లేత విశ్వాసము-ముదురు విశ్వాసము

గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు



యెషయా 1:17-19; యోహాను 1:1-5; కొలస్స. 1:15-17.

నిన్ననేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఓ దేవా! నీవు దైవగ్రంథములో వ్రాయించిన రీతిగా, మానవులమైన మా మనవులు ఆలకించువాడవని భక్తులయొక్క చరిత్రవల్ల తెలిసికొన్నాము. ఈ దినము నీవాక్య ధ్యానముద్వారా ఏలాగు నీ సన్నిధిలో ప్రార్ధించవలెనో అట్టి వివేచన జ్ఞానమొసంగుమని క్రీస్తుయేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ ఆమేన్.


దేవుడు అన్ని ప్రార్ధనలు ఆలకిస్తాడని, దానికి నెరవేర్పు ఇస్తాడని దేవుని వాక్యము, వివరములనుబట్టి తెలిసికొనుచున్నాము. కాని మన జీవితంలో దాని క్రియ వేరుగా కనిపించుచున్నది. అనుభవమునుబట్టిచూస్తే దేవుడనేక ప్రార్ధనలు ఆలకించడములేదు అని అనిపించుచున్నది. ఈ రెండు అనుభవముల మధ్యను విశ్వాసులు నలిగిపోతున్నారు. దేవుని వాక్యములో అన్ని ప్రార్ధనలు నెరవేరతాయని ఉన్నది. ఇక్కడ చూస్తే దేవుడు ప్రార్ధన ఆలకిస్తాడని ఉన్నది, క్రియకు వచ్చేటప్పటికి దేవుడు కొన్ని ప్రార్ధనలు వినుటలేదు అదేమిటి? అని కొందరు లోకస్టులు అనుచున్నారు. దేవుని వాక్యమును సరిగా గ్రహించనందు వలన, సరిగా ఆలకించనందువలన, సరిగా విననందువలన (ఆపసోపాలు) నానా అవస్థలు పడుచున్నారు. ఈ విషయం చాలా అవసరము. మన అనుభవములో నిన్న ఒక సంగతి జరిగినది. ఒక అమ్మాయి 2,3 సం.ల నుండి జబ్బుపడెను. ఇక్కడున్నవారు ఆ అమ్మాయిని థైర్యపరచి ఆనందపరచిరి. వారి ప్రార్ధనలనుబట్టి ఆమె జీవించు చున్నది. 'మరణము నీకురాదు' అని వాక్యమునుబట్టి మీరు బోధించిన బోధ నిజమా? వాక్యము నిజమా? అనుభవము నిజమా? ఇది ఆలోచించగా వీటిమధ్య విశ్వాసి తలతిరిగిపోవుచున్నది. ఈ సమయములో సాతాను వస్తాడు. 'మీ బైబిలు ఏమైనది? మీ బోధ ఏమైనది? మీ ప్రార్ధనలు ఏమైనవి?' అని అంటాడు. అలా అనగానే దేవుడు ఆలకిస్తాడని, బైబిలులోని బోధనుబట్టి మీరు చేసికొనిన తీర్మానము శిధిలమైపోతుంది. అప్పుడు విశ్వాసి "నా అనుభవ వాంగ్మూలమే నిజమైనది” అని అనుకుంటాడు. ఆలాగున వీటిమధ్యన విశ్వాసి నలిగిపోవుచున్నాడు. రోగి ప్రార్థన చేసికొంటాడు. సంఘమంతా అతని కొరకు ప్రార్ధన చేస్తుంది. ఆ ప్రార్ధనలకు ప్రత్యక్ష అనుభవ ఫలితం కనబడనియెడల ప్రార్థనలన్ని కొట్టివేయబడినవా! అని ఆ విశ్వాసిని కొందరు హేళన చేస్తున్నారు. ఒకదరినుండి అవిశ్వాసి, మరియొకదరినుండి అపవాది విశ్వాసిని పట్టుకొంటున్నారు. గనుక ఈ రెండింటిమధ్య విశ్వాసి నలిగిపోతున్నాడు. అవిశ్వాసి వచ్చి విశ్వాసిని మీరు చేసిన ప్రార్ధనలు ఏమైనవని అడిగితే, విశ్వాసి నోరు మూసికొనెను. ఇలా విశ్వాసి నలిగిపోతున్నాడు. మీరు చేసికొనిన తీర్మానములో ఏమున్నది? బోధ, గ్రంథవివరణ, ప్రార్థన, వాంగ్మూలములు (సాక్ష్యములు) ఉన్నవి. దీనిలోనున్న కథేమిటి? మీ తీర్మానము రెండు పాళ్లుగా ఉండవలెను.

అలాగున అనిన విశ్వాసికి ఎప్పుడు హృదయములో గొప్ప "సంతోషమున్నది. నా మనస్సులో ఉండే కోరిక యావత్తు తండ్రి ఎదుట కుమ్మరించినాను" అనే సంతోషము వచ్చును. విశ్వాసి సన్నిధి గదిలోనుండి సంతోషంగా, అంతా పూర్తిచేసానని సంతోషముతో బైటికి వస్తాడు. దీనిని ముదురు విశ్వాసము అనవచ్చును. నీ చిత్తము చేయలేను అని లేతవిశ్వాసి అంటాడు.


యేసుప్రభువు గేత్సేమనే తోటలో పై రెండు పాళ్లు కలిగియున్నారు.

