Menu

ఉపవాస ప్రార్థన ప్రకరణము

Author: Mungamuri Devadasu Ayyagaru

(ఏ మతమునుగాని ఏ మనుష్యునిగాని ద్వేషించరాదు, తుంచనాడకూడదు)

ఉపోద్ఘాతము: దేవునితో సహవాసము చేయుటకు, దేవునికి యిష్టులముగా నుండుటకు, ఆయన మార్గములో నడచుటకు దైవజనులైన దేవదాసు అయ్యగారు ఒక క్రమమును పాటించి,  బోధించి,  నేర్పించారు.  ఈ క్రమములో ఒక భాగము ఉపవాసము. ఉపవాస ప్రార్ధన ప్రకరణము అను చిన్న పుస్తకములో మనము పాటించవలసిన జీవన విధానమును, దిద్ధుబాటును ఒక ధీక్షగా, వ్రతముగా   ఆచరించాలని    సూచించినారు. ఉపవాసము అనగా "ప్రత్యేకముగా నివసించుట" అని అర్ధము. అనగా ఒక ప్రత్యేక స్థలమును  ఏర్పరుచుకొని దేవునితో ఏకాంతముగా గడుపుట. ఈ ధీక్ష కొన్ని ప్రకరణములుగా వివరించబడినది. ప్రకరణము అనగా నిభందనతో కూడిన క్రమము. ఎవరైనను సరే, ఈ క్రమమును అనుసరించిన యెడల తమ ఆత్మీయ జీవితమును చక్కదిద్దుకొని, శ్రేష్టులైన భక్తుల వరుసకు సిద్ధపడగలరు. తమ పనిలో చురుకుదనము, ఉద్రేకము కావలెనని కోరుకొనెడి దైవ సేవకులు మరియు విశ్వాసులు తప్పక ఈ క్రమమును పాటించి, అందులోని అనుభవమును  అందుకోవలసినదే. ఏ మతము వారైనను, ఈ పుస్తకములోని పద్ధతులను ఆచరించగలిగిన యెడల మహిమ అంతస్తునకు సిద్ధపడగలరు. దైవజనులైన దేవదాసు అయ్యగారు 1935, 1936 సంవత్సరములలో సన్నిధి కూటములను ఏర్పరిచి, ఈ క్రమములో నడిపిస్తుండగా ప్రతీ ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడి సంపూర్ణ దైవానుభూతిని అనుభవించారు. అట్టి అనుభవమును ఇప్పుడును మనము పొందు నిమిత్తము, ఈ పుస్తకమును శ్రద్ధగా చదివి ఆచరించుటకు నిర్ణయించుకొను విధేయతను, సిద్ధ మనస్సును ప్రభువు మనకనుగ్రహించిను గాక!   ఆమేన్.

ఉపవాస ప్రార్థన వాక్యములు

  1. ఆది 37:34-35, 50:10
  2. నిర్గమ 24:18; 34:28
  3. లేవి 16:29-31; 23:27-29; 16:24; 23:26-32
  4. సంఖ్యా 29:7; 20:29
  5. ద్వితియో 9:9,18
  6. యెహోషువ   7:6-8
  7. 1 సమూ. 1:7; 1:10-15,20; 7:6; 31:13
  8. న్యాయాధి. 11 :30,39; 20:26
  9. 2 సమూ 1:12; 3:35; 12:17-20,23
  10. 1రాజులు 21:27; 19:5
  11. 1దిన 10:12 2దిన 20:3
  12. ఎజ్రా 10:1-6
  13. నెహెమ్యా 9:1-4
  14. ఎస్తేరు 4:16
  15. దా.కీర్తనలు 25వ అధ్యాయము, 107వ అధ్యాయము, 51వ అధ్యాయము, 35:13.
  16. యెషయా 58:2-8, 22:12
  17. యిర్మియా 9:1-2; 14:12; 36:6; 36:9
  18. విలాప 2:10-18
  19. యెహెజ్కేలు 27:30; 3:15,
  20. దానియేలు 10:2-4; 9:3, 8
  21. హోషేయా 4వ అధ్యాయము
  22. యోవేలు 1:14; 2:12; 2:15
  23. యోనా 3:5-10
  24. మీకా 4వ అధ్యాయము
  25. జెకర్యా 7:3; 8:18-23
  26. మలాకి 3:14
  27. మత్తయి 4:2-16; 6:16; 9:14,15
  28. మార్కు 1:11-13; 2:18; 9:29
  29. లూకా 2:37; 4:1-2; 5:33-35; 18:12
  30. అపో.కార్య 13:2-3; 14:23; 27:9
  31. 2కొరింథి 6:5; 11:27

సిద్ధబాటు

ఉదయము 6 గంటలకు ఆరంభించి సాయంకాలము 6 గంటలకు ముగించవలెను. ఉదయము 5 గంటలకే లేచి స్నానము చేయవలెను. మత్తయి 6:16-18 ప్రకారము ప్రతి అంశము ప్రార్ధించి, స్తుతించి 'యెహోవ నా మొరలాలించెను ' అను పాట పాడవలెను.

