(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

మృతుల యెడల ప్రభువు ప్రేమ పని



దేవుడు మనకొరకు మూడు పటములు (Maps) వేసి ఉంచినాడు.

ఈ మూడు పటములను బట్టీ మన హృదయమను పటము తయారగుచున్నది. అయితే ఈ పటము అంతా నల్లగీతలైనా తెల్లగీతలైనా ఉండును. కోడి పొదిగినప్పుడు గ్రుడ్లనుండి బయటకు వచ్చిన పిల్లలు కొన్ని నల్లగాను, కొన్ని ఎర్రగాను, కొన్నితెల్లగాను ఉండును. అట్లే మనుష్య హృదయములు ఆత్మలు రకరకములుగా తయారగుచున్నవి. కొన్ని గ్రుడ్డు చితికిపోవును కొన్ని పగిలిపోవును. అలాగే అనేకమంది మనుష్యులు హృదయశుద్ధిగలవారై యుండరు, కొందరు పూర్తిగా చెడిపోదురు. మొదటి పటము చూపినా మారరు. రెండవ పటము దానంతట అది కనబడినా మారరు. మూడవ పటము భక్తులు వివరించినను మారరు. ఎట్లనగా చితికిపోయిన గ్రుడ్లవలె కొందరు మారరు. ఇటువంటి దృష్టాంతములు మనకు ఉన్నవి గాన మనము ఇప్పుడే మార్చుకొనవలసియున్నది. దేవుడు మంచివారిమీదను, చెడ్డవారిమీదను వర్షమును కురిపించి సూర్యకాంతిని ఉదయింపజేయుచున్నాడుగాని చెడిపోయినవారు ఏలాగైనా చెడిపోయినారు.


ఎట్లనగా ఒక మీటింగు జరుగుచున్నది.

ఈ పటములు ఈ ప్రకారముగా నుండగ, నేను చెప్పిన దేవుని లక్షణములకు వ్యతిరేకమైన లక్షణముల పటమును, సైతాను ఏ రీతిని పుటించునో ఆ ప్రకారమైన పటమును కొంతమంది యొక్క హృదయములలో వేయును. బహు చక్కగా వేయును. బోధవల్ల మారిన వారి హృదయములలో ప్రభువు సింహాసనము వేసికొనును. మారనివారి హృదయములలో సైతానుండును. అది తెలుపు, ఇది నలుపు. అక్కడ శాంతి, ఇక్కడ గందర గోళములు ఉండును. కొంతవరకు ఇక్కడ పూర్తిగా మోక్షలోకములోని స్వరూపము ఏర్పడి ఈ భక్తులు క్రీస్తువంటి వారవుదురు. మారనివారు దయ్యములగుదురు.


అయితే క్రీస్తుప్రభుని ఎరుగని వారి సంగతి ఏమి? అట్టవారిని రక్షించుటకు యేసుప్రభువు కనిపెట్టుచున్నాడు. ఈ ప్రశ్నకు నేను చెప్పబోయే ఈ బోధవిన్న క్రైస్తవులలో చాలమంది నాకు విరోధులగుదురు. వీరుకాక నాకు వేరే మంద ఉన్నది అని ప్రభువు చెప్పినారు. నా దొడ్డికి వాటిని తోలుకొని రావలెననెను. రక్షణ పొందిన మందనుగూర్చి ప్రభువు చెప్పుచు సంతోషించుచు వారిని తోలుకొని రావలెననెను. ప్రభువును ఎరుగని యూదులుకాని ఇతరులు, ప్రభువు ఎరుగకుండ చనిపోయినవారు మాత్రము ప్రభువు గొర్రెలుకారా? అట్టివారిని మాత్రము తోలుకొని రావద్దా? ప్రభువా! నిన్ను ఎరుగని వారిని నీ మందలోనికి తీసికొని వచ్చిన, రాకున్న నిన్ను ఎరుగక చనిపోయిన వారిగతిఏమి? నీవు రాకముందు ఉన్నవారి కథ ఏమి? వేరే గొర్రెలైన అన్యులను ఈ దొడ్డిలోనికి తోలుకొని వచ్చిన న్యాయముకాదా? చనిపోయినవారైన గొర్రెలను తోలుకొని వచ్చుట న్యాయముకాదా? అని అడిగిన వారి సంగతి నాకెందుకు? భూలోక మందనుగూర్చి నేను చెప్పితిని. గాని వారిని గూర్చి ఎందుకు అని ప్రభువనరు. ఎందుకంటే వారును ఆయన కలుగజేసినవారే గనుక అనరు.


