(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

మనము కష్టములు అనుభవించుచుండగా దేవుడు ఎందుకు ఊరుకొనుచున్నాడు?



13) మనుష్యుడు పాపము చేసినందున అన్ని రకములైన కష్టములు వచ్చినవి, అవి ఎంతో కష్టతరమైనవిగాను, హానికరమైనవిగా నున్నట్టు మనిషికి తెలియును గాని, కష్టముకంటే పాపమెంత భయంకరమైనదో గడ్డెనదో తెలియుటలేదు. అట్లు తెలిసికొనకుండుట మనిషియొక్కతప్పు. పాపమువల్ల వచ్చిన కష్టముకంటే, సాతానువల్ల వచ్చిన పాపమే ఎక్కువ హానికరమైనదని మనిషి తెలుసుకొనవలెను. అట్లు తెలిసికొనుటకే కష్టములురాగా చూచి దేవుడు ఊరుకొనుచున్నాడు. పాపము పొడవు ఎక్కువ. పాపఫలితమైనయున్న కష్టము కురచ అనగా మనిషి చేసిన పాపముల పరిమితికంటే కష్టముల పరిమితి తక్కువైనది.


14) పాపము చేసినందువలన కష్టము తెచ్చుకొన్నాడు. అంతేకాక తనకున్న వరముకూడా పోగొట్టుకొన్నాడు. అయినను ప్రార్ధించుచునే ఉన్నాడు. అందువల్ల తనకున్న అపరాధము పరిహారమైనది తనకున్న శ్రమలో కొంతశాంతి కలిగినది, గాని తన ప్రార్ధనవల్ల సంతుష్టి కలుగలేదు. తాను చేయుచున్న క్రొత్త ప్రార్ధనకు నెరవేర్పు కనబడుటలేదు. ఎందుకనగా తన అపరాధములవల్లనే కష్టము వచ్చినదను నమ్మిక ఉన్నది గాని తన అపరాధము వల్లనే తనకున్న వరము పోగొట్టుకొన్నాడను నమ్మకము వచ్చువరకు పోగొట్టుకొనిన వరమును సంపాదించువరకు దేవుడు ఊరుకొనును. ఆదాము, హవ్వలకు దేవుడు ఒక వాక్యము చెప్పినాడు. ఆ వాక్యమే రెండు భాగములుగా ఉన్నది.

పాపమువల్ల దేవునిని, దేవుని వాక్యమును పోగొట్టుకొన్నారు. సాతాను వద్దనుండి సాతాను వాక్యము నొద్దనుండి తిరిగి దేవుని వద్దకు దేవుని వాక్యము వద్దకు వచ్చు వరకు శ్రమలు పోవు దేవుని వాక్యము నొద్దకు, దేవుని యొద్దకు వెళ్ళవలెను. అదే కనిపెట్టు సిద్ధాంతము క్రొత్తగా తెచ్చినాము. అందుకె శత్రువులు హెచ్చయిరి. (ఆదామా నేను ఎక్కడ ఉంచితే ఎక్కడ ఉన్నావు, ఆ సన్నిధి నుండి ఈ సన్నిధికి రావలెను). తప్పిపోయిన కుమారునికి తండ్రి సన్నిధిపోయి పందుల సన్నిధికి వెళ్ళినాడు. తండ్రియొద్దకు రావలెను. వచ్చువరకు ఆకలి దరిద్రతపోదు యజమానునకు పందులకుకూడా దయలేదు? తండ్రి సన్నిధికి వచ్చువరకు శ్రమలు తప్పవు.