మనోనిదానపు ప్రకరణము

A) మల్పు మెట్టు :- అనగా మరుపు మెట్టు. ఈ మెట్టుపై అన్ని మరచిపోవలెను.

  • 1) నీలో ఉన్న పొరపాట్లు అన్ని మరచిపోవలెను.
  • 2) నీకున్న కష్టములను మరచిపోవలెను.
  • 3) నీకున్న సదుపాయములను మరచిపోవలెను.
  • 4) నీవేమి ప్రార్ధించదలుచుకొన్నావో,  ఆ అంశములను మరచిపోవలెను.
  • 5) ఆకాశము, భూమి, మోక్షలోకము, పాతాళ లోకము, గత కాలము, నవీన కాలము అన్నీ మరచిపోవలెను.
  • 6) దయ్యములను, దుష్టులను కూడ మరచిపోవలెను. పైవన్ని రాకమానవు కాని రానీయకూడదు. అన్న్నీ మరచిపోవిట వల్ల నీ హృదయము ప్రార్థనకు ఖాళీచేయవలెను. అవి జ్ఞాపకమునకు రాకుండా ప్రయత్నించవలెను.

B) విజ్ఞప్తి :-

  • 1) యేసు ప్రభువును మాత్రమే తలంచవలెను.ఆయన నీ ఎదుట ఉన్నాడని తలంచవలెను.
  • 2) నీవు చేసిన ప్రార్థన వినుటకు వచ్చెనని తలంచవలెను.
  • 3) నిన్ను బలపర్చుటకు వచ్చెనని తలంచవలెను.
  • 4) నిన్ను శుద్దిచేయుటకు వచ్చెనని తలంచవలెను.
  • 5) ఇద్దరు ముగ్గురుండు చోట ఉంటాననే వాగ్దానము నెరవేర్చుటకు వచ్చెనని తలంచవలెను.
  • 6) నేనే దేవుడనని, నేనే నీ రక్షకుడని ఋజువుచేయుటకు వచ్చెనని తలంచవలెను.
షరా: ఫోటో తీయునపుడు లెన్స్ వైపు (కెమేరా వైపు) చూచునట్లుగా, మనో నిదానముతో ప్రభువు వైపే చూడవలెను.

నమస్కారపు ప్రకరణము

ప్రభువునకు నీ ఇస్టము వచ్చినట్లు నమస్కారము చేయుము.

  1. ప్రభువా! నీవు నా యెదుట ఉన్నందుకు నమస్కారము.
  2. నేను చేయు ప్రార్ధన వినుటకు వచ్చినావు గనుక నమస్కారము.
  3. నన్ను బలపరచుటకు వచ్చినావు గనుక నమస్కారము.
  4. నాతో మాట్లాడుటకు వచ్చినావు గనుక నమస్కారము.
  5. నన్ను రక్షించుటకై వచ్చినావు గనుక నమస్కారము.

శుద్ధి ప్రకరణము

ఒప్పుదల:-

  1. పది ఆజ్ఞలను బట్టి పరీక్ష చేసికొనవలెను.
  2. నీలో ఉన్న పొరపాట్లు, తప్పులు, నేరములు, పాపములు ఒప్పుకొనవలెను. చేయకూడనివి ఏవి చేసినావో, చేయవలసినవి ఏవి చేయలేదో వాటిని ఒప్పుకొనవలెను.
  3. తలంపు, మాటలు, ప్రయత్నములోని పాపములు ఒప్పుకొనవలెను. (ఏకాంత స్థలము కోరుము అనే కీర్తనలో 1,2,3 చరణములు)
  4. దేవునిమీద ఎప్పుడైనను విసుగుకొన్నావా?
  5. జంతువులకు సరిగా ఆహారము పెట్టకపోవుట (15వ వచనము).
  6. దేవుడు నీకిచ్చిన వస్తువులను జాగ్రత్తగా వాడకపోవుట
  7. నీ కుండకు చిల్లిపడితే దానిని పూడ్చనందున నీళ్ళన్నీ కారిపోవును. ఇది అజాగ్రత్త పాపము.
  8. దేవుడిచ్చిన శరీరమును సరిగా శుభ్రము చేయకపోవుట, అరికాళ్ళు కడుగుకొనకుండా కాళ్ళు కడుగుకొనుట
  9. పరులకు విరోధముగా చేసినవి (5 వ వచనము)
  10. ఇతరులకు చేయవలసిన ఉపకారములు చేయకపోవుట. షరా: ఒకరికి రూపాయి ఇవ్వలనుకొని ఇవ్వకపోవుట, ఒక జబ్బుగా నున్న వ్యక్తి దగ్గర ప్రార్ధన చేయాలనుకొని చేయకపోవుట.

