలువ వచ్చుచున్నది. 30 సంవత్సరాల క్రిందట అన్ని పేపర్లలో సిలువను గురించి వేసినారు. ఎవరికో దర్శనములో ప్రభువు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలువ వచ్చినట్లు చూపించారు. ఆ పేపర్లలో వేసిన సంగతి మిషనెరీ గారు గుడిలోనే చెప్పినారు. వారిని సిలువ వేస్తే, ప్రక్కవారి సిలువను చూచి ఆ సిలువ బాగుంది అదివ్వమంటారు. అప్పుడు ప్రభువు వారిది వీరికి మార్చలేము. మోయ వలసినది అదే అంటారు. అలాగుననే సీమోనుకుకాడివేసినారు. ఈ రోజు వర్తమానము ‘మీరందరు సిలువ మోయవలెను.” క్రైస్తవులందరు ఒక్కొక్క సిలువను గూర్చి నేర్చుకొనవలెను. సాతాను సిలువను చూచి పారిపోయెను. అలాగే మన సిలువను గూర్చి నేర్చుకొనవలెను. సాతాను సిలువను చూచి పారిపోయెను. అలాగే మన సిలువను చూచి వాడు, వాడి దూతలు పారిపోవలెను. దేవుడు మిమ్మునందరిని దీవించి మీ నొసటి మీద సిలువ ముద్ర వేయును గాక. ఆమేన్.