దేవుని నిశ్శబ్దలక్షణము-క్రైస్తవుని స్థిరవిశ్వాసము

గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు



మత్తయి 7:24-27.

క్రీస్తుప్రభుని రాకడకు నిరీక్షించుచున్నవారలారా! ఈదిన వర్తమానముద్వారా ఆయన వాక్యములోని స్థిరవిశ్వాసము అనే రాతిపునాదిపై ప్రభువు మిమ్ములను స్థిరులనుగా చేయునుగాక! ఆమేన్.


బైబిలులో దేవునియొక్క నిశ్శబ్ద లక్షణమున్నది. అందుచేత క్రైస్తవునియొక్క విశ్వాసము దేవుని నిశ్శబ్దమునుబట్టి కదలిపోవచ్చు.


1. దేవుని నిశ్శబ్దము:- ఆ విశ్వాసి అనగా ఇసుకపై పునాది వేసిన అవిశ్వాసి - “సైతాను, అతని దూతలు, పాపములు, వడ్డీ పాపాలు, పాప ఫలితములు, చివర చావు, ఈ మొదలగునవన్నీ జరుగుచుండగా దేవుడు ఎరుగనట్టు ఊరుకొన్నాడు” అని అనును. అదే దేవుని నిశ్శబ్ద లక్షణము, అది అనేకులకు ఆటంకపు బండగా నున్నది (విశ్వాసికి కాదుగాని ఇసుకపై పునాదివేసిన అవిశ్వాసికి మాత్రము ఆటంకపు బండగానున్నది. ప్రసంగి 8:11). దేవుని మీద నేరము మోపుట చాలా సుళువు. ఎందుచేతనంటే ఆయన కనబడి అడుగడు గదా!


ఉదా:-

దృష్టాంతము:- ఒక పంతులమ్మగారిని అయ్యగారెరుగుదురు. ఆమె ఎప్పుడు జబ్బుతోను, బలహీనతతోను ఉండెడిది. అయినను ఆమె విసుగుకొనక. బైబిలు చదువును. తల్లిమాత్రము విసిగి ఎన్నో మాటలు అనేది. అయినను ఆ పంతులమ్మగారు బైబిలు ఎప్పుడూ చదివెడిది. ఇది రాతిపునాది. 'ఒక మనిషి పాపములోపడినాడు దేవుడెందుకో ఊరుకొన్నాడు' అని రాతి పునాది మీద ఉన్న క్రైస్తవుడు అనును. ఒకనికి జబ్బువచ్చినప్పుడు ఇసుకమీద పునాది వేసినవాడు “దేవుడు అతనికి ఎందుకు జబ్బు రానివ్వాలి? ఆపకూడదా?” అని అంటాడు. విశ్వాసి అయితే, “వానికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యముండగా జబ్బు ఎందుకు తెచ్చుకోవాలి” అని అంటాడు. 'అకాలమరణం ఎందుకు రావాలి? ఆ చావు రాకుండా ఆయుష్కాల మివ్వకూడదా?' అని ఇసుక పునాది విశ్వాసి అనగా “ఎందుకో ఒకందుకు దేవుడు తీసికొన్నాడుగాని అది నీకెందుకు" అని రాతిమీద విశ్వాసి అంటాడు.


రాతిమీద పునాది వేయబడిన క్రైస్తవునియొక్క లక్షణము కూడా నిశబ్ధమే. ఇవన్నిచూస్తు దేవుడు ఊరుకున్నాడు గనుక ఆయన విశ్వాసులు ఆయన గుణము కల్గి యుంటారు గనుక వారుకూడా ఊరుకొందురు. ఒకడు పాపములో పడిపోతే అది రాతిపై పునాది వేయబడిన విశ్వాసిచూచి, 'అయ్యో! నీవు పాపములో పడ్డావు 'రా!' నీకొరకు ప్రార్ధన చేస్తాను. ఇకమీదట పాపము చేయకు అని అంటాడు. అంతేగాని “నీవు పాపములో పడేటప్పుడు దేవుడు చెయ్యిపట్టుకొని వెనుకకు లాగితే ఎంత బాగుండును? అట్లు చేయనందున దేవునిదే నేరము” అని అనడు. అయితే ఇసుక పునాది విశ్వాని ఇసుకలో ఎన్ని ఇసుక రేణువులున్నవో అన్నిసార్లు విసుగుకొనును, గాని రాతి పునాది విశ్వాసి అలాగు చేయడు. ఎందుకంటే బైబిలు బాగా చదువును గనుక.