పది ఆజ్ఞల వివరము

1వ ఆజ్ఞ :- "నీ దేవుడైన యెహోవాను నేనే; నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందైనను, క్రింది భూమియందైనను, భూమి క్రింద నీళ్ళయందైనను  నుండు దేని రూపమునుగాని నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు".


దేవునికి బదులుగానుండు ప్రతిదియు పాపము


బహిరంగ విగ్రహము: సొమ్మును, కీర్తిని, పనిని, సౌఖ్యమును, మందులను, విద్యను, జనమును, ఆస్తిని, పొలములను, పశ్వాదులను, ఇండ్లను, పుస్తకాలను, తోటలను, ఆరోగ్యము ; ఈ పై వాటిని డెవునికంటె ఎక్కువగా ప్రేమించరాదు. నమ్మరాదు. విగ్రహములకు అర్పించరాదు.  చింతగలవారు దేవుని నమ్మనట్లే.


భయపడుట: కరువులకు, వ్యాధులకు, విషపురుగులకు, క్రూరజంతువులకు, నిందలకు, దయ్యములకు, గాలివానలకు, వరదలకు, పిడుగులకు, ఉరుములకు, భూకంపములకు, దొంగలకు, మరణమునకు, నరకమునకు, దుష్ట స్వప్నములకు, తలంచని పాపమునకు, మరి దేనికైనను భయపడరాదు. కేవలము దేవునికి మాత్రమే భయపడవలెను.


నాస్తికత్వము: దేవుని తలంపు లేకుండుట, దేవుని యెడల నిర్లక్ష్యము, దేవుని సంగతుల యెడల నిర్లక్ష్యము, దైవ విషయములో మందము, దేవుడు చూడనట్లు చూచుట, ప్రతి పనిలో ఆదిని దేవుని తలంచకుండుట, దేవుడున్నాడనునది అనిశ్చయము, దైవ విషయములు తెలిసికొనకుండుట, మూఢ భక్తి.


చేయవలసిన విధులు:

  1. కొంత నేను, కొంత దేవుడు ఉండకూడదు. దైవ భయము ఉండవలెను. దాస భయము కూడదు.
  2. శిశు భీతి ఉండవలెను.
  3. దైవ ప్రేమకలిగి ఉండవలెను.
  4. నమ్ముట - సమస్తమైన వాటికంటె ఆయనను నమ్మవలెను.

షరా: నమ్మితే చింత ఉండదు, నమ్మితే ఆనందముండును, నమ్మితే దైవ భక్తి ఉండును. నమ్మితే చింత ఉండదు.


2వ ఆజ్ఞ:- "నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్ధముగా నుచ్ఛరింప కూడదు; యెహోవా తన నామమును వ్యర్ధముగా నుచ్ఛరింపువానిని నిర్దోషిగా ఎంచడు".

  • దైవ నామమును ఆలోచించకుండ ఎత్తుట, ఉలికిపడగా ఎత్తుట,  భక్తి లేకుండా వాక్యము చదువుట, భక్తి లేకుండా పాడుట, భక్తులను హేళనచేయుట, పవిత్ర సంగతులను హేళన చేయుట.
  • శపించుట: ఒకరికి కీడు కోరుట, కీడు రాగా ఆనందించుట, శాపము తొలగనందున ఆనంద లేమి.
  • ఒట్టు: సంభాషణలలో, పంచాయితీలలో, కోర్టులలో, ఊహించుటలో.
  • మంత్రములు: సోదె, సాముద్రికము, జ్యోతిష్యము, అశుభ భీతి, రహస్యములు తెలిసికొనుట.
  • అబద్ధములు:   బోధలలో  కల్పనలు
  • వంచన: వేషధారణ, లోకాశలచే సేవచేయుట

విధులు:  శ్రమలో, ఇబ్బందిలో, ప్రార్ధనలో, స్తుతిలో దుర్భుద్ధిని పారద్రోలుట, పాటలలో, ఉత్తరాలలో, దైవనామమును ఉచ్చరించవలెను. 


