Old
New
సామెతలు Proverbs नीतिवचन - 14
- జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ... బెరుకును.
- యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులుగలవాడు కుటిలచిత్తుడు ఆయనను తిరస్కరించువాడు,
- మూఢుల నోట బెత్తమువంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును.
- ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు ఎద్దుల బలముచేత విస్తారము వచ్చుబడి కలుగును
- నమ్మక మైన సాక్షి అబద్ధమాడడు కూటసాక్షికి అబద్ధములు ప్రియములు.
- అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము. తెలివిగలవానికి జ్ఞానము సులభము.
- బుద్ధిహీనుని యెదుటనుండి వెళ్లిపొమ్ము జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా?
- తమ ప్రవర్తనను కనిపెట్టి యుండుట వివేకుల జ్ఞానము నకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరచు మూఢత.
- మూఢులు చేయు అపరాధపరిహారార్థబలి వారిని అపహాస్యము చేయును యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయ చూపుదురు.
- ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానే రడు.
- భక్తిహీనుల యిల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్థిల్లును.
- ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.
- ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండ వచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును.
- భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును.
- జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.
- జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.
- త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలుగలవాడు ద్వేషింపబడును.
- జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు.
- చెడ్డవారు మంచివారి యెదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు.
- దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు.
- తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయు వాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు.
- కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు.
- ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు.
- జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే.
- నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును అబద్ధములాడువాడు వట్టి మోసగాడు.
- యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును
- అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును
- జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము.
- దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొం దును.
- సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.
- దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించు వాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు.
- అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
- తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివా సము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును
- నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును.
- బుద్ధిగల సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరముగా నడచువానిమీద రాజు కోపించును
- The wisest of women builds her house, but folly with her own hands tears it down.
- Whoever walks in uprightness fears the LORD, but he who is devious in his ways despises him.
- By the mouth of a fool comes a rod for his back, but the lips of the wise will preserve them.
- Where there are no oxen, the manger is clean, but abundant crops come by the strength of the ox.
- A faithful witness does not lie, but a false witness breathes out lies.
- A scoffer seeks wisdom in vain, but knowledge is easy for a man of understanding.
- Leave the presence of a fool, for there you do not meet words of knowledge.
- The wisdom of the prudent is to discern his way, but the folly of fools is deceiving.
- Fools mock at the guilt offering, but the upright enjoy acceptance.
- The heart knows its own bitterness, and no stranger shares its joy.
- The house of the wicked will be destroyed, but the tent of the upright will flourish.
- There is a way that seems right to a man, but its end is the way to death.
- Even in laughter the heart may ache, and the end of joy may be grief.
- The backslider in heart will be filled with the fruit of his ways, and a good man will be filled with the fruit of his ways.
- The simple believes everything, but the prudent gives thought to his steps.
- One who is wise is cautious and turns away from evil, but a fool is reckless and careless.
- A man of quick temper acts foolishly, and a man of evil devices is hated.
- The simple inherit folly, but the prudent are crowned with knowledge.
- The evil bow down before the good, the wicked at the gates of the righteous.
- The poor is disliked even by his neighbor, but the rich has many friends.
- Whoever despises his neighbor is a sinner, but blessed is he who is generous to the poor.
- Do they not go astray who devise evil? Those who devise good meet steadfast love and faithfulness.
- In all toil there is profit, but mere talk tends only to poverty.
- The crown of the wise is their wealth, but the folly of fools brings folly.
- A truthful witness saves lives, but one who breathes out lies is deceitful.
- In the fear of the LORD one has strong confidence, and his children will have a refuge.
- The fear of the LORD is a fountain of life, that one may turn away from the snares of death.
- In a multitude of people is the glory of a king, but without people a prince is ruined.
- Whoever is slow to anger has great understanding, but he who has a hasty temper exalts folly.
- A tranquil heart gives life to the flesh, but envy makes the bones rot.
- Whoever oppresses a poor man insults his Maker, but he who is generous to the needy honors him.
- The wicked is overthrown through his evildoing, but the righteous finds refuge in his death.
- Wisdom rests in the heart of a man of understanding, but it makes itself known even in the midst of fools.
- Righteousness exalts a nation, but sin is a reproach to any people.
- A servant who deals wisely has the king's favor, but his wrath falls on one who acts shamefully.