లేత విశ్వాసి ముదురు విశ్వాసియై పోయినాడు కనుకనే సత్యప్రమాణములు చేసాడు. విశ్వాసి తన చిత్తము మధ్యను, దేవుని చిత్తము మధ్యను నలిగిపోతున్నాడు. అంతేకాకుండా అపవాది మధ్యను దేవుని మధ్యను నలిగిపోతున్నాడు. ఈ రెండు తీర్మానముల మధ్య విశ్వాసి నలిగిపోతున్నాడు. అయితే, ముదురు విశ్వాసికూడా ఈ రెండింటిమధ్య నలిగిపోక, ఆయన మీదనే ఆనుకొని ముందుకు సాగిపోవును. ఈ రెండు అధికారముల మధ్య నలిగిపోయిన విశ్వాసి ఏ రంగులో తేలగలడు? "తాను చేసిన ప్రార్ధన నెరవేరలేదు" అప్పుడు విశ్వాసి రెండు వాంగ్మూలముల మధ్యను అనగా అపవాది, అవిశ్వాసుల మధ్యను ఎప్పుడైతే నలిగిపోతాడో, అప్పుడు విశ్వాసి నిజమైన రంగు తేలును. అప్పుడు విశ్వాసి "దేవుని చిత్తము" అని అనవలెను. విశ్వాసి ఆలాగు అనుటవలన అపవాదికి ఆక్షేపించుటకు సందు దొరకదు. అప్పుడు విశ్వాసి నా చిత్తము నెరవేరలేదు నా తండ్రి చిత్తము నెరవేరినది అని సమాధానము చెప్పవలెను.


ప్రార్ధన గదిలో ఒకరంగు, రెండు చిత్తముల మధ్య ఒక రంగు, మూడును నెరవేరిన తరువాత ఇంకొకరంగులోనికి విశ్వాసి మారుచుండును. అప్పుడు గెత్సేమనేలో ప్రార్ధనయైన తరువాత శత్రువులు వచ్చిరి. విశ్వాసికూడా ఇప్పుడు ఆలాగే అనవలెను. ఆ సమయములో తండ్రీ! నీ చిత్తము కావలెనని అనుటకు విశ్వాసి హృదయములో ఏమి కావలెను? విశ్వాసి హృదయములోనికి ఏమి చేరుకొనవలెను?

ఈ మూడు ఏ విశ్వాసియొక్క హృదయములోనున్నవో, ఆ విశ్వాసముగల విశ్వాసియొక్క “నీ చిత్తము” అనే ప్రార్ధన నెరవేరినది. ఓ అపవాదీ! ఓ అవిశ్వాసీ! నా చిత్తము నెరవేరలేదు. నా తండ్రి చిత్తము నా చిత్తముగా మార్చుకొన్నందువల్ల నా చిత్తము అనుటకు వీలైనది. గనుక నాకు జయము కల్గినది అని అపవాదిని ఓడించవలెను. విశ్వాసి ఎప్పుడు అధైర్యపడకూడదు.

నా చిత్తమునకు ఒక శిరస్సున్నది. దేవుని చిత్తమునకు ఒక శిరస్సున్నది. నా చిత్తమునకు జ్ఞానమున్నది. దేవుని చిత్తమునకు, జ్ఞానమునకు అపరిమితమైన జ్ఞానమున్నది. అనగా నా చిత్తమునకున్న జ్ఞానము పరిమితిగల జ్ఞానము. మన జ్ఞానమునకు 10మైళ్ల దూరమున నున్న చెట్లవేళ్లు కనబడువు. దేవుని జ్ఞానమునకు మనిషి జీవితకాల పర్యంతము ఏమి వచ్చునో, అవన్నియు కనబడును. ఆ రహస్యము మనకు తెలియదు. దేవుని చిత్తమునకు అన్నియు తెలుసును. దేవుడు మన మొదటి కోరిక ప్రకారముచేయక రెండవ కోరిక ప్రకారముగా నెరవేర్చును.


మనిషికి రెండు వరములు గలవు అవి

రెండునూ పవర్ (శక్తి) గలవే. దర్శన వరమునకు రాబోయే సంగతి కనుగొనే శక్తిఉన్నది. విశ్వాస వరమునకుకూడా తెలియును. ప్రార్ధన చేసిన విశ్వాసము కలుగును. రాబోయే నెరవేర్పులు తెలిసికొనేది దర్శనము. ఈ విశ్వాసి ప్రార్ధన చేసినపుడు వెంటనే రాబోయే సంగతి తెలియును. ప్రభువు రాబోయే సంగతి మందు తెలియపర్చి, నెరవేర్పు తరువాత తెలియజేయును. జబ్బు బాగుచేయునని తెలియనపుడు ప్రార్ధన చేసినా, తెలిసిన తరువాత జబ్బు బాగుచేయకపోయిన పరలోక మహిమకు సిద్ధపర్చి ఆ రోగిని గుణపర్చును. అది చేయుటవలన చిత్తమునకు ఇంకొక చిత్తము, ప్రార్ధనలోనుండి ఇంకొక ప్రార్ధన వచ్చినది. ఎప్పుడైతే దర్శనములో కనబడునో, “సహింపు దయచేయుము, నీ మహిమకొరకు సిద్ధపర్చుము” అనే క్రొత్త ప్రార్ధన విశ్వాసి చేయును. దర్శనవరము ఒకవేళ లేకపోయినా ఫర్వాలేదు. హిజ్కియా ఉన్నాడు, మరణశాసనము వ్రాయబడియున్నది. రెండవ ప్రార్ధనలో దర్శనములో నీకు 15సం॥ల ఆయుష్షు ఉన్నదని తెలియబడెను. విశ్వాసి గనుక నమ్మెను. ఆలాగు నమ్మి, విశ్వాస దర్శన వరములను సంపూర్ణముగా పొందుస్ధితి పెండ్లికుమారుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.



10.6.1945వ సం! దేవదాసు అయ్యగారు రాజమండ్రిలో చేసిన ప్రసంగము.