3వ ఆజ్ఞ:- "విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుకొనుటకు జ్ఞాపకముంచుకొనుము"

చేయనిశ్చయించుకొనవలసినవి: ఏకాంత స్థలము కోరుము అనే 58వ కీర్తనలో 4-14 చరణములు.


చేయకూడనివి: వాక్యము తిరస్కరించుట, గుడికి క్రమముగా వెళ్ళకపోవుట, గుడిలో పరధ్యానముగా నుండుట మొదలగు పనులు చేయరాదు. బజారుకు వెళ్ళవద్దు. ఒకవేళ ఇంటికి వచ్చినా కొనకూడదు. వార్తా పత్రికలు చదవవద్దు. శరీర సంబంధ విందులు కూడదు.ఉత్తరాల వ్రాతలు కూడదు.

చేయవలసినవి: బైబిలు చదువుట, ప్రార్థన చేయుట, కీర్తనలు పాడుట, బైబిలు నేర్చుకొనుట,  బైబిలు నేర్పుట.


4వ ఆజ్ఞ:- "నీకు మేలు కలుగునట్లును, నీవు భూమిమీద అనేక దినములు బ్రతుకునట్లును నీ తల్లిని, నీ తండ్రిని సన్మానింపుము".


చేయవలసినవి: తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, మారు తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, పాస్టర్లను, మిషనెరీలను, పంతుళ్ళను, సువార్తికులను, రాజులను, కోర్టులను, ఉద్యోగస్తులను, మనకంటే పెద్దవారలను, చిన్నవారైనను గౌరవపాత్రులైన ఉద్యోగస్తులైనవారిని గౌరవించవలెను. ఎవరినీ నీచముగా ఎంచవద్దు.


5వ ఆజ్ఞ:- "నరహత్య చేయకూడదు" చేయకూడనివి లేక ఉండకూడనివి: కోపము, వైరము, పగ, ఓర్వలేనితనము, అసూయ, పొట్లాడుట, కొట్టుట, యుద్ధము, ద్వేషము, త్రాగుట, అశ్రద్ధ, అనారికత, అశుభ్రత, దుఃఖపెట్టుట, జబ్బుపడుట, బాగుచేయింపకుండుట, హత్య, స్వహత్య, తిండిబోతుతనము, తిండి బాగా తినకుండుట, మితిమీరి తినుట, స్నానము చేయకుండుట. కులము హానికరము. బాల్య వివాహము కూడదు.

చేయవలసినవి: బీదలకు, రోగులకు, విచారగ్రస్తులకు, అనాధశాలలకు, వైద్య శాలలకు, సత్రములకు, సహాయ పడవలెను. సమయానుకూల ఉపవాసము చేయవలెను. జీవరాసులను బాధింపవద్దు.    చెట్లను, కొమ్మలను, అనవసరముగా నరకరాదు. జీవరాసులకు తగిన మేత పెట్టవలెను.


6వ ఆజ్ఞ:- "వ్యభిచరింపకూడదు" చేయకూడనివి: చెడుతలంపులు, బూతులు, చెడు సంభాషణలు, దుర్నీతి కథలు, దుర్నీతి పాటలు, పరియాచకములు, చెడు బొమ్మలు,గ్రుహ జీవన ఐక్యత లేకపోవుట; ఈ పై వాటిని విడిచిపెట్టవలెను.

  1. మేనరికము కూడదు
  2. అవిశ్వాసులతో హత్తియుండకూడదు

చేయవలసినవి: ఈ భూమిమీద దేవుడు ఏర్పాటు చేసిన అన్నివిషయములలో వివాహము ఘనమైనది. వివాహమును గౌరవించవలెను. ఏకమతస్తులై యుండవలెను.


7వ ఆజ్ఞ:- "దొంగిలింపకూడదు" చేయకూడనివి: దొంగతనము, దూబరి తనము, నిర్వ్యాపారము, మోసపు పనులు, చోరి, ఆస్తిని దాచుట, దొరికినవి దాచుట, అరువు తెచ్చుకొని ఇవ్వకుండుట, అప్పు తీర్చకుండుట, పనిలో బద్దకము, బలముండి భిక్షమెత్తుట, పందెములు, జూదములు, లాటరీలు, లంచాలు, వ్యాజ్యాలు, తిక్కెట్లు లేకుండా ప్రయాణము చేయుట, పనిలో అపనమ్మకము, స్వల్ప జీతములిచ్చుట, ఎక్కువ ధరలు, ఎక్కువ వడ్డీ, దగా పాలు, పిచ్చి కొలతలు, పశువులను వేరొకరి పొలమొలో నికి తోలుట, అనవసరముగా ఆస్తిని పాడుచేయుట, దేవుని దొంగిలించుట అనగా దశమ భాగము ఇవ్వకుండుట.

