Old
New
సామెతలు Proverbs नीतिवचन - 7
- నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము.
- నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు.
- నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము
- జ్ఞానముతోనీవు నాకు అక్కవనియు తెలివితోనీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.
- అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును.
- నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానములేనివారి మధ్యను
- ¸°వనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను.
- సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ
- వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను.
- అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను.
- అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు.
- ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును.
- అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను
- సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను
- కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవేకనబడితివి
- నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను.
- నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను.
- ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము.
- పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు
- అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను
- అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.
- వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును
- తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
- నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి
- జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.
- అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది
- దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.
- My son, keep my wordsand treasure up my commandments with you;
- keep my commandments and live; keep my teaching as the apple of your eye;
- bind them on your fingers; write them on the tablet of your heart.
- Say to wisdom, "You are my sister," and call insight your intimate friend,
- to keep you from the forbidden woman, from the adulteress with her smooth words.
- For at the window of my house I have looked out through my lattice,
- and I have seen among the simple, I have perceived among the youths, a young man lacking sense,
- passing along the street near her corner, taking the road to her house
- in the twilight, in the evening, at the time of night and darkness.
- And behold, the woman meets him, dressed as a prostitute, wily of heart.
- She is loud and wayward; her feet do not stay at home;
- now in the street, now in the market, and at every corner she lies in wait.
- She seizes him and kisses him, and with bold face she says to him,
- "I had to offer sacrifices, and today I have paid my vows;
- so now I have come out to meet you, to seek you eagerly, and I have found you.
- I have spread my couch with coverings, colored linens from Egyptian linen;
- I have perfumed my bed with myrrh, aloes, and cinnamon.
- Come, let us take our fill of love till morning; let us delight ourselves with love.
- For my husband is not at home; he has gone on a long journey;
- he took a bag of money with him; at full moon he will come home."
- With much seductive speech she persuades him; with her smooth talk she compels him.
- All at once he follows her, as an ox goes to the slaughter, or as a stag is caught fast
- till an arrow pierces its liver; as a bird rushes into a snare; he does not know that it will cost him his life.
- And now, O sons, listen to me, and be attentive to the words of my mouth.
- Let not your heart turn aside to her ways; do not stray into her paths,
- for many a victim has she laid low, and all her slain are a mighty throng.
- Her house is the way to Sheol, going down to the chambers of death.
- हे मेरे पुत्रा, मेरी बातों को माना कर, और मेरी आज्ञाओं को अपने मन में रख छोड़।
- मेरी आज्ञाओं को मान, इस से तू जीवित रहेगा, और मेरी शिक्षा को अपनी आंख की पुतली जान;
- उनको अपनी उंगलियों में बान्ध, और अपने हृदय की पटिया पर लिख ले।
- बुद्धि से कह कि, तू मेरी बहिन है, और समझ को अपनी साथिन बना;
- तब तू पराई स्त्री से बचेगा, जो चिकनी चुपड़ी बातें बोलती है।।
- मैं ने एक दिन अपने घर की खिड़की से, अर्थात् अपने झरोखे से झांका,
- तब मैं ने भोले लोगों में से एक निर्बुद्धि जवान को देखा;
- वह उस स्त्री के घर के कोने के पास की सड़क पर चला जाता था, और उस ने उसके घर का मार्ग लिया।
- उस समय दिन ढल गया, और संध्याकाल आ गया था, वरन रात का घोर अन्धकार छा गया था।
- और उस से एक स्त्री मिली, जिस का भेष वेश्या का सा था, और वह बड़ी धूर्त थी।
- वह शान्तिरहित और चंचल थी, और अपने घर में न ठहरती थी;
- कभी वह सड़क में, कभी चौक में पाई जाती थी, और एक एक कोने पर वह बाट जोहती थी।
- तब उस ने उस जवान को पकड़कर चूमा, और निर्लज्जता की चेष्टा करके उस से कहा,
- मुझे मेलबलि चढ़ाने थे, और मैं ने अपनी मन्नते आज ही पूरी की हैं;
- इसी कारण मैं तुझ से भेंट करने को निकली, मैं तेरे दर्शन की खोजी थी, सो अभी पाया है।
- मैं ने अपने पलंग के बिछौने पर मि के बेलबूटेवाले कपड़े बिछाए हैं;
- मैं ने अपने बिछौने पर गन्घरस, अगर और दालचीनी छिड़की है।
- इसलिये अब चल हम प्रेम से भोर तक जी बहलाते रहें; हम परस्पर की प्रीति से आनन्दित रहें।
- क्योंकि मेरा पति घर में नहीं है; वह दूर देश को चला गया है;
- वह चान्दी की थैली ले गया है; और पूर्णमासी को लौट आएगा।।
- ऐसी ही बातें कह कहकर, उस ने उसको अपनी प्रबल माया में फंसा लिया; और अपनी चिकनी चुपड़ी बातों से उसको अपने वश में कर लिया।
- वह तुरन्त उसके पीछे हो लिया, और बैल कसाई- खाने को, वा जैासे बेड़ी पहिने हुए कोई मूढ़ ताड़ना पाने को जाता है।
- अन्त में उस जवान का कलेजा तीर से बेधा जाएगा; वह उस चिड़िया के समान है जो फन्दे की ओर वेग से उड़े और न जानती हो कि उस में मेरे प्राण जाएंगे।।
- अब हे मेरे पुत्रों, मेरी सुनो, और मेरी बातों पर मन लगाओ।
- तेरा मन ऐसी स्त्री के मार्ग की ओर न फिरे, और उसकी डगरों में भूल कर न जाना;
- क्योंकि बहुत लोग उस से मारे पड़े हैं; उसके घात किए हुओं की एक बड़ी संख्या होगी।
- उसका घर अधोलोक का मार्ग है, वह मृत्यु के घर में पहुंचाता है।।