(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)

దేవుని మనిషి



15) దేవుని మనిషి:

ఈ నాలుగు తన స్వతంత్రతతోనూ, ఇష్టముతోనూ చేయవలెను. మనిషి ఈ నాలుగు తన ఇష్టము చొప్పున చేయవలెను. అయితే దేవుడు బలవంతముగా ఈ పనులన్నీ చేయించుకొనగలడు, గానీ దేవునికి ఇష్టము లేదు. ఎందుకంటే అట్లు బలవంతముగా చేయుట అనగా అది మనిషి యొక్క ఇష్టము నుండి వచ్చినదికాదు. దేవుని ఇష్టమును బట్టి వచ్చినది కాదు. గనుక దానికి విలువలేదు. పంతులుగారు పిల్లవానిని కొట్టిరి. గనుక అది మేలు కొరకే కాని పిల్లవాడు ఆ కష్టముతో పంతులుగారికి సలాము చేయలేదు. మానేటరు చేయమంటే చేసెను. భయముతో చేసెను గాని ఇష్టముతోకాదు కాని ఇష్టముతో చేయవలెను. బడి విడిచిన తరువాత పిల్లలందరూ సలాము చేయుచుండగా ఈ పిల్లవాడుకూడా ఇష్టముతో సలాము చేసినాడు. ఇప్పుడు ఇష్టమైనది అట్లే మనమును దేవునికి ఏది చేసినను మన ఇష్టముతో చేయవలెను. దేవుని ఇష్టప్రకారము చేయవలెను.


ఈ రెండు జరిగేవరకు దేవుడు ఊరుకొనును. కష్టములో ఇష్టముతో వందనము చేయవలెను. మనము అట్లు ఇష్టముతో చేయువరకు కష్టములు తొలగవు. కష్టముల వలన నష్టములేదు గాని తర్ఫీదు గలదు. పైకి కష్టమేగాని లోపల నష్టములేదు. సముద్రము పైన కొన్ని గజములవరకు కెరటముల వలన అల్లరి విస్తారముగాని లోపల అంతా నెమ్మది. అట్లే మనకు వచ్చే కష్టములు పైకి అల్లరేగాని లోపల హాయిగాను ఆనందముగాను ఉండును. శరీరమునకు, జీవమునకు ఆత్మకు బుద్ధివచ్చును. ఆత్మపోయి పరమాత్మతో కలిసిపోవునట్టి అనుభవము వచ్చును. గనుకనే కష్టమువచ్చినప్పుడు దేవుడు ఊరుకొనును.


16) హేబేలును కయీను చంపెను. హేబెలునకు శరీరము ప్రాణము ఆత్మ పోయినది. ఆదాము హవ్వలకు కొడుకుపోయెను. కయీనునకు తమ్ముడు పోయెను. దేవునికి క్రొత్త కొడుకు దొరికెను. అన్న తనను చంపేటప్పుడు తమ్ముడు పారిపోలేదు. దేవునికి క్రొత్త వరుసలేదు గాన తప్పించుకొనలేదు. అందువలన హేబెలు లోకములో హతసాక్షియైనాడు (మత్తయి. 23:35) హేబెలు తన పాపమునుబట్టి మరణించలేదు. ఆదాము హవ్వ కయీను వారి పాపమును బట్టి చనిపోయిరి. ఇప్పుడు కుమారుడు రెండు ముక్కలుగా పడియుండుటయు, రక్తమువలన భూమి తడిసియుండుటయు చూచిరి.


ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరని దేవుడు చెప్పిన ఆ చావును ఇప్పుడు కన్నులారా చూచిరి. ఇదేవారు మరణమును మొదటిసారి చూచుట. పాపమునుబట్టి మరణము తప్పదని తెలిసికొను చున్నాము. హేబెలు లోకములో రాబోవు హతసాక్షులకు మానేటరు. హేబెలుచేసిన తప్పు ఏమిటి? తప్పుగాదుగాని దేవునికిని తనకును అంగీకారమైన మంచి కానుకను తెచ్చెను. ఆ కానుకను దేవుడు అంగీకరించెను. అందుచేత నీతిమంతుడైన హేబెలు అనిపేరు వచ్చినది. హెబ్రీ. 11:4 హేబెలు గొఱ్ఱెపిల్లను దేవునికి సమర్పించెను. ఆ గొఱ్ఱెపిల్ల దేవుని గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు ప్రభువునకు ముంగుర్తు. ఈ ముంగుర్తయిన గొఱ్ఱెపిల్లను అర్పించిన హేబెలు దేవునికొరకు హతసాక్షియైనందున, దేవుని గొఱ్ఱెపిల్లయైన క్రీస్తుపభువునకు ముంగుర్తుగా. అర్పించబడిన దేవునిగొఱ్ఱెపిల్లగా ఎంచబడెను. దీనిని శ్రమలలో చేర్చకూడదు. హతసాక్షులలో చేర్చవలెను. అయిననూ మనము తాత్కాలికముగా శ్రమలలో చేర్చక తప్పదు. నరకబడుట హతసాక్షుల లెక్కలోచేర్చబడుటకే హతసాక్షులకు ప్రత్యేకమైన గౌరవమును పరమభక్తులకు లేని గొప్ప బహుమానమును పరలోకములో ఉండును. క్రీస్తుప్రభువునకు ముంగుర్తుగా తన రక్షణ కొరకును ఇతరుల రక్షణ కొరకును హతసాక్షులు ప్రాణమునర్పించిరి. క్రీస్తుప్రభువు మన అందరికొరకు తన ప్రాణము నర్పించెను. కయీను, హేబెలును చంపునపుడు దేవుడు వచ్చి కయీను గొంతు పట్టుకొంటే హేబెలు చావు తప్పునుగాని దేవుడు తప్పించలేదు. తప్పించినయెడల హేబెలునకు ఆ గొప్ప పేరురాదు. కయీనుకు చెడ్డపేరురాదు. అందుకే దేవుడు ఊరుకొనెను. ప్రకటనలో అయ్యగారు హతసాక్షులను గూర్చి వివరముగా చెప్పిరి.


17) శ్రమలలో ఉన్న అందరు వినండి. శ్రమలంటే ఏమనగా దయ్యము కలలోకనబడి భయపెట్టి బాధపెట్టుట పాపము చేయించుట, జబ్బు, ఇబ్బంది, కష్టము తెచ్చిపెట్టినది ఇవన్ని మనిషి అసహ్యించు కొన్నాడు. ఇది రెండవరకమైన హత సాక్ష్యము. మొదటి హతసాక్షులు హటాత్తుగా చనిపోదురు. కాని ఇదైతే కొన్ని సంవత్సరములు శ్రమపడుదురు. రోగులను ఉచితముగా బాగుచేయు స్వస్థిశాలకు వచ్చువరకు ఈ రెండు హతసాక్ష్యముండును. దీనికి బహుమానము దొరుకును. ప్రది దినము కష్టములననుభవించుట. రెండవ రకమైన హతసాక్షి వరుసలోనికి వచ్చును. నాకు హతసాక్షి లెక్కవద్దు అంటే కష్టము పోవును గాని కిరీటముండదు.

ఏడు రకములైన కిరీటములున్నవి. హతసాక్షి ప్రభువు బాగుచేయు స్వస్థిశాలకు వెళ్ళవలెను. వెళ్ళినను బాగుపడకపోతే

దేవుని పద్ధతులు వేరు గనుక మనము

సన్నిధిలో గదిలోకాదు గదిలోనున్న సన్నిధికాదు. “సన్నిధిలో” ఈ వర్తమానమును అయ్యగారు సన్నిధిలోనుండి అందించుచున్నారు గది సన్నిధి వేరు (అయ్యగారు ప్రభువు. ప్రభువు అయ్యగారు ఉన్న సన్నిధివేరు) ఈ సన్నిధిలో నుండుట కష్టము. అయ్యగారు సన్నిధిలో ఉన్నందున ఇట్టి సంగతులను తెలియజేయుచున్నారు. ప్రభువు అయ్యగారితో మాట్లాడుచున్నారు. అయ్యగారు ఒక దొరగారు కలిసి పక్కలంక వద్దనున్న తాడిపూడి వెళ్ళిరి. దొరగారు అయ్యగారిని ప్రసంగించమనగా ప్రసంగించిరి. చెప్పేటప్పుడు ఎదురుగా ఉండి ఒక ముసలాయన ప్రసంగమంత విని వెనుకకు తిరిగి మనకు ఏమియు తెలియలేదురా అన్నాడు. ప్రసంగము వివరమంతా సున్న నీవు తెలుగు మనిషివి. ఆయన తెలుగు మనిషి మీరుచెప్పినదే అర్ధముకాకపోతే నేను చెప్పితే వారికింకేమి అర్ధమగును? అని దొరగారు చాలా నిరాశపడ్డారు. కష్టాలలోనున్న వారికి అనగా ఊరగాయవలె కష్టాలలో ఊరే వారికి అర్ధము కాదు. ఇక్కడనున్న వారందరూ విశ్వాసులా? అవిశ్వాసులా? ఇక్కడకు రావడమే విశ్వాసము. మీరు విశ్వాసులైతే ఈ చరణము పాడకూడదు.
“కడు బీదవాడనంధుడను, దౌర్భాగ్యుడను చెడిపోయిపడియున్నాను
సుడివడిన నామదికి స్వస్థత చెడిన కనులకు దృష్టిభాగ్యము
-బడయవలసినవన్నీ నీచేబడయుటకు నాయొడయడాయిదే ॥ఉన్నపాటున॥