చేయవలసినవి:

  1. పొదుపరితనము
  2. ఆస్తిని వినియోగము చేయుట
  3. ధర్మము చేయుట
  4. దేవిడిచ్చినవి సరిగా అనుభవించుట

8వ ఆజ్ఞ:- "నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుక కూడదు" చేయకూడనివి: అసత్యము, మంచిపేరు చెడగొట్టుట, గుట్టు బైట పెట్టుట, స్నేహితుని పట్టించుట, చాడీలు, చెడ్డ వదంతులు, కొద్ది తప్పు కొండంత చేయుట, తప్పుగా అర్థము చేసికొనుట, సరిగా గ్రహింపకుండుట, చెడ్డవి అగపడునట్లు చేయుట, మోసము, మాయ వేషము, పెద్ద తప్పులను స్వల్పపరచుట, పొగుడుట, మాట నిలుపుకొనలేకపోవుట, నవ్వులాటల అబద్ధాలు, అనవసర అబద్ధాలు, వట్టి ఊఉహలు, నష్టము లేని అబద్ధాలు.

చేయవలసినవి: సత్యముగా నడచుట, మంచిపేరు కాపాడుట, సత్య విషయమై ప్రాణము పెట్టుట (హత సాక్షి) ఇతరుల మంచి పనిని చెప్పుకొనుట, కాపాడుట. 


9వ ఆజ్ఞ, 10వ ఆజ్ఞ:- "నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు". చేయకూడనివి: అత్యాశ, పాపనైజము, జన్మ పాపము, హక్కులేనివి కావలెననుకొనుట, అన్యాయముగా సంపాదింపకోరుట, ఇతరుల ఆస్తిని చూచి అసూయపడుట, లాలస, ఇచ్ఛము, బెదిరించుట, విడదీయుట.

చేయవలసినవి:ఇతరులవి వారికి ఇచ్చుట, మనస్సాక్షి చెప్పునది చేయుట, మనస్సాక్షిని కప్పివేయరాదు.


'ఏకాంత స్థలము కోరుము' అనే కీర్తన పాడవలెను. నీ పాపములు క్షమించబడెనని స్తుతించి, కొంతసేపు కనిపెట్టవలెను.

తీర్మానపు  ప్రకరణము

ఇది చిన్నదైనను గడ్డైనది.నాకు తెలిసిన ఏ పాపమును, ఏ పొరపాటునైనను చేయకుండా ఉంటానని నీ యెదుట తీర్మానము చేసికొనుచున్నాను.

సమర్పణ ప్రకరణము

యేసుప్రభువా!

  1. నా శరీరము నీకే సమర్పణ చేయుచున్నాను
  2. నా ఆత్మ
  3. నా ప్రాణము
  4. నా జ్ఞానము
  5. నా మనస్సాక్షి
  6. నా ఆస్తి యంతా
  7. నా కోరికలన్నీ
  8. నా ప్రార్ధనలన్నీ
  9. నా మనవులన్నీ
  10. నా గత కాలము
  11. నా నవీన కాలము
  12. నా భావి కాలము,
  13. నా  నష్టములు
  14. నా సదుపాయములు,
  15. నా సేవ,
  16. నా స్వజనులు

అన్నియు నీకే సమర్పించుచున్నాను.


"నీవేయని నమ్మిక", "తనువు నాదిదిగో"  అనే కీర్తనలు పాడుకొనవలెను. దావీదు కీర్తన 25, 31 అధ్యాయములు చదువవలెను.

వృద్ధి ప్రకరణము

వ్రతము మెట్టు

  1. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు త్రియేక దేవుడైయున్నారు.
  2. కుమారుడు యేసు క్రీస్తను పేరుమీద భూమి మీద వెలసియున్నారు.
  3. క్రీస్తు స్తాపించిన మతము క్రైస్తవ మతమే రక్షణ మతము.
  4. పాపము చేయకూడదు.
  5. పిశాచిని  అనుసరింప కూడదు.
  6. దేవదూతలు నాకు సహకారులై యున్నారు.
  7. ఎవరు ఏమి బోధించినను అది నా కాధారము కాదు, బైబిలే నాకు ఆధారము.
  8. క్రీస్తు ప్రభువు నన్ను నరకము నుండి తప్పించును.
  9. ఆయన నన్ను మోక్షమునకు తప్పక తీసికొని వెళ్ళును.

ఇదే నా వ్రతము, ఇదే నా మతము, ఇదే నా హితము. కష్టములు, సందేహములు వచ్చినను, ఇదే నేను ధ్యానించవలసినదై యున్నది. ఈ వృతము నా నైజమై యున్నది. ఇదే నా విశ్వాసమై యున్నది.

