గ్రంథకర్త యం. దేవదాసు అయ్యగారు


ప్రశంస

ప్రభువునందు ప్రియులారా! త్వరగా రానైయున్న ప్రభువు నామమున మీకు శుభములు కలుగునుగాక.


అభయాని అనగా హానిలేని యుద్ధము అని అర్ధము (A war without harm)1. ఈ గ్రంథములో ప్రాముఖ్యమైన ఏడు సిద్ధాంతములు గలవు. ఇవి దైవగ్రంథములో గలవు. దైవజనుడైన యం. దేవదాసు అయ్యగారు 1934 నుండి 37 సంవత్సరములలో వాక్యానుసారమైన బోధలను బోధించిరి. ఆ బోధలన్నిటిని గ్రంథరూపములోనికి తీసికొనివచ్చి కీ॥శే॥ శ్రీ. కె. విజయరత్నముగారు 1937 సెప్టెంబరు 2వ తేదీని రాజమండ్రిలో అచ్చువేయించినారు. ఈ గ్రంథములోని విషయములను లూథరన్ సంఘ సిద్ధాంతములలో చేర్చవలసినదిగా కోరిన నివేదిక ఈ గ్రంథములో కలదు. సంఘ సభ్యులకు, గురువులకు, మిషనెరీలకు, మిషను అధికారులకు, ప్రెసిడెంటుగారికి, అమెరికాలోని తల్లి సంఘమునకు ఈ గ్రంథము ద్వారానే, వారికి వారికి కల్గిన వాదోపవాదములకు ఇచ్చిన సమాధానములు వృత్తాంతములు ఇందు కలవు.


1937 సంవత్సరములో ప్రచురింపబడిన ఈ గ్రంథమును తిరిగి క్రీ॥శే॥ రెవ. పి. భూషణంగారు, ఎడిటరు - బైబిలుమహిమ విజయవాడ అచ్చువేయించినారు. దేవుడు తన మహిమకొరకును అనేకుల ఉపయోగము కొరకును ఈ గ్రంథమును దీవించునుగాక!


- రెవ. డా॥ జె. జాన్ సెల్వరాజ్,
ప్రసిడెంటు, బైబిలుమిషను. మే-2011




1. Not there in original book, added here for more clarity. Similar notation is followed wherever needed.