1. యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను.

  2. పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది.

  3. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తనదాసు లను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి.

  4. కాగా అతడుఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దు లును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధ ముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని

  5. వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి.

  6. తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి.

  7. కాబట్టి రాజు కోప పడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.

  8. అప్పుడతడుపెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు.

  9. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను.

  10. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారి నందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను.

  11. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి

  12. స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను.

  13. అంతట రాజువీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.

  14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.

  15. అప్పుడు పరిసయ్యులు వెళ్లి, మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచనచేయుచు

  16. బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము.

  17. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడ తమ శిష్యులను ఆయనయొద్దకు పంపిరి.

  18. యేసు వారి చెడుతన మెరిగివేషధారులారా, నన్నెందుకు శోధించు చున్నారు?

  19. పన్నురూక యొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయనయొద్దకు ఒక దేనారము1 తెచ్చిరి.

  20. అప్పుడాయనఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారినడుగగా వారుకైసరువనిరి.

  21. అందుకాయనఆలా గైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించు డని వారితో చెప్పెను.

  22. వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లి పోయిరి.

  23. పునరుత్థానములేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దిన మున ఆయనయొద్దకు వచ్చి

  24. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను;

  25. మాలో ఏడుగురు సహోదరు లుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను.

  26. రెండవ వాడును మూడవ వాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి.

  27. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను.

  28. పునరుత్థాన మందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి.

  29. అందుకు యేసులేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు.

  30. పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న దూతలవలె2 ఉందురు.

  31. మృతుల పునరుత్థానమునుగూర్చినేను అబ్రాహాము దేవు డను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నా నని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా?

  32. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను.

  33. జనులది విని ఆయన బోధ కాశ్చర్యపడిరి.

  34. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరి సయ్యులు విని కూడివచ్చిరి.

  35. వారిలో ఒక ధర్మశాస్త్రో పదేశకుడు ఆయనను శోధించుచు

  36. బోధకుడా, ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.

  37. అందు కాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే.

  38. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.

  39. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.

  40. ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అత నితో చెప్పెను.

  41. ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి

  42. క్రీస్తునుగూర్చి మీకేమి తోచు చున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి.

  43. అందుకాయనఆలా గైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు

  44. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువునా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు?

  45. దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా

  46. ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

  1. And again Jesus spoke to them in parables, saying,

  2. "The kingdom of heaven may be compared to a king who gave a wedding feast for his son,

  3. and sent his servants to call those who were invited to the wedding feast, but they would not come.

  4. Again he sent other servants, saying, 'Tell those who are invited, See, I have prepared my dinner, my oxen and my fat calves have been slaughtered, and everything is ready. Come to the wedding feast.'

  5. But they paid no attention and went off, one to his farm, another to his business,

  6. while the rest seized his servants, treated them shamefully, and killed them.

  7. The king was angry, and he sent his troops and destroyed those murderers and burned their city.

  8. Then he said to his servants, 'The wedding feast is ready, but those invited were not worthy.

  9. Go therefore to the main roads and invite to the wedding feast as many as you find.'

  10. And those servants went out into the roads and gathered all whom they found, both bad and good. So the wedding hall was filled with guests.

  11. "But when the king came in to look at the guests, he saw there a man who had no wedding garment.

  12. And he said to him, 'Friend, how did you get in here without a wedding garment?' And he was speechless.

  13. Then the king said to the attendants, 'Bind him hand and foot and cast him into the outer darkness. In that place there will be weeping and gnashing of teeth.'

  14. For many are called, but few are chosen."

  15. Then the Pharisees went and plotted how to entangle him in his talk.

  16. And they sent their disciples to him, along with the Herodians, saying, "Teacher, we know that you are true and teach the way of God truthfully, and you do not care about anyone's opinion, for you are not swayed by appearances.

  17. Tell us, then, what you think. Is it lawful to pay taxes to Caesar, or not?"

  18. But Jesus, aware of their malice, said, "Why put me to the test, you hypocrites?

  19. Show me the coin for the tax." And they brought him a denarius.

  20. And Jesus said to them, "Whose likeness and inscription is this?"

  21. They said, "Caesar's." Then he said to them, "Therefore render to Caesar the things that are Caesar's, and to God the things that are God's."

