క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. మట్టలాదివారము...
  5. మట్టలాదివారము 4

మట్టలాదివారము 4

దా. కీర్త, 93 అధ్యా; మత్తయి 21:1-10; కొలస్సి. 1:15.

అనేక సంఘములలో ఈ పండుగ ఆచరింతురు. ప్రభువు జయోత్సవముతో యెరూషలేములో ప్రవేశించుటను గూర్చి నేడు గుడులను అలంకరింతురు. కొన్ని సంఘములలో నిర్ధారణ ఇచ్చెదరు పిల్లలను స్థిరపరిచెదరు. మొదటి సారి ప్రభు భోజన ఇచ్చెదరు. అది యొక పండుగ. ఈ మట్టలాదివార దినమున కొమ్మలు ఆకులతో పండుగ చేయుదురు. ఈ రోజు పై పాఠములను ధ్యానించెదరు. ఇది పండుగే. ఈ పాఠము అనేకసార్లు విందురు. కొద్ది భేదములతో సువార్తికులు వీటిని వ్రాసిరి.

ఈ దినపు పాఠములో యేసుప్రభువు అలసియున్నారు. సిరియా నుండి వచ్చి యెరికో దాటి, బేతనియకు వెళ్ళి, అక్కడనుండి ఆయన దేవుని రాజ్యవిషయములు బోధించిరి. జయోత్సాహముతో యెరూషలేమునకు నడిచివెళ్ళిరి. శిష్యులకు ఈ చరిత్ర మాత్రమే తెలియును గాని దాని భావము వీరికి తెలియదు. రెండు గాడిదలు : ఈ కథ చాల సార్లు విన్నారు. నేర్చుకొన్నారు. ఈ వేళ పాఠము అదే గనుక మరల ధ్యానించుదము. ప్రభువునకు మిక్కుటమైన శ్రమచరిత్ర ఆరంభమైన క్రమము: సోమ, మంగళ, బుధ, గురు వారములలో ఆయనకు శ్రమ అధికమై, శుక్రవారము నాటికి పరిపూర్ణమైనది. శనివారము సమాధి, ఆదివారము ఆయన లేచుట జరిగెను. ఈ ఆదివారము పండుగ, రేపు ఆదివారము కూడా పండుగే. ఈ రెండు ఆదివారములకు మధ్య ఉన్న ఈ రోజులను శ్రమలోయ అని అనవచ్చును. రెండు సంగతులు జ్ఞాపకము చేయుదును. ఈ జయోత్సవము రెండు గార్ధభములు కట్టబడిన స్థలము మొదలుకొని, యెరూషలేము పట్టణము వరకు సాగి వెళ్ళినది. ప్రభువు ఒకప్పుడు ఇలా అన్నారు ‘ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున సమావేశమయిన అక్కడ నేను వారి మధ్య ఉన్నాను ‘. ఆ ఇద్దరితో కొత్త నిబంధన ఆరంభమైనది. అనగా పేతురు, యోహాను అను ఇద్దరి నుండి ప్రారంభమై యెరూషలేము వరకు సాగినది. అందుకే ఈ రోజు అంతా పండుగే. రేపటి నుండి శ్రమ. దారిలో బట్టలు పరచుట పండుగే. శిష్యులు గార్ధభము కొరకు వెళ్ళుట శుభవార్తే. గాడిదను యజమాని ఆటంకపరచలేదు. ఆయన ఎక్కెను. పిల్లలు పాటలు పాడిరి. ప్రజలు ఎదిర్కొనుటకు వెళ్ళిరి. ఇవన్నీ శుభవార్తలే.

పై బట్టలకు క్రింది బట్టలకు మధ్య,పై కొమ్మలకు క్రింది కొమ్మలకు మధ్య, పై మట్టలకు క్రింది మట్టలకు మధ్య, ఆ గ్రామమునకు ఈ గ్రామమునకు మధ్య, ఆ గాడిదకు, ఈ గాడిదకు మధ్య, పరిసయ్యులకు శాస్త్రులకు మధ్య, పని పిల్లలకు చిన్న పిల్లలకు మధ్య, పెద్దవారికి చిన్నవారికి చిన్న వారికి మధ్య, ముందు నడచు సమూహమునకు వెనుక వచ్చు సమూహమునకు మధ్య జరిగిన కథ అంతా శుభమే. అంతా కథ అంతా శుభమే. అంతా కథగానే జరిగినది. ఇది చూచిన వారు ధన్యులు. ఈ వర్తమానము పొందినవారు కూడా ధన్యులే.

