(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
కనిపెట్టు వాక్యములు
-
1. నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. (కీర్తన 25:3).
-
2. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు
కనిపెట్టుకొని
యుండుము (కీర్తన 27:14).
-
3. యెహోవా ఎదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము (కీర్తన 37:7).
-
4. దేవా! సీయోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, (కీర్తన 65:1).
-
5. నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను (కీర్తన 69:3).
-
6. ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి (కీర్తన 106:13).
-
7. యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు షక్షిరాజులవలె రెక్కలుచాపి పైకి ఎగురుదురు. అలయక
పరుగెత్తుదురు.
సొమ్మసిల్లక నడిచిపోవుదురు (యెషయా 40:31).
-
8. తనకొరకు కనిపెట్టువాని విషయమై, నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని, ఎవడు నేకాలమున చూచియుండలేదు. అట్టి
దేవుడు
కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు (యెష. 64:4)
-
9. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలముమీదను, గోపురముమీదను,
కనిపెట్టుకొని యుందుననుకొనగా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను - చదువువాడు పరుగెత్తుచు చదువవీలగునట్లు నీవు ఆ దర్శన
విషయమును
పలకమీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతుర పడుచున్నది, అది తప్పక నెరవేరును.
అది
ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును (హబక్కూకు 2:1-3).
-
10. ఆయన వారిని కలిసికొని ఈలాగు ఆజ్ఞాపించెను - 'మీరు యెరూషలేమునుండి వెళ్ళక నావలన వినిన తండ్రియొక్క వాగ్ధానము కొరకు
కనిపెట్టుడి' (అపో.కార్య. 1:4).
-
11. యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టియున్నాను (ఆది.కా. 49:18).
-
12. ప్రభువా! సైన్యములకధిపతివగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగనియ్యకుము (కీర్తన 69:6).
-
13. యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము. ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును.
భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు (కీర్తన 37:34).
-
14. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయనవలన నాకు రక్షణ కలుగును (కీర్తన 62:1).
-
15. నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను
దానిని
స్మరించి కనిపెట్టుచున్నాను (కీర్తన 52:9).
-
16. తగినకాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని, ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి (కీర్తన 104:27).
-
17. దాసుల కన్నులు తమ
యజమానుని చేతితట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్టు, మనదేవుడైన యెహోవా మనలను కరుణించువరకు, మన
కన్నులు
ఆయనతట్టు చూచుచున్నవి (కీర్తన 123:2).
-
18. కీడునకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ఆయన నిన్ను రక్షించును. (సామెతలు 20:22).
-
19. కావున మీయందు దయజూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడియున్నాడు. యెహోవా
న్యాయముతీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు (యెషయా 30:18).
-
20. యాకోబు వంశమునకు తనముఖమును మరుగుచేసికొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు నేను
కనిపెట్టుచున్నాను
(యెషయా 8:17).
-
21. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమిమీద సాగిలపడి నీకు
నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నాకొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు
నీవు
తెలిసికొందువు (యెషయా 49:23).
-
22. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింప గలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా! నీవేగదా దాని
చేయుచున్నావు! నీవే ఈ క్రియలన్నియు చేయుచున్నావు; నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము (యిర్మియా 14:22).
-
23. నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణకొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది (విలాప 3:26).
-
24. కాబట్టి యెహోవా సెలవిచ్చు
వాక్కు
ఏదనగా - “నాకొరకు కనిపెట్టుడి. నేను లేచి యెర పట్టుకొను దినము కొరకు కనిపెట్టి యుండుడి. నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని
వారిమీద కుమ్మరించుటకై; అన్యజనులను పోగుచేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని.
నా
రోషాగ్నిచేత భూమియంతయు కాలిపోవును (జెఫన్యా 3:8).
-
25. అది విరువబడిన దినమున, నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై, నన్ను కని పెట్టుకొనియున్న గొర్రెలు
తెలిసికొనెను (జెకర్యా 11:11).
-
26. యెరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును, భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు
కనిపెట్టువాడు. పరిశుద్దాత్మ అతనిమీద ఉండెను (లూకా 2:25).
-
27. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే, అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని, అతనికొరకు ఎదురు చూచు
మనుష్యులవలె ఉండుడి (లూకా 12:36).
-
28. మనము చూడనిదానికొరకు నిరీక్షించినయెడల, ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము (రోమా 8:25).