అందులోఎన్ని ఉన్నవి (పాపముల జాబితా)

నీవు కడు బీదవాడవా? దేవుడు నీకు ఏమి తక్కువ చేసినాడు? గ్రుడ్డివాడవా? బైబిలు చదువుటలేదా? భాగ్యములేని వాడవా? చెడిపోయినవాడవా? మంచివాడవుకావా? పడిపోతే ఇక్కడికి ఎలా వచ్చావు? ఒక మనసుకు స్వస్థతలేదా? ఇన్ని ఉంటే మరెందుకు విశ్వాసులు కారు? ఇదికాదు విశ్వాసులు పాడదగినది.


“దరిలేని ఆనందకరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయనూ - తెరవు కడ్డంబైన
యన్నిటి విరుగగొట్టెను గాన నేనిపుడరుదుగానీవాడనవుటకు మరి
నిజము నీవాడనవుటకే” ॥ఉన్నపాటున॥


18) ఓ ప్రభువా! ఈ దినము ప్రార్థన చేయబోతే ప్రార్ధన రావడములేదు. బైబిలు చదవాలంటే ఇష్టములేదు. ఎందుకో గందరగోళముగా నున్నది. నన్ను నేను పరిశీలించుకొంటే నేను పాపము చేసినట్టు కనబడుటలేదు. కారణము తెలియుటలేదు. గనుక ప్రభువా! నా మీదికి కష్టములు పంపించుము. బైబిలు చదువుటకు ఇష్టము పుట్టును. కష్టములు రానిచ్చిన సహించలేవని ప్రభువనెను. నేను సహిన్తాను. ప్రభువా పంపుమనెను. అప్పుడు కష్టము వచ్చెను. కష్టము రాగా రద్దీగా ప్రార్ధన వచ్చెను. వాక్యము ఎక్కడతీసినా కాంతిగానే కనబడుచుండెను. ఈలాగు జరిగెను. ఇట్లు ఎవరు చేయగలరు. ఇట్లు చేసిన యెడల అందున్న మేలును గుర్తింపవచ్చును.


ప్రార్ధన:- ఓ కనికరముగల తండ్రీ! ఇప్పుడు మాట్లాడుకొన్నవన్ని అందుకొని ఆనందించేటట్లును మాశక్తికొలది బోధల ప్రకారము నడిచే శక్తి, ఆసక్తి దయచేయుమని వేడుకొనుచున్నాము ఆమేన్.


దేవుడు ఎందుకు ఊరుకొనుచున్నాడు? ఎందుకు ఊరుకొన్నాడంటే ఆయన గుణములు మనకు ఇచ్చివేసినాడు. గనుక ఊరుకొనుచున్నాడు. అందులో ముఖ్యముగా స్వతంత్రత ఇచ్చినందున ఊరుకొన్నాడు. ఈ రెండు కాక ఒకసంగతి చెప్పినాడు. ఇది తినండి అది తినవద్దు తింటే మరణము అని చెప్పినాడు. కనుక ఊరుకొన్నాడు. తన రూపమును తన స్వభావమును తన లక్షణములను తన ఆజ్ఞను ఇచ్చినాడు గాన ఊరుకొన్నాడు తన ఆజ్ఞను మీరినందున వచ్చే నష్టమును చెప్పినాడు. గనుక ఊరుకొన్నాడు. ఈ నాలుగు ఈ పదనెనిమిదిలోఇవే. ఈ పదునెనిమిది కారణములను ఊరుకొనకపోతే ఆయనను ఏమి చేయమంటారు?