  22. When they heard it, they marveled. And they left him and went away.

  23. The same day Sadducees came to him, who say that there is no resurrection, and they asked him a question,

  24. saying, "Teacher, Moses said, 'If a man dies having no children, his brother must marry the widow and raise up children for his brother.'

  25. Now there were seven brothers among us. The first married and died, and having no children left his wife to his brother.

  26. So too the second and third, down to the seventh.

  27. After them all, the woman died.

  28. In the resurrection, therefore, of the seven, whose wife will she be? For they all had her."

  29. But Jesus answered them, "You are wrong, because you know neither the Scriptures nor the power of God.

  30. For in the resurrection they neither marry nor are given in marriage, but are like angels in heaven.

  31. And as for the resurrection of the dead, have you not read what was said to you by God:

  32. 'I am the God of Abraham, and the God of Isaac, and the God of Jacob'? He is not God of the dead, but of the living."

  33. And when the crowd heard it, they were astonished at his teaching.

  34. But when the Pharisees heard that he had silenced the Sadducees, they gathered together.

  35. And one of them, a lawyer, asked him a question to test him.

  36. "Teacher, which is the great commandment in the Law?"

  37. And he said to him, "You shall love the Lord your God with all your heart and with all your soul and with all your mind.

  38. This is the great and first commandment.

  39. And a second is like it: You shall love your neighbor as yourself.

  40. On these two commandments depend all the Law and the Prophets."

  41. Now while the Pharisees were gathered together, Jesus asked them a question,

  42. saying, "What do you think about the Christ? Whose son is he?" They said to him, "The son of David."

  43. He said to them, "How is it then that David, in the Spirit, calls him Lord, saying,

  44. "'The Lord said to my Lord, Sit at my right hand, until I put your enemies under your feet'?

  45. If then David calls him Lord, how is he his son?"

  46. And no one was able to answer him a word, nor from that day did anyone dare to ask him any more questions.

  1. इस पर यीशु फिर उन से दृष्टान्तों में कहने लगा।

  2. स्वर्ग का राज्य उस राजा के समान है, जिस ने अपने पुत्रा का ब्याह किया।

  3. और उस ने अपने दासों को भेजा, कि नेवताहारियों को ब्याह के भोज में बुलाएं; परन्तु उन्हों ने आना न चाहा।

  4. फिर उस ने और दासों को यह कहकर भेजा, कि नेवताहारियों से कहो, देखो; मैं भोज तैयार कर चुका हूं, और मेरे बैल और पले हुए पशु मारे गए हैं: और सब कुछ तैयार है; ब्याह के भोज में आओ।

  5. परन्तु वे बेपरवाई करके चल दिए: कोई अपने खेत को, कोई अपने ब्योपार को।

  6. औरों ने जो बच रहे थे उसके दासों को पकड़कर उन का अनादर किया और मार डाला।

  7. राजा ने क्रोध किया, और अपनी सेना भेजकर उन हत्यारों को नाश किया, और उन के नगर फूंक दिया।

  8. तब उस ने अपने दासों से कहा, ब्याह का भोज तो तैयार है, परन्तु नेवताहारी योग्य न ठहरे।

  9. इसलिये चौराहों में जाओ, और जितने लोग तुम्हें मिलें, सब को ब्याह के भोज में बुला लाओ।

  10. सो उन दासों ने सड़कों पर जाकर क्या बुरे, क्या भले, जितने मिले, सब को इकट्ठे किया; और ब्याह का घर जेवनहारों से भर गया।

  11. जब राजा जेवनहारों के देखने को भीतर आया; तो उस ने वहां एक मनुष्य को देखा, जो ब्याह का वस्त्रा नहीं पहिने था।

  12. उस ने उससे पूछा हे मित्रा; तू ब्याह का वस्त्रा पहिने बिना यहां क्यों आ गया? उसका मुंह बन्द हो गया।

  13. तब राजा ने सेवकों से कहा, इस के हाथ पांव बान्धकर उसे बाहर अन्धियारे में डाल दो, वहां रोना, और दांत पीसना होगा।

  14. क्योंकि बुलाए हुए तो बहुत परन्तु चुने हुए थोड़े हैं।।

  15. तब फरीसियों ने जाकर आपस में विचार किया, कि उस को किस प्रकार बातों में फंसाएं।

  16. सो उन्हों ने अपने चेलों को हेरोदियों के साथ उसके पास यह कहने को भेजा, कि हे गुरू; हम जानते हैं, कि तू सच्चा है; और परमेश्वर का मार्ग सच्चाई से सिखाता है; और किसी की परवा नहीं करता, क्योंकि तू मनुष्यों का मुंह देखकर बातें नही करता।

  17. इस लिये हमें बता तू क्या समझता है? कैसर को कर देना उचित है, कि नहीं।

  18. यीशु ने उन की दुष्टता जानकर कहा, हे कपटियों; मुझे क्यों परखते हो?

