(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
పరతంత్రత
మనిషికి ఇది లేకపోతే చాల చిక్కే నాయనా ఆ పండు తినమంటున్నావు ఇవి వద్దన్నావు, ఆ చెట్టుమీద ఎవడో ఉన్నాడు. ఆ పండ్లు తినమంటున్నాడు, ఏమి చెయ్యమంటావని అడగవలసింది. అట్లడుగుటయే పరతంత్రత. స్వతంత్రత గల హవ్వ, ఆదాము తండ్రిని చూచి ఎవడో తినమంటున్నాడని అడుగవలెను. గాని అట్లు అడుగక తనమీదనే ఆనుకొని ఆ పండ్లను తినెను. అదే స్వతంత్రత తనమీద అనుకొనుట స్వతంత్రము దేవునిమీద అనుకొనుట పరతంత్రత.
తప్పిపోయిన కుమారుడు గుఱ్ఱమునెక్కి యింటివద్ద బయలుదేరినది మొదలు పందులవద్దకు వచ్చువరకు స్వతంత్రుడు తండ్రియొద్దకు వెళ్లి కూలివానిగాగానీ పాలివానిగాగాని చేర్చుకొనుమని అందుననుకొనుట పరతంత్రత చేర్చుకొనుటే కావలెను. అదే పరతంత్రము పాపశోధన వచ్చినప్పుడు దేవునిని అడిగిన స్వతంత్రతను ఆపుజేయుటకాదు.
స్వతంత్రతకు పరతంత్రము సహాయముచేయును. ఇది లోకములో నున్న వారందరికి చెప్పిన పాపము ఆగిపోవును. బోధకులు బైబిలు గ్రంథమును వివరించుచున్నారు. వారేకాదు. ఇంకకొందరు బోధకులున్నారు.
- 1. తెగులు
- 2. కరువు
- 3. ఆపద. వీరు గొప్ప బోధకులు. జబ్బు వచ్చినప్పుడు దేవుని ప్రార్ధించుచున్నారు. జబ్బులేకపోతే దేవుని తలంచడు. పాపము వలన వచ్చిన అపకారము ఒక ఉపాధ్యాయుడు. తప్పిపోయిన కుమారునికి పొట్టు చూడగానే
- 4. ఆకలి అయినది.
యజమాని పందులకు మేత పెట్టెనుగాని అతనికి పెట్టలేదు. అప్పుడు తండ్రి జ్ఞాపకమునకు వచ్చినాడు.
కుష్టురోగి ప్రభువా! కిష్టమైతే నన్ను శుద్దినిగా చేయగలవనెను.
ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడు. స్వతంత్రతలోనే ఉన్నాడు. ప్రభువును ప్రార్ధించెను అదే పరతంత్రము. ప్రభువు అతని తప్పును ఎత్తలేదుగాని బాగుచేసెను. జబ్బువల్ల, కరువువల్ల, కష్టమువల్ల ప్రభువును సమీపింతురు. ఇది మేలే అదే పరతంత్రము. ఆపద రాగానే తెలియని రీతిగా ప్రభువును ప్రార్ధింతురు. ముందు ఆపద మొక్కులు మొక్కుదురు గానీ తరువాత ఆపదను ఆపుచేసే మొక్కులు మొక్కుదురు.
