1. ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర....తీరమున కూర్చుండెను.

  2. బహు జనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుం డెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా

  3. ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగాఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను.

  4. వాడు విత్తుచుండగా కొన్ని విత్తన ములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మింగివేసెను

  5. కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని

  6. సూర్యుడు ఉదయించి నప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను.

  7. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి

  8. కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను.

  9. చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.

  10. తరువాత శిష్యులు వచ్చినీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను

  11. పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింప బడలేదు.

  12. కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియువారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు.

  13. ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించు చున్నాను.ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి

  14. మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు

  15. గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది.

  16. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.

  17. అనేక ప్రవక్తలును నీతిమంతు లును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

  18. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి.

  19. ఎవడైనను రాజ్య మునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.

  20. రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు.

  21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును.

  22. ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.

  23. మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.

  24. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగాపరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది.

  25. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను.

  26. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను.

  27. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా,అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి.

  28. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.

  29. అందుకతడు వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.

  30. కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు ననెను.

  31. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది.

  32. అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించు నంత చెట్టగును.

  33. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.

  34. నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడినసంగతులను తెలియజెప్పెదను

  35. అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగ తులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.

  36. అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటి లోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిపొలము లోని గురుగులను గూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి.

  37. అందుకాయన ఇట్లనెనుమంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు;

  38. పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు1; గురుగులు దుష్టుని సంబంధులు1;

  39. వాటిని విత్తిన శత్రువు అపవాది2; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు.

  40. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును.

  41. మనుష్యకుమా రుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు.

  42. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.

  43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.

  44. పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగిన దంతయు అమి్మ ఆ పొలమును కొనును.

  45. మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది.

  46. అతడు అమూల్య మైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగిన దంతయు అమి్మ దాని కొనును.

  47. మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది.

  48. అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయు దురు.

  49. ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవ దూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి,

  50. వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.

  51. వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడు గగా వారుగ్రహించితి మనిరి.

  52. ఆయనఅందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థ ములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నా డని వారితో చెప్పెను.

  53. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి, సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను.

  54. అందువలన వారాశ్చర్యపడిఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి?

  55. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా?

  56. ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి.

  57. అయితే యేసుప్రవక్త తన దేశము లోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను.

  58. వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.

  1. That same day Jesus went out of the house and sat beside the sea.

  2. And great crowds gathered about him, so that he got into a boat and sat down. And the whole crowd stood on the beach.

  3. And he told them many things in parables, saying: "A sower went out to sow.

  4. And as he sowed, some seeds fell along the path, and the birds came and devoured them.

  5. Other seeds fell on rocky ground, where they did not have much soil, and immediately they sprang up, since they had no depth of soil,

  6. but when the sun rose they were scorched. And since they had no root, they withered away.

  7. Other seeds fell among thorns, and the thorns grew up and choked them.

  8. Other seeds fell on good soil and produced grain, some a hundredfold, some sixty, some thirty.

  9. He who has ears, let him hear."

  10. Then the disciples came and said to him, "Why do you speak to them in parables?"

  11. And he answered them, "To you it has been given to know the secrets of the kingdom of heaven, but to them it has not been given.

  12. For to the one who has, more will be given, and he will have an abundance, but from the one who has not, even what he has will be taken away.

  13. This is why I speak to them in parables, because seeing they do not see, and hearing they do not hear, nor do they understand.

  14. Indeed, in their case the prophecy of Isaiah is fulfilled that says: "' You will indeed hear but never understand, and you will indeed see but never perceive.

  15. For this people's heart has grown dull, and with their ears they can barely hear, and their eyes they have closed, lest they should see with their eyes and hear with their ears and understand with their heart and turn, and I would heal them.'

  16. But blessed are your eyes, for they see, and your ears, for they hear.

  17. Truly, I say to you, many prophets and righteous people longed to see what you see, and did not see it, and to hear what you hear, and did not hear it.

  18. "Hear then the parable of the sower:

  19. When anyone hears the word of the kingdom and does not understand it, the evil one comes and snatches away what has been sown in his heart. This is what was sown along the path.

  20. As for what was sown on rocky ground, this is the one who hears the word and immediately receives it with joy,

  21. yet he has no root in himself, but endures for a while, and when tribulation or persecution arises on account of the word, immediately he falls away.

  22. As for what was sown among thorns, this is the one who hears the word, but the cares of the world and the deceitfulness of riches choke the word, and it proves unfruitful.

  23. As for what was sown on good soil, this is the one who hears the word and understands it. He indeed bears fruit and yields, in one case a hundredfold, in another sixty, and in another thirty."