బ్రతికి ఉన్నవారిలో

ఈ మూడు మందలలో వారిని కలుగజేసిన ఆయనే రక్షించకపోయిన యెడల ఇంకెవరు రక్షించేది? ఆయనే రక్షించవలెను. ఆయన సర్వవ్యాపియైయున్నాడు. అంతట ఉన్నాడు. రెండు మందలయొద్ద ఉండి మూడవ మందయొద్ద లేకున్న ఆయన సర్వవ్యాప్తికాడు. గనుక అక్కడకూడా ఉండవలెను. ఆయన సర్వజన రక్షకుడైయున్నాడు. సర్వజన రక్షకుడైన ఆయన అన్ని మందలను రక్షించుటకు ఏదో ఒక ఆలోచన చేయవలెను. అది బైబిలులో నుండవలెను. మీ స్నేహితులలో, మా బంధువులలో మీ బిడ్డలలో ఎవరైనా ప్రభువును ఎరుగక, లేక దిక్కరించి చనిపోయిన వారి రక్షణను గురించి మీకు విచారముండదా? చనిపోయినందుకు విచారముండుట సరే! రక్షింపబడిన మీకు రక్షింప బడని వారిని గురించిన దిగులు మాకు ఉండదా? మట్టి మనుష్యులమైన మనకే విచారముంటే ప్రేమాస్వరూపియైన దేవునికి విచారముండదా? తప్పక ఉండును?


దేవునిని ఒప్పుకొననివారు ఎక్కడబడితే అక్కడే ఉన్నారు. వారిగతి ఏమవునో గాని నీ గతి ఏమవునో చెప్పుము. చెట్టు మొలచినది. నీడ నిచ్చినది. ఆ చెట్టుకు పురుగుపట్టి చెట్టు చచ్చినది, ఎండ వచ్చినందున యోనా దిగులుపడి విసిగుకొనెను.


అందుకు యెహోవా ఈవేళ పుట్టి ఈ వేళ ఎండిపోయిన ఈ చెట్టును గూర్చి నీకు విచారమైతే అంతమందితో నశించిపోయే నినెవే పట్టణపు వానిగూర్చి నాకు దిగులు ఉండదా? అనెను. యోనా. 4:11. నాశనమయ్యే వారినిగూర్చి ఆయనకు విచారముండును. ఒక్కరైన నశించుట నాకిష్టములేదని చెప్పిన ప్రభువు వారి రక్షణను గురించి ఏదైనా ఏర్పాటు చేయకుండునా? యోనా ఈ కబురు చెప్పుటకు వచ్చెను. తీరా బోధించిన తరువాత ప్రభువు తట్టు తిరిగెను. అందుచేత దేవుడు ప్రోగ్రామును మార్చెను. నాశనము తీసివేసెను. నీవు నేను నాశనము చేయుదును అని రక్షిస్తున్నావు అందుకేకదా నేను వెళ్ళనని అన్నాను అనెను. అందుకు దేవుడు ఇందుకు నీవు విచారిస్తే ఇంతమంది నాశనమయ్యే వారినిగూర్చి నాకు విచారముండదా! అనగా యోనా చివరకు సిగ్గుపడి ఊరుకొనెను.


అంధకారములోపడియున్నవారియొద్దకు ప్రభువు వెళ్ళెను - లోకమునకు రావడము, శిష్యులను భూదిగంతములవరకు పంపుట, ఏ విధముగా నున్నదో ఆ విధముగానే అక్కడకూడా ఉన్నది. ఆయన వెళ్ళవలెను. ఆయన శిష్యులుకూడా వెళ్ళవలెను, బోధించవలెను. భూమిమీద జరిగినట్లు అక్కడను జరుగును. భూమిమీద బోధించినపుడు విని కొందరు రక్షింపబడినారు. అలాగే అక్కడ కొందరు విందురు. కొందరు వినరు. ఇక్కడ నాటకమే అక్కడను జరుగును. ఇక్కడ అక్కడ వినకపోతే ఏమి జరుగును? వినకపోతే కీడే, అట్టివారిని గూర్చి మనము ప్రార్ధించవలెను. అట్టివారిని గూర్చి ప్రార్ధింపవచ్చునా? అట్టివారి యొద్దకు ప్రభువు, శిష్యులు వెళ్ళి బోధించుచున్నారు గాన అట్టివారిని గూర్చి ప్రార్ధింపవలెను. ఇక్కడనున్న వారికొరకు ఇక్కడనున్న వారు ప్రార్థించి, బోధించుట అక్కడనున్న వారికొరకు ప్రభువు శిష్యులు బోధించుట, ప్రార్థించుట అనే కార్యక్రమము దేవుని చేతిలో ఉన్నది. గనుక పాతాళమునకు ఎవరినైన పంపి బోధ చేయింపవచ్చును. ప్రార్ధన చేయింపవచ్చును అనునవి ఆయన కార్యక్రమములో ఉన్నవి.


