Old
New
యోబు గ్రంథము Job अय्यूब - 28
- వెండికి గని గలదు పుటమువేయు సువర్ణమునకు స్థలము గలదు.
- ఇనుమును మంటిలోనుండి తీయుదురు రాళ్లు కరగించి రాగి తీయుదురు.
- మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యంతముల వరకు సంచరింతురు.
- జనులు తిరుగు స్థలములకు చాల దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు వారు పైసంచరించువారిచేత మరువబడుదురు అచ్చట వారు మానవులకు దూరముగానుండి ఇటు అటు అల్లాడుచుందురు.
- భూమినుండి ఆహారము పుట్టును దాని లోపలిభాగము అగ్నిమయమైనట్లుండును.
- దాని రాళ్లు నీలరత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి.
- ఆ త్రోవ యే క్రూరపక్షికైనను తెలియదు డేగ కన్నులు దాని చూడలేదు
- గర్వముగల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు
- మనుష్యులు స్ఫటికమువంటి బండను పట్టుకొందురు పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు.
- బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును.
- నీళ్లు ఓడిగిలిపోకుండ వారు జలధారలకు గట్టు కట్టు దురు మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించు దురు
- అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది?
- నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు.
- అగాధము అది నాలో లేదనును సముద్రమునాయొద్ద లేదనును.
- సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు.
- అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు.
- సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్య బడదు.
- పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది
- కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు.
- అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది?
- అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది.
- మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును.
- దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.
- ఆయన భూమ్యంతములవరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింది దానినంతటిని తెలిసికొనుచున్నాడు.
- గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి నప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు
- వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచి నప్పుడు
- ఆయన దాని చూచి బయలుపరచెను దానిని స్థాపనచేసి దాని పరిశోధించెను.
- మరియుయెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరు లకు సెలవిచ్చెను.
- "Surely there is a mine for silver, and a place for gold that they refine.
- Iron is taken out of the earth, and copper is smelted from the ore.
- Man puts an end to darkness and searches out to the farthest limit the ore in gloom and deep darkness.
- He opens shafts in a valley away from where anyone lives; they are forgotten by travelers; they hang in the air, far away from mankind; they swing to and fro.
- As for the earth, out of it comes bread, but underneath it is turned up as by fire.
- Its stones are the place of sapphires, and it has dust of gold.
- "That path no bird of prey knows, and the falcon's eye has not seen it.
- The proud beasts have not trodden it; the lion has not passed over it.
- "Man puts his hand to the flinty rock and overturns mountains by the roots.
- He cuts out channels in the rocks, and his eye sees every precious thing.
- He dams up the streams so that they do not trickle, and the thing that is hidden he brings out to light.
- "But where shall wisdom be found? And where is the place of understanding?
- Man does not know its worth, and it is not found in the land of the living.
- The deep says, 'It is not in me,' and the sea says, 'It is not with me.'
- It cannot be bought for gold, and silver cannot be weighed as its price.
- It cannot be valued in the gold of Ophir, in precious onyx or sapphire.
- Gold and glass cannot equal it, nor can it be exchanged for jewels of fine gold.
- No mention shall be made of coral or of crystal; the price of wisdom is above, pearls.
- The topaz of Ethiopia cannot equal it, nor can it be valued in pure gold.
- "From where, then, does wisdom come? And where is the place of understanding?
- It is hidden from the eyes of all living and concealed from the birds of the air.
- Abaddon and Death say, 'We have heard a rumor of it with our ears.'
- "God understands the way to it, and he knows its place.
- For he looks to the ends of the earth and sees everything under the heavens.
- When he gave to the wind its weight and apportioned the waters by measure,
- when he made a decree for the rain and a way for the lightning of the thunder,
- then he saw it and declared it; he established it, and searched it out.
- And he said to man, 'Behold, the fear of the Lord, that is wisdom, and to turn away from evil is understanding.'"
- चांदी की खानि तो होती है, और सोने के लिये भी स्थान होता है जहां लोग ताते हैं।
- जोहा मिट्टी में से निकाला जाता और पत्थर पिघलाकर पीतल बनाया जाता है
- मनुष्य अन्धियारे को दूर कर, दूर दूर तक खोद खोद कर, अन्धियारे ओर घोर अन्धकार में पत्थर ढूंढ़ते हैं।
- जहां लोग रहते हैं वहां से दूर वे खानि खोदते हैं वहां पृथ्वी पर चलनेवालों के भूले बिसरे हुए वे मनुष्यों से दूर लटके हुए झूलते रहते हैं।
- यह भूमि जो है, इस से रोटी तो मिलती है, परन्तु उसके नीचे के स्थान मानो आग से उलट दिए जाते हैं।
- उसके पत्थ्र नीलमणि का स्थान हैं, और उसी में सोने की धूलि भी है।
- उसका मार्ग कोई मांसाहारी पक्षी नहीं जानता, और किसी गिठ्ठ की दृष्टि उस पर नहीं पड़ी।
- उस पर अभिमानी पशुओं ने पांव नहीं धरा, और न उस से होकर कोई सिंह कभी गया है।
- वह चकमक के पत्थर पर हाथ लगाता, और पहाड़ों को जड़ ही से उलट देता है।
- वह चट्टान खोदकर नालियां बनाता, और उसकी आंखों को हर एक अनमोल वस्तु दिखाई पड़ती है।
- वह नदियों को ऐसा रोक देता है, कि उन से एक बूंद भी पानी नहीं टपकता और जो कुछ छिपा है उसे वह उजियाले में निकालता है।
- परन्तु बुध्दि कहां मिल सकती है? और समझ का स्थान कहां है?
- उसका मोल मनुष्य को मालूम नहीं, जीवनलोक में वह कहीं नहीं मिलती !
- अथाह सागर कहता है, वह मुझ में नहीं है, और समुद्र भी कहता है, वह मेरे पास नहीं है।
- चोखे सोने से वह मोल लिया नहीं जाता। और न उसके दाम के लिये चान्दी तौली जाती है।
- न तो उसके साथ ओपीर के कुन्दन की बराबरी हो सकती है; और न अनमोल सुलैमानी पत्थर वा नीलमणि की।
- न सोना, न कांच उसके बराबर ठहर सकता है, कुन्दन के गहने के बदले भी वह नहीं मिलती।
- मूंगे और स्फटिकमणि की उसके आगे क्या चर्चा ! बुध्दि का मोल माणिक से भी अधिक है।
- कूश देश के पद्मराग उसके तुल्य नहीं ठहर सकते; और न उस से चोखे कुन्दन की बराबरी हो सकती है।
- फिर बुध्दि कहां मिल सकती है? और समझ का स्थान कहां?
- वह सब प्राणियों की आंखों से छिपी है, और आकाश के पक्षियों के देखने में नहीं आती।
- विनाश ओर मृत्यु कहती हैं, कि हमने उसकी चर्चा सुनी है।
- परन्तु परमेश्वर उसका मार्ग समझता है, और उसका स्थान उसको मालूम है।
- वह तो पृथ्वी की छोर तक ताकता रहता है, और सारे आकाशमणडल के तले देखता भालता है।
- जब उस ने वायु का तौल ठहराया, और जल को नपुए में नापा,
- और मेंह के लिये विधि और गर्जन और बिजली के लिये मार्ग ठहराया,
- तब उस ने बुध्दि को देखकर उसका बखान भी किया, और उसको सिठ्ठ करके उसका पूरा भेद बूझ लिया।
- तब उस न मनुष्य से कहा, देख, प्रभु का भय मानना यही बुध्दि हैे और बुराई से दूर रहना यही समझ है।