బైబిలు పాఠములు: యెషయా 53:4-5; లూకా 23:33-49; 1పేతురు 2:21-24.
ప్రవేశ ధ్యాన ప్రార్ధన: సిలువమీద బాధపడిన యేసుప్ర్భువా! నా నిమిత్తము బాధపడిన ప్రభువా! మేము, న్ పడిన బాధను తలంచుకొని, కృతజ్ఞత చూపించుటకై మాలో ప్రతివానికి నీ దూతలను కావలియుంచుము. మాలో ప్రతివామికి నీ వర్తమానము అందించుము. ఆమేన్.
బైబిలంతటిలో ఉన్న శ్రమ చరిత్ర అంశములన్నిటి మధ్యనున్న చిన్న అంశములను గూర్చి వివరించుకొందము. శ్రమ చరిత్రలో అనేక అంశములు, కథలు, పంక్తులు ఉన్నవి. అవన్ని ఉదయమునుండి సాయంత్రము వరకు ఉపవాస ప్రార్ధనగా ఏర్పర్చుకొని ధ్యానించుట మంచిది. ప్రభువు యొక్క శ్రమ పంక్తి: (1పేతురు 2:21) “క్రీస్తు కూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడల యందు నడచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” యేసు ప్రభువు బాధ పడెను. మిమ్ములనెవరైనా ఇ వేళ ఏమి ప్రసంగమని అడిగితే ‘క్రీస్తు ప్రభువు మా కొరకు బాధపడెను ‘ అని ఇదే ముమ్మారు చెప్పండి.(ప్రభువునకు బాధ) అనుదాని వివరములో మూడు ప్రశ్నలున్నవి. (1) ఏమి బాధ? (2) ఎక్కడ బాధ? (3) ఎందు నిమిత్తమై బాధ పడెను? ఉదా: ఎవరైన అనారోగ్యపరులు మంచము మీద పడి మూలుగుచుంటే, ఎందుకు అని అడిగితే గుండెకు దెబ్బ తగిలినది, బాధగా నున్నది అని చెప్పును. అలాగే క్రీస్తు బాధ పడెను. ఇది పేతురు వ్రాసిన వ్రాత వల్ల బయలు పడెను. యెషయా 53:4,5 వచనములలో ఏమి ఉన్నదనగా (1) ప్రభువు మన పాపములను తన మీద వేసికొనెను.(2) ప్రభువు మన వ్యాధులను తనమీద వేసికొనెను(3) ప్రభువు మన శిక్షలను తన మీద వేసికొనెను. గాన క్రీస్తుప్రభువు బాధపడవలసి వచ్చెను. పైనున్న మూడు భారములు తనమీద వేసికొనకపోతే ఆయనకు బాధ ఉండదు. అవి మనకు లేకుండ చేయుటకు, ఆయన బాధపడి వాటిని వహించి, సహించి, జయించెను. పాపము, వ్యాధి, శిక్ష మనకున్నందున వ్యసనము. ఈ మూడు లేకపోతే మనకు వ్యసనము లేదు, క్రీస్తుప్రభువుకు బాధ లేదు. పై మూడింటిని బట్టి నరులు వ్యసనపడుచున్నందు వల్ల, మనిషి మీదనున్నవి తన మీద వేసికొన్నందు వలన ఆయన బాధపడెను.
ఒక మిషనెరీ ఒకప్పుడొక మాట పలికెను. క్రిష్ట్మస్ ప్రసంగము చేయుటకు, పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చి ప్రసంగము చేయుతకు పులి పీఠ మెక్కుదును గాని మంచి శుక్రవార ప్రసంగము చేయుమంటే నేను చేయలేను, చేయను, నన్ను అడుగకూడదు, నాకు రాదు అనెను. ఎందుకనగా ప్రభువెంత బాధ పడెనో ఎవరికి తెలియును? సువార్తికులైనను అంతా చెప్పలేకపోయిరి. వ్రాయలేక పోయిరి. వ్రాయుటకు కలము నడువలేదు. ఆయన బాధ అంత గొప్పదిమూడు ప్రశ్నలు: ఏమి, ఎక్కడ, ఎందు నిమిత్తమై బాధపడెను. ఒక్కొక్కటి వివరించుటకు సమయము చాలదు.
1. ఎక్కువ బాధ: యెరూషలేము పట్టణము వెలుపల గెత్సెమనే తోటలో (1) ఒక రాత్రి ప్రార్ధన చేయునప్పుడు, రక్తము చెమటగా మారునంత బాధపడెను. (2) కౄరులు ఆయన భుజము మీద భారమైన సిలువకొయ్యను పెట్టి, కల్వరి గిరి వరకు మోయించ్చు, దెబ్బలు కొట్టుటవలన బాధపడెను. (3) ఎప్పుడూ బరువులు మోయలేని సుకుమారుడైనందున, భారమైన సిలువ మోయలేనందున బాధపడెను. ఆ భారమైన సిలువ భుజముమీద పెట్టుకొని మోయునప్పుడు భుజము మాచనివ్వరు, నిలువబడనివ్వరు, కూర్చుండనివ్వరు. యెషయా 9:6 లో ఆయన భుజము మీద రాజ్యభారముండును అని ఉన్నది, గాని ఇక్కడ ఆయన భుజము మీద సిలువ భారము అనగా పాపభారము, వ్యాధి భారము, శిక్షభారము నున్నది గాన ఆయనకు భుజము బాధగా నున్నది.
(2) మత్తయి 27;26 లో కొరడాలు తీసికొని ఆయనను కొట్టిరి. అని వ్రాయబడినది. కొరడా పొడవుగాను, చివర గుజ్జుగాను త్రాళ్ళు కట్టి యుండును. చివర, గాలపు ముండ్లు వంటివి కూడ ఉండును. పై త్రాళ్ళ దెబ్బమాత్రమేగాక ఇనుప ముండ్ల దెబ్బలు కూడ తగులును. ప్రభువు శరీరమునకు ఈ దెబ్బలు వలన మొదటగా గాయములను, వీపు మీద నుండి రక్తమును కారుచుండెను. తుడిచేవారు, దూదితో అద్దేవారు, కడిగేవారు ఒక్కరూ లేరు. ఇదే ఎక్కువ బాధ. వీపు మీద బాధ, మరింత బాధ. ఎక్కడ బాధ? వీపు మీద భుజముల మీద బాధ., ఎందుకు బాధ? కొరడాలతో కొట్టినందున బాధ. ఎందునిమిత్తమై బాధపడెను? మీ నిమిత్తమై బాధపడెను. 1పేతురు 2:21లో నీవు ప్రధాన యాజకునికి అటువంటి జవాబు యిస్తావా! అని బంట్రోతులలో ఒకడు అరచేతితో యేసుప్రభువు చెంపమీద కొట్టెను. ఏమి జవాబు ఇచ్చెను? సమాజ మందిరములో నేను వారి కేమి చెప్పినది విన్నవారిని అడుగుము. ఇదిగో వారు ఇక్కడనే ఉన్నారని చెప్పెను. ఇది వారిని ఎదిరించినట్లుగా భావించి కొట్టిరి. ఇది చెంప మీద బాధ: ఇది ఎవరి నిమిత్తమైన బాధ? మీ కొరకైన బాధయే కదా.
(4) మత్తయి 26:67 లో “ఆయనను గుద్దిరి” అని ఉన్నది. లోక రక్షకుని గుద్దవచ్చునా? వారి ఇష్టము వచ్చినట్లు ఎక్కడ బడితే అక్కడ ఆయనను గుద్దిరి. గనుక బాధ.
(5) ఆయన ముందు సిలువను పండబెట్టి, దానిపై ఆయనను పరుండబెట్టి, 5స్థలములలో మేకులు కొట్టిరి. అప్పుడు రక్తము ధారగా చిందెను. అయినను కొట్టిన వారికి జాలి కలుగలేదు. పాదములలో, చేతులలో బాధ. మన నిమిత్తమై మేకులు కొట్టినందున బాధ. నా నిమిత్తమై ఆయనకు బాధ ఎక్కువగు చుండెను. రాను రాను శ్రమ ఎక్కువగు చున్నది. నరుడు 100సంవత్సరములు బ్రతికితే పాపాలు ఎక్కువగును. శిక్షలు ఎక్కువగును. గాన ప్రభువునకు బాధలు ఎక్కువైనవి.
(6) తలపై ముండ్లకిరీటము పెట్టి అదిమిరి. అందువలన తలలో బాధ ఎక్కువైనది. ముండ్లకిరీటము పెట్టినందున మన నిమిత్తమైన బాధ తలలో కలిగెను.
(7) బల్లెముతో ప్రక్కలో పొడిచినందున బాధ కలిగెను.