  1. నా నైజము పాపనైజమై యుండే సమయములో నేను నా వ్రతములో నిలిచియుండెదను.
  2. పాప క్రియలు, నా బలహీనతను బట్టి నా తీర్మానమునకు భిన్నముగా ఏదైన పాపములో పడినప్పుడు సహితము, ఇదే నేను ధ్యానించుచుందును. ఇదే నా వ్రతము.
  3. కష్టములు  అనగా ఇబ్బందులు, జబ్బులు, చిక్కులున్నప్పుడు సహితము ఇదే నా వ్రతము.
  4. నేను ఏది అడిగినను, దేవుడు నాకివ్వకపోయినను ఇదే నా వ్రతము. నాకు సంగతులు అర్ధము కానప్పుడు, సణుగుకొనుట కంటె ఊరుకొనుట నాకు క్షేమము. ఇదే నా వ్రతము.
  5. సంఘము, క్రైస్తవులు అనగా అన్ని మిషనుల క్రైస్తవులు, బోధకులు తప్పిపోవుట నాకు కనబడినను నా వ్రతమును వదలను.
  6. ప్రపంచములోని వారందరు క్రీస్తుమతము తప్పు అని బోధించుచున్నప్పుడు సహితము, నేను నా వ్రతమును మానను, ఇదే నా వ్రతము.
  7. భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు నేను ఎరిగియున్న సమస్తమును నశింపులోకి వచ్చేటప్పుడు సహితము ఇదే నా వ్రతము.
  8. నాకు దుస్థితి వచ్చినను  ఇదే నా వ్రతము.
  9. ఇంకను చెడగొట్టేవి ఏమైనను ఉన్నప్పుడు సహితము  ఇదే నా వ్రతము. ఏదైనను నశించును గాని నా వ్రతము నశించదు. నరకములోనికి వెళ్ళినను, అక్కడ నా వ్రతమును జ్ఞాపకము తెచ్చుకొందును. 'నీవు పాతాళము లోనికి దిగినను నేనక్కడ ఉన్నానని ' అన్నారు గనుక న వ్రతము నెరవేరును.
  10. 'దుస్థితి ' పాపము వచ్చినను, ఇదే నా వ్రతమని తీర్మానము చేసికొను చున్నాను. పైన ఉదహరించినవి రావలెనని కాదు. అవి రాకుండ నా శక్తి కొలది ప్రయత్నము చేయుదును. ఎన్నిటిని విడిచినను, ఈ నా వ్రతము విడువను.

 A) వ్రతము మెట్టు: యేసు ప్రభువా! ఎన్ని కష్టములు వచ్చినా నిన్ను విడిచి పెట్టను. నిన్ను మరచిపోను. యేసు ప్రభువా! ఎంత సుఖమున్నా, అన్ని కాలములలో, అన్ని వేళలలో, అన్ని స్థలములలో, అన్ని పనులలో అన్ని స్తితులలో, ఏమి చేసినా, ఎక్కడున్నా, నిన్ను విడిచి పెట్టను. నిన్ను మరిచిపోను. నిన్నే జ్ఞాపకము తెచ్చుకుటాను. నిన్ను మరచుట నాకసాధ్యము. నిద్రలో మెళకువ రాగానే నిన్నే తలంతును. నా ప్రార్థన నెరవేరినా, నెరవేరకపోయినను నిన్నే తలంచుకుంటాను. నిన్నే స్తుతించుదును. నిన్నే సేవించుదును. నిన్నే ప్రకటించెదను. ఏ దయ్యమైనా, ఏ దుష్టుడైన, ఏ జీవరాశియైనా, ఏ కష్టమైన,  ఏ సుఖమైన నాలోనుండి ఏమైన తీసివేయగలరు గాని ఈ నా వ్రతము తీసివేయజాలరు.


B) నిరుకు మెట్టు: ఇక మీదట నీ వాక్యము ప్రతి దినము ధ్యానింతును. ప్రతి దినము ప్రార్థింతును.  అందరి కొరకు ప్రార్థింతును. అన్నిటి కొరకు స్తుతింతును. ఎవరో ఒకరికైనను వాక్యము చెప్పెదను. గుడికి క్రమముగా వెళ్ళెదను. నా కానుక, దశమ భాగము ఇచ్చెదను. నా విధులన్నియు నెరవేర్చెదను. ఇదివరకే నాకు ప్రార్థన, స్తుతి, బైబిలు చదువుట, విశ్వాసము, చందావేయుట, పవిత్రత, జ్ఞానము మొదలైనవి ఉన్నవి గాని నేనిప్పుడు కోరుకొనేది 'నన్ను వృద్ధి చేయుమని '. 'యేసుని జూచుట ' అను కీర్తన పాడవలెను. దావీదు కీర్తన 119 చదివి కొంత విశ్రాంతి తీసుకొనవలెను.