  24. He put another parable before them, saying, "The kingdom of heaven may be compared to a man who sowed good seed in his field,

  25. but while his men were sleeping, his enemy came and sowed weeds among the wheat and went away.

  26. So when the plants came up and bore grain, then the weeds appeared also.

  27. And the servants of the master of the house came and said to him, 'Master, did you not sow good seed in your field? How then does it have weeds?'

  28. He said to them, 'An enemy has done this.' So the servants said to him, 'Then do you want us to go and gather them?'

  29. But he said, 'No, lest in gathering the weeds you root up the wheat along with them.

  30. Let both grow together until the harvest, and at harvest time I will tell the reapers, Gather the weeds first and bind them in bundles to be burned, but gather the wheat into my barn.'"

  31. He put another parable before them, saying, "The kingdom of heaven is like a grain of mustard seed that a man took and sowed in his field.

  32. It is the smallest of all seeds, but when it has grown it is larger than all the garden plants and becomes a tree, so that the birds of the air come and make nests in its branches."

  33. He told them another parable. "The kingdom of heaven is like leaven that a woman took and hid in three measures of flour, till it was all leavened."

  34. All these things Jesus said to the crowds in parables; indeed, he said nothing to them without a parable.

  35. This was to fulfill what was spoken by the prophet: "I will open my mouth in parables; I will utter what has been hidden since the foundation of the world."

  36. Then he left the crowds and went into the house. And his disciples came to him, saying, "Explain to us the parable of the weeds of the field."

  37. He answered, "The one who sows the good seed is the Son of Man.

  38. The field is the world, and the good seed is the children of the kingdom. The weeds are the sons of the evil one,

  39. and the enemy who sowed them is the devil. The harvest is the close of the age, and the reapers are angels.

  40. Just as the weeds are gathered and burned with fire, so will it be at the close of the age.

  41. The Son of Man will send his angels, and they will gather out of his kingdom all causes of sin and all law-breakers,

  42. and throw them into the fiery furnace. In that place there will be weeping and gnashing of teeth.

  43. Then the righteous will shine like the sun in the kingdom of their Father. He who has ears, let him hear.

  44. "The kingdom of heaven is like treasure hidden in a field, which a man found and covered up. Then in his joy he goes and sells all that he has and buys that field.

  45. "Again, the kingdom of heaven is like a merchant in search of fine pearls,

  46. who, on finding one pearl of great value, went and sold all that he had and bought it.

  47. "Again, the kingdom of heaven is like a net that was thrown into the sea and gathered fish of every kind.

  48. When it was full, men drew it ashore and sat down and sorted the good into containers but threw away the bad.

  49. So it will be at the close of the age. The angels will come out and separate the evil from the righteous

  50. and throw them into the fiery furnace. In that place there will be weeping and gnashing of teeth.

  51. "Have you understood all these things?" They said to him, "Yes."

  52. And he said to them, "Therefore every scribe who has been trained for the kingdom of heaven is like a master of a house, who brings out of his treasure what is new and what is old."

  53. And when Jesus had finished these parables, he went away from there,

  54. and coming to his hometown he taught them in their synagogue, so that they were astonished, and said, "Where did this man get this wisdom and these mighty works?

  55. Is not this the carpenter's son? Is not his mother called Mary? And are not his brothers James and Joseph and Simon and Judas?

  56. And are not all his sisters with us? Where then did this man get all these things?"

  57. And they took offense at him. But Jesus said to them, "A prophet is not without honor except in his hometown and in his own household."

  58. And he did not do many mighty works there, because of their unbelief.

  1. उसी दिन यीशु घर से निकलकर झील के किनारे जा बैठा।

  2. और उसके पास ऐसी बड़ी भीड़ इकट्ठी हुई कि वह नाव पर चढ़ गया, और सारी भीड़ किनारे पर खड़ी रही।

  3. और उस ने उन से दृष्टान्तों में बहुत सी बातें कही, कि देखो, एक बोनेवाला बीज बोने निकला।

  4. बोते समय कुछ बीज मार्ग के किनारे गिरे और पक्षियों ने आकर उन्हें चुग लिया।

  5. कुछ पत्थरीली भूमि पर गिरे, जहां उन्हें बहुत मिट्टी न मिली और गहरी मिट्टी न मिलने के कारण वे जल्द उग आए।

  6. पर सूरज निकलने पर वे जल गए, और जड़ न पकड़ने से सूख गए।

  7. कुछ झाड़ियों में गिरे, और झाड़ियों ने बढ़कर उन्हें दबा डाला।

  8. पर कुछ अच्छी भूमि पर गिरे, और फल लाए, कोई सौ गुना, कोई साठ गुना, कोई तीस गुना।

  9. जिस के कान हों वह सुन ले।।

  10. और चेलों ने पास आकर उस से कहा, तू उन से दृष्टान्तों में क्यों बातें करता है?