(8) ఎండకాయుచుండగా గాయములు పెద్దవగుట వలన బాధ కలిగెను. (1థెస్స 5:10) మనలను జీవింపచేయుటకు ఆయన మృతి పొందెను. నా కొరకు చనిపోయెను. తన కోసమై చనిపోలేదు గాని మన మన కోసమై చనిపోయెను, బెత్లెహేములో పుట్టినప్పుడు గొల్లలు, దూతలు, దూతలు, సుమెయోను, అన్న దర్శించి, ఎవరి మహిమను చూచెనో ఆయనే ఈ వేళ చనిపోయినాడు. హేరోదు తన సైన్యము ద్వారా కత్తితో చంపించ ప్రయత్నించినప్పుడు తప్పించుకొనిన ఆయన ఈవేళచనిపోయెను. ‘యూదులకు రాజు ‘ అన్ని వ్రాయబడిన ఆయనే ఈ వేళ చనిపోవడము అర్ధము కావడము లేదు. ఎవరైతే యొర్ధాను నదిలో బాప్తిస్మము పొందినప్పుడు, పరిశుద్ధాత్మ పావురాకారముగా మీదకు వచ్చెనో, ఆయనే ఈ దినమున చనిపోయెను. బాప్తీస్మ కాలమందు “ఈయనే నా ప్రియ కుమారుడు” అని తండ్రి వలన ఎవరైతే బిరుదు పొందెనో ఆయనే చనిపోయెను. కొండమీద ప్రసంగములో నేను లోకానికి వెలుగైయున్నానని చెప్పిన ఆయనే ఇప్పుడు ప్రాణము విడిచెను. ప్రాణదీపము, లోకదీపము చనిపోతే వేరుగావేరుగా ఎట్లుండగలరు? గ్రామాదులు సంచరించి, రోగులను ప్రభావము చేత బాగు చేసిన ఆయన ఈవేళ చనిపోవడము ఆశ్చర్యముగానున్నది. బేతనియలో, సమాధిలో ఉన్న లాజరును, ఇంటిలో యాయీరు కుమార్తెను, దారిలో విధవరాలి కుమారుని బ్రతికించిన ఆయన ఈ వేళ ఎట్లు చనిపోయినాడో మన జ్ఞానమునకు అందదు. గెత్సెమనే తోటలో తనను బంధించి తీసికొని వెళ్ళుటకు వచ్చిన గుంపు, ఆయనను చూడగానే నేలపడిపోయిరి. పడిపోయిన ఆ గుంపును ప్రభువు లేవనెత్తగా, వారే ఆయనను చంపిరి. కల్వరిగిరి దగ్గర వారు ఎందుకు పడిపోలేదు? ఇది ఏలాగు జరిగినదో మన జ్ఞానానికి అందుటలేదు. నేను దేవుని కుమారుడను, మెస్సీయాను అని సాక్ష్యమిచ్చిన ఆయన ఎట్లు చావగలడు? క్రీస్తు, రక్షకుడు, మెస్సియా ఎట్లు చనిపోగలడు? ఇది చాలా ఆశ్చర్యముగా నున్నది. మన కొరకు చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడంటే మన పాపములు, మన వ్యాధులు, మన శిక్షలు ఆయన మీద వేసికొని మనకు లేకుండ చేయుటకు, రక్షణ దయచేయుటకు, మోక్షమునకు తీసికొని వెళ్ళుటకు చనిపోయెను. ఇంకా ఎందుకనగా మనకొరకు బ్రతకడానికి, లేవడానికి చనిపోయెను. మనము రాత్రులు పండుకొని ఉదయమునే లేచినట్లు, మూడు దినములు సమాధిలో పండుకొని తరువాత పునరుత్థానుడై తిరిగి లేచెను. మనలను నరకమను రెండవ మరణము నుండి తప్పించుటకు మన కొరకు మరణము పొందెను. మనము పొందవలసిన మరణమును, పరలోకమునకు వెళ్ళే మార్గముగా మార్చుటకు ఆయన మృతి పొందెను. తన మరణము ద్వారా, రాకడ విశ్వాసులందరు మరణము లేకుండ, ఆరోహణము కావడానికి ఆయన మరణము పొందెను. ‘ఓ మరణమా! నీ ముల్లెక్కడ? ఓ మరణమా! నీ విజయమెక్కడ? అను వాక్యము యొక్క బలమును కనబర్చుటకు చనిపోయెను. ప్రభువు తన బాధలలో కనబర్చిన సహనము, ఆయన పొందిన విజయము చదువరులందరకు కలుగునుగాక. ఆమెన్.