క్రైస్తవ పండుగలు

⌘K
  1. Home
  2. Docs
  3. క్రైస్తవ పండుగలు...
  4. రాకడ పండుగ...
  5. రాకడ పండుగ – V

రాకడ పండుగ – V

యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ అనునది ‘గురుతుల ‘ మీదను, ‘త్వరగా’ అనుమాట మీదను ఆధారపడియున్నది. అది మాత్రమే గాక ‘సిద్ధపడండి ‘ అనే మాట మీదకూడా అధికముగా ఆధారపడియున్నది. త్వరగా వస్తానని ప్రభువు చెప్పినారే గాని త్వరగా రాలేదు కదా! గనుక ఆ మాట మీద మనము ఆధారపడియుండుట ఎందుకు? అనే ప్రశ్న అనేకులలో నున్నది. మనకు ముందున్న పూర్వీకులు ‘త్వరగా’ అని సిద్ధపడినారు. కాని వారి కాలములో రాకడ రాలేదు గనుక వారు వెళ్ళిపోయినారు. త్వరగా అను మాట నెరవేరలేదు అనగా రాకడ మాత్రము నెరవేరలేదు గాని సిద్ధపడడమనేది నెరవేరినది. అయితే రాకడ కొరకు ఎంతో సిధపడి ఎదురుచూచారు గనుకనే వారు వధువు సంఘములో నున్నారు.

తప్పిపోయిన కుమారుడు తిరిగి గృహమునకు రాగా, తండ్రి గొప్ప విందు చేసినాడు. పెద్ద కుమారుడు విందులోనికి రాక బయటనే ఉన్నాడు. అప్పుడు తండ్రి పెద్దకుమారుని చూచి ‘నాకున్నవన్నియు నీవే కదా’ అని చెప్పినాడు. అప్పుడు ఆ విందు సంతోషము, తమ్ముడు తిరిగి వచ్చిన సంతోషము, తండ్రి సమానముగా చూచిన సంతోషము, తండ్రి అంతా నీదే అన్న సంతోషము అతనికి కల్గెను. అలాగే కొందరు భక్తులు రాకడ కొరకు సిద్ధపడి, ఆశించి చనిపోయినారు. వారు రాకడ సంతోషము కూడా అనుభవించెదరు. ఉదా:- ఒక తల్లి అరిసెలు వండినది. సమయానికి పిల్లలు వచ్చియున్నారు. వారందరికి సమానముగా పంచిపెట్టినది. ఒక పిల్లవాడు పని ఉండి ఆలస్యముగా వచ్చెను. వానికి కూడ ముందు పిల్లలవలె సమానముగా పెట్టునా? లేక అరిసెలు అయిపోయినవి గనుక నీకు అన్నము వండిపెడతాను అని అనునా? వానికిని సమానముగానే పెట్టును. అలాగే ప్రభువు కూడా ఆలస్యముగా వచ్చిన వారికిని మొదట వచ్చిన వారికిని, రాకడ సంతోషము కలుగజేయును. పరలోకములో 7 సంవత్సరములు మహా పెండ్లి విందు జరుగగా, అట్టి విందుకు అర్హత లేని వారిని కూడా ప్రభువు రానిచ్చును. ఈ రాకడ సంగతులు, మరియొక సంగతి, ఇంకా అనేక చిన్న చిన్న సంగతులు గలవు. ఇవన్నియు కలిపిన యెడల పెద్ద దండకమౌను.

మరియొక సంగతి:- ఎంతమంది పరలోకమునకు వెళ్ళినారో, వారందరు దేవుని సిం హాసనము ఎదుట అంతస్తుల ప్రకారము కూర్చొందురు. అంతస్థులు ఏడు రకములు.

ఒక్కొక్క అంతస్తునకు ఒక్కొక్కపేరున్నది. 1. ఎఫెసు, 2. స్ముర్న. 3. పెర్గము, 4. తుయతైర, 5. సార్ధిస్, 6. ఫిలదెల్ఫియా, 7. లవొదికయ. ఇవి భూలోకములో పాలస్తీనా దేశములోనున్న ఏడు పట్టణములలోని ఏడు సంఘములు. అప్పుడు పాలస్తీనాకు మాత్రమే ఈ ఏడు సంఘములున్నవి కాని ఇప్పటి క్రైస్తవులు కూడా అందులో ఉన్నారు. క్రీస్తు కాలములో భూలోకములో అనేక భక్తుల సంఘములున్నవి. అవి పాత నిబంధనకు సంబంధించినవి గాని క్రైస్తవ సంఘమునకు సంబంధించినవి కావు. అయితే ఒక్క పాలస్తీనా దేశములో మాత్రమే అనేక క్రైస్తవ భక్తుల సంఘములున్నవి.

పరలోకములో మొదటి అంతస్తునకు తగిన విశ్వాసులు కూడా పాలస్తీనాలో కొన్ని పట్టణములలో నున్నారు. 1. భక్తులయొక్క మొదటి గుంపు యూదులు. వీరు లోకమందంతటా నున్నారు. 2. ఒక్క పాలస్తీనాలో మాత్రమే క్రైస్తవసంఘ పట్టణములున్నవి. ఆ పట్టణములలో పరలోకములో నున్న ఏడు అంతస్తులకు తగిన విశ్వాసులున్నారు. 3. ఆ అంతస్తులుగల పట్టణములలో యేసుప్రభువు ఏడు పట్టణములను ప్రత్యేకముగా ఏరి యోహానుకు చూపి ప్రకటన 1:11లో ఉదహరించి యున్నారు. 4. అట్టివారు తక్కిన కొన్ని పట్టణ ములలో కూడా నున్నారు. వారిని యేసుప్రభువు తృణీకరించలేదు. గాని యోహానుకు తెల్పుటకే ఏడు సంఘముల పేర్లు చెప్పియున్నారు.

గుంపులు:- 1. యూదులు 2. క్రైస్తవులు 3. అంతస్తులలో ఏర్పరచుకొన్న ఏడు సంఘములు.

యేసుప్రభువు యోహాను యొద్దకు వచ్చినప్పుడు యోహాను బహు వృధాప్యములో మరణదశకు సిద్ధమైయున్నాడు. ప్రభువు యోహానును చూచి “యోహాను! నీ ముసలితనము నాకడ్డమా? నీవు చావవు. నీ చేత కొన్ని సంగతులు వ్రాయించుటకు వచ్చియున్నాను అని దగ్గరకు వచ్చి గత సంగతులు, నేటి సంగతులు, రాబోవు సంగతులు వ్రాయి” అని చెప్పినారు. ముసలితనములో నున్న యోహాను వ్రాయుటకు మొదలు పెట్టెను. హెబ్రీ భాష ఉర్దూభాషవలె వెనుకకు వ్రాయవలెను. ఇదెంత కష్టమో, అయినా ప్రభువు చెప్పుచూ ఉంటే, యోహాను వ్రాసాడు. సీనాయి కొండమీద ఉన్న మోషేకు చూపు, బలము ఉన్నందువల్ల పది యాజ్ఞలు తండ్రి వ్రాసి ఇచ్చినారు. యోహాను బహు వృద్దుడు. కలము పట్టుకొనలేడు. తరచుగా ప్రభువు శిష్యులు ఆయన యొదకు వచ్చి ఆయనను పలుకరించేవారు. యోహానుకు సంకెళ్ళు లేవు. ముసలివాడయిన యోహాను మరియు మోషేల చేత దేవుడు తన వ్రాతలను వ్రాయించిరి.

Please follow and like us:

How can we help?

Leave a Reply