ఒక దృష్టాంతము: - రామచంద్రాపురంలో ఒక చాకలి వాడున్నాడు. అతను బట్టలు నెత్తిమీద పెట్టుకొని వచ్చుచుండగా వర్షము వచ్చుచుండెను. దారిలో ఒక పాక కనబడగా తడవకుండు నిమిత్తము దానిలో ప్రవేశించెను. అనుకొనని విధముగా ఆ పాకపై పిడుగుపడగా చనిపోయెను. అప్పుడు ఇసుకమీద పునాదివేసిన విశ్వాసి దేవుడు ఎందుకు అట్టి అకాలమరణము రప్పించాలి? ఆ వ్యక్తిని దేవుడు చావకుండ చేయకూడదా? అనిఅంటే దానికి రాతి పునాది విశ్వాసి - “అది ఆయన న్యాయలక్షణము. ఆయన ఇష్టము గనుక ఊరుకొన్నాడు” అని అనును. మనలో నేరములుంచుకొని దేవునిపై నేరము చెప్పుదుము (యాకోబు 1వ అ॥ము). అది గొప్ప నేరము.


ఆకాశమునుండి వర్షము వస్తే అది వరదగా ప్రవహిస్తే అది ఇసుకమీదనున్న ఇంటిమీద ప్రవహించగా అది పడిపోయినది. మనిషికి నష్టము కలిగినది. ఆకాశముకంటె ఎత్తుగా పైనున్న దేవునియొద్దనుండి వర్షము వస్తున్నట్లుగా, దేవుని నిశ్శబ్దము పై నుండి వచ్చుచుండగా, వర్షము వలన ఇసుక కరిగిపోవునట్లుగా, ఇసుక విశ్వాసము కరిగిపోవును. వరదవల్ల భూమిమీదనున్న ఇసుక కొట్టుకొనిపోవునట్లు ఇసుక విశ్వాసియొక్క విశ్వాసము కొట్టుకొని పోవును. గాలిలోకమునుండి మరియు దురాత్మలనుండి వచ్చు నిందలు, దూషణలు అనేవర్షము కురవగా, నీటి ప్రవాహమువలె వచ్చు నింద దూషణ ప్రవాహమునకు ఇసుక విశ్వాసము కొట్టుకొనిపోవును. వర్షము మంచిదే, నిశ్శబ్దము మంచిదేగాని వరద మంచిదిగాదు (నిందలు, దూషణలవల్ల విశ్వాసము కరిగి కొట్టుకొనిపోవును). వర్షమువల్ల వరద వచ్చురీతిగా, మనుష్యులవల్ల నిందలురాగా దేవుని నిశ్శబ్దమువల్ల ఇసుక విశ్వాసి విశ్వాసంకూడా కొట్టుకొనిపోవును. వర్షము మంచిదే, దేవుని నిశ్శబ్దము మంచిదేగాని నింద దూషణలవల్ల మనిషి చెడినాడు. ఎందుకంటే ఇసుక విశ్వాసము గనుక. మంచిదైయున్న దేవుని నిశ్శబ్దమువల్ల కూడా మనిషి చెడును. ఎందుకంటే ఇసుక విశ్వాసము గనుక. నరుల ఆక్షేపణకు కూడా మనిషి చెడును. భూమి మీదనున్న బురదగల వరద మనుష్యులయొక్క ఆక్షేపణకు సమానము.


మనిషి కట్టుకొన్న ఇల్లు పడగొట్టుటకై వాన వరద వచ్చిందా? రాలేదు. అవి వాటి పనిమీద వచ్చినవిగాని పడగొట్టుటకు రాలేదు అయితే వాటి వాటి పునాదుల బలమును బట్టి కొన్ని ఇళ్లు పడితే పడవచ్చు.

మనకు వచ్చే శోధనలు; మిత్రులవల్ల, శత్రువుల వల్ల, స్వజనులవల్ల వచ్చే ఆటంకములు దూషణలు, ఆక్షేపణలు. మొదలగునవి వరదతో పోల్చవచ్చును.

ఇల్లు = సిద్ధాంతము లేదా మతము లేదా బ్రతుకుదెరువు.


