(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

త్రియేక దేవుని స్తుతి



తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును, ఎల్లప్పుడును యుగా యుగములందు ఉండునట్లు మహిమ, మహామహిమ, ఘనత, కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లునుగాక!


దైవలక్షణముల స్తుతి



దేవా! నీయొక్క దివ్య లక్షణములు దేవదూతలకు, మనుష్యులకు ఇచ్చినావు. గనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపములో పడి నీ సద్గుణములు లేకుండ చేసికొన్నది. అలాగే మనుష్యులు పాపములోపడి నీ గుణములు చాలావరకు పోగొట్టుకొనుచున్నారు. అయినను నీవు వారియెడల దీర్ధశాంతము కలిగి యున్నావు. గనుక నీకు వందనములు. మరియు ఓ దేవా! నిన్ను అడిగే వారికి నీ శక్తులు దయచేయుదువు. గనుక నమస్కారములు. దేవా! నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములు బయలుపర్చినావు. గనుక నీకు అనేక స్తుతులు. మరియు దేవా! సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులో ఉన్నవి గనుక నీకు స్తుతులు. మరియు దేవా! నిన్ను నమ్మినవారిలో నున్న దుర్గుణములు దూరముగా తీసివేసి, మోక్షమునకు చేర్చుకొనుచున్నావు. అక్కడ శాశ్వతముగా వారు నీ దివ్యలక్షణములను అనుభవిస్తున్నారు. గనుక నీకు మంగళ స్తోత్రములు.