- हर बुद्धिमान स्त्री अपने घर को बनाती है, पर मूढ़ स्त्री उसको अपने ही हाथों से ढा देती है।
- जो सीधाई से चलता वह यहोवा का भय माननेवाला है, परन्तु जो टेढ़ी चाल चलता वह उसको तुच्छ जाननेवाला ठहरता है।
- मूढ़ के मुंह में गर्व का अंकुर है, परन्तु बुद्धिमान लोग अपने वचनों के द्वारा रक्षा पाते हैं।
- जहां बैल नहीं, वहां गौशाला निर्मल तो रहती है, परन्तु बैल के बल से अनाज की बढ़ती हाती है।
- सच्चा साक्षी झूठ नहीं बोलता, परन्तु झूठा साक्षी झूठी बातें उड़ाता है।
- ठट्ठा करनेवाला बुद्धि को ढूंढ़ता, परन्तु नहीं पाता, परन्तु समझवाले को ज्ञान सहज से मिलता है।
- मूर्ख से अलग हो जा, तू उस से ज्ञान की बात न पाएगा।
- चतुर की बुद्धि अपनी चाल का जानना है, परन्तु मूर्खों की मूढ़ता छल करना है।
- मूढ़ लोग दोषी होने को ठट्ठा जानते हैं, परन्तु सीधे लोगों के बीच अनुग्रह होता है।
- मन अपना ही दु:ख जानता है, और परदेशी उसके आनन्द में हाथ नहीं डाल सकता।
- दुष्टों को घर विनाश हो जाता है, परन्तु सीधे लोगों के तम्बू में आबादी होती है।
- ऐसा मार्ग है, जो मनुष्य को ठीक देख पड़ता है, परन्तु उसके अन्त में मृत्यु ही मिलती है।
- हंसी के समय भी मन उदास होता है, और आनन्द के अन्त में शोक होता है।
- जिसका मन ईश्वर की ओर से हट जाता है, वह अपनी चालचलन का फल भोगता है, परन्तु भला मनुष्य आप ही आप सन्तुष्ट होता है।
- भोला तो हर एक बात को सच मानता है, परन्तु चतुर मनुष्य समझ बूझकर चलता है।
- बुद्धिमान डरकर बुराई से हटता है, परन्तु मूर्ख ढीठ होकर निडर रहता है।
- जो झट क्रोध करे, वह मूढ़ता का काम भी करेगा, और जो बुरी युक्तियां निकालता है, उस से लोग बैर रखते हैं।
- भोलों का भाग मूढ़ता ही होता है, परन्तु चतुरों को ज्ञानरूपी मुकुट बान्धा जाता है।
- बुरे लोग भलों के सम्मुख, और दुष्ट लोग धर्मी के फाटक पर दण्डवत् करते हैं।
- निर्धन का पड़ोसी भी उस से घृणा करता है, परन्तु धनी के बहुतेरे प्रेमी होते हैं।
- जो अपने पड़ोसी को तुच्छ जानता, वह पाप करता है, परन्तु जो दीन लोगों पर अनुग्रह करता, वह धन्य होता है।
- जो बुरी युक्ति निकालते हैं, क्या वे भ्रम में नहीं पड़ते? परन्तु भली युक्ति निकालनेवालों से करूणा और सच्चाई का व्यवहार किया जाता है।
- परिश्रम से सदा लाभ होता है, परन्तु बकवाद करने से केवल घटती होती है।
- बुद्धिमानों का धन उनका मुकुट ठहरता है, परन्तु मूर्खों की मूढ़ता निरी मूढ़ता है।
- सच्चा साक्षी बहुतों के प्राण बचाता है, परन्तु जो झूठी बातें उड़ाया करता है उस से धोखा ही होता है।
- यहोवा के भय मानने से दृढ़ भरोसा होता है, और उसके पुत्रों केा शरणस्थान मिलता है।
- यहोवा का भय मानना, जीवन का सोता है, और उसके द्वारा लोग मृत्यु के फन्दों से बच जाते हैं।
- राजा की महिमा प्रजा की बहुतायत से होती है, परन्तु जहां प्रजा नहीं, वहां हाकिम नाश हो जाता है।
- जो विलम्ब से क्रोध करनेवाला है वह बड़ा समझवाला है, परन्तु जो अधीर है, वह मूढ़ता की बढ़ती करता है।
- शान्त मन, तन का जीवन है, परन्तु मन के जलने से हडि्डयां भी जल जाती हैं।
- जो कंगाल पर अंधेर करता, वह उसके कर्ता की निन्द करता है, परन्तु जो दरिद्र पर अनुग्रह करता, वह उसकी महिमा करता है।
- दुष्ट मनुष्य बुराई करता हुआ नाश हो जाता है, परन्तु धर्मी को मृत्यु के समय भी शरण मिलती है।
- समझवाले के मन में बुद्धि वास किए रहती है, परन्तु मूर्खों के अन्त:काल में जो कुछ है वह प्रगट हो जाता है।
- जाति की बढ़ती धर्म ही से होती है, परन्तु पाप से देश के लोगों का अपमान होता है।
- जो कर्मचारी बुद्धि से काम करता है उस पर राजा प्रसन्न होता है, परन्तु जो लज्जा के काम करता, उस पर वह रोष करता है।।