వరద అనగా చెడిపోయిన బురదనీరు. లోకములో మనకు వచ్చే కష్టములకు అవి గుర్తు. ఇవి మూడు కలిసి మన ఇల్లును పడగొట్టును (ఇసుక పునాదైతే మన ఇల్లుపడిపోవును) గాని రాతిపునాదియైతే అవి పడగొట్టలేవు. ఈ రాతిపునాది అయ్యగారికి చాలా ప్రాముఖ్యము.


సిద్ధాంతము అనగా:-

ఈ 11 అంశములు కలిపితే ఇల్లు అయినది. లేక సిద్ధాంతమైనది. నమ్మిక, విశ్వాసముకూడా ఈ 11 అంశముల కొరకే. ఇవన్నీ ఉన్న మనిషి ఒప్పుకొన్న భక్తుడే. భక్తుడైన మనిషి చనిపోయినపుడు తిన్నగా మోక్షం లభించును. ఒప్పుకొనని మనిషి చేసే పని ఏదనగా, "ఇవన్ని వట్టిదే" అంటాడు గనుక అతనిది ఇసుకపునాది.


ఇపుడు ఇతర మతస్థులు ప్రవక్తల దగ్గరకు వచ్చి మరి ముఖ్యంగా నాస్తికులు వచ్చి - “బైబిలంతా వట్టిది, క్రీస్తువారు పుట్టలేదు, క్రైస్తవమతమమంతా అసత్య మతము, దేవుడు లేడు, దయ్యములేదు. మోక్షములేదు, దూతలులేరు, మనిషి చనిపోతే గాలిలో కలిసిపోతాడు” అని నాస్తికులు అంటే నిజమేబాబు అని క్రైస్తవులు అందులో కలిసిపోతున్నారు. ఆలాగు కలసిపోకూడదు. అట్టివారికి ఇసుక విశ్వాసమే.


రాతిపునాది - స్థిరపునాది:-


రాతిపునాది కలిగిన విశ్వాసి శ్రమలు పడినపుడు కిరీటముండునా? లేక తీర్పు తరువాత కిరీటముండునా? శ్రమలు పడుచు సహించేటప్పుడే కిరీటముండును. “అబ్బా! ఏమి శ్రమలు?” అని విసుగుకుంటే, ఆ కిరీటము వెంటనే వెళ్ళిపోవును. (దర్శన వరముగలవారు చూస్తే కనబడును). యేసు ప్రభువు నిన్ను సువార్తకు పంపినపుడు ఫలితము లేనప్పుడు; "ఫలితమున్నదని సంతోషించి స్తుతించవలెను" అదే జయము.


ప్రార్ధన:- ఓ తండ్రీ! గాలి వీస్తుండగా ఒకరాయి గట్టిగా విసరితే కొన్ని గజాల దూరమైనా, గాలిని త్రోసికొని దూసికెళ్లును. అలాగే మా కూటముయొక్క బోధలు, ప్రార్ధనలు మిక్కిలి కఠినమైన హృదయములలోనికి కూడా దూసికొని వెళ్ళేటట్లు బలపరచి పదునుపెట్టుము. ఆమేన్.


కిరీటము:- ప్రభువు నిమిత్తము శ్రమలు పడేవారియొక్క శిరస్సులమీద వారి సహింపు సమయమున మహిమ కిరీటము పడునుగాని విసుగుకొన్నపుడు వెంటనే సింహాసనముయొద్దకు వెళ్ళిపోవును గనుక జాగ్రత్తగా యుండండి. అయితే, మరలా ఆ తప్పు ఒప్పుకొని సహించుటకు ముందుకు సాగి, సహింపనారంభించి సంతోషించితే, అప్పుడు అది మరలా వచ్చును. ఎన్ని పర్యాయములు రాతిపునాది మీదనుండి తొలగిపోతే అన్ని పర్యాయములు ఇసుకపునాదికి వెళ్ళి తిరిగి అన్ని పర్యాయములు మరలా రాతిపునాది మీదికి రావలెను.


క్లుప్త స్ధిర సిద్ధాంతము:- మనము రాతిపునాది మీద స్థిరపడుట ఎట్లు అనగా

మనిషి ఏమి చేసినా దేవుడు ఊరుకుంటున్నాడు. దానికి కారణము అయ్యగారు ఈ రీతిగా చెప్పిరి.

