ఈ పండుగ బైబిలులో లేదు. సంఘము ఏర్పర్చుకొన్నది. పరిశుద్ధులనగా ఎవరు? క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారు. ఎఫెసీ 1:1లో పరిశుద్ధులకు అని వ్రాయబడి యున్నది. పరిశుద్ధులనగా పాపములేని వారని కాదు. లోపములున్నను, ఏర్పాటులోనివారు అని అర్ధము.
- నోవాహు : ఈయన చేసిన పనిని తలంచుకొని స్తుతించవలెను. ఇతనిచే నిర్మించబడిన నావ సంఘమునకు ముంగుర్తుగా నున్నది. ఇతడు దేవుడు చెప్పినట్లుగా చేసెను. గనుక ఈయన పరిశుద్ధుడు.
- అబ్రహాము : ఈయన జనాంగములకు తండ్రిగా నుండెను. యూదా జనాంగములో నుండి వచ్చినవారు ఒక్కొక్కరు, ఒక్కొక్క విషయములో ప్రసిద్ధి చెందిరి. అట్లే మనమును ఏదో ఒక దానియందు ప్రసిద్ధికెక్కవలెను.
- ఇస్సాకు : ఈయన యేసుప్రభువు యొక్క సిలువ మరణమునకు, యజ్ఞమునకు ముంగుర్తుగా నుండెను. గనుక పరిశుద్ధుడు.
- యాకోబు : ఇతని యందు మోసము, టక్కరి తనము, కుయుక్తి ఉన్నను దీవెన పొందెను. రాతిని తలగడగా చేసుకొని పరుండినప్పుడును, మామ యొక్క మందలను కాయునప్పుడును, తిరిగి వచ్చువేయునప్పుడును దీవెనలు పొందెను. దేవుని నిబంధన మీరలేదు. దీవెన పుత్రుడని పేరుపొందెను.
- యోసేపు : ఇతడు శోధనను జయించెను గనుక పరిశుద్ధుడు. ఈయనను ఉదహరించి, ఇట్టి శక్తి కొరకు ప్రార్ధించవలెను.
- మోషే : ఈ కాలేజి మాష్టరు గారు, 40 సంవత్సరములు అరణ్యములో, లక్షల మంది విధ్యార్ధులకు దేవుని ఆజ్ఞలు ఉపదేశించెను. మొదటి గ్రంధకర్త. న్యాయశాస్త్రము అనగా, “లా” ఈయన ద్వారా లోకమునకు అందెను.
- యెహోషువ : గొప్ప సైన్యాధిపతి. దేవుని వాగ్ధాన దేశమును సంపాదించుటలో గొప్ప యుద్ధశూరుడు. వాగ్ధాన దేశమును ఇశ్రాయేలీయులకు పంచి ఇచ్చిన వాడు.
- గిద్యోను : కుండలు, కాగడాలు వినియోగించుట ద్వారా తన స్వంత జ్ఞానమును ఉపయోగించెను. దేవుడు చెప్పకపోయినను అట్లు చేసి, జయము సంపాదించి దేవునికి మహిమ తెచ్చెను.
- సమూయేలు : ఉజ్జీవ కూటములు జరుపుటలో ప్రసిద్ధికెక్కినవాడు. సమూయేలు వచ్చుచున్నాడంటే క్రొత్త సంగతులు చెనని ప్రజలు అతని కొరకు ఎదురుచూచేవారు.
- దావీదు : అన్ని శక్తులు గలవాడు, గొప్పరాజు, గొప్ప యుద్ధ శూరుడు. యేసుప్రభువునకు జనకుడు. స్తుతించుటలో గొప్పవాడు. నిందలు, కష్టములు అనుభవించుటలో ప్రసిద్ధికెక్కినవాడు.
- ఎస్తేరు : ఈమె, మగవారు చేయలేని పనిచేసెను. నశింపనైయున్న తన జనాంగమునురక్షించెను. అన్యదేశములలో నశించిన దానిని రక్షించెననుటకు గుర్తుగా ఈ గొప్పకార్యము జరిగినది. దేవుడని ఈ గ్రంధములో లేకపోయినను, జరిగిన పని అంతయు దేవునిదై యున్నది.
- యెషయా : పాత నిబంధనలోనే క్రీస్తు ప్రభువు చరిత్రను పూర్తిగా దర్శనములలో చూచి ఎరిగినవాడు. దర్శనములలో చాల గొప్పవాడు.
ప్రకటన గ్రంధము వ్రాసిన యోహాను:
లోకాంతము వరకు జరుగవలసిన భవిష్యత్తును గూర్చి ఇతడు వ్రాసెను. మోషే మొదటి. యోహాను చివరి రిటరు. మోషే మొదటి సృష్టిని గురించి వ్రాసెను. మోషే జరిగిపోయినది వ్రాయుటకును, యోహాను రానైయున్నది వ్రాయుటకును ఏర్పాటు చేయబడిరి.
షరా:- 1. పాత నిబంధన పరిశుద్ధులు, 2. క్రొత్త నిబంధన పరిశుద్ధులు, 3. సంఘ చరిత్రలోని పరిశుద్ధులు, 4. నవీనకాల పరిశుద్ధులు. వీరందరిని తలంచి స్తుతి చేయుటయే సర్వ పరిశుద్ధుల పండుగ.
చదువరులు పరిశుద్ధులని పిలువబడు కృప కలిగియుందురు గాక! ఆమెన్.
Please follow and like us: