(దేవుడు మనకు తోడైయున్నాడు)
గ్రంథకర్త: Father M. Devadasu
మూడవ ప్రసంగము
“ఇమ్మానుయేలు” అను మాటలో దేవుని గురించియు, మనలను గురించియు, ఆయన చేసిన ఉపకారములను గురించియు చెప్పినాను. అయితే
(ఇమ్మానుయేలు) అను (క్రీస్తు) పేరును గూర్చి ఈ దినమున కూడ రవ్వంత చెప్పవలసియుండును. అదేమనగా ఇమ్మానుయేలు అను పేరు
తలంచుకొన్న
యెడల భాగ్యము. దేవుడున్నాడని నమ్మగల వారందరికిని దేవుడు తోడైయుండిన ఎంత ఉపకారమో ఈ నామమంత ఉపకారము. మరియు దేవుడు ఎంత
గొప్పవాడో అంతగొప్ప నామము.
దేవుడు మనకు తోడైయుండిన మనకు కలిగే ఉపకారమేమి? అని కొందరు అడుగుదురు. దీనికి ఒకటే జవాబు
తోడైయుండుటయే ఉపకారము. ఆ ఉపకారముతోపాటు అన్ని ఉపకారములు కలుగును (ఇమ్మానుయేలు) అను మాట మన భాషలోని మాటకాదు. ఏ భాషలోని
మాటయని చెప్పినాను. అది హెబ్రీ భాషలోని పదమని ఇదివరకే చెప్పితిని. అయితే (హెబ్రీ) భాషలోకి అది ఏ భాషనుండి వచ్చినది. అది
మోక్ష లోకములో నుండి వచ్చినది. మోక్షము కోరువారందరికిని ఇది ఉపయోగకరమైన స్మరణ నామము. మోక్షమనగా ఎవరికిష్టముండదు.
అందరికిష్టమే గనుక (ఇమ్మానుయేలు) అనగా అందరికి ఇష్టముగా నుండవలెను. (యేసుక్రీస్తు ప్రభువు) యొక్క ఈ పేరు అందరకు ఇష్టముగా
నుండవలెను.
మన భాషలోని పేరుకాదు గనుక ఈ పేరు ఎందుకు స్మరింపవలెను అని అందురేమో! ఇది స్వదేశపదముకాదు, విదేశ పదముకాదు.
పరలోక
నామము. గనుక అందరకు అనుగ్రహింపబడిన నామము. మనము అందరము ఎన్నటికైనను మోక్షమునకు వెళ్ళవలెను. గనుక ఈ మోక్ష లోకనామము మన
భాషానామమే. మన దేశనామమే, పరదేశనామమే, స్వదేశ నామమే. మోక్షలోకమునుండి వచ్చిన (ఇమ్మానుయేలు) యను నామము ఎవరి కొరకని
ఉద్దేశింపబడినది. మన కొరకే పరభాషాపదము అనుటకు వీలులేదు. ఒకవేళ ఎవరైన పరబాషాపదము మనమెందుకు వాడవలెనని సందేహించిన
అట్టివారిమీద ముందు వేయు ప్రశ్న ఏదనగా ఇంగ్లీషుభాష విదేశభాష మనము నేర్చు కొనుటలేదా! మానివేయుచున్నామా? తెలుగువారికి,
అరవభాష
పరభాష కాదా! మన తెలుగు వారు అది నేర్చుకొనుటలేదా! ఈ మహమ్మదీయులకు తెలుగు భాష పరభాషకాదా! వారు తెలుగుభాష నేర్చుకొనుటలేదా!
ఇండియా ప్రజలకు బర్మా భాష పరభాషకాదా! మనవారు నేర్చుకొనుటలేదా! లోకభాషలే మనవారు అంగీకరించినప్పుడు మోక్షలోకభాష ఎందుకు
అంగీకరింపకూడదు? లోక భాషలలోని మాటలలో మనకు ఉపయోగముండగా, పరలోకభాషలోని, మోక్షలోక భాషలోని (ఇమ్మానుయేలు) అను పదము మనకు
అంతకంటె
మరి ఎక్కువ ఉపయోగకరముగా నుండదా? (ఇమ్మానుయేలు) అనుమాటయును (క్రీస్తు) అను మాటయును (యేసు) అనుమాటయును పరలోకమునుండి
వచ్చినవే
గాన, భూలోకమునందున్న మనము ఈ పేరులు వాడిన మోక్షలోకమునకు వెళ్ళకముందే భూలోకములోనే మోక్ష లోకభాష మాట్లాడినట్లుండును.