యుద్ధములో అనేకమంది చనిపోవుచున్నారు. వ్రభువు ఊరుకొంటున్నారు. వారికి వారికి కలిగిన ద్వేషమునుబట్టి చంపుకొను చుండగా ఊరుకొనుచుండెను. ఎందుకంటే చనిపోయన తరువాత వారియొద్దకు వెళ్ళి వారికి బోధిస్తానని ఊరుకొనెను. చావడానికి వెళ్ళినారు గనుక స్వహత్యవల్ల, బండిక్రింద, కారుక్రింద పడి నదిలో, నూతిలో పడి, విషయము త్రాగి అనేకమంది చనిపోవుచున్నారు. అందుకే ఊరుకొంటున్నారు. ఇక్కడ నా మాట విన్నారుకాదు. అక్కడైన చెప్పవచ్చునని ఆయన ఊరుకొనెను.


తండ్రి గడ్డము పట్టుకొని తప్పిపోయిన కుమారుని అన్నను బ్రతిమాలినను నేనురాను అన్నాడు. తండ్రి కబురు పంపిన రాలేదు. తండ్రి వెళ్ళినాడు అలాగే చనిపోయిన వారియొద్దకు వెళ్ళినాడు? కాని వెళ్ళకూడదు. అయితే ఈ తండ్రి పెద్దకుమారుని బ్రతిమాలినట్లు వారిని బ్రతిమాలుటకు వెళ్లెను. శిక్షించుటకు కాదు.


ప్రభుని చరిత్రయే సువార్త అక్కడ చెప్పేది అదే మీ కొరకు పుట్టితిని, బోధించితిని, చనిపోతిని అన్ని మీ కొరకే చేసితిని రండి అని అంటే అనేకమంది మోక్షమునకు వెళ్ళుదురు. ఇక్కడ విన్నవారు ఇక్కడినుండి వెళ్ళినట్లు అక్కడివారు విని నమ్మి వెళ్ళుదురు. ఇక్కడి వారు వెళ్ళినట్లు వారు వెళ్ళరు. 1సమూ. 2:6 పాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే; పంపుటెందుకు వారు రాలేరు గనుక వారిని పాతాళమునకు పంపును. వారు అక్కడ నమ్మి వచ్చిన అక్కడినుండి రప్పించును కీర్తన. 139:7,8. దేవుడు అంతట ఉండును. పాతాళములోను ఉండును. ప్రభువు ఎక్కడనున్నవారినైన పట్టుకొనగలడు. దొరికితే ప్రభువు పట్టుకొనుటకు ప్రయత్నించును. దొరికితే పట్టుకొనును. మనిషి స్వతంత్రుడుగాన దొరికితే పట్టుకొనును. దొరుకకపోయిన ఊరుకొనును. ఎవరి విషయములలోను దేవుడు అన్యాయము చేయడు. ఫిలిప్పీ. 2:9-11 పాతాళములో క్రీస్తును ఒప్పుకొందురు. దేవుడు ఎందుకు ఊరుకొంటున్నాడంటే పాతాళములోనైనా ప్రభువు వారిని పట్టుకొనును గనుక ఊరుకొంటున్నాడు.


ఈ భూమిమీద సువార్తను అందించేటప్పుడు మనుష్యులు వినివిననట్లు నిశ్శబ్దముగా ఉంటున్నారు. ఈ నిశ్శబ్దమును ఖండించుటకు దేవుని నిశ్శబ్దము ఉండును. సువార్త ప్రకటించె వారికి ఎంతో బాధగా ఉంటున్నది. ఇతరులు వేసే ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలు ఈ బోధ అంతటిని బోధకుని కొట్టివేయుచున్నవి. చనిపోయినవారికి సువార్త ఉన్నదని చెప్పవద్దు. హేడెస్సులో విని మారవచ్చు అని ఇక్కడ వినరు. గాన చెప్పవద్దు అనుచున్నారు. మీ ఇష్టానుసారముగా ఇక్కడ ఉండి అక్కడ నమ్ముదునందురు గాన చెప్పవద్దు అంటున్నారు. ఇక్కడ శరీరము ఉన్నది దీనితోపాటు పాపము ఇక్కడ ఉండిపోతున్నది. ఈ శరీరము అనవచ్చును. అక్కడ అది సాగదు. మారుమనస్సు పొందుటకు చాలా సంవత్సరములు పట్టును. ఇక్కడున్న సమయములో ఇక్కడగల శిక్ష శ్రమ, కష్టములను బట్టి ఇక్కడ మారుట సుళువు 1పేతురు. 3:19-20.