  11. उस ने उत्तर दिया, कि तुम को स्वर्ग के राज्य के भेदों की समझ दी गई है, पर उन को नहीं।

  12. क्योंकि जिस के पास है, उसे दिया जाएगा; और उसके पास बहुत हो जाएगा; पर जिस के पास कुछ नहीं है, उस से जो कुछ उसके पास है, वह भी ले लिया जाएगा।

  13. मैं उन से दृष्टान्तों में इसलिये बातें करता हूं, कि वे देखते हुए नहीं देखते; और सुनते हुए नहीं सुनते; और नहीं समझते।

  14. और उन के विषय में यशायाह की यह भविष्यद्ववाणी पूरी होती है, कि तुम कानों से तो सुनोगे, पर समझोगे नहीं; और आंखों से तो देखोगे, पर तुम्हें न सूझेगा।

  15. क्योंकि इन लोगों का मन मोटा हो गया है, और वे कानों से ऊंचा सुनते हैं और उन्हों ने अपनी आंखें मूंद लीं हैं; कहीं ऐसा न हो कि वे आंखों से देखें, और कानों से सुनें और मन से समझें, और फिर जाएं, और मैं उन्हें चंगा करूं।

  16. पर धन्य है तुम्हारी आंखें, कि वे देखती हैं; और तुम्हारे कान, कि वे सुनते हैं।

  17. क्योंकि मैं तुम से सच कहता हूं, कि बहुत से भविष्यद्वक्ताओं ने और धर्मियों ने चाहा कि जो बातें तुम देखते हो, देखें पर न देखीं; और जो बातें तुम सुनते हो, सुनें, पर न सुनीं।

  18. सो तुम बानेवाले का दृष्टान्त सुनो।

  19. जो कोई राज्य का वचन सुनकर नहीं समझता, उसके मन में जो कुछ बोया गया था, उसे वह दुष्ट आकर छीन ले जाता है; यह वही है, जो मार्ग के किनारे बोया गया था।

  20. और जो पत्थरीली भूमि पर बोया गया, यह वह है, जो वचन सुनकर तुरन्त आनन्द के साथ मान लेता है।

  21. पर अपने में जड़ न रखने के कारण वह थोड़े ही दिन का है, और जब वचन के कारण क्लेश या उपद्रव होता है, तो तुरन्त ठोकर खाता है।

  22. जो झाड़ियों में बोया गया, यह वह है, जो वचन को सुनता है, पर इस संसार की चिन्ता और धन का धोखा वचन को दबाता है, और वह फल नहीं लाता।

  23. जो अच्छी भूमि में बोया गया, यह वह है, जो वचन को सुनकर समझता है, और फल लाता है कोई सौ गुना, कोई साठ गुना, कोई तीस गुना।

  24. उस ने उन्हें एक और दृष्टान्त दिया कि स्वर्ग का राज्य उस मनुष्य के समान है जिस ने अपने खेत में अच्छा बीज बोया।

  25. पर जब लोग सो रहे थे तो उसका बैरी आकर गेहूं के बीच जंगली बीज बोकर चला गया।

  26. जब अंकुर निकले और बालें लगी, तो जंगली दाने भी दिखाई दिए।

  27. इस पर गृहस्थ के दासों ने आकर उस से कहा, हे स्वामी, क्या तू ने अपने खेत में अच्छा बीज न बोया था? फिर जंगती दाने के पौधे उस में कहां से आए?

  28. उस ने उन से कहा, यह किसी बैरी का काम है। दासों ने उस से कहा क्या तेरी इच्छा है, कि हम जाकर उन को बटोर लें?

  29. उस ने कहा, ऐसा नहीं, न हो कि जंगती दाने के पौधे बटोरते हुए उन के साथ गेहूं भी उखाड़ लो।

  30. कटनी तक दोनों को एक साथ बढ़ने दो, और कटनी के समय मैं काटनेवालों से कहूंगा; पहिले जंगली दाने के पौधे बटोरकर जलाने के लिये उन के गट्ठे बान्ध लो, और गेहूं को मेरे खत्ते में इकट्ठा करो।।

  31. उस ने उन्हें एक और दृष्टान्त दिया; कि स्वर्ग का राज्य राई के एक दाने के समान है, जिसे किसी मनुष्य ने लेकर अपने खेत में बो दिया।

