(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

నిశ్శబ్ద అంగీకారము



ఎవరైన నిన్న మీరు చదివిన దైవ నిశ్శబ్ద విషయములో ప్రశ్నలు ఉంటే బైబిలు మిషను పాస్టర్లను అడిగి తెలిసికొనండి చెప్పండి, పూర్తిగా వినండి పూర్తిగా వినకపోతే ఇది నిజమా? అను ప్రశ్నవచ్చును. సైతాను అవ్వకు మొదట వేసిన ప్రశ్న ఇదే. మీరు ఇక్కడ జవాబులనే ఆయుధములను సిద్ధపరచుకొనండి. లేకపోతే సాతాను సందేహమును ప్రవేశపెట్టును. అప్పుడు అంతా వ్యతిరేకమే వచ్చును ఎలాగంటే, దేవుడు శక్తిమంతుడని లక్షణములలో ఉంటే దేవుడు శక్తిహీనుడు. నీవు గొప్పపాపివి, నిన్ను రక్షించలేడు శక్తిహీనుడు అందరిని రక్షింపగలడా? నిన్ను రక్షించలేడు అని పుట్టించును. నీ జబ్బు తీసివేయలేడు నరకమునకు వెళ్ళినా ఊరుకొనును దేవుడు శక్తిమంతుదైతే ఒక్కరినైనా నరకమునకు వెళ్ళకుండ రక్షింపకూడదా? దేవుడు శక్తిమంతుడని ఎందుకనుచున్నావు? అని సాతాను అనేక ప్రశ్నలు పుట్టించును. నీవు పూర్తిగా తెలిసికొన్న యెడల దేవుడు శక్తిమంతుడని వాక్యములో నున్నది. నీ మాటలు నీకు నచ్చును గాని నాకు నచ్చవు దేవుని వాక్యమే నిజమని చెప్పగలవు. సైతాను అవ్వతో ఇది నిజమా? అన్నప్పుడు మా తండ్రి చెప్పునది చేయుదును. నీవు నచ్చచెప్పినా నేను చేయను అని అనవలసినది కాని అనలేదు. దేవుని లక్షణములకు, శక్తికి సైతాను అద్దు, సైతాను పనులకు, శక్తికి, భక్తుల ప్రార్ధనలు అద్దు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రక్క ఆ ప్రక్క కొండలు, వెనుక శత్రువులు, వారు ఏమి చేయవలెను? అప్పుడు వారు దేవుని ప్రార్థించిరి. వెంటనే దేవుని శక్తివచ్చి ఎర్ర సముద్రమును పాయలు చేసినది. దేవుని వాక్యమునకు అపార్ధము అడ్డు వచ్చినపుడు, ప్రార్థించి సాతాను చెప్పిన మాటను కొట్టివేయవలయును. శక్తినిబట్టి అన్ని గ్రహించుకొనండి. దైవలక్షణములకు వ్యతిరేకమైనవి సాతాను ఎన్ని ఆటంకములు కలిగించుచున్నాడో! అవి అన్ని చెప్పెను వాటిని నివారణ చేయుటకు భక్తుల ప్రార్ధనలు ఎట్లున్నవో అన్ని చెప్పెను.