ఎలాగనిన
మనము (అమెరికా) వెళ్ళకముందు (ఇండియా) లోనేయుండి (అమెరికా) భాష మాట్లాడుచున్నాము గదా! ఆ భాష మాట్లాడుటవలన అనగా విదేశ భాష
మాట్లాడుటవలన కథ నడుచుచున్నదిగదా! అలాగే (యేసుక్రీస్తు) నామములో ఒక నామమైన (ఇమ్మానుయేలు) అనుమాటయును (యేసు) అను మాటయును
(క్రీస్తు) అను మాటయును భూలోకములో వాడుకొన్నందున దైవభక్తిగల జీవిత కథ బాగుగా నడువగలదు. చివరకు లెక్క ఎక్కడకు తేలినదనగా
మోక్షలోకమునకు వెళ్ళకుండనే, భూలోకములో ఉండగానే మోక్షము సంపాదించుకొందుము. ఎంత ధన్యులము. ఇంతవరకు వచ్చినది కథ.
ఇంకొక
సంగతి
ఏమనగా దేవుడు మనకు తోడైయున్నాడు అను నాలుగు మాటలుగల వాక్యము ఒక్క మాటలో చెప్పవలెనని “ఇమ్మానుయేలు” అనిన చాలును.
సూక్ష్మములో
మోక్షము అన్నట్లుగా యుండును. మరియొక సంగతి ఏమనిన “ఇమ్మానుయేలు” అనుపేరు (యేసుక్రీస్తు)
కొందరు తమ బిడ్డలకు పెట్టుకొనుచున్నారు. బాబూ ఇమ్మానుయేలు అని తల్లి పిలిచేటప్పుడు దేవుడు మనకు తోడైయున్నాడని, అనగా
అబ్బాయీ
దేవుడు నీకు, నాకు తోడైయున్నాడను ఉద్దేశముతోకదా! పిలుచుచున్నది. పిలిచిన యెడల ఫలము పొందకపోదు. (ఇమ్మానుయేలు) అను
నామములో
ఎంతైన యున్నది. ఆ అంతయు ఆమెకు ప్రాప్తించిన యెడల “అంతయు” అనగా ఏమి చెప్పగలరు? దేవుడు మనుష్యునికి ఎంత సహాయము చేయగలడో,
ఎంత
ఇవ్వవలెనని యనుకున్నాడో దానికే "అంతయు” అని అర్ధము. మోక్షలోకములోని మాట మనము తరుచుగా పలుకగలందులకు మనకు ఎంత తేలికైనది.
నమ్మిన
యెడల మోక్షముకూడా తేలికే సుమండీ! 'నమ్మువానికి సమస్తము సాధ్యమే' అను మాట ఈ సందర్భములో జ్ఞాపకము వచ్చుచున్నది 'క్రిస్మస్'
పండుగకు “ఇమ్మానుయేలు” నామమునకు సంబంధముగలదు. ఎందుకందురా? (క్రిస్మస్) కాలములో అనగా యేసుప్రభునియొక్క జన్మకాలములోనే
జన్మకథలోనే (ఇమ్మానుయేలు) అను ఈ పేరు చూచుచున్నాము. అయితే ఇంకొక సంగతి ఈ పేరు ఎప్పుడు మోక్ష లోకమునుండి వచ్చినదా!
యేసుక్రీస్తు ప్రభువు పుట్టకముందు ఎనిమిదివందల ఏండ్ల క్రిందట యెషయా అను ఒక దైవభక్తుడు, దైవసన్నిధానమందు ఉండగా ఈ పేరు
ఆయనకు
మొదటనే అందియున్నది యెషయా 7:10. ఆయన తన గ్రంథములో వ్రాసియుంచినాడు. ఆయనకు మోక్షలోకములోనుండి ఏ విధముగా వినబడినదనిన
చెప్పుదును వినండి "కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును” ఈ మాటలు భవిష్యత్తుగా
చెప్పబడినవి
నెరవేరినవి గనుకనే లోకరక్షకుడు జన్మించినాడు. నిజముగా ఆయన ఒక కన్యకకు జన్మించినాడు. ఆ (యేసుక్రీస్తు) ప్రభుని పేరే
ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా యేసుక్రీస్తు ప్రభువు అనగా మనదగ్గర ఉండే ప్రభువు అని అర్ధము. దేవుడు దగ్గర ఉన్నయెడల మనకు
అక్కరలేదా! తప్పకుండా దేవుడు మనకు కావలయునుగదా! యేసుక్రీస్తు ప్రభువు యెషయాకు ఇమ్మానుయేలు కన్య మరియమ్మకు ఇమ్మానుయేలు,
నాకు
ఇమ్మానుయేలు, నీకు ఇమ్మానుయేలు.