విజ్ఞాపన ప్రార్థన:
A) భూగోళమంతటి ప్రకారము దేశములు, పట్టణములు మొదలైనవి జ్ఞాపకము చేసికొని, అక్కడున్న వారిని జ్ఞాపకము చేసికొని, వారిని గురించి ప్రార్థించవలెను. అన్ని మతములు, అన్ని మిషనులు, అన్ని ఆజ్ఞలు అనుసరించని వారిగురించి ప్రార్థించవలెను. ఒక్క మనిషినైనను మరిచి పోకూడదు. మంచివారిని గురించి, భక్తులను గురించి, పెండ్లికుమార్తెను గురించి ప్రార్థించవలెను. యోహాను 17వ అధ్యాయము చదివి, "ఎంతో సుందరమైనవి" అను కీర్తన పాడుకొని, కొంత సమయము 'విశ్రాంతి ' తీసికొనవలెను.


    B)
  1. ఆజ్ఞ:- విగ్రహారాధికులు, నాస్తికులు, అనిశ్చయపరులు, దేవుడుగల నాస్తికులు, దేవునికంటె సృష్టిలోని వాటిని ఎక్కువగా ప్రేమించువారు.
  2. ఆజ్ఞ:- దేవదూషకులు, నిర్భయముగా దేవుని నామమున ప్రమాణము చేయువారు, దేవునిని స్తుతించనివారు.
  3. ఆజ్ఞ:- ఆదివారమనగా లెక్కలేనివారు, ఆరాధనయందు గౌరవము లేనివారు, ఆదివారమును గౌరవింపని వారు.
  4. ఆజ్ఞ:-తల్లిదండ్రులను గౌరవింపని వారు, పెద్దలను గౌరవింపని వారు, మంచి స్థితి గలవారిని గౌరవింపని వారు.
  5. ఆజ్ఞ:- నరహంతకులు, ఉపకారము చేయని వారు, ఆరోగ్యము కాపాడుకొననివారు, అన్యాయముగా యుద్ధములలో పాల్గొనినవారు.
  6. ఆజ్ఞ:- వ్యభిచారులు, కుటుంబములలో సమాధానము లేనివారు.
  7. ఆజ్ఞ:- దొంగతనము చేయువారు, అన్యాయ వర్తకులు, దశమ భాగమియ్యనివారు, దేవుడిచ్చు దానములను సరిగా వాడుకొనని వారు, సరకులను పాడుచేయువారు.
  8. ఆజ్ఞ:-కోర్టులలో అబద్ధ సాక్ష్యము పలుకువారు, ఇతరులను గూర్చి అల్లరి చేయువారు, చాడీలు చెప్పువారు, ఇతరుల గొప్పస్థితిని గూర్చి మంచిగా మాట్లాడని వారు.
  9. ఆజ్ఞ:- వివాహమును గౌరవించని వారు, పరుల కుటుంబముల జోలికి పొవువారు.
  10. ఆజ్ఞ:- ఆశించకూడనిది ఏదైనను సరే ఆశించువారు, దురాలోచన గలవారు, ప్రతిదానిని తప్పు అర్థము చేయువారు, అనుమానపడువారు, చెడ్డ సంగతులను కల్పించువారు, అబద్ధికులును, మంచిని చెడుగాను మరియు చెడుగును మంచిగాను మార్చి చెప్పువారు, కలహములు పెట్టువారు, పిరికితనము గలవారు, కపటాలోచన గలవారు, కృపను ద్వేషించువారు, మనస్సాక్షిని ఎదిరించువారు, ఏదియు నమ్మనివారు, స్వలాభము చూచుకొనువారు, తిండిబోతులు, జూదగాళ్ళు, అప్పుల పాలగువారు, శక్తిపూజ చేయువారు, క్రీస్తు మత ద్వేషకులు, బైబిలు భావములు పెడర్ధములు చేయువారు, శుద్ధి శుభ్రత లేనివారు మొదలగు వారిని గూర్చి ప్రార్ధించవలెను.

C) ప్రత్యేక అంశప్రార్థన ఏదైన ఉంటె ఇప్పుడు ఆ ప్రార్థన చేయవలెను. జబ్బులు, ఇబ్బందులు, అవమానములు, శ్రమలు, నవీనకాలపు, ఆపదలు ఈ మొదలైన వాటిని గురించి ప్రార్థించవలెను. 'నాకేమి కొదువ ', 'పాపికాశ్రయుడవు ' అను కీర్తనలు పాడవలెను.

