1. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను.

  2. మరియు అతడు ఇశ్రా యేలీయుల యధిపతులందరిని యాజకులను లేవీయులను సమకూర్చెను.

  3. అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు.

  4. వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను,ఆరు వేలమంది అధి పతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి.

  5. నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి.

  6. గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.

  7. లద్దాను కుమారులు ముగ్గురు;

  8. పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు

  9. షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు.

  10. యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.

  11. యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమా రులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి.

  12. కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు.

  13. అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధ మైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యే కింపబడిరి.

  14. దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.

  15. మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.

  16. గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.

  17. ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.

  18. ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.

  19. హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు,యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.

  20. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.

  21. మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.

  22. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.

  23. మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.

  24. వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.

  25. ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు

  26. లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.

  27. దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.

  28. వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,

  29. సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,

  30. అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.

  31. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు,

  32. యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.

  1. When David was old and full of days, he made Solomon his son king over Israel.

  2. David assembled all the leaders of Israel and the priests and the Levites.

  3. The Levites, thirty years old and upward, were numbered, and the total was 38,000 men.

  4. "Twenty-four thousand of these," David said, "shall have charge of the work in the house of the LORD, 6,000 shall be officers and judges,

  5. 4,000 gatekeepers, and 4,000 shall offer praises to the LORD with the instruments that I have made for praise."

  6. And David organized them in divisions corresponding to the sons of Levi: Gershon, Kohath, and Merari.

  7. The sons of Gershon were Ladan and Shimei.

  8. The sons of Ladan: Jehiel the chief, and Zetham, and Joel, three.

  9. The sons of Shimei: Shelomoth, Haziel, and Haran, three. These were the heads of the fathers' houses of Ladan.

  10. And the sons of Shimei: Jahath, Zina, and Jeush and Beriah. These four were the sons of Shimei.

  11. Jahath was the chief, and Zizah the second; but Jeush and Beriah did not have many sons, therefore they became counted as a single father's house.

  12. The sons of Kohath: Amram, Izhar, Hebron, and Uzziel, four.

  13. The sons of Amram: Aaron and Moses. Aaron was set apart to dedicate the most holy things, that he and his sons forever should make offerings before the LORD and minister to him and pronounce blessings in his name forever.

  14. But the sons of Moses the man of God were named among the tribe of Levi.

  15. The sons of Moses: Gershom and Eliezer.

  16. The sons of Gershom: Shebuel the chief.

  17. The sons of Eliezer: Rehabiah the chief. Eliezer had no other sons, but the sons of Rehabiah were very many.

  18. The sons of Izhar: Shelomith the chief.

  19. The sons of Hebron: Jeriah the chief, Amariah the second, Jahaziel the third, and Jekameam the fourth.

  20. The sons of Uzziel: Micah the chief and Isshiah the second.

  21. The sons of Merari: Mahli and Mushi. The sons of Mahli: Eleazar and Kish.

  22. Eleazar died having no sons, but only daughters; their kinsmen, the sons of Kish, married them.

  23. The sons of Mushi: Mahli, Eder, and Jeremoth, three.

  24. These were the sons of Levi by their fathers' houses, the heads of fathers' houses as they were listed according to the number of the names of the individuals from twenty years old and upward who were to do the work for the service of the house of the LORD.

  25. For David said, "The LORD, the God of Israel, has given rest to his people, and he dwells in Jerusalem forever.

  26. And so the Levites no longer need to carry the tabernacle or any of the things for its service."

  27. For by the last words of David the sons of Levi were numbered from twenty years old and upward.

  28. For their duty was to assist the sons of Aaron for the service of the house of the LORD, having the care of the courts and the chambers, the cleansing of all that is holy, and any work for the service of the house of God.

  29. Their duty was also to assist with the showbread, the flour for the grain offering, the wafers of unleavened bread, the baked offering, the offering mixed with oil, and all measures of quantity or size.

  30. And they were to stand every morning, thanking and praising the LORD, and likewise at evening,

  31. and whenever burnt offerings were offered to the LORD on Sabbaths, new moons and feast days, according to the number required of them, regularly before the LORD.

  32. Thus they were to keep charge of the tent of meeting and the sanctuary, and to attend the sons of Aaron, their brothers, for the service of the house of the LORD.