ఐక్యత

19) ప్రార్ధన చేసినా కష్టము తీసివేయలేదు, తప్పించలేదు అంటే తీసివేసేవరకూ నీవు ప్రార్ధన చేయవలెను. తీసివేయకపోయినను మనస్సులోనైననూ సంతోషము కలిగించును. సంతోషము కలిగించుట ఒక జవాబు, తీసివేయుట మరియొక జవాబు. ప్రార్ధించు వింటాను అన్నారు గాన ఈ రెండు ఏమగును? ప్రార్ధన నెరవేరకపోతే మనలో ఏదో పొరబాటు ఉన్నదని గ్రహింపవలెను, ప్రార్థించండి వింటాను అని చెప్పిన ఆయన వాక్యము ఎల్లప్పుడు పనిచేయును; మానదు, మారదు. ఆ రెండు కొట్టివేసిన యెడల దేవుని కొట్టివేసినట్లే. ప్రభువా! నాలో లోపము ఏదో చూపించుము. దిద్దుకొందునని ప్రభువునడిగిన ప్రభువు చెప్పును. అందుకే సన్నిధి అవసరము. దేవుడు ఊరుకొనుచున్నాడని సంతోషించవలెను. దేవుడు ఊరుకొన్నాడని మనము సంతోషించి ఊరుకొనవలెను. ఈ రీతిని దేవుడు మనమును ఊరుకొనుట ఐకమత్యము.

సహోదరుల ఐక్యతయే ఎంతో మేలు, ఎంతో మనోహరము అయిన ఎడల దేవుడును, మనిషి ఐక్యత కలిగి ఉన్న ఇంకెంతమేలు, ఇంకెంత మనోహరము. తండ్రి, కుమార, పరిశుద్దాత్మ ముగ్గురు ఒక్కరే ఇది త్రిత్వములోని ఐక్యత అది మనకుకూడా ఉన్నది. మనమెన్ని వందలమంది ఉన్నా దేవుని లెక్క ఒక్కరే, అదే ఐక్యత. త్రిత్వములోనుండి ఇది వచ్చినది. మన ఐక్యత ఎక్కడ ఉన్నా ఉన్నంతసేపైనా బేధాభిప్రాయములు, విసుగుదల, కీచులాటలు లేకుండ ఉండవలెను. తండ్రి ఏమిచెప్పునో అదే కుమారుడును పలుకునని ప్రభువు చెప్పెను ఇదే ఐక్యత. యోహాను. 3:34; 5:19; 14:23-24. పరిశుద్ధాత్మను పంపుదును ఆయన మాటలే పలుకునని ప్రభువు చెప్పెను. యోహాను. 16:14 ముగ్గురు ఒక్కటే అట్టి ఐక్యత సంఘములో నుండవలెను. అట్టి ఐక్యత ఉన్నందున కీర్తన. 133:1లో ఉన్నట్టు ఎంత మేలు, ఎంత మనోహరముగా ఉండును. మేలంటే ఉపకారము కలుగుట దానివల్ల సంతోషము కలుగును. సంఘమంతయు ఐక్యత కలిగి ఉన్న యెడల త్రిత్వములోని ఐక్యత అను ప్రతిబింబము సంఘములోనికి వచ్చును. అప్పుడు దేవుడు మనము ఒకటే అగుదుము. ఐక్యమత్యత ఉన్నందు వలన మిషనుల బేధము ఉండకూడదు. ఇతర మతముల బేధము ఉండకూడదు, ఏనాడో పుట్టిన ఆ బేధమును తీసివేయగలమా? ఫలాని వారు లూథరనులు, ఫలానివారు బాప్టిస్టులు అను బేధాభిప్రాయము ఉండకూడదు. ఎవరి మతము వారికే ఎవరి మిషనువారికే. ఎవరి స్వంత అభిప్రాయము వారికే గొప్ప. గనుక బేధాభిప్రాయము ఉండకూడదు. మనము భేదాభిప్రాయము తీసివేసికొన్న అందరు తీసివేసికొనగలరా? తీసివేసికొన్న అదే మనోహరముగా ఉండును.


“పరమ దయానిధి క్రీస్తుబలమున - పాపభారంబులు విడునన్న ఆ పరిశుద్ధాత్ముని బంధుత్వంబున - అరమర చీకటులన్నియు తొలగును ॥మనసానందము॥


దైవసన్నిధికి వచ్చిన యెడల ఐక్యత కలుగును. దైవసన్నిధిలో పరిశుద్ధాత్ముడు అన్ని అరమరలు తొలగించును. దైవసన్నిధిలో ఐక్యత కలిగించుకొనవలెను. అప్పుడు ఐక్యత కలుగును.


ప్రార్ధన: - ప్రతివారియొక్క జ్ఞానములోనూ, మనస్సాక్షిలోను, ఆత్మలోనూ ఈ విషయములు చొరవబడునట్లు కటాక్షింపుము. ఇదివరకు ఉన్నవారిని, క్రొత్తవారిని దీవించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్.