రాకడ విశ్వాసులుగా ఉండగోరుచున్న ప్రియులారా! పెంతెకొస్తు సంఘస్థులుగా ఉండగోరుచున్న వారలారా! రాకడ పండుగ ఆచరించు వారలారా! మీకు ప్రభువు నామమున శుభము కలుగును గాక! అన్నిటికన్న గొప్ప సంతోషము రాకడ. ఇది ఒక ప్రత్యేకమైన వరము. ఇది సంఘమునకు దేవుడు అనుగ్రహించిన వరము. ప్రత్యేకమైన అంశము. ప్రత్యేకమైన మేలు. మన ఆరోగ్యమును మనము కాపాడుకొని జీవించ గలిగితే, ఆయనను మనము కలిసికొందము, ఎత్తబడుదుము. ప్రభువుయొక్క రాకడను కొన్ని భాగములుగా చేయుదుము.
(1) యేసుప్రభువు ఈ లోకమునకు రాక పూర్వము కొన్ని గుర్తులు జరుగును. అవి 1)నేల మీదను, 2)ఆకాశ మండలములోను, 3) భూమి చుట్టునూ జరుగును.
(1) భూమి మీద జరుగుచున్న ఈ లోక చరిత్రలో కొన్ని సంగతులు కనబడుచున్నవి.
(2) అట్లే క్రైస్తవమత సంఘములో కొన్ని సంగతులు జరుగును. ఇప్పుడు అవి మనము తెలిసికొనవలెను.
ఇవన్ని చూచి మనము రాకడ సమీపించుచున్నదని తెలిసికొనవలెను. ప్రతి రాకడ విశ్వాసియొక్క హృదయము లోపల ఒక గుర్తు ఉన్నది. ఆ గుర్తు ఆకాశములో, నేలమీద, నేల అడుగు భాగమున లేదుగాని, ఇప్పుడు మన లోక చరిత్ర విషయములో తీసికొందుము.