దేవుడు తన జ్ఞానశక్తినిబట్టి ఒక మాట అన్నాడు. పండుతింటే మరణమని అన్నాడు గనుక దేవుని మాట వలన ఆదాము రాబోవు సంగతియైన మరణమును తెలిసికొన్నాడు. దానికి వ్యతిరేకముగా ఇది నిజమా? అని సైతాను పెట్టినాడు. నీకు మేలు కలుగునని దేవునికి తెలియునని మంచి మాట అన్నాడు. తన మాటవలన తబ్బిబ్బుచేసి తినవద్దు తింటే చావు అని దేవుడు చెప్పిన ఆ మాటలు మరచిపోయేటంతగా తబ్బిబ్బుచేసి, ఆ జ్ఞానమును సాతాను వారి బుర్రలో ప్రవేశపెట్టెను. దేవుడు జ్ఞాన ప్రకారము జరగలేదు, వారు ప్రార్థించలేదు, వారికి ఇంత తర్పీదులేదు. గాన దేవుడే వచ్చివారిలోనున్న పాపమునుచెప్పి సైతాను కార్యమునకు అడ్డువచ్చెను. సైతాను కార్యములను ధ్వంసము చేయుటకు ప్రయత్నముచేసెను (1యోహా. 3:8) దేవుని లక్షణములను తప్పు అర్ధము చేసికొనేటట్ట చేసి ఆయన రక్షణ కార్యమును లయపర్చుటకు నేటివరకు సైతాను ప్రయత్నము చేయుచున్నాడు. దేవుని శక్తి, జ్ఞానము అను రెండు లక్షణములను వ్యతిరేకమైనవి చెప్పితిని. దేవుడు నిత్యము ఆది, అంతము లేనివాడు. అనాది, అనంతము, శాశ్వతమైనవాడు జీవమిచ్చువాడు. అయితే దైవభక్తుడు చనిపోయేటప్పుడు ఈ భక్తుడు దాటిపోవుచున్నాడని సైతాను ఆఖరి పర్యాయము వచ్చి ఇంకేమి బ్రతుకు? ఇంకేమి ప్రార్ధన? ఇంకేమి విశ్వాసము? ఇంకేమి దేవుడు? ఇంకా బ్రతకాలనేనా? చివరికి మరణము వచ్చినది చనిపోవుచున్నావు. డాక్టరు చెప్పనే చెప్పినాడు నేను ఇంకా బాగా చెప్పుచున్నాను. తరువాత ఇంకా ఏమౌదువు? మోక్షమునకు వెళ్ళుదుననుచున్నావు అది నిజమా? కాదు. నిజము కాదంటే మాత్రము నీవు నమ్ముతావా? అని చెప్పుచున్నాను. నీవు జీవములో ప్రవేశించవు, మరణములో ప్రవేశించవు అనిచెప్పును. స్థిరవిశ్వాసియెన భక్తుడైతే సైతాను చెప్పిన మాట వినడు. దేవునియొక్కయు, దేవుని వాక్యము యొక్క నిజార్ధము తెలిసినవాడైతే అన్నిటికి జవాబిచ్చి సైతాను కార్యములను లయముచేయును. ఇంత భక్తునికి మరణము వచ్చిన రావచ్చును గాని వెంటనే నిత్య జీవము వచ్చును. అది నీకు తెలియదు. అది నాకు తెలియును, అని దైవవాక్యమెరిగిన జ్ఞాని చెప్పి వ్యతిరేక భావమున జయించును. ఈ భక్తునికిని, సైతానుకును అట్టి సంభాషణ చాల దీర్ఘముగా ఉన్నది. నేను కొంచెమే చెప్పితిని. ఎవరైతే దర్శనవరము పొందుదురో వారు క్రొత్త జవాబులు చెప్పుదురు.


ఓ అపవాదీ! నేను బాగా ఉన్నప్పుడు, మొన్న జబ్బుగా నున్నప్పుడు దైవసన్నిధిలో కనిపెట్టుచుండగా నా తండ్రి వచ్చి నా ఆత్మను మోక్షములోనికి తీసికొని వెళ్ళి ఇదిగో నీవు రానైయున్న మహిమ స్థలమని నాకు చెప్పియున్నారు. అలాటివన్ని నీకెక్కడ వినబడును? నీ ఆటలు సాగవు నాకు అన్నియు తెలియునని దర్శనవర పుత్రుడనును. సాతాను ఊరుకొనడు. వట్టి వట్టి ఊహలను పుట్టించును. అప్పుడు దైవభక్తుడిట్లనును:- నామాట వట్టి ఊహ అయితే మరి నీమాటో? ఇక వెళ్ళువెళ్ళు, నేను ఇట్లు మోక్షమునకు వెళ్ళుదును అనెను. దర్శనము గలవాడు బాగా చెప్పును. సాతాను ఓడిపోవును. అవిశ్వాసి అయితే ఓడిపోవును. విశ్వాసిదగ్గరసాతాను ఓడిపోయి వెక్కిరించును. ఎట్లనగా ఇద్దరు పిల్లలు పోట్లాడుచుండగా ఒకరు క్రిందపడెను. పడినవాడు పళ్ళు ఇకిలించి వెక్కిరించెను. అట్లే సాతాను చేయును. నేను చెప్పిన మాట వినలేదులే నరకానికి పోవుదువు అని చెప్పి మూలుగుచు వెళ్ళిపోవును. గనుక జాగ్రత్త మరణ సమయమందే కాదు. ప్రతి కష్టసమయమందు, తోచని సమయమందు, ప్రతి సందేహ సమయమందు ప్రతి నిశ్శబ్ద కాలమందు అతగాడువచ్చి ఇట్టి మాటలే చెప్పిపోవును.