నిశ్శబ్ద లక్షణమేమనగా మనకు తెలిసికొనవలెనని కోరిన సంగతులు వివరముగా బైబిలులో లేవు. మనము తెలిసికొనవలెనని శ్రద్ధయున్నదిగాని అవి బైబిలులో వివరముగాలేవు. అందుచేత అభ్యంతరము కలిగినది. అవేవో చెప్పగలరా?


1. యేసుప్రభువు గార్థభమును విప్పుకొని రమ్మన్నారు. గాని యజమానుని సెలవడుగలేదు. అది ఎందుచేత బైబిలులో లేదు? బైబిలులో లేనిది మనమేలాగు చెప్పగలము? మన సొంత ఆలోచన చొప్పున చెప్పవచ్చునుగాని అది వట్టిది అగును. బైబిలులో తారీకులు లేవుగాని పండితులు ఊహించి చెప్పిరి. దేవుడు బైబిలులో పలానిది ఫలాన తారీఖున జరిగిందని చెప్పి వ్రాయించిన బాగుండును గాని ఆలాగు చేయలేదు. ఉదా:-

వాటికి సరియైన తారీకులు లేవుగాని సంవత్సరములున్నవి గనుక బైబిలుకూడా ఆ విషయములో ఏమి చెప్పకుండా నిశ్శబ్దముగా ఉన్నది. ఆదికాండము మొదలుకొని మలాకీ వరకు ఈలాగు అనేక నిశ్శబ్దములున్నవి. అవి చూచి ఇతరులు ఆలాగు ఎందుకు ఉన్నది? అని మనలను అడుగుదురు. దానికి మనమేమి చెప్పగలము? ఎందుచేతననగా బైబిలు నిశ్శబ్దము వహించింది. అయితే క్రీస్తుప్రభువు పుట్టినప్పటినుండి మనకాలము వరకు తారీకులు, సంవత్సరములు, దశాబ్దములు, శతాబ్దములు సరిగానేయున్నవి. తర్వాత ఈ మతాలు ఏలాగు పుట్టినవో వివరముగాలేదు.

ఈ నాలుగు మతాలు ఎప్పుడు వచ్చినవో తెలియదు. బైబిలులోలేదు. అలాగే మహమ్మదీయ మతము. ఆ ముందు నాల్గు మతములు ఎట్లు వచ్చినవో బైబిలులోలేదుగాని ఉంటే మనకు బాగుండేది. కయీను భార్య ఎవరో బైబిలులోలేదు. గాని అందరు ఆ సంగతి అడుగుచున్నారు గాని బైబిలు నిశ్శబ్దముగా ఉన్నది. ఆ వివరమున్ననూ, లేకపోయిననూ, దేవుడు చెప్పిననూ, చెప్పక పోయిననూ రక్షణమాత్రం పోదు. ఆదాముకు హవ్వను ఏలాగు పుట్టించాడో అలాగే కయీనుకు భార్యను పుట్టించాడు అని ఊరకే గుంజులాడుకొంటున్నారుగాని, దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెండ్లి చేసికొన్నట్లున్నది. అది ఏమిటో తెలియదు. ఆ విషయములలో బైబిలు నిశ్శబ్ధముగా నున్నది. మెల్కిసెదెకు ఎవరో తెలియదు. ఆయన తండ్రిలేనివాడు, తల్లి లేనివాడు అని చెప్పుచున్నారు. చదివితే పిచ్చిగా ఉంటుందిగాని అది ఎవరికి నమ్మకము! తెలియబడని అనేక సంగతులు బైబిలులోయున్నవి గాని బైబిలు మాత్రము రక్షణ సంకల్పన బైలుపర్చుటకు వ్రాయబడియున్నది. అంతే గాని మనిషియొక్క సరదాలు తీర్చుటకు వ్రాయబడలేదు. లెక్కల పుస్తకమైన సంఖ్యాకాండములో, లెక్కలతోపాటు జాగ్రఫీ (భౌగోళిక శాస్త్రము) ఇశ్రాయేలీయులు ప్రయాణించిన స్థలములు, వారు తిరిగిన ప్రదేశములు, విడిదిచేసిన మజీలీల గురించికూడ వ్రాయబడినది. అలాగే బైబిలు రక్షణను గురించి తెలియపర్చుటకు వ్రాయబడినదిగాని సరదా కొరకు గాని, ఆటకొరకు గాని బైబిలు వ్రాయబడలేదు.

