కీర్తన 24; మత్తయి 21; ఎఫెసి. 6వ అధ్యాయము.
ప్రార్ధన:- మా శరీర బలహీనతలయందు, ఆత్మ బలహీనతలయందు బలపరచు తండ్రీ! నీకు స్తోత్రములు, నీ వాక్యము ద్వావా మమ్ములను క్రమపరచు తండ్రీ! నీకు స్తోత్రములు. మహా మహిమగల దినములు మా కొరకు కనిపెట్టుచున్నవి. దూతలు పరలోక పరిశుద్ధులు కనిపెట్టుచుండగా మనము చీకటి రాజ్యమునకు సంబంధించిన వాటివైపుకే చూచునట్టి నీ కృప దయచేయుము.
ఈ పాఠము చూస్తే యెరూషలేము గుమ్మము నుండి ఒలీవ కొండ వరకు జరిగిన కథ కనబడుచున్నది. ఈ వారమంతా ప్రభువు తన పనిని జరిగించి ముగించవలెను. శిష్యులకు చెప్పవలసినవన్నీ, యూదులకు చెప్పవలసినవన్నీ త్వరగా చెప్పవలెను. సిలువ వరకు ఆయనను వెంబడించిన కొన్ని గుంపులు గలవు. అవి
1. శిష్యుల గుంపు.
2. గార్ధాభమును పంపినవారి గుంపు.
3. ఎదుర్కొనిన వారి గుంపు (జయకీర్తనలు పాడిరి),
4. ఎదిరించినవారి గుంపు (చాటునుండి ధిక్కరించు మతాధికారులు).
1) శిష్యుల గుంపు:- వీరు దేవునితో ఉండి నేర్చుకొన్న గొప్ప పాఠము ఏమనగా విధేయత. ఆయన మీతో చెప్పునది చేయుడి(యోహాను 2:5) అను మాటను బట్టి గార్ధభమును తోలుకొని వచ్చిరి. ప్రభువు ఏమి చెప్పునో అది చేయడమే వారికి పండుగ. మనకు కూడా పండుగే గాని ఆచార ప్రకారము ఆచరించుచున్నారు. ఆచారమైతే అది దండుగ. అయితే అది మనకే పండుగ.
2) గార్ధభమును ఇచ్చినవారి గుంపు:- అనగా దేవునకు ఏమి కావలెనో అవి ఇచ్చే గుంపు.విశ్వాసులలో కొందరు ప్రభువు ఏమి అడిగితే అది ఇచ్చేవారు గలరు. వీరు ఈ గుంపులోనికి చేర్చబడుదురు ప్రభువు ఏమి అడిగితే అది ఇచ్చేవారు గలరు. వీరు ఈ గుంపులోనికి చేర్చబడుదురు. 5000 మందికి ఆహారము పెట్టిన సమయములో రొట్టెలిచ్చిన అబ్బాయికి దానకర్త అని పేరు పెట్టవచ్చును. దీనిని బట్టి చూస్తే విశ్వాసులలో దేవుని సేవకు దేవుడు చెప్పినట్లుగా ఇచ్చేవారు దానకర్తలుగా పరిగణింపబడుదురు. వీరివంటి వారే 70 మంది శిష్యులు, వీరిలో ఒకరు గార్ధభమును ఇచ్చినవారు. వీరు ఇంకేమి అడిగిననూ ఇవ్వగలరు.
3) జయకీర్తనలు పాడిన గుంపు:- వీరు యెరూషలేమునకు రమ్మని ప్రభువునకుస్వాగతము చెప్పుచున్నారు. వీరు ప్రభువును రానిచ్చే గుంపు, మహిమ పరచిన గుంపు, జయకీర్తనలు పాడిన గుంపు. (1. స్తుతి, 2. కీర్తనలు, 3. మహిమ) ఈ గుంపునకుమనస్సులో గర్వమున్నది గనుక జయమన్నారు. చెట్ల కొమ్మలు నరికి దారిపొడుగునను పరచిరి. ఇది అంతా చుస్తే లోకాధికారులకు పగ ఎక్కువాయెను.
4) ఆక్షేపణ చేసిన గుంపు:- దారిలో ప్రభువు వారికి సమాధానము చెప్పెను. యేసుప్రభువు యొక్క చరిత్ర రెండు భాగములు.
1. జన్మము మొదలు యెరూషలేము వెళ్ళువరకు
2. సిలువ మొదలు పునరుత్థానము వరకు అనగా శ్రమ, సిలువ, పునరుత్థానము. మనకు కూడ పుట్టినది మొదలు మరణపర్వంతము తండ్రి గడువు ఇచ్చును. ఈ గడువు అంగీకరించని వారు అంధకార రాజ్యమునకు వెళ్ళవలసినదే.