(రెండు సిలువలు, రెండు సిం హాసనములు)
సిలువ ధ్యానపరులారా, మీకు శ్రమ నివారణ కలుగును గాక.
1. మీరు పాపస్థితిలో ఉన్నప్పుడు, మీ స్వంత సిం హాసనము మీద మీరే ఉన్నట్టు.
2. మీరు సిం హాసనము మీద ఉన్నప్పుడు క్రీస్తుప్రభువు సిలువమీద ఉన్నట్టు.
3. మీరు మారుమనస్సు పొందినప్పుడు మీరు సిలువ మీద ఉన్నట్టు.
4. అప్పుడు యేసుప్రభువు సిం హాసనముమీద ఉన్నట్టు.
మీరు పాపస్థితిలో ఉన్నప్పుడు మీరు చాలా సంతోషముగా ఉందురు. అది మీ సంతోషపు గద్దె, మీరు పాపము ఒప్పుకొనరు. గనుక గద్దె దిగరు. అప్పుడు ఆయనకు విచారాము. గనుక మీరు ఆయన ఎదుట మీ పాపస్థితిని ఒప్పుకొని, మారుమనస్సు పొంది, మీ పాపములను సిలువకు అంటగొట్టినట్లయిన అప్పుడు ప్రభువునకు సంతోషము, గనుక ఆయన సంతోషపు గద్దెమీద ఉండును. గనుక నేడు మిమ్మును మీరు పరిశీలన చేసికొని, మీరు సిలువ మీద ఉన్నారా? లేక సిం హాసనము మీద ఉన్నారా? లేక యేసుప్రభువును సిలువ ఎక్కించినారా లేక సిం హాసనము ఎక్కించినారో? తెలిసికొనగలరు. (హెబ్రీ 6:4a)
క్రైస్తవుడు, క్రీస్తు శ్రమల దుర్భిణిలోనుండి తన శ్రమలు చూచినయెడల పునరుత్థాన బలము, జయము, రూపము కనబడును. తన మనస్సులోనికి గొప్ప ఆదరణ ప్రవేశించును. విశ్వాసము గంతులు వేయును. శ్రమల యెడల నిర్లక్ష్యభావము కలుగును. ఈ మంచి శుక్రవారపు దీవెన మీకు అందును గాక. ఆమెన్.