Old
New
యోబు గ్రంథము Job अय्यूब - 15
- అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగునప్రత్యుత్తరమిచ్చెను
- జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా?తూర్పుగాలితో తన కడుపు నింపుకొన దగునా?
- వ్యర్థసంభాషణచేత వ్యాజ్యెమాడ దగునా?నిష్ ప్రయోజనమైన మాటలచేత వాదింప దగునా?
- నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు.దేవునిగూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.
- నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది.వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.
- నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవినీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి.
- మొదట పుట్టిన పురుషుడవు నీవేనా?నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా?
- నీవు దేవుని ఆలోచనసభలో చేరియున్నవాడవా?నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?
- మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు?మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు?
- నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సుమీరిన పురుషులును మాలో నున్నారునీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు.
- దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా?ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యముతేలికగా నున్నదా?
- నీ హృదయము ఏల క్రుంగిపోయెను?నీ కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి?
- దేవునిమీద నీవేల ఆగ్రహపడుచున్నావు? నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు?
- శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?
- ఆలోచించుము ఆయన తన దూతలయందు నమి్మకయుంచడు.ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.
- అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లుత్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అప విత్రుడు గదా.
- నా మాట ఆలకింపుము నీకు తెలియజేతునునేను చూచినదానిని నీకు వివరించెదను.
- జ్ఞానులు తమ పితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను.
- అన్యులతో సహవాసము చేయకతాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించినజ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.
- తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందునుహింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడుబాధనొందును.
- భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు.
- తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు.
- అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగు లాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును.
- శ్రమయు వేదనయు వానిని బెదరించును.యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టు కొనునట్లు అవి వానిని పట్టుకొనును.
- వాడు దేవునిమీదికి చేయి చాపునుసర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.
- మూర్ఖుడై ఆయనను మార్కొనునుతన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును.
- వాని ముఖము క్రొవ్వు పట్టియున్నదివాని చిరుప్రక్కలపైని క్రొవ్వుకండలు పెరిగియున్నవి.
- అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురుఎవరును నివసింపకూడని యిండ్లలోదిబ్బలు కావలసియున్న యిండ్లలో నివసించెదరు
- కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు.వారి సస్యసంపద పంట బరువై నేలకు వంగదు
- వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేతకొమ్మలను దహించునుదేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు.
- వారు మాయను నమ్ముకొనకుందురు గాక;వారు మోస పోయినవారుమాయయే వారికి ఫలమగును.
- వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.
- ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారినిరాల్చును.ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారినిాల్చును.
- భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును.లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును
- వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపముకందురువారి కడుపున కపటము పుట్టును.
- Then Eliphaz the Temanite answered and said:
- "Should a wise man answer with windy knowledge, and fill his belly with the east wind?
- Should he argue in unprofitable talk, or in words with which he can do no good?
- But you are doing away with the fear of God and hindering meditation before God.
- For your iniquity teaches your mouth, and you choose the tongue of the crafty.
- Your own mouth condemns you, and not I; your own lips testify against you.
- "Are you the first man who was born? Or were you brought forth before the hills?
- Have you listened in the council of God? And do you limit wisdom to yourself?
- What do you know that we do not know? What do you understand that is not clear to us?
- Both the gray-haired and the aged are among us, older than your father.
- Are the comforts of God too small for you, or the word that deals gently with you?
- Why does your heart carry you away, and why do your eyes flash,
- that you turn your spirit against God and bring such words out of your mouth?
- What is man, that he can be pure? Or he who is born of a woman, that he can be righteous?
- Behold, God puts no trust in his holy ones, and the heavens are not pure in his sight;
- how much less one who is abominable and corrupt, a man who drinks injustice like water!
- "I will show you; hear me, and what I have seen I will declare
- (what wise men have told, without hiding it from their fathers,
- to whom alone the land was given, and no stranger passed among them).
- The wicked man writhes in pain all his days, through all the years that are laid up for the ruthless.
- Dreadful sounds are in his ears; in prosperity the destroyer will come upon him.
- He does not believe that he will return out of darkness, and he is marked for the sword.
- He wanders abroad for bread, saying, 'Where is it?' He knows that a day of darkness is ready at his hand;
- distress and anguish terrify him; they prevail against him, like a king ready for battle.
- Because he has stretched out his hand against God and defies the Almighty,
- running stubbornly against him with a thickly bossed shield;
- because he has covered his face with his fat and gathered fat upon his waist
- and has lived in desolate cities, in houses that none should inhabit, which were ready to become heaps of ruins;
- he will not be rich, and his wealth will not endure, nor will his possessions spread over the earth;
- he will not depart from darkness; the flame will dry up his shoots, and by the breath of his mouth he will depart.
- Let him not trust in emptiness, deceiving himself, for emptiness will be his payment.
- It will be paid in full before his time, and his branch will not be green.
- He will shake off his unripe grape like the vine, and cast off his blossom like the olive tree.
- For the company of the godless is barren, and fire consumes the tents of bribery.
- They conceive trouble and give birth to evil, and their womb prepares deceit."
