Old
New
సామెతలు Proverbs नीतिवचन - 4
- కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి
- నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి.
- నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యేక కుమా రుడనైయుంటిని.
- ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.
- జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించు కొనుము నా నోటిమాటలను మరువకుము. వాటినుండి తొలగిపోకుము.
- జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.
- జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాం శము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించు కొనుము.
- దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును.
- అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.
- నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీక రించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.
- జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను.
- నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.
- ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టు కొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము
- భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.
- దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము.
- అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
- కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగు దురు
- పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,
- భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
- నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.
- నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.
- దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.
- నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము
- మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము.
- నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.
- నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.
- నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.
- Hear, O sons, a father's instruction, and be attentive, that you may gain insight,
- for I give you good precepts; do not forsake my teaching.
- When I was a son with my father, tender, the only one in the sight of my mother,
- he taught me and said to me, "Let your heart hold fast my words; keep my commandments, and live.
- Get wisdom; get insight; do not forget, and do not turn away from the words of my mouth.
- Do not forsake her, and she will keep you; love her, and she will guard you.
- The beginning of wisdom is this: Get wisdom, and whatever you get, get insight.
- Prize her highly, and she will exalt you; she will honor you if you embrace her.
- She will place on your head a graceful garland; she will bestow on you a beautiful crown."
- Hear, my son, and accept my words, that the years of your life may be many.
- I have taught you the way of wisdom; I have led you in the paths of uprightness.
- When you walk, your step will not be hampered, and if you run, you will not stumble.
- Keep hold of instruction; do not let go; guard her, for she is your life.
- Do not enter the path of the wicked, and do not walk in the way of the evil.
- Avoid it; do not go on it; turn away from it and pass on.
- For they cannot sleep unless they have done wrong; they are robbed of sleep unless they have made someone stumble.
- For they eat the bread of wickedness and drink the wine of violence.
- But the path of the righteous is like the light of dawn, which shines brighter and brighter until full day.
- The way of the wicked is like deep darkness; they do not know over what they stumble.
- My son, be attentive to my words; incline your ear to my sayings.
- Let them not escape from your sight; keep them within your heart.
- For they are life to those who find them, and healing to all their flesh.
- Keep your heart with all vigilance, for from it flow the springs of life.
- Put away from you crooked speech, and put devious talk far from you.
- Let your eyes look directly forward, and your gaze be straight before you.
- Ponder the path of your feet; then all your ways will be sure.
- Do not swerve to the right or to the left; turn your foot away from evil.
- हे मेरे पुत्रो, पिता की शिक्षा सुनो, और समझ प्राप्त करने में मन लगाओ।
- क्योंकि मैं ने तुम को उत्तम शिक्षा दी है; मेरी शिक्षा को न छोड़ो।
- देखो, मैं भी अपने पिता का पुत्रा था, और माता का अकेला दुलारा था,
- और मेरा पिता मुझे यह कहकर सिखाता था, कि तेरा मन मेरे वचन पर लगा रहे; तू मेरी आज्ञाओं का पालन कर, तब जीवित रहेगा।
- बुद्धि को प्राप्त कर, समझ को भी प्राप्त कर; उनको भूल न जाना, न मेरी बातों को छोड़ना।
- बुद्धि को न छोड़, वह तेरी रक्षा करेगी; उस से प्रीति रख, वह तेरा पहरा देगी।
- बुद्धि श्रेष्ठ है इसलिये उसकी प्राप्ति के लिये यत्न कर; जो कुछ तू प्राप्त करे उसे प्राप्त तो कर परन्तु समझ की प्राप्ति का यत्न घटने न पाए।
- उसकी बड़ाई कर, वह तुझ को बढ़ाएगी; जब तू उस से लिपट जाए, तब वह तेरी महिमा करेगी।
- वह तेरे सिर पर शोभायमान भूषण बान्धेगी; और तुझे सुन्दर मुकुट देगी।।
- हे मेरे पुत्रा, मेरी बातें सुनकर ग्रहण कर, तब तू बहुत वर्ष तब जीवित रहेगा।
- मैं ने तुझे बुद्धि का मार्ग बताया है; और सीधाई के पथ पर चलाया है।
- चलने में तुझे रोक टोक न होगी, और चाहे तू दौड़े, तौभी ठोकर न खाएगा।
- शिक्षा को पकड़े रह, उसे छोड़ न दे; उसकी रक्षा कर, क्योंकि वही तेरा जीवन है।
- दुष्टों की बाट में पांव न धरना, और न बुरे लोगों के मार्ग पर चलना।
- उसे छोड़ दे, उसके पास से भी न चल, उसके निकट से मुड़कर आगे बढ़ जा।
- क्योंकि दुष्ट लोग यदि बुराई न करें, तो उनको नींद नहीं आती; और जब तक वे किसी को ठोकर न खिलाएं, तब तक उन्हें नींद नहीं मिलती।
- वे तो दुष्टता से कमाई हुई रोटी खाते, और उपद्रव के द्वारा पाया हुआ दाखमधु पीते हैं।
- परन्तु धर्मियों की चाल उस चमकती हुई ज्योति के समान है, जिसका प्रकाश दोपहर तक अधिक अधिक बढ़ता रहता है।
- दुष्टों का मार्ग घोर अन्धकारमय है; वे नहीं जानते कि वे किस से ठोकर खाते हैं।।
- हे मेरे पुत्रा मेरे वचन ध्यान धरके सुन, और अपना कान मेरी बातों पर लगा।
- इनको अपनी आंखों की ओट न होने दे; वरन अपने मन में धारण कर।
- क्योंकि जिनकों वे प्राप्त होती हैं, वे उनके जीवित रहने का, और उनके सारे शरीर के चंगे रहने का कारण होती हैं।
- सब से अधिक अपने मन की रक्षा कर; क्योंकि जीवन का मूल द्दॊत वही है।
- टेढ़ी बात अपने मुंह से मत बोल, और चालबाजी की बातें कहना तुझ से दूर रहे।
- तेरी आंखें साम्हने ही की ओर लगी रहें, और तेरी पलकें आगे की ओर खुली रहें।
- अपने पांव धरने के लिये मार्ग को समथर कर, और तेरे सब मार्ग ठीक रहें।
- न तो दहिनी ओर मुढ़ना, और न बाईं ओर; अपने पांव को बुराई के मार्ग पर चलने से हटा ले।।