1. నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల

  2. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల

  3. తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల

  4. వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల

  5. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.

  6. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.

  7. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.

  8. న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.

  9. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.

  10. జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును

  11. బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.

  12. అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.

  13. అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు

  14. కీడుచేయ సంతోషించుదురు అతిమూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు.

  15. వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనులు

  16. మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షిం చును.

  17. అట్టి స్త్రీ తన ¸°వనకాలపు ప్రియుని విడుచునది తన దేవుని నిబంధనను మరచునది.

  18. దాని యిల్లు మృత్యువునొద్దకు దారితీయును అది నడచు త్రోవలు ప్రేతలయొద్దకు చేరును

  19. దానియొద్దకు పోవువారిలో ఎవరును తిరిగి రారు జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినినయెడల

  20. నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు.

  21. యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు.

  22. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.

  1. My son, if you receive my words and treasure up my commandments with you,

  2. making your ear attentive to wisdom and inclining your heart to understanding;

  3. yes, if you call out for insight and raise your voice for understanding,

  4. if you seek it like silver and search for it as for hidden treasures,

  5. then you will understand the fear of the LORD and find the knowledge of God.

  6. For the LORD gives wisdom; from his mouth come knowledge and understanding;

  7. he stores up sound wisdom for the upright; he is a shield to those who walk in integrity,

  8. guarding the paths of justice and watching over the way of his saints.

  9. Then you will understand righteousness and justice and equity, every good path;

  10. for wisdom will come into your heart, and knowledge will be pleasant to your soul;

  11. discretion will watch over you, understanding will guard you,

  12. delivering you from the way of evil, from men of perverted speech,

  13. who forsake the paths of uprightness to walk in the ways of darkness,

  14. who rejoice in doing evil and delight in the perlieness of evil,

  15. men whose paths are crooked, and who are devious in their ways.

  16. So you will be delivered from the forbidden woman, from the adulteress with her smooth words,

  17. who forsakes the companion of her youth and forgets the covenant of her God;

  18. for her house sinks down to death, and her paths to the departed;

  19. none who go to her come back, nor do they regain the paths of life.

  20. So you will walk in the way of the good and keep to the paths of the righteous.

  21. For the upright will inhabit the land, and those with integrity will remain in it,

  22. but the wicked will be cut off from the land, and the treacherous will be rooted out of it.

  1. हे मेरे पुत्रा, यदि तू मेरे वचन ग्रहण करे, और मेरी आज्ञाओं को अपने हृदय में रख छोड़े,

  2. और बुद्धि की बात ध्यान से सुने, और समझ की बात मन लगाकर सोचे;

  3. और प्रवीणता और समझ के लिये अति यत्न से पुकारे,

  4. ओर उसको चान्दी की नाईं ढूंढ़े, और गुप्त धन के समान उसी खोज में लगा रहे;

  5. तो तू यहोवा के भय को समझेगा, और परमेश्वर का ज्ञान तुझे प्राप्त होगा।

  6. क्योंकि बुद्धि यहोवा ही देता है; ज्ञान और समझ की बातें उसी के मुंह से निकलती हैं।

  7. वह सीधे लोगों के लिये खरी बुद्धि रख छोड़ता है; जो खराई से चलते हैं, उनके लिये वह ढाल ठहरता है।

  8. वह न्याय के पथों की देख भाल करता, और अपने भक्तों के मार्ग की रक्षा करता है।

  9. तब तू धर्म और न्याय, और सीधाई को, निदान सब भली- भली चाल समझ सकेगा;

  10. क्योंकि बुद्धि तो तेरे हृदय में प्रवेश करेगी, और ज्ञान तुझे मनभाऊ लगेगा;

  11. विवेक तुझे सुरक्षित रखेगा; और समझ तेरी रक्षक होगी;

  12. ताकि तुझे बुराई के मार्ग से, और उलट फेर की बातों के कहने वालों से बचाए,

  13. जो सीधाई के मार्ग को छोड़ देते हैं, ताकि अन्धेरे मार्ग में चलें;

  14. जो बुराई करने से आनन्दित होते हैं, और दुष्ट जन की उलट फेर की बातों में मगन रहते हैं;

  15. जिनकी चालचलन टेढ़ी मेढ़ी और जिनके मार्ग बिगड़े हुए हैं।।

  16. तब तू पराई स्त्री से भी बचेगा, जो चिकनी चुपड़ी बातें बोलती है,

  17. और अपनी जवानी के साथी को छोड़ देती, और जो अपने परमेश्वर की वाचा को भूल जाती है।

  18. उसका घर मृत्यु की ढलान पर है, और उसी डगरें मरे हुओं के बीच पहुंचाती हैं;

  19. जो उसके पास जाते हैं, उन में से कोई भी लौटकर नहीं आता; और न वे जीवन का मार्ग पाते हैं।।

  20. तू भले मनुष्यों के मार्ग में चल, और धर्मियों की बाट को पकड़े रह।

  21. क्योंकि धर्मी लोग देश में बसे रहेेंगे, और खरे लोग ही उस में बने रहेंगे।

  22. दुष्ट लोग देश में से नाश होंगे, और विश्वासघाती उस में से उखाड़े जाएंगे।।


1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31