- तब तेमानी एलीपज ने कहा,
- क्या बुध्दिमान को उचित है कि अज्ञानता के साथ उत्तर दे, वा उपने अन्तेकरण को पूरबी पवन से भरे?
- क्या वह निष्फल वचनों से, वा व्यर्थ बातों से वादविवाद करे?
- वरन तू भय मानना छोड़ देता, और ईश्वर का ध्यान करना औरों से छुड़ाता है।
- तू अपने मुंह से अपना अधर्म प्रगट करता है, और धूर्त्त लोगों के बोलने की रीति पर बोलता है।
- मैं तो नहीं परन्तु तेरा मुंह ही तुझे दोषी ठहराता है; और तेरे ही वचन तेरे विरूद्ध साक्षी देते हैं।
- क्या पहिला मतुष्य तू ही उत्पन्न हुआ? क्या तेरी उत्पत्ति पहाड़ों से भी पहिले हुई?
- क्या तू ईश्वर की सभा में बैठा सुनता था? क्या बुध्दि का ठीका तू ही ने ले रखा है?
- तू ऐसा क्या जानता है जिसे हम नहीं जानते? तुझ में ऐसी कौन सी समझ है जो हम में नहीं?
- हम लोगों में तो पक्के बालवाले और अति पुरनिये मनुष्य हैं, जो तेरे पिता से भी बहुत आयु के हैं।
- ईश्वर की शान्तिदायक बातें, और जो वचन तेरे लिये कोमल हैं, क्या ये तेरी दृष्टि में तुच्छ हैं?
- तेरा मन क्यों तुझे खींच ले जाता है? और तू आंख से क्यों सैन करता है?
- तू भी अपनी आत्मा ईश्वर के विरूद्ध करता है, और अपने मुंह से व्यर्थ बातें निकलने देता है।
- मनुष्य है क्या कि वह निष्कलंक हो? और जो स्त्री से उत्पन्न हुआ वह है क्या कि निदष हो सके?
- देख, वह अपने पवित्रों पर भी विश्वास नहीं करता, और स्वर्ग भी उसकी दृष्टि में निर्मल नहीं है।
- फिर मनुष्य अधिक घिनौना और मलीन है जो कुटिलता को पानी की नाई पीता है।
- मैं तुझे समझा दूंगा, इसलिये मेरी सुन ले, जो मैं ने देखा है, उसी का वर्णन मैं करता हूँ।
- (वे ही बातें जो बुध्दिमानों ने अपने पुरखाओं से सुनकर बिना छिपाए बताया है।
- केवल उन्हीं को देश दिया गया था, और उनके मध्य में कोई विदेशी आता जाता नहीं था।)
- दुष्ट जन जीवन भर पीड़ा से तड़पता है, और बलात्कारी के वष की गिनती ठहराई हुई है।
- उसके कान में डरावना शब्द गूंजता रहता है, कुशल के समय भी नाशक उस पर आ पड़ता है।
- उसे अन्ध्यिारे में से फिर निकलने की कुछ आशा नहीं होती, और तलवार उसकी घात में रहती है।
- वह रोटी के लिये मारा मारा फिरता है, कि कहां मिलेगी। उसे निश्चय रहता है, कि अन्धकार का दिन मेरे पास ही है।
- संकट और दुर्घटना से असको डर लगता रहता है, ऐसे राजा की नाई जो युठ्ठ के लिये तैयार हो, वे उस पर प्रबल होते हैं।
- उस ने तो ईश्वर के विरूद्ध हाथ बढ़ाया है, और सर्वशक्तिमान के विरूद्ध वह ताल ठोंकता है,
- और सिर उठाकर और अपनी मोटी मोटी ढालें दिखाता हुआ घमणड से उस पर धावा करता है;
- इसलिये कि उसके मुंह पर चिकनाई छा गई है, और उसकी कमर में चब जमी है।
- और वह उजाड़े हुए नगरों में बस गया है, और जो घर रहने योग्य नहीं, और खणडहर होने को छोड़े गए हैं, उन में बस गया है।
- वह धनी न रहेगा, और न उसकी सम्पत्ति बनी रहेगी, और ऐसे लोगों के खेत की उपज भूमि की ओर न भुकने पाएगी।
- वह अन्धियारे से कभी न निकलेगा, और उसकी डालियां आग की लपट से झुलस जाएंगी, और ईश्वर के मुंह की श्वास से वह उड़ जाएगा।
- वह अपने को धोखा देकर व्यर्थ बातों का भरोसा न करे, क्योंकि उसका बदला धोखा ही होगा।
- वह उसके नियत दिन से पहिले पूरा हो जाएगा; उसकी डालियां हरी न रहेंगी।
- दाख की नाई उसके कच्चे फल झड़ जाएंगे, और उसके फूल जलपाई के वृक्ष के से गिरेंगे।
- क्योंकि भक्तिहीन के परिवार से कुछ बन न पड़ेगा, और जो घूस लेते हैं, उनके तम्बू आग से जल जाएंगे।
- उनके उपद्रव का पेट रहता, और अनर्थ उत्पन्न होता हैे और वे अपने अन्तेकरण में छल की बातें गढ़ते हैं।