అభ్యంతరపడకుండ ఉంటే ఒకమాట చెప్పుదును. సాతాను ఈవెళ ఉదయము వచ్చి నిన్ననే అంతా చెప్పివేసినావు మిగతా ఉన్న రెండు రోజులు ఏమి చెప్పుదువు? అని అయ్యగారిని అడిగెను. అయ్యగారు సాతానుకు ఈలాగు జవాబిచ్చిరి. నా తండ్రి అందించిన చెప్పుదును. అందించకపోయిన చెప్పను. నాకు వర్తమానము రాకపోతే నేనన్నమాటే నెరవేరినదని సాతాను అంటే సాతానా! అవసరమైతే అందిస్తారు లేకపోతే కుమారుడా చాలు అంటారు. ఆయనదే పద్దు నాపద్దు ఏది? అనవలెను. సాతానుయొక్క అపాయములు తప్పించుకొనుటకు ఈ ఉపాయములు ఉండవలెను. బైబిలు చదవకపోయిన, ధ్యానించకపోయిన ఈ ఉపాయములు రావు. బైబిలుచదువుట, ధ్యానించుట, బైబిలు ఎక్కడ చదివితే అక్కడ దేవుడు నాతో మాటలాడుచున్నాడని అర్ధమగును. ప్రభువు హృదయములో మాట్లాడును. మీకా అను ప్రవక్త కాలములో దేవుడు నిశ్శబ్దము నారంభించెను. ప్రభువు వచ్చువరు సుమారు 40 సం॥లకు ముందు

ఈ నాలుగు అయిన తరువాత ఇంక చెప్పవలసినవిలేవు. గాన 400 సంవత్సరములు నిశ్శబ్దముగానుండెను. ఎందుచేత! అందుచేత పై నాలుగు అయినవి గనుక దేవుడు ఊరుకొన్నాడు. ఇవి ఫలింపవలెను. వ్యవసాయదారుడు పొలములో శుభ్రము చేయును. దున్నించును ముఖ్యమైన పని అందులో విత్తనములువేయుట తరువాత పని ఏమిటి? నిశ్శబ్దముగా నుండును. తెలియనివాడైతే వడ్లగింజ మొలచినదో ప్రదినదినము తీసి చూచును. అది ఏమి ఎదుగును? దేవుడు తన క్రియలు ఏవి చేయక 400 సం॥లు నిశ్శబ్దముగా ఉండెను. అలాగే మనలో దేవుని వాక్యము అనే విత్తనము ఫలించేటప్పుడు దేవుడు ఊరుకొనును అదే నిశ్శబ్దము అదే ప్రేమ పంట విరగగాయును. పంట విరగ పండినది కోసేవరకు ఉండకుండ విరిగిపోతే దండుకొని పోవువారుందురు. దేవుడు చేసినపనికంటే నిశ్శబ్దకాలములో ఎక్కువ పని జరుగకమానదు. అదివరకు నీ హృదయములో దేవుడు చేసిన పనికంటే ఇప్పుడు ఆయన ప్రత్యక్షపరచుచున్న నిశ్శబ్దమువల్ల ఎక్కువమేలు కలుగును. ఎంతగొప్ప మేలంటే మీకా వద్దనుండి జకర్యా వరకు నిశృబ్దముగా ఉండి అక్కడనుండి రక్షకుడు వచ్చునని చెప్పుట అది నెరవేరుట, ఇది గొప్పపని దేవుని పనులన్నీ ఇట్లే ఉండును. తన ప్రియ కుమారుడు చంపబడిన కాలమున దేవుడు నిశ్శబ్దముగా నున్నాడు, సమాది చేసిన ఊరుకొన్నాడు. ఫలితము పునరుత్థానము. అలాగే క్రైస్తవ జీవితములో జరుగును. దేవుని నిళ్శబ్దమువల్ల కలిగే గౌరవము పూలదండలవంటిది, కాబట్టీ సంతోషించంది. భయపడవద్దు ఓ ప్రభువా! ఇది నిశ్శబ్దము గనుక భక్తుడు నా ప్రార్థన వినుటలేదు. నా కష్టములు తీసివేయుటలేదు అని అనక భక్తుడుకూడా నిశ్శబ్దముగా నుంటే సాతానుకు భయము, ఈ అంశములోనిది కాకపోయినను ఇందులో వాడుకొనెదము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిలో ఐక్యత ఉన్నది. అలాగే భూమిమీద అక్కడకూడా విశ్వాసులు అనేకులైననూ వారితో వారికి ఐక్యత ఉన్నది.