స్తుతి ప్రకరణము

1) అపకార నివారణ స్తుతి: అనగా కలిగిన నష్టములు, గండములనుండి ప్రభువు విమోచించిన సంగతి తలంచుకొని ఆయనను స్తుతించుట. షరా: ఓ ప్రభువా! నా జబ్బునుండి తప్పించినావు గనుక స్తోత్రములు. ఓ ప్రభువా! ఇబ్బందినుండి తప్పించినావు గనుక స్తోత్రములు. ఈలాగు, ఎన్ని గండములు, కష్టములు, వ్యాధులు, వచ్చినవో ఒక్కొక్కొటి తలంచుకొని ప్రభువును స్తుతించవలెను.


2) ఉపకార దాన స్తుతి: దేవుడు ఎన్ని మేళ్ళు చేసెనో, నీకు ఏమి దానముగా ఇచ్చెనో, వాటన్నిటిని తలంచి ఒక్కొక్క దానినిగూర్చి స్తుతిచేయవలెను.శరీర దానము, ఆహార దానము, వస్త్రదానము ఈ మొదలగునవి. అవి మాత్రమేగాక కుమార దానము, వాక్యదానం, సంఘదానము ఇట్లు అన్ని తలంచి స్తుతించవలెను.

దైవ లక్షణముల స్తుతి:  దైవలక్షణముల స్తుతి చేయవలెను.
1) ప్రేమ: తండ్రీ! నీవు ప్రేమవైయున్నావు. నీవు ప్రేమవై యున్నందుకు స్తోత్రములు. నీలోని లక్షణములను మానవులమైన మేము అనుభవించుటకు, వాటితో మనుష్యులను కలుగజేసియున్నావు. కాబట్టి నీకు స్తోత్రములు. మేము పుట్టకముందే, నిన్ను ప్రేమింపక ముందే, నీవు మమ్మును ప్రేమించినావు స్తోత్రములు. మేము పాపులమై యుందుమనియు, అవిధేయులమై యుందుమనియు, నీకు ముందే తెలిసినప్పటికిని నీవు మమ్మును ప్రేమించుచున్నావు. మా మీద నీకున్న ప్రేమను చూపించేటందుకు, నా విషయమై దేవదూతలను పరిచారకులుగాను, భూమిని నివాస స్థలముగాను కలుగజేసినావు. స్తోత్రములు. మేము చెడిపోతే రక్షించుటకు, నీ ప్రియ కుమారుని పంపించినావు స్తోత్రములు. నీ కుమారుని ఇవ్వడమువల్ల మాకు సమస్తమును ఇచ్చివేసినావు. నీకు స్తోత్రములు. మేము నీ ప్రేమకు ఎమి చెల్లింపగలము! తిరిగి నిన్ను ప్రేమించుటవల్ల నీ ఋణము తీర్చుకొనగలము. ఓ ప్రేమగల తండ్రీ! ఓ కటాక్షముగల తండ్రీ! నీ ప్రేమ లక్షణమును, నీ ప్రేమ క్రియలను, నీ ప్రేమ పిలుపులకును, నీ ప్రేమ సహవాసమునకును, నీవు బైబిలులో వ్రాయించిన ప్రేమగల మాటలకును అనేక స్తోత్రములు. మేము కష్టములలోను, ఇబ్బందులలోను, శోధనలలోను, మాకు వెంటనే సహాయము కలుగపోవుట చూచి, నీవు ప్రేమలేనివాడవని పొరబాటున అనుకొనే బలహీనులమై యున్నాము. నీ ప్రేమను మేము గ్రహించక పోవుట మా తప్పు అయియున్నది. నీ ప్రేమయొక్క ఎత్తైయినను, వెడల్పైనను గ్రహించలేము. ఇంత గొప్ప ప్రేమతో మమ్మును ఆవరించుకొనుచున్న తండ్రీ! నీకు స్తోత్రములు. ఈ మా స్తోత్రములను నీ ప్రేమ కుమారుడును, మా ప్రభువైన యేసు పరిముఖమున వేడుకొనుచున్నాము. ఆమేన్.

2) సర్వ శక్తి:

3) సర్వ న్యాయము
4) సర్వాధికారి
5) దైవ స్థితి
6) పరిశుద్ధత
7) సర్వ వ్యాపకత్వము
8) జీవము
9) జ్ఞానము
10) నిరాకారము
11) స్వతంత్రత
12) త్రిత్వము

కనిపెట్టు ప్రకరణము

విమోచన ప్రార్థన ప్రకరణము

ఉపవాసము చేయు విధములు

Close

Access Restricted.