దాని ముందోక కథ జరిగినది. అదే సిరియా నుండి బేతనియ వరకు, యెరూషలేము వరకు జరిగిన కథ. ఈ మట్టలాదివార పండుగ ఈ ఆదివారము వరకే పండుగ. తరువాత శ్రమ లోయ దాటవలెను. తరువాత మరి యొక పండుగ. ఇది అంతా ఆయనకు ముందే తెలియును. విప్పితే ఊరుకొన్నారు ఒకరు (యజమాని); విప్పితే ఊరుకొన్నారు ఇద్దరు (గాడిదలు); పండుగంతా అయిన తరువాత మూలుక్కున్నారు పరిసయ్యులు, శాస్త్రులు. మన క్రైస్తవ జీవితం కూడ అలాగే ఉంటుంది. ఇంకొక, ముందు కథ, సీమోను కుమారీ! యెరూషలేము వాసులారా! నీ (మీ) రాజు గార్ధభాసీనుడై వచ్చును. (జెకర్యా 9:9), ఏడు, ఎనిమిది వందల సం||ల క్రితము ప్రవచన చరిత్ర, ప్రభువు కాలంలో వృత్తాంత చరిత్ర, మన కాలములో ఇది అనుభవ చరిత్ర. ఈ మూడు చరిత్రలు బైబిలంతటిలో గలవు. ఈ ప్రవచిన చరిత్ర, మరియు జరిగిన చరిత్రలు మన అనుభవములో లేకపోతే ఏమిలాభము? అట్లయిన ప్రభువు చెప్పినట్లు మనము చేసినాము అని అనుట అసంభవము. గాడిదను విప్పిన ఊరుకొన్నారు. బట్టలు పరచినారు. వాటిని పైన, క్రింద పరచినారు, అపుడు కూడా ఊరుకొన్నారు. అది శిష్యులకు మరియు బాలురకు గాని విశ్వాసులకు అట్టి ఆనందానుభవమే లేకపోతే ఏమి లాభము! గనుక అట్టి అనుభవము విశ్వాసులకు తప్పక కావలయును.

1. పేతురు యోహానులు ప్రభువు చెప్పగానే చేసిరి. మనమును అట్లు చెప్పగానే చేస్తే అట్టి అనుభవము మనకును కలుగును. అట్లు చేస్తే, అది నిజ అనుభవము.

2. ‘వారు తమ బట్టలు పరచి నిన్ను గౌరవపరచిరి. అట్లే మేమును నిన్ను గౌరవపరచునట్లు, అట్టి బుద్ధి మాకు దయచేయుమనుట ‘ విధేయుల లక్షణము.

3. ప్రభువు కొరకు గాడనడుగగా యజమానుడు లోబడి ఇచ్చెను. నీవును నీ ప్రభువునకు కావలసిన ఆస్థి, బలము మొదలైనవి ఇవ్వగలవా? అట్టి సమయము వచ్చినపుడు అట్టి దాన గుణము నీకున్నదా? ప్రభువా! మాకో, అని అంటే అది దానగుణము కాదు. గాడిదను తోలుకొని వెళ్ళేటప్పుడు, ఎప్పుడు తోలుకొస్తావు అని యజమానుడు అన్నాడా! అట్లే మనము ఆయనకు ఇచ్చినది తిరిగి కోరకూడదు. ఆయన మరి యొక రీతిగా ఇస్తే ఇచ్చును. అట్లు చెప్పి చందా ఇస్తే, ఇచ్చినది మరలా ఆశించే విశ్వాసి ఈ గుంపులో ఉండునా?

  1. విశ్వాసానందము 2. గౌరవానందము 3. (ఇచ్చే) దానానందము.