ఆ ఐక్యతనుబట్టి ఈ ఐక్యత వచ్చినది. ఐక్యత ఉన్నది గనుక త్రియేక దేవుని ఐక్యత సంఘములో ఉన్నది గనుక ఎంత చెప్పిన అంతే ఆయన ఏది చేసిన అదే.


ఆయన నిశ్శబ్దముగా నుంటే ఈ భక్తుడుకూడా నిశ్శబ్దముగా నుండును. ఒకప్పుడు నాకు ఒక గొప్ప కష్టము వచ్చినది. ప్రభువా! కష్ట నివారణ చేయుము. నీవు కష్టనివారణ చేయకపోతే నేను సహించలేనని ప్రార్థించితిని. పరిశుద్దాత్మ మహా ప్రకాశముగా కనబడి “ఊహు” అన్నారు. అనగా నీ కష్టముతిసి వేయమంటే ఆయన ఎందుకు తీసివేయలేదు అనే ఆలోచన రాకుండ నేను దుప్పటి నిండ కప్పుకొని పండుకొంటిని. ప్రభువా! నీవు కష్ట నివారణ చేయకపోవుటకు నీ ఏర్పాటు ఏదో ఉన్నది గాన రాగ రాగ నీ ఏర్పాటుకే అడ్డురానా? అని ఊరుకొన్నాను. హబక్కూకు, హోషెయా గ్రంథముములలో దేవుని నిశ్శబ్దము ఉన్నది ఎన్నాళ్లు వరకు ఊరుకొందునని హబక్కూకు అనెను (హబక్కూకు. 1:13).


ఇక్కడ ఒక గ్లాసు ఉన్నది. ఈ గ్లాసులోని నీళ్లు ఇక్కడ కూర్చున్న ఒక స్నేహితుడు త్రాగినాడు. ఇక్కడ వండించే ఆయన తలుపుచాటున ఉండి చూస్తున్నాడు, త్రాగగానే ఆ చూస్తున్న ఆయన మరలవచ్చి గ్లానునిండ నీళ్లు పోసెను. ఇక్కడ ప్లేటులోనున్నవి ఒకాయన భోంచేస్తున్నాడు అన్నము తగ్గిన, కూర తగ్గిన మరలా తీసికొని వచ్చివేయును. అప్పుడు భోజనముచేయు ఆయన చాలు అనును, అప్పుడు వేయుట మానివేయును. మనము ఎంత అనుభవించగలమో ప్రభువు అంత ఇస్తారు గాని ఇంక అక్కడ ఎంతో మిగిలియుండును. ఇంక అడుగవలెనని చూచుచుండును అడిగితే ఇస్తారు. అడగకపోతే ఇవ్వరు. ఇది మంచి దృష్టాంతము ఇది మాత్రమేకాదు నేను చెప్పేది బైబిలులో ఒకవాక్యమున్నది. 1కొరింథి. 10:13 సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధనరానివ్వడు. ఒక మనిషికి కష్టమువస్తే అతడు ఎంతవరకు సహించగలడో చూచి ఇక సహించలేడనునప్పుడు ఆయన ఆవుచేయును. ఇంకా ఒక్కరవ్వంత కష్టమువస్తే మనిషి నశించునని ఆయనకు తెలిసి ఆపుచేయును. ఇది ఆయనకున్న దృష్టి ప్రకారము ఆయనకున్న లెక్కప్రకారము ఆపుచేయును. ఆ లెక్కమనకు చాలకపోవును. పరలోకము వేరు. ఆయన లెక్కవేరు. ఆయన దృష్టివేరు, ఈ ఘటము ఎంత కష్టము సహిస్తుందో అను సంగతి ఈ ఘటమును కలుగజేసిన ఆయనకు తెలుసు, ఈ ఘటమునకు తెలియదు. అందుచే మొదటనే ఆపుచేయక కష్టమును ఇంక ముందునకు జరుగనిచ్చును. ఎక్కడ ఆపుచేయవలెనో అక్కడ ఆపుచేయును. కష్టము ఆరంభించినది. మొదలుకొని తండ్రి కష్టమును ఆపుచేయలేదు. ఇక ఆపుచేయును. కష్టము ఆరంభించినది మొదలుకొని తండ్రి కష్టమును ఆపుచేయలేదు ఇక ఆపుచేయును. ఎందుకంటే ఇక సహించలేదు. ఈ ఘటము లోపలనున్న ఆత్మ ఆ కష్టకాలములో తయారగుచున్నదో లేదో ప్రభువు చూస్తు కష్టమును సాగనిచ్చును. ఈ రెండు చూడవలెను. ఇక్కడ కష్టము వచ్చుచున్నది. అక్కడ ఆత్మసిద్ధమగుచున్నది. ఆత్మసిద్ధపడుట మనకు తెలియదు. శరీరమునకు, ప్రాణమునకు తెలియదు. ఈ రెండు ఒక జట్టు. ఆత్మకు తెలియును. ఆత్మ సిద్ధమగుచున్నకొలది ఆత్మ ఇంక సిద్ధము కావలసియున్నప్పుడు కష్టము ఎక్కువగుచుండును. ఇక్కడ సిద్ధమైతె కష్టమును ఆపుచేయును. ఈ రెండు చూడవలెను. ఆత్మసిద్ధమగుటయే దేవునికి ముఖ్యమైనది. కష్టము ఈ ఆత్మ బాగుచేయుటకు ఒక సాధనము. ఆత్మను బాగుచేయుటకు ఈ కష్టము ఒక పనిముట్టువంటిది.