ఆత్మరూపము:- ఆత్మల యొద్దకు వెళ్ళుటకు ఆత్మరూపముగా వెళ్ళెను. జలప్రళభయములో నాశనమగుచుంటే ఎందుకు ఊరుకున్నాడంటే ఆత్మరూపిగా వెళ్ళి చెప్పవచ్చుననుకొని ఊరకుండెను. ఈ బోధ చేసే వారమైన మేము చేయుమనవి ఏమనగా ప్రభువును అడగండి. ఈ వ్రాత వ్రాయించిన ఆయనను అడిగితే నిరుకు తెలియగలదు. ఒకవేళ మాది తప్పు అయిన యెడల మాది తప్పు అని చెప్పును; మీది తప్పు అయిన మీది తప్పు అని ప్రభువు చెప్పును.


ఒక షావుకారు ఒకనికి ఎకరము పొలము ఇచ్చెదనని అనెను. విన్న అతడు నాకు షావుకారు ఒక ఎకరము పొలము ఇచ్చినాడని అందరకు చెప్పుచుండెను. వ్రాతలేనిదే ఎందుకు చెప్పుచున్నావని అందరు అనగా ఆ ఎకరము పొలము వ్రాయించుకొనెను. క్షత్రియుడు వ్రాసి ఇచ్చెను. బ్రతికియుండగనే వ్రాయించుకొని, ఆయన సంతకము పెట్టించుకొని, వేలిముద్ర వేయించుకొని, సాక్షుల సంతకము పెట్టించుకొని, పెట్టెలో పెట్టుకొనెను, ఇచ్చిన క్షత్రియుడు చనిపోయెను. వ్రాయించినది నమ్మకపోతే చచ్చినవాడు మరల రావలెనా? న్యాయము చొప్పున రాలేడు. బైబిలులో వ్రాత నమ్మకపోతే మనమాట నమ్ముదురా? గనుక వ్రాసిన ఆయనవస్తే వస్తాడు ప్రార్ధించిన వచ్చును. ఎందుకు వస్తాడు ఇది నీవు వ్రాయించినదేనా! అంటే నేను వ్రాయించినదే అనును.


క్రీస్తు వచ్చెనని యున్నది 1పేతురు. 4:6. ఈ చనిపోయిన ఆయన వచ్చెనుగాని చనిపోయిన క్షత్రియుడురాలేడు. ప్రభువు వచ్చును. సరదాకైనా అడగండి సందేహము లేకపోయిన వచ్చిచెప్పును. ఇద్దరు ముగ్గురు ఉన్నచోటికి వస్తానన్నాడు గాన నీకు అడుగుటకు భయమైతే ఇంకొకరిని తీసికొనివెళ్ళి అడుగు. హిందూ మతములో నుండి మహమ్మదీయ మతములోనుండి, బౌద్ధ మతములోనుండి క్రీస్తును తీసికొని రాగలను. వారిలో కొందరు భక్తులున్నారు. వారిని ధూషింపవద్దు. వేరే గొర్రెలున్నవన్నది ఇదే గాన ఇతర మతముల వారిలో నున్నారు. వారియొద్దకు వెళ్ళి మనము నచ్చినట్లు చెప్పిన వారు దొడ్డిలోనికి వస్తారు. రెండవ దుర్భోధ ప్రభువు కనబడి మాట్లాడీనారు నాతో మాటలాడినారు ఎన్నో మర్మములు తెలిపినారు. అవి అన్ని చెప్పలేను. మీరు అడిగి తెలిసికొనండి.


ప్రార్ధన: - పిలిచిన ప్రభువా! మాతో ఉన్న ప్రభువా! మాకు బయలు పడిన ప్రభువా! క్రొత్త విషయములు బయలుపరచిన ప్రభువా! వందనములు. నాకు బయలుపరచినట్లు వారికిని బయలుపరచుము. ఇక్కడ ఉన్నవి వారికొరకు మీరు ప్రకటించే వారికొరకు ఈ వర్తమానములను దీవించుము. మరియొకసారి సమావేశమై క్రొత్త సంగతులు నేర్చుకొను కృప దయచేయుము. మా స్వజనులను, సంఘములను దీవించుము. త్వరగా వచ్చుచున్న యేసునామమున వేడుకొనుచున్నాము ఆమేన్.