అన్నిటికన్న ప్రభువు దృష్టిలో వారు చెడ్డ పిల్లలైరి.

ప్రభువును స్తుతించినందున వారికి చెడ్డ పిల్లలైరి. ప్రభువు పరిసయ్యులను, శాస్త్రులను మెచ్చుకొనలేదు గాని, స్తుతించిన పిల్లలను మెచ్చుకొనెను. ప్రభువు పరిసయ్యుల హృదయములను, పిల్లల హృదయములను చదువగలిగెను. ఆ పిల్లల వలె స్తుతించువారు ఈ గుంపులో ఉనారా? పిల్లలారా! మీరు ఎక్కడ నేర్చుకొన్నారు అని అడిగినాను. శాస్త్రులు నేర్చుకొననిది పిల్లలకు ఎట్లు వచ్చినది? పెద్దవారికి రాని స్తుతి చిన్నపిల్లలకు వచ్చినది. స్తుతి పాటలు పాడే పిల్లలే, పరిసయ్యులకు పాడు పిల్లలైరి. 1. దావీదు కుమారునికి జయము 2. హోసన్నా 3. హల్లెలూయ అని పిల్లలు స్తుతి పాటలు పాడారు. 1. రాజుకు జయము, పరలోకంలో జయము. భూలోకంలో జయము, మొత్తానికి ఆ లోకాన్ని, ఈ లోకాన్ని కలిపి స్తుతిలో అల్లివేసినారు. లూకా 2:14 లో దూతలవంటి అల్లిక స్తుతి, ఈ పిల్లలల్లినారు. గనుక ఈ చిన్నపిల్లలు వలె అటువంటి గానానంద అనుభవము మరియు జయానంద అనుభవము గల విశ్వాసులు ఇక్కడ ఉన్నారా? పేతురు, యోహానుల వలె విధేయతానందానుభవము మరియు గౌరవానంద అనుభవము గల విశ్వాసులు ఇక్కడ ఉన్నారా? ఆ యజమానుని వలె కానుకానందముగల విశ్వాసులున్నారా? ఇట్టి ఆనందానుభవములు ఉండవలెను గాని ఇంటివద్ద కుక్క అన్నము తింటున్నదేమో! తలుపు సరిగా వేసెనో లేదో, మొదలగు తలంపులు ఎందుకిక్కడ? యేసుప్రభువు వెళ్తూ ఉంటే ఒక సమూహము ముందు మరియొకటి వెనుక ఉండగా, మధ్యవర్తియైన ప్రభువు మధ్యను నిలబడెను. అనగా ప్రభువు అన్ని రీతులలో మధ్యనే ఉన్నారు. గనుక ఈయనకు మధ్యవర్తి ఆనందము. ఆ తెగకు, ఈ తెగకు రెండు సమూహములకు మధ్యనున్నారు. ఒక సమూహమును ముందు నడువ నిచ్చెను. మరియొక సమూహమును వెనుక రానిచ్చెను. ముందు వెళ్ళినవారు అనగా విశ్వాసులు కొంతమంది పరదైసులో ఉన్నారు. మనము ఇక్కడే ఉన్నాము. ప్రభువు మధ్యన ఉన్నారు. అనగా వెళ్ళిన విశ్వాసులకును, భూమి మీదనున్న విశ్వాసులకును; రక్షింపబడిన సమూహమునకును, తయారగు చున్న సమూహమునకును మధ్య ఆయన ఉన్నారు. రక్షింపబడిన వారికి, రక్షింపబడని వారికి మధ్య ప్రభువు ఉండి కనిపెట్టుచున్నారు. అందరు అనగా ముందును వెనుకను ఉన్నవారు. యెరూషలేము వెళ్ళినారు. అట్లే ముందు వెళ్ళిన పెండ్లి కుమార్తె విశ్వాసులు, ఇప్పుడిక్కడ ఉన్న పెండ్లికుమార్తె విశ్వాసులు నూతన యెరూషలేమునకు వెళ్ళుదురు. దేవుడు మిమ్మును అందు కొరకు ఆయత్త పరచును గాక! ఆమెన్.

Please follow and like us:

How can we help?

Leave a Reply