ప్రతి మనిషిలో ఈ రెండును జరుగుచున్నవి జన్మించిన ప్రతి మనిషిలోను ఈ రెండు జరుగచున్నవి. ఈ ఘటమునకు తెలియదుగాని, ఈ ఘటములోని ఆత్మకు తెలియును. ఆత్మ యోగి దైవధ్యానములో నుండును. ఈ యోగియొక్క తపస్సు పూర్తియై సిద్ధమయ్యేవరకు కష్టము తగ్గదు.


21. ఒక రోగికి మందు నీళ్ళు ట్యూబు ద్వారా ఎక్కించునప్పుడు గ్లాసులో నీళ్ళుచూస్తూ ఎక్కించును తుదకు ఆపుచేయును. డాక్టరు నీళ్ళు ఎక్కువ ఎక్కిస్తె మనిషి చనిపోవును గాన డాక్టరు నీటి ఒరవడి చూచి ఎంతవరకు ఎక్కించవలెనో అంతవరకు ఎక్కించి ఆపుచేయును. అట్లే పరమ తండ్రి చూచినది వేరే ఉన్నది. అది అయ్యేవరకు తండ్రి కష్టములు ఆపుచేయడు.

ఈ మూడు దృష్టాంతములు ఇవి దేవుని నిశ్శబ్దమును వివరించుచున్నవి. ఓ పంతులమ్మలారా! పంతుళ్లారా! గవర్నమెంటు వారు ఒకరూలు ఏర్పాటు చేసిరి. ఆ రూలు లేకముందు పిల్లలు తప్పుచేస్తే ఎక్కడబడితే అక్కడ పంతులుగారు కొట్టేవారు. ఇప్పుడు మూడు దెబ్బలకంటే ఎక్కువ కొట్టకూడదు. ఆ దెబ్బలు కొట్టిన మాస్టరు ఉద్యోగము పోవును. బుద్ధివచ్చేవరకు ఆ పిల్లవానిని కొట్టకపోతే ఏమి లాభమని మాస్టరుగారు అంటే బుద్ధి వచ్చేవరకు శిక్షిస్తే పిల్లవాడు సహించలేడు గాన సహించగలిగినంతమట్టుకే శిక్షించవలెనని గవర్నమెంటు వారనుచున్నారు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయడు. 1కొరింథి. 10:13 ఇది పరలోక గవర్నమెంటు రూలు.