దేవుడు, యం.దేవదాసు అయ్యగారికి బైలుపరచిన బైబిలు మిషను
బైబిలు మిషను భక్తులు స్థాపించిన మిషనుకాదు. దేవుడే స్వయముగా బయలుపరచిన మిషను.
లోకరక్షకుడైన క్రీస్తుప్రభువు నామము ధరించియున్న వారలారా! మీకు శుభములు కలుగునుగాక.
ఇందులో సమకూర్చిన ప్రతిదియు మీ నిష్కళంక పరిశీలన కాధీనమైయున్నది. ప్రార్ధనపూర్వకముగా ఆలోచించండి.
-
1. క్రైస్తవమత సంఘమిషనులు:- దేవుడు ఒక్కడేయనియు, ఆయనను గూర్చిన వర్తమానముగల బైబిలు అను దైవగ్రంథమొక్కటేయనియు, యేసుక్రీస్తుయను లోక రక్షకుడు ఒక్కడేయనియు, ఆయన స్థాపించిన క్రైస్తవ సంఘమను మతము ఒక్కటేయనియు, నమ్మి బోధించుచున్న క్రైస్తవ సంఘమెందుకు ఇన్ని మిషనులుగా చీలిపోయినదను ప్రశ్న అందరును అడిగి తెలిసికొనవలసినదే.
మతగ్రంథమునుబట్టిగాక, గ్రంథాంశములనుబట్టి అభిప్రాయ బేధములు కలిగినందువలన ఇట్టి శాఖలు (మిషనులు) ఏర్చడవలసి వచ్చెను. చీలికలు దేవునిబట్టి కలుగలేదు. అయినను శాఖలవలన మతమనేకచోట్ల వ్యాపించుచున్నది. ఎప్పటికైనను అన్ని మిషనులవారు ఏకాభిప్రాయమునకు రావలసినవారై యున్నారు. అట్టిది తరచుగా కూడుకొను అన్ని మిషనుల ఐక్య సమావేశమువలన కొంతవరకు జరుగును. అన్ని మిషనుల వారును ఏకీభవించి, దేవునిని ప్రార్థించి జవాబు పొందిన యెడల క్రైస్తవమత శాఖలు అంతర్ధానమగును. - 2. క్రొత్త మిషను:- ఇన్ని మిషనులుండగాను; ఒక మిషను మరియొక మిషనుకు విరోధముగా తర్కించుచుండగాను, ఇటువంటి విషయములు ఇతర మతస్థులకు అడ్డుబండయై నిలిచియుండగాను; రాజమండ్రిలో “బైబిలు మిషను” అను నామముతో యొక క్రొత్త మిషనెందుకు బయలుదేరవలెను? అనునటువంటి ప్రశ్నకూడ సామాన్య జ్ఞానవంతులు సహితము వేయవలసిన ప్రశ్నయైయున్నది. అన్ని మిషనులువారు, వందలాది నంవత్సరములుగా పనిచేయుచున్నారు. అయినను, క్రీస్తు సందేశమన్నిప్రదేశములకు అందలేదు గనుక క్రొత్త మిషను అవసరము.
- 3. బైబిలు మిషను ఎటువంటి మిషను కాదనగా:-
- 1. మిషనెరీలను ఎదిరించు మిషనుకాదు.
- 2. మిషనులకు వ్యతిరేకముగ పనిచేయు మిషనుకాదు (అనగా పోటీ మిషనుకాదు).
- 3. ఇతర మిషనులను దూషించు మిషనుకాదు.
- 4. ఇతర మిషను వారలారా! మాలోనికి వచ్చిన మీకు రక్షణ, రాకడ. రానియెడల రక్షణ, రాకడ భాగ్యము లేదని భయపెట్టు మిషనుకాదు.
- 5. ఎవరినుండైనను చందాలను బలవంతముగా వసూలు చేయు మిషనుకాదు, వస్తు రూపముగా నైనను, కానుకల నడుగు మిషనుకాదు.
- 6. ఒకరు వెళ్ళిపొమ్మనుటయే కారణముగా లేక మిషగా (సాకు) చూపించు మిషనుకాదు.
- 7. ఒత్తిడిగల్గి లూథరన్ మిషనులోనుండి వచ్చివేసిన మిషనుకాదు.
- 8. జ్ఞానమునుగాని, భక్తినిగాని, సమర్ధతను గాని వెల్లడించుకొనుటకై వెడలిన మిషనుకాదు.
- 4. బైబిలు మిషను ఎటువంటి మిషను -
- a) మీ బోధలు మాకు నచ్చినవి. ప్రార్థన చేనికొన్నాము, మమ్ములను చేర్చుకొనండని అడుగు ప్రతివారిని చేర్చుకొనునట్టి మిషను.
- b) బైబిలు మిషనులో చేరిన తరువాత "నాకిష్టములేదు" అను ప్రతివారిని వెళ్ళనిచ్చునట్టి మిషను (అనేక మిషనులున్నవి గనుక ప్రతి విశ్వాసి ఏదోయొక మిషనుకు హత్తియుండుట క్షేమము).
- c) కోరుకొనునట్టి క్రైస్తవులకు సహితము బోధలు వినుపించునట్టి మిషను.
- d) బేధాబిప్రాయములు లేచినప్పుడు, ప్రభువు స్వరముతో జవాబిచ్చువరకు ప్రార్ధనలో కనిపెట్టునట్టి మిషను.
- e) ఇతరులను చందాలు అడుగకపోయినను, అక్కరలు దేవునికి తెలిపి సహాయము పొందునట్టి మిషను.
- f) రిపోర్టు అనునది చరిత్ర గనుక దానిలో అక్కరలు ఉదహరించుచు, ప్రార్ధన సహాయము పొందునట్టి మిషను.
- g) కోరని క్రైస్తవులకు కూడ పరీక్షార్ధమై బోధలు వినిపించునట్టి మిషను.
- h) తప్పులు పట్టినవారిని, ఉభయపక్షములు విచారింపనివారిని, లేనిపోనివాటిని కల్పించువారిని, దూషించు వారిని, మమ్మును చేరనియ్యని వారిని, మా సేవను ఆటంకపరచువారిని, ముఖ్యముగా మమ్ములను గురించి దేవుని నడిగి తెలిసికొననివారిని, మాలో కొందరి బలహీనతలను ఒక వంకగా చేసికొని మిషనంతయు వాక్య విరుద్ధమైనదని తీర్మానించుకొనువారిని, మా ఎదుట మంచిగా మాట్లాడి, చాటున వేరుగా మాట్లాడుకొనువారినేమియనక, ఆలాగు సహించు కొనునట్టి వారి నిమిత్తమై దైవ ప్రార్ధన చేయునట్టి మిషను.