  19. कर का सिक्का मुझे दिखाओ: तब वे उसके पास एक दीनार ले आए।

  20. उस ने, उन से पूछा, यह मूर्त्ति और नाम किस का है?

  21. उन्हों ने उस से कहा, कैसर का; तब उस ने, उन से कहा; जो कैसर का है, वह कैसर को; और जो परमेश्वर का है, वह परमेश्वर को दो।

  22. यह सुनकर उन्हों ने अचम्भा किया, और उसे छोड़कर चले गए।।

  23. उसी दिन सदूकी जो कहते हैं कि मरे हुओं का पुनरूत्थान है ही नहीं उसके पास आए, और उस से पूछा।

  24. कि हे गुरू; मूसा ने कहा था, कि यदि कोई बिना सन्तान मर जाए, तो उसका भाई उस की पत्नी को ब्याह करके अपने भाई के लिये वंश उत्पन्न करे।

  25. अब हमारे यहां सात भाई थे; पहिला ब्याह करके मर गया; और सन्तान न होने के कारण अपनी पत्नी को अपने भाई के लिये छोड़ गया।

  26. इसी प्रकार दूसरे और तीसरे ने भी किया, और सातों तक यही हुआ।

  27. सब के बाद वह स्त्री भी मर गई।

  28. सो जी उठने पर, वह उन सातों में से किस की पत्नी होगी? क्योंकि वह सब की पत्नी हो चुकी थी।

  29. यीशु ने उन्हें उत्तर दिया, कि तुम पवित्रा शास्त्रा और परमेश्वर की सामर्थ नहीं जानते; इस कारण भूल में पड़ गए हो।

  30. क्योंकि जी उठने पर ब्याह शादी न होगी; परन्तु वे स्वर्ग में परमेश्वर के दूतों की नाई होंगे।

  31. परन्तु मरे हुओं के जी उठने के विषय में क्या तुम ने यह वचन नहीं पढ़ा जो परमेश्वर ने तुम से कहा।

  32. कि मैं इब्राहीम का परमेश्वर, और इसहाक का परमेश्वर, और याकूब का परमेश्वर हूं? वह तो मरे हुओं का नहीं, परन्तु जीवतों का परमेश्वर है।

  33. यह सुनकर लोग उसके उपदेश से चकित हुए।

  34. जब फरीसियों ने सुना, कि उस ने सदूकियों का मुंह बन्द कर दिया; तो वे इकट्ठे हुए।

  35. और उन में से एक व्यवस्थापक ने परखने के लिये, उस से पूछा।

  36. हे गुरू; व्यवस्था में कौन सी आज्ञा बड़ी है?

  37. उस ने उस से कहा, तू परमेश्वर अपने प्रभु से अपने सारे मन और अपने सारे प्राण और अपनी सारी बुद्धि के साथ प्रेम रख।

  38. बड़ी और मुख्य आज्ञा तो यही है।

  39. और उसी के समान यह दूसरी भी है, कि तू अपने पड़ोसी से अपने समान प्रेम रख।

  40. ये ही दो आज्ञाएं सारी व्यवस्था और भविष्यद्वक्ताओं का आधार है।।

  41. जब फरीसी इकट्ठे थे, तो यीशु ने उन से पूछा।

  42. कि मसीह के विषय में तुम क्या समझते हो? वह किस का सन्तान है? उन्हों ने उस से कहा, दाऊद का।

  43. उस ने उन से पूछा, तो दाऊद आत्मा में होकर उसे प्रभु क्यों कहता है?

  44. कि प्रभु ने, मेरे प्रभु से कहा; मेरे दहिने बैठ, जब तक कि मैं तेरे बैरियों को तेरे पांवों के नीचे न कर दूं।

  45. भला, जब दाऊद उसे प्रभु कहता है, तो वह उसका पुत्रा क्योंकर ठहरा?

  46. उसके उत्तर में कोई भी एक बात न कह सका; परन्तु उस दिन से किसी को फिर उस से कुछ पूछने का हियाव न हुआ।।


1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28