I.

నిశ్శబ్దమున్నంత మాత్రమున తప్పు అర్ధముచేసికొనరాదు. II. దేవుడు బైబిలులో దుష్టులయొక్క దుష్కార్యములను గురించి వ్రాయించాడు. అంతేకాదు, భక్తులు చేసిన పాపాలను గురించికూడా వ్రాయించాడు. ఎందుచేత? దేవునికి పక్షపాతములేదు గనుక భక్తులయొక్క పాపములుకూడా జరిగినవి జరిగినట్లుగా వ్రాయించాడు.

III

IV. ఒక నిమిషమునకు ముందుగాని, ఒక నిమిషమునకు వెనుకగాని ప్రభువు ఎన్నడును ఏ పని చేయలేదు. ఒక చిన్నపని యైనను చేయలేదు.


ఉదా:-

V. దేవుడు మనుష్యులేమి పెడితే అది తింటాడా? మనలోకి వచ్చాడు గనుక మనము పెట్టిన ప్రతిది తినాలి. అది సహవాసము.


VI.

VII. మాంసాహారము చేయవచ్చునా?

దేవుని నిశ్శబ్దములోనిదే మరొక అంశము:-

దేవుడు ఊరుకొన్నాడు గనుక దుష్టులకు సెలవిచ్చినట్లే (దుష్టులకు) Permitted will of God and direct will of God (దైవచిత్తానుసారమైన అనుమతి) మరియు దేవుని కొన్ని విషయములలో దేవుని ప్రత్యక్ష అనుమతి సమ్మతిస్తారు. మరికొన్ని దేవుడు స్వయంగా చెప్పుతారు. అది ఒక చిత్తము. ఏలాగంటే మోషే ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతిపెట్టాడు ఇది Permitted will of God అనగా దైవచిత్తానుసారమైన అనుమతి. పొదలో దేవుడు మోషేతో ఐగుప్తుకు వెళ్లుము అని చెప్పుట, Direct will God. అనగా దేవుని ప్రత్యక్ష అనుమతి. నేను నత్తివాడ్ని బాబో నేను వెళ్లలేను! అన్నపుడు దేవుడు ప్రత్యక్షంగా బలవంతము చేసాడు. రహస్యము ఏమనగా అక్కడ ఒకరిని చంపాడు గనుక తిరిగి ఐగుప్తు వెళ్ళితే వారు పట్టుకొని చంపుతారని ఆ భయంవల్ల ఆ విధంగా వంకబెట్టాడు. అయినా దేవుడు మోషేను పంపించాడా లేదా!

రాజుల గ్రంథములో ఏమున్నదంటే (రాజులు 22:19-22) భూమిమీదికివెళ్లి ఎవరైనా అబద్ధమాడిస్తారా? అంటే ఒక దయ్యము - “నేను వెళ్లి అబద్దము ఆడించెదను” అని అన్నది.


దేవుడు ఎందుకు ఆలాగు సెలవిచ్చాడు అంటే అది Permitted will of God అనగా దైవచిత్తానుసారమైన అనుమతి. ఎందుకంటే పాపము చేయవలెనని ప్రయత్నము అక్కడ ఉన్నది గనుక ఆలాగు. సెలవిస్తున్నాడు.


ఈలాగున దైవచిత్తానుసారమైన క్రియలలోని దేవుని అనుమతిని, దేవుని నిశ్శబ్ద లక్షణముగా పరిగణించవచ్చును. పాపము చేయనిచ్చుట, చేయుచుండగా ఊరకుండుట ఆయన నిశ్శబ్ద లక్షణమును వెల్లడి చేయుటకే. మన బ్రతుకులలోని దేవుని నిశ్శబ్ద లక్షణమును గుర్తించి, ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించి, శరీరాత్మీయ జీవనములలో వర్ధిల్లు ధన్యత ప్రభువు నేడు మనకందరకు దయచేయునుగాక. ఆమేన్.



అక్టోబర్, 9,10,11 1950వ సం॥ దేవదాసు అయ్యగారు, బెజవాడ, భీమవరంలో చేసిన ప్రసంగము.