  1. दाऊद तो बूढ़ा वरन बहुत बूढा हो गया था, इसलिये उस ने अपने पुत्रा सुलैमान को इसगाएल पर राजा नियुक्त कर दिया।

  2. तब उस ने इस्राएल के सब हाकिमों और याजकों और लेमियों को इकट्ठा किया।

  3. और जितने लेवीय तीस वर्ष के और उस से अधिक अवस्था के थे, वे गिने एए, और एक एक पुरूष के गिनने से उनकी गिनती अड़तीस हजार हुई।

  4. इन में से चौबीस हजार तो यहोवा के भवन का काम चलाने के लिये नियुक्त हुए, और छे हजार सरदार और न्यायी।

  5. और चार हजार द्वारपाल नियुक्त हुए, और चार हजार उन बाजों से यहोवा की स्तुति करने के लिये ठहराए गए जो दाऊद ने स्तुति करने के लिये बनाए थे।

  6. फिर दाऊद ने उनको गेश न, कहात और मरारी नाम लेवी के पुत्रों के अनुसार दलों में अलग अलग कर दिया।

  7. गेश नियों में से तो लादान और शिमी थे।

  8. और लादान के पुत्रा : सरदार यहीएल, फिर जेताम और योएल ये तीन थे।

  9. और शिमी के पुत्रा : शलेमीत, हजीएल और हारान से तीन थे। लादान के कुल के पूर्वजों के घरानों के मुख्य पुरूष ये ही थे।

  10. फिर शिमी के पुत्रा : यहत, जीना, यूश, और वरीआ के पुत्रा शिमी यही चार थे।

  11. यहत मुख्य था, और जीजा दूसरा; यूश और बरीआ के वहुत बेटे न हुए, इस कारण वे सब मिलकर पितरों का एक ही घराना ठहरे।

  12. कहात के पुत्रा : अम्राम, यिसहार, हेब्रोन और उज्जीएल चार। अम्राम के पुत्रा : हारून और मूसा।

  13. हारून तो इसलिये अलग किया गया, कि वह और उसके सन्तान सदा परमपवित्रा वस्तुओं को पवित्रा ठहराएं, और सदा यहोवा के सम्मुख धूप जलाया करें और उसकी सेवा टहल करें, और उसके नाम से आशीर्वाद दिया करें।

  14. परन्तु परमेश्वर के भक्त मूसा के पुत्रों के नाम लेवी के गोत्रा के बीच गिने गए।

  15. मूसा के पुत्रा, गेश म और एलीएजेर।

  16. और गेश म का पुत्रा शबूएल मुख्य था।

  17. और एलीएजेर के पुत्रा : रहब्याह मुख्य; और एलीएजेर के और कोई पुत्रा न हुआ, परन्तु रहब्याह के बहुत से बेटे हुए।

  18. यिसहार के पुत्रों में से शलोमीत मुख्य ठहरा।

  19. हेब्रोन के पुत्रा : यरीरयाह मुख्य, दूसरा अमर्याह, तीसरा यहजीएल, और चौथा यकमाम था।

  20. उज्जीएल के पुत्रों में से मुख्य तो मीका और दूसरा यिश्शिरयाह था।

  21. मरारी के पुत्रा : महली और मूशी। महली के पुत्रा : एलीआजर और कीश थे।

  22. एलीआजर पुत्राहीन मर गया, उसके केवल बेटियां हुई; सो कीश के पुत्रों ने जो उनके भाई थे उन्हें ब्याह लिया।

  23. मूशी के पुत्रा : महली; एदोर और यरेमोत यह तीन थे।

  24. लेवीय पितरों के घरानों के मुख्य पुरूष ये ही थे, ये नाम ले लेकर, एक एक पुरूष करके गिने गए, और बीस वर्ष की वा उस से अधिक अवस्था के थे और यहोवा के भवन में सेवा टहल करते थे।

  25. क्योंकि दाऊद ने कहा, इस्राएल के परमेश्वर यहोवा ने अपनी प्रजा को विश्राम दिया है, और वह तो यरूशलेम में सदा के लिये बस गया है।

  26. और लेवियों को निवास और उस की उपासना का सामान फिर उठाना न पड़ेगा ।

  27. क्योंकि दाऊद की पिछली आज्ञाओं के अनुसार बीस वर्ष वा उस से अधिक अवस्था के लेवीय गिने गए।

  28. क्योंकि उनका काम तो हारून की सन्तान की सेवा टहल करना था, अर्थात यह कि वे आंगनों और कोठरियों में, और सब पवित्रा वस्तुओं के शुठ्ठ करने में और परमेश्वर के भवन की उपासना के सब कामों में सेवा टहल करें।

  29. और भेंट की रोटी का, अन्नबलियों के मैदे का, और अखमीरी पपड़ियों का, और तवे पर बनाए हुए और सने हुए का, और मापने और तौलने के सब प्रकार का काम करें।

  30. और प्रति भोर और प्रति सांझ को यहोवा का धन्यवाद और उसकी स्तुति करने के लिये खड़े रहा करें।

  31. और विश्रामदिनों और नये चान्द के दिनों, और नियत परव में गिनती के नियम के अनुसार नित्य यहोवा के सब होपबलियों को बढ़ाएं।

  32. और यहोवा के भवन की उपासना के विषय मिलापवाले नम्बू और पवित्रास्थान की रक्षा करें, और अपने भाई हारूनियों के सौंपे हुए काम को चौकसी से करें।


1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29