కరువు, ఆపద, జబ్బు వచ్చిన విసుగుకొనవద్దు. దేవునివైపు తిరగండి అది పరతంత్రము. పాపమువల్ల, కీడు, జబ్బులు తెచ్చుకొందురు. అది స్వతంత్రత ఆ కుమ్మరము వలన దేవునివైపు తిరుగుదురు. అదే పరతంత్రత. దేవునిమీద ఆనుకొనుట విశ్వాసపద్ధతి. మనిషిని దేవుడు ఏర్పరచిన ఆ మనిషిమీదకూడా ఆనుకొనకూడదు. దేవునిమీదనే ఆనుకొనవలెననునది “బైబిలు మిషను” సిద్ధాంతము. తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రిచేసిన విందులో సేవకులు, పశువును వధించి విందు సిద్ధము చేసిరి. విందు తండ్రి చేయించెను. సేవకులుకాదు, కాకులద్వారా ఏలియాను దేవుడు పోషించెను. గాన ఏలియా దేవుని ఏర్పాటుమీద అనుకొనెను గాని కాకులమీద ఆనుకొనలేదు. దేవుని యెడల కృతజ్ఞత గల ఏలియా దేవుడు పంపిన కాకులయెడల కృతజ్ఞత గలవాడై యుండెను. మీకు ఎవరైన కానుక ఇస్తే దేవుడు ఇచ్చినాడని దేవుని స్తుతించి మనిషికి వందనములు చేయండి. మనిషి ద్వారా దేవుడు ఇచ్చెను. కాంతి సృష్టిలోన సూర్యునిద్వారా దేవుడు మనకు ఇచ్చెను. రక్షణ మనిషిద్వారా వచ్చెను ఆ మనిషి దేవునికిని మనుష్యులకును మధ్యవర్తియైన దేవనరుడైన యేసుక్రీస్తు. 1తిమోతి. 2:5. దేవుడు కొన్ని ఇస్తాడు ఇతరులద్వారా ఇప్పిస్తాడు. అది పరతంత్రము. దేవుడు పంపలేదు మా అన్న పంపెను అనెను. అన్నమీద ఆనుకొనుట, దున్ని ఉడ్చిన పండినది గానీ దేవుడు ఇవ్వలేదు అన్నట్టున్నది. ఎవరు ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చినాడు అనుకొంటే పరతంత్రము బైబిలు మిషనువారు దేవునిమీద అనగా పరతంత్రముమీద పూర్తిగా ఆనుకొనవలెను. స్వతంత్రము మీదకూడా ఆనుకొనవలెను.
ప్రార్ధన:- ఓ తండ్రీ! బల్లమీద మాకు కావలసినవన్నీ పెట్టినావు భూమి, ఆకాశము, గ్రంథమును పెట్టినావు. ఈ బల్లమీద తుదకు ప్రభు భోజన బల్లమీద చాల విలువైనవి పెట్టినావు. మేము అనుభవించుట నీకు చాల ఇష్టము. మా స్వతంత్రతను, పరతంత్రతను బాగుగా వాడుకొను కృప అనుగ్రహించుమని త్వరగా వచ్చుచున్న ప్రభువుద్వారా వేడుకొనుచున్నాము ఆమేన్.
ప్రభువా! నీ లక్షణములను గూర్చి మేము విన్నది నిజమే అని తెలిసికొన్న మాకు నీవు బయలపడినావు. అనాది, అనంతము మహిమగల వాడవని గ్రహించి వందించు కృప దయచేయుము ఔను, ప్రభువా! నీకు వందనములు చెప్పునట్లు మంచి మనస్సు దయచేయుము. దయగల ప్రభువా! నీవు మంచివాడవు గనుక నీవు చేయునదంతయు సరిగా నున్నదని మేము అనుకొన్నప్పుడు దానిని చెడగొట్టే అభిప్రాయము వచ్చిన లోబడకుండ శక్తి దయచేయుము. నీవు స్వయముగా చేసినపని మేము స్వతంత్రముగా చేసినపని, నీవు చేయనిచ్చిన పని, నీ స్థితి, నీకార్యము విని బలపడే బలమునిమ్ము. ఓ ప్రభువా! అదేదనగా పాపము ప్రవేశించినపడు నీవు అడ్డుపెట్టలేదు; అడ్డుపెట్టకుండ ఊరుకునే పని పరిశుద్ధమైన పని. మరియు మా స్వతంత్రతను శుద్ధిచేయు పని ఆయన ఊరుకుండుట వల్ల ఊరుకున్నాడని విసుగుకొనకుండ చేయునదై యున్నది. జరిగేదేదో ఆయన సెలవులేకుండ జరుగదని సంతోషించే కృప దయచేయుము. ఈ ప్రార్ధన త్వరగా వచ్చుచున్న యేసునామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.