  32. वह सब बीजों से छोटा तो है पर जब बढ़ जाता है तब सब साग पात से बड़ा होता है; और ऐसा पेड़ हो जाता है, कि आकाश के पक्षी आकर उस की डालियों पर बसेरा करते हैं।।

  33. उस ने एक और दृष्टान्त उन्हें सुनाया; कि स्वर्ग का राज्य खमीर के समान है जिस को किसी स्त्री ने लेकर तीन पसेरी आटे में मिला दिया और होते होते वह सब खमीर हो गया।।

  34. ये सब बातें यीशु ने दृष्टान्तों में लोगों से कहीं, और बिना दृष्टान्त वह उन से कुछ न कहता था।

  35. कि जो वचन भविष्यद्वक्ता के द्वारा कहा गया था, वह पूरा हो कि मैं दृष्टान्त कहने को अपना मुंह खोलूंगा: मैं उन बातों को जो जगत की उत्पत्ति से गुप्त रही हैं प्रगट करूंगा।।

  36. तब वह भीड़ को छोड़कर घर में आया, और उसके चेलों ने उसके पास आकर कहा, खेत के जंगली दाने का दृष्टान्त हमें समझा दे।

  37. उस ने उन को उत्तर दिया, कि अच्छे बीज का बोनेवाला मनुष्य का पुत्रा है।

  38. खेत संसार है, अच्छा बीज राज्य के सन्तान, और जंगली बीज दुष्ट के सन्तान हैं।

  39. जिस बैरी ने उन को बोया वह शैतान है; कटनी जगत का अन्त है: और काटनेवाले स्वर्गदूत हैं।

  40. सो जैसे जंगली दाने बटोरे जाते और जलाए जाते हैं वैसा ही जगत के अन्त में होगा।

  41. मनुष्य का पुत्रा अपने स्वर्गदूतों को भेजेगा, और वे उसके राज्य में से सब ठोकर के कारणों को और कुकर्म करनेवालों को इकट्ठा करेंगे।

  42. और उन्हें आग के कुंड में डालेंगे, वहां रोना और दांत पीसना होगा।

  43. उस समय धर्मी अपने पिता के राज्य में सूर्य की नाई चमकेंगे; जिस के कान हों वह सुन ले।।

  44. स्वर्ग का राज्य खेत में छिपे हुए धन के समान है, जिसे किसी मनुष्य ने पाकर छिपा दिया, और मारे आनन्द के जाकर और अपना सब कुछ बेचकर उस खेत को मोल लिया।।

  45. फिर स्वर्ग का राज्य एक व्योपारी के समान है जो अच्छे मोतियों की खोज में था।

  46. जब उसे एक बहुमूल्य मोती मिला तो उस ने जाकर अपना सब कुछ बेच डाला और उसे मोल ले लिया।।

  47. फिर स्वर्ग का राज्य उस बड़े जाल के समान है, जो समुद्र में डाला गया, और हर प्रकार की मछलियों को समेट लाया।

  48. और जब भर गया, तो उस को किनारे पर खींच लाए, और बैठकर अच्छी अच्छी तो बरतनों में इकट्ठा किया और निकम्मी, निकम्मीं फेंक दी।

  49. जगत के अन्त में ऐसा ही होगा: स्वर्गदूत आकर दुष्टों को धर्मियों से अलग करेंगे, और उन्हें आग के कुंड में डालेंगे।

  50. वहां रोना और दांत पीसना होगा।

  51. क्या तुम ने ये सब बातें समझीं?

  52. उन्हों ने उस से कहा, हां; उस ने उन से कहा, इसलिये हर एक शास्त्री जो स्वर्ग के राज्य का चेला बना है, उस गृहस्थ के समान है जो अपने भण्डार से नई और पुरानी वस्तुएं निकालता है।।

  53. जब यीशु ने सब दृष्टान्त कह चुका, तो वहां से चला गया।

  54. और अपने देश में आकर उन की सभा में उन्हें ऐसा उपदेश देने लगा; कि वे चकित होकर कहने लगे; कि इस को यह ज्ञान और समर्थ के काम कहां से मिले?

  55. क्या यह बढ़ई का बेटा नहीं? और क्या इस की माता का नाम मरियम और इस के भाइयों के नाम याकूब और यूसुफ और शमौन और यहूदा नहीं?

  56. और क्या इस की सब बहिनें हमारे बीच में नहीं रहती? फिर इस को यह सब कहां से मिला?

  57. सो उन्हों ने उसके कारण ठोकर खाई, पर यीशु ने उन से कहा, भविष्यद्वक्ता अपने देश और अपने घर को छोड़ और कहीं निरादर नहीं होता।

  58. और उस ने वहां उन के अविश्वास के कारण बहुत सामर